🕉 రావణ బ్రహ్మ గురించి తెలుసుకోవలసిన సత్యాలు :
💠 1) రావణుడు - బ్రాహ్మణుడు!
రావణుడి తండ్రి మానవుడు , బ్రాహ్మణుడైన విశ్రవసు బ్రహ్మ. రావణుడి తల్లి రాక్షస స్త్రీ అయిన కైకసి. వీళ్ళ సంతానం రావణుడు , కుంభకర్ణుడు , విభీషణుడు , సూర్పణఖ.
రావణుడు బ్రాహ్మణుడు కానీ అతనిలో రాక్షస లక్షణాలే ఎక్కువ . తను లంకకు రాజే కానీ ఆటవికుడు , దళితుడు ఎలా అవుతాడు ?
💠 2) తన చెల్లెలి ప్రేమ పెళ్ళి నచ్చని రావణుడు!
రావణుడి చెల్లెలు సూర్పణఖ విద్యుత్ జిహ్వ అనే రాక్షసుడ్ని ప్రేమించింది.కానీ రావణుడికి తన చెల్లెలి ప్రేమ వ్యవహారం నచ్చలేదు . విద్యుత్ జిహ్వ రావణుడిని చంపి లంకకు రాజు కావాలనుకుంటున్నాడు అని రావణుని అనుమానం. కానీ తల్లి కైకసి రావణుడిని ఒప్పిస్తుంది.
💠 3) సొంత చెల్లెలి భర్తను చంపిన రావణుడు!
రావణుడు అంగీకరించినట్లు చెప్పినా మనసులో మాత్రం విద్యుత్ జిహ్వను చంపాలనుకుంటాడు.సమయం చూసుకుని రావణుడు తన సొంత చెల్లెలి భర్త ను చంపేస్తాడు.
💠 4) సూర్పణఖ ముక్కూ చెవులు కోసినా పట్టించుకోని రావణుడు!
తన భర్తను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని సూర్పణఖ ఒక పధకం రచించింది.రావణుడిని చంపగాలవాడు కేవలం శ్రీ రాముడు మాత్రమే అని గ్రహించింది.రాముడితో వైరం కలగాలని తనకు కోపం తెప్పించేలా ప్రయత్నించింది.రాముడు ఏక పత్నీవ్రతుడు అని తెలిసే తనని పెళ్ళి చేసుకోమని విసిగించింది.అందుకు రాముడు ఏమి చేయకపోయినా లక్ష్మణునికి ఆగ్రహం వచ్చి ముక్కూ చెవులూ కోసాడు.వెంటనే రావణుని దగ్గరకు వెళ్ళి లక్ష్మణుడు చేసిన పని చెప్పింది.రావణుడికి సూర్పణఖ అంటే ఇష్టంలేదు కనుక విన్నా పట్టించుకోలేదు.అప్పుడు సూర్పణఖ సీతమ్మ గురించి చెప్పి , సీతమ్మ వంటి అందగత్తె నీ లాంటి వాడికి రాణిగా ఉంటే బాగుంటుంది అని చెప్తుంది. స్త్రీ లంటే కామం కనుక సీతమ్మను అపహరించి తెచ్చి రాముడితో వైరం పెట్టుకుని రావణుడు మరణిస్తాడని తలచినది.
💠 5) పర స్త్రీలను కామించిన రావణుడు!
రావణుడు అతి కాముడు.స్త్రీలతో రమించాలనే కోరిక అధికంగా ఉన్నవాడు.కంటికి నచ్చిన స్త్రీలను బలవంతంగా ఎత్తుకొచ్చి అనుభవించాడు. సీతమ్మ పూర్వ జన్మలో వేదవతి. ఒకసారి రావణుడు పుష్పక విమానంలో వెళ్తూ వేదవతి తపస్సు చేసుకోవడం చూసి కామించి సమీపిస్తాడు.అప్పుడు వేదవతి యోగాగ్నిలో తనకు తానె దహించుపోతు తన వల్లే రావణుడు మరణిస్తాడని శాపం పెడుతుంది.
💠😀5) భార్య యొక్క చెల్లెల్ని కామించిన రావణుడు!
రావణుని భార్య మండోదరి.
మండోదరి చెల్లెలు మాయ.
మాయను కామించి అనుభవించాలని చూసాడు.అప్పుడు మాయ కూడా స్త్రీ వల్లే నువ్వు చనిపొతావు అని శపించింది.
💠 6) కూతుర్ని కామించిన రావణుడు!
రావణుడికి కుబేరుడు తమ్ముని వరుస.కుబేరుడి కొడుకు నల కుబేరుడు. ఒకరోజు నల కుబేరుడి భార్యను చూసి కామించి చేరబట్టబోతుండగా నల కుబేరుడు శపిస్తాడు.ఆ శాపం ప్రకారం రావణుడు ఏ స్త్రీనైనా బలవంతంగా అనుభవించాలని ప్రయత్నిస్తే తల పగిలి చస్తాడు అని. అందుకే సీతమ్మను తాకలేక సీతమ్మ తో పాటు అక్కడి మట్టిని కుడా లంకకు తెస్తాడు.లంకలో కూడా సీతమ్మను తకలేకపోయాడు. చంపుతాను అని బెదిరించాడే కానీ అనుభవిస్తాను అని చెప్పలేదు.
💠 7) తన గురించి మాత్రమే ఆలోచించిన రావణుడు!
రామో విగ్రహవాన్ ధర్మః అని మారీచుడు చెప్పినా వినలేదు. సీతమ్మను తీసుకు రావడం తప్పని తిరిగి రామునితో కలపమని మండోదరి,విభీషణుడు,కుంభకర్ణుడు ఎంతగా వారించినా వినలేదు.తన వారందరూ చనిపోతున్నా పట్టించుకోలేదు.కేవలం సీతమ్మను పొందాలని మాత్రమే ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
👉 ఇటువంటి రావణుని ఇప్పుడు కొందరు హేతువాదులు,నాస్తికులు,
హిందూ ధర్మానికి వ్యతిరేకులు, మేధావులు అని చెప్పుకునే వారు, కీర్తిస్తూ ,రావణుడి చరిత్రను తిరిగి రాసి పూజించాలి అనడం ఎంత వరకూ ధర్మం ?
👉రావణుడి శివ భక్తి ఎలా ఉన్నా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు పతనమైపోయాడు.
తన భక్తి తనని కాపాడిందా ?
అటువంటి భక్తి ఆదర్శనీయమా ?
No comments:
Post a Comment