Sunday, October 29, 2023

   *🌼మహనీయుల మాట🌼*
        :::::::::::::::::::::::::::::::::::::::::

_ఓ మనిషి.. నీ జీవితం ఏ స్థాయిలో ఉన్నా ఉరుకులు పరుగులతో కూడి ఉంటుంది.. ఆదిమ మానవుడు ఎలా జీవించాడో ఏమోగానీ.. ఆధునిక మానవుడు మాత్రం బతుకు యాత్రలో ఊపిరి సలపని వేగంతో.. ఆందోళనను గుండెల నిండా నింపుకొని పయనిస్తున్నాడు.. నాటి మానవుడు పూట గడవడం కోసం.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం.. భద్రంగా జీవించడం కోసం తపనపడి ఉంటాడు.. నేటి మానవుడు అన్ని సౌకర్యాలు అందివచ్చినా.. సరే.. మనిషి తనకు వచ్చిన ఒత్తిడిని పుణికిపుచ్చుకొని హాయిగా.. సుఖంగా.. జీవించలేకపోతున్నాడనేది.. నిజం.._

_ఈ సమాజంలో మనసుకు హత్తకునేలా మాట్లాడేవారు కొందరు ఉంటే.. మనసు నొచ్చుకొనేలా మాట్లాడేవారు కొందరు ఉంటారు.. మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కూడా కొందరు ఉన్నారు.. ఈ అందరి మధ్య సాగే జీవనప్రయాణమే నీ జీవితం.._

No comments:

Post a Comment