Monday, October 30, 2023

మాయం.

 *మాయం.*

గుమస్తాలు మాయం.
కూలీలు మాయం.
కోడళ్ళ పనితనం మాయం.
అత్తమామల మాటసాయం మాయం.
అల్లుళ్ళ గౌరవహోదా మాయం.
పోస్టుమాన్ మాయం.
ఆసాంతం వినే వైద్యుడు మాయం.
చీర, రవిక మాయం.
పుస్తక పఠనం మాయం.
రేడియోకి శ్రోతలు మాయం.
పెరడు బావి మాయం.
సైకిలు మాయం. 
ఎండావకాయ మాయం.
కుంపటిపై దిబ్బరొట్టి మాయం.
మట్టి వాసన మాయం.
పిడతకింద పప్పు బండి మాయం.
వందరోజులాడే సినిమాలు మాయం.
అర్ధరాత్రయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయం.
ఉపాధ్యాయుడు మాయం కొంత వరకు.
కుంకుడుకాయ, సీకాకాయ మాయం.
వాకిట పూల మొక్కలు మాయం.
పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం. 
సత్తు గిన్నె చారు మాయం.
స్కూల్లో మైదానం మాయం.
సంఘంలో నిదానం మాయం.
వానపాము మాయం.
చెరువుల్లో ఆటలు మాయం.
కోతికొమ్మచ్చి కబడ్డీ మాయం.
అవ్వ గోచీ కూడా మాయం.
థూళి లేని గాలి మాయం.
పాళీ ఉన్న పెన్ను మాయం.
ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం.
నిలకడగా కురిసే వాన మాయం.
నిర్మానుష్యమైన ఏకాంతం మాయం.
కంటికి నిద్ర మాయం.
వెన్నెల చూడాలనే కన్నులు మాయం.
పట్టుమని పదినిమిషాల ఏకాగ్రత మాయం.
హారన్ కూత లేని వీధి మాయం.
దోమలు లేని పార్కులు మాయం.
తోటమాలి కొలువే మాయం.
దాచుకుందామంటే వడ్డీరేటు మాయం.
'ఒక అల్లం పెసరె' అని కేక వేసే పాక హోటల్ మాయం.
సగం సగం పంచుకునే తేనీరు మాయం.
నిఖార్సయిన చేగోడీ, వడియం, అప్పడం మాయం.
ప్రేమ ప్రకటించే పొందిక ప్రేమ లేఖలు మాయం.
సాయంకాలం మల్లెపువ్వులు పెట్టుకుని కాటన్ చీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం.
ఆఫీసు నుండి రాగానే నాన్నా నాకేమి తెచ్చావు అని ఎదురుపడే‌సంతానం మాయం.
ఏమండీ రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం.
ఎంతసేపు జొమేటో ప్రత్యక్షం.
ఎవరి చరవాణి లోకి వాళ్ళు మాయం.
 *అంతా సాంకేతిక మయం.*
*మనదైన సమయం కూడా మాయం.*
*అంతా అయోమాయం.*
*ఈ స్థితిని పారత్రొలుదాం.*
*ఇంట్లో పెద్దవారి మాట విందాం.*

No comments:

Post a Comment