꧁•••••┉┅━•••••🌹✳️🌹•••••━┅┉•••••꧂
🌈 వికారాలు లేని మనసే ఆత్మ 🌈
✳️ పాత్రకు అంటిన మురికి తొలగిస్తే దాని సహజమైన మెరుపు బయట పడుతుంది. అలాగే మనసుకు అంటిన వికారాలు తొలగిస్తే దాని సహజ రూపమైన ఆత్మగా ఉంటుంది. ఈ విషయాన్ని మరింత సులభంగా మనకు అందించేందుకు మహానుభావులైన శ్రీరమణభగవాన్ అవతరించారు. అరుణా చలంలోని కనపడని చైతన్యం, కనపడే శివలింగం, శ్రీరమణభగవాన్లకు బేధంలేదు. శ్రీరమణభగవాన్ మనకి కేవలం శరీరంగా కనిపించినా ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. అందుకే నేను వెళ్ళటానికి ఖాళీ ఏది? అని భగవాన్ ప్రశ్నించేవారు. దైవాన్ని మనలోనే శోధించమని భగవాన్ సందేశం. కేవలం నేనెవరు? అన్న ప్రశ్నతో సమాధానం రాదు. ముందు మనకు తెలిసిన మన మనసుని గమనిస్తూ ఉన్న వికారాలు దాటితే నిజమైన నేనెవరో వ్యక్తం అవుతుంది. మనం మనసుని పూర్తిగా అర్థం చేసుకోవడమే మనని మనం తెలుసుకోవడం. ఒక్కొక్కరికి ఒక్కో రకం పోకడ ఉంటుంది.
✳️ మన మనసుకు ఏఏ కొరతలు, కలతలు, బలహీనతలు, ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా మనకి వశం అవుతుంది. మనం సుఖదుఃఖాలకు సమాన దూరంలో ఉండాలంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. భగవంతుని ప్రేమగుణం మనం అలవర్చుకోవాలి. భగవాన్ చెప్పినా, భగవద్గీత చెప్పినా మన అహంకార స్వరూపాన్ని తెలుసుకొమ్మనే. రకరకాల గుణాలతో మిళితమై కనిపించే మనసునుండి ఆ గుణాలు తీసేయడమే భగవాన్ చెప్పిన సాధనలో ఆంతర్యం. బుద్ధభగవానుడిలా కౄర జంతువులతో సైతం అరమరికలు లేకుండా కలిసి జీవించిన భగవాన్ ఆత్మస్థితిని స్మరిస్తే మనకు ఆఅఖండ శాంతిని, ఆత్మవైభవాన్ని తప్పక అందిస్తుంది. శ్రీశైలాన్ని దర్శిస్తేనో, కాశీలో మరణిస్తేనో మోక్షం వస్తుంది. కానీ అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి వస్తుందన్న భగవాన్ మాటలు స్వయంగా అరుణాచలేశ్వరుడి ఆజ్ఞే. అహం బ్రహ్మస్మి అనే మాట ఆత్మజ్ఞానులు అనాల్సిన మాట. అప్పటి వరకూ సాధకుడు ఎదుటివారిలో బ్రహ్మను చూడటం అలవర్చు కోవాలి.
🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment