*::::::: కారణాలు, ఫలితాలు::::::*
*భయం* మనకు భయం వేస్తూ వుంటుంది. భయ పడకూడదు అని భయం పోవాలి అని అనుకుంటాం.
*ఆందోళన* మనం ఆందోళన పడతాము.
ఆందోళన వద్దు , ఎప్పుడు ప్రశాంతత చేకూరుతుందా అని ఎదురు చూస్తాం.
*దుఃఖం* దుఃఖం కలుగుతూ వుంటుంది. ఇది ఏమి కర్మ రా అని ఏడుస్తాం.
*కంగారు* కంగారు పడతాం. నిశ్చలంగా వుంటే బాగుండు అని ఆశ పడతాం.
*ఇవన్నీ ఫలితాలు ఇవేవి ఊరక రావు.*
వీటికి కారణాలు వుంటాయి. అవి కోరికలో, ఆశలో, ఒక దానికోసం పడే తపనో
, ఆత్రుతతో, అజ్ఞానమో కావచ్చు.
ఈ కారణాలు వున్నంత కాలం పైన చెప్పిన భయాలు, ఆందోళనలు, కోపాలు వుంటాయి. మనం వీటిని అణచి వేస్తూ వుంటాము.
కారణం అలానే వుంటుంది కనుక మరల వస్తాయి.
కారణాలను లేకుండా చేయిటే ధ్యానం.
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment