అనురాగమయి అమ్మ (గేయ కవిత)
========================
పదాలెరుగని పెదాలకు
మర్మమెరుగని మనసుకు
మాటలు నేర్పేది అమ్మ
మధువుపంచే మాయమ్మ
ఒళ్ళు పులకరించగా
ఒడినే బడిగా చేస్తూ
ఓనమాలు నేర్పేది అమ్మ
ఓషధులు పోసే మాయమ్మ
ముద్దుముద్దు మాటలతో
ముచ్చటైన మాటలతో
మురిపాలు పంచేదమ్మ
ముందుకునడుపు మాయమ్మ
అలసిన హృదయాలకు
అమితమైన ప్రేమతో
ఆహ్లాదం పంచేదమ్మ
ఆనందం నింపేమాయమ్మ
ఆకలేసిన వేళలో
అలకబూనిన వేళలో
బువ్వ పెట్టేది అమ్మ
బుజ్జగించేది మాయమ్మ
ఆపదలో ఆప్తుడిగా
కష్టాల్లో మిత్రుడిగా
వెంట ఉండేది అమ్మ
వెలుగుపంచేది మాయమ్మ
ముల్లుగుచ్చుకున్నా
ముప్పు వాటిల్లినా
తల్లడిల్లేది అమ్మ
తబ్బిబ్బయ్యేది మాయమ్మ
అంతులేని అనురాగానికి
నిండైన మమకారానికి
నిలువెత్తు నిదర్శనమమ్మ
నిజాయితీగల మాయమ్మ
కల్మషం లేని ప్రేమకు
నిర్మలమైన మనసుకు
నిజ రూపము అమ్మ
కనిపించే దైవం మాయమ్మ
జీవితంలో తోడుంటూ
బతుకుపోరులో గెలిపిస్తూ
భవితకు బాటవేసేదమ్మ
సృష్టికి మూలం మాయమ్మ
======================
మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో
======================
- ఈర్ల సమ్మయ్య టీచర్
MPPS శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ
పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
Cell: 9989733035
సేకరణ
========================
పదాలెరుగని పెదాలకు
మర్మమెరుగని మనసుకు
మాటలు నేర్పేది అమ్మ
మధువుపంచే మాయమ్మ
ఒళ్ళు పులకరించగా
ఒడినే బడిగా చేస్తూ
ఓనమాలు నేర్పేది అమ్మ
ఓషధులు పోసే మాయమ్మ
ముద్దుముద్దు మాటలతో
ముచ్చటైన మాటలతో
మురిపాలు పంచేదమ్మ
ముందుకునడుపు మాయమ్మ
అలసిన హృదయాలకు
అమితమైన ప్రేమతో
ఆహ్లాదం పంచేదమ్మ
ఆనందం నింపేమాయమ్మ
ఆకలేసిన వేళలో
అలకబూనిన వేళలో
బువ్వ పెట్టేది అమ్మ
బుజ్జగించేది మాయమ్మ
ఆపదలో ఆప్తుడిగా
కష్టాల్లో మిత్రుడిగా
వెంట ఉండేది అమ్మ
వెలుగుపంచేది మాయమ్మ
ముల్లుగుచ్చుకున్నా
ముప్పు వాటిల్లినా
తల్లడిల్లేది అమ్మ
తబ్బిబ్బయ్యేది మాయమ్మ
అంతులేని అనురాగానికి
నిండైన మమకారానికి
నిలువెత్తు నిదర్శనమమ్మ
నిజాయితీగల మాయమ్మ
కల్మషం లేని ప్రేమకు
నిర్మలమైన మనసుకు
నిజ రూపము అమ్మ
కనిపించే దైవం మాయమ్మ
జీవితంలో తోడుంటూ
బతుకుపోరులో గెలిపిస్తూ
భవితకు బాటవేసేదమ్మ
సృష్టికి మూలం మాయమ్మ
======================
మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో
======================
- ఈర్ల సమ్మయ్య టీచర్
MPPS శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ
పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
Cell: 9989733035
సేకరణ
No comments:
Post a Comment