*జీవితమంటే ఏమిటి..?*
➖➖➖
*ఎంత ఆలోచించినప్పటికీ జీవితమంటే ఎమిటో తెలియక సతమతమవుతున్న ఒక జీవితపు ప్రయాణ బాటసారి గురువు వద్దకి వెళ్ళి …*
*"స్వామీ ...! ఎంత ఆలోచించినా జీవితం అంటే ఏమిటో తెలియట్లేదు ఇక మీరే నాకు జ్ఞాన ప్రదాత” అని శరణు వేడాడు .*
*అది చూసిన గురువు గారు ఆ శిష్యుడిని పోస్టు మాస్టర్ వద్దకి తీసుకెళ్ళి, ఈరోజు ‘ఉత్తరాల సంచి’ని శిష్యుడికి ఇప్పించి ఆ సంచిలో ఉన్న ఉత్తరాలను అడ్రసుల వారీగా పంచిరమ్మని ఆజ్ఞాపిస్తాడు.*
*అది చూసిన ఆ బాటసారి కొంత ప్రశ్నార్థకంగా చుస్తూ ......*
*సరే గురువు గారు చెప్పారు కదా....అని ముందుకి సాగుతాడు . *
*అలా ఇల్లిల్లూ తిరిగి ఉత్తరాలు పంచుతూ ఉండగా ఒక ఇంటికి వచ్చిన ఉత్తరంలో, ఆ ఇంటి బిడ్డకు ఉద్యోగం వచ్చిందని లేఖ ఉంటుంది , అది చూసి సంతోష పడతాడు.*
*మరో ఇంటికి వచ్చిన లేఖలో వారి బంధువొకరు మరణించారన్న వార్త చూసి బాధపడతాడు.*
*ఇంకో పేద వృద్ధురాలికి పించను డబ్బులు మనీ ఆర్డర్ ద్వరా ఇచ్చి సంబరపతాడు.*
*ఇంకొకరి బంధువుల ఇల్లు మంటలలో కాలిపోయిందన్న ఉత్తరమిచ్చి విలపిస్తాడు.*
*అలా తిరుగుతూ సాయంకాలానికి గురువుగారి ఆశ్రమానికి చేరుకొని విచారంగా కూర్చుంటాడు.*
*గురుదేవుల రాకను గమనించి గబుక్కున లేచి కొంత అలసటతో కొంత విచారంతో కొంత తెలుసుకోగలిగానన్న సంతోషంతో గురువుగారి పాదాలకు మనస్కరించి వెళ్ళిపోతాడు.*
*ఏంటీ .......!!! కథ ను మధ్యలో ఆపాననుకుంటున్నారా ....... నిజమేనండి కథ అయిపోయింది,*
❓
❓
❓
*!!!...ఆలోచించండి ఆ శిష్యుడికి ఏమి అర్థమయ్యుంటుంది .....?????*
*"....జీవితమంటే పోస్టు మ్యాన్ భుజానికున్న ఉత్తరాల సంచి లాంటిది. అందులో సంతోషం, బాధల కలబోతల ఉత్తరాలున్నట్టు, జీవితం కూడా సుఖ దుఃఖాల కలబోత. అన్నిటినీ భరిస్తూ ముందుకి సాగడమే జీవితం .... "
No comments:
Post a Comment