*లక్ష్మీదేవి : ఖాళీగా ఉన్నారేమిటి బ్రహ్మదేవా*
*బ్రహ్మ : ఏమి చెయ్యను తల్లి భూలోకంలో బ్రాహ్మణ అమ్మాయిలు అబ్బాయిలు ఎంత వయస్సొచ్చినా వివాహం చేసుకోవటం లేదు ఇంక వివాహము చేసుకోకపోతే నాకు భార్యాభర్తలకు పిల్లలను ప్రసాదించే పనిలేదుకదా అందుకే నాకు ఖాళీ దొరికినది. మున్ముందు ఇలాగే కొనసాగితే ఇంక న అవసరం భులోకవాసులకు ఉండదు. అయినా నువ్వు మరోలా అనుకోకపోతే దీనికి కారణం నువ్వే అనిపిస్తోంది*
*లక్ష్మి:నేనా*
*బ్రహ్మ : అవును అటు అమ్మాయిలకి అబ్బాయిలకి దేశ విదేశాల్లో లక్షల్లో కోట్లలో జీతాలొచ్చే ఉద్యోగాలొస్తున్నాయి వాళ్ళు నీవిచ్చే సంపదతో ఆనందడోలికల్లో ములిగి తేలి ఆడుతున్నారు వీళ్ళే కాదు వాళ్ళ తల్లితండ్రులు కూడా అలాగే తయారయ్యి పిల్లల పెళ్లిళ్లు మాటే మర్చిపోయారు. పెళ్లి చేసుకుంటే లాభమేమిటి అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు*
*లక్ష్మి : ఏదో డబ్బులు బాగా ఇస్తే యుక్త వయస్సులో పెళ్లి చేసుకుని భార్యాభర్తలు వాళ్ళ తల్లితండ్రులు డబ్బుకి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటారని అనుకున్నాను* *ఐనా ఆకలేస్తే అన్నం తింటారు కానీ నోట్ల కట్టలు తింటారా? ఎంత డబ్బున్నా ఒక మొగుడు లేక పెళ్ళానికి సమానమవుతుందా? ప్రేమ కంటే విలువైనదా డబ్బు. నా దగ్గర ఇంత డబ్బున్నా మా శ్రీవారిని వదిలి ఒక్క క్షణమైనా ఉండగలనా* *ఆలుమగలన్నాక చిన్న చిన్న గొడవలు తగవులు మాములే* *ఆ మాటకోస్తే మా మధ్య లేవా? మీ మధ్య లేవా? అయినా తల్లితండ్రులు హాయిగా సంసారం చేసుకుంటూ పిల్లల పెళ్ళికి ప్రోత్సహించకపోవడం నేరం కదూ!*
*బ్రహ్మ : అవునమ్మా నువ్వు చెప్పింది అక్షర సత్యం 35 సంవత్సరాలకి 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లలను కనాలనుకుంటే నేను ఎక్కడ సృష్టించేది? ఆడవాళ్లకు 28 లేదా 30 సంవత్సరల లోపు అయితేనే పిల్లలను సునాయాసంగా కనేటట్లు ఆడదాని శరీరాన్ని నేను సృష్టించాను. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే పెళ్లిళ్లు చేసుకుంటే సహజీవనం చేస్తే వాళ్ళ కర్మకు వాళ్లేభాద్యులు*
*ఇప్పటికైనా గ్రహించి పెళ్లిచేసుకోండి వయస్సు మీరకుండా* అడపా.శ్రీనివాసరావు. ఊటసముద్రం
No comments:
Post a Comment