Sunday, October 29, 2023

నేటి మంచి మాట

 ::::::::::::::::::::::::::::::::::::::::
         *☘️నేటి మంచి మాట☘️*
        :::::::::::::::::::::::::::::::::::::::::

_మనిషి అనే వాడు తాను ఎన్ని చదువులు చదివినా.. ఎంత అనుభవం గడించినా.. జీవితాన్ని ఆస్వాదించడం.. జీవించడం ఎలాగో తెలియని అమాయకత్వంతో అజ్ఞానిగా మిగిలిపోతున్నాడు.. మనిషి జ్ఞానానికి.. అజ్ఞానానికి చదువులు ఒక్కటే కారణం కాదని మహాపురుషుల జీవితాలు పరికిస్తే అర్ధమవుతుంది.. అక్షరజ్ఞానం లేకపోయినా "ఆత్మజ్ఞానం" తెలిసినవారు.. కష్టసుఖాలలో మానవత్వంతో.. సమభావంతో జీవించడం సాధ్యమని.. మహాపురుషులు జీవించిన భారతావని సంస్కృతిని పరిశీలిస్తే బోధపడుతుంది.._

_'నేను' అనగానే మనిషికి బోధపడే అంశం ఒడ్డు పొడుగు గల తన దేహపు బాహ్య దృశ్యరూపమే.. అవును కదా..! ఆ రెండక్షరాల "నేను" అనే పదం అవ్యక్తంగా హృదయస్థానంలో కొలువై ఉండే.. నేను అనే నీ ఆత్మకు ముడిపడి ఉన్నదే నీ "శరీరం" అని చెబుతారు వేదాంతులు.._

🦋☘️🍁🌷🌹🍂🍃🍀🌾🌿🎋🌱

No comments:

Post a Comment