*సత్సంగం*
*ఇవాళ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందువల్ల
గంట బదులు రెండు గంటలసేపు దైవధ్యానం చేస్తాను*
అని ఓసారి మహాత్మా గాంధీ అన్నారు
ఈ మాటను బట్టీ
మనం చేసే దానికి దైవసహాయం అవసరం
అని అర్థం చేసుకోవచ్చు
మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్ముకుని,
లౌకిక విషయాల నుంచి బయటపడి,
దైవ ధ్యానంలో ఉంటే
మనకేం కావాలో
ఆయనే అన్నీ ఇస్తాడు.
అయితే మాయని జయించిన వాళ్ళు కూడా ప్రాపంచిక విషయాల బంధంలో చిక్కుకుంటారు.
విష్ణువు అంశ లో పుట్టి,
నాలుగు వేదాలనీ విభజించి,
అష్టాదశ పురాణాలనూ,
భాగవతాన్నీ, భారతాన్నీ రచించి
భగవత్ తత్వాన్నీ, మోక్షమార్గాన్నీ ఆకళింపు చేసుకున్న వ్యాసభగవానుడుని కూడా
పుత్రవాత్సల్య రూపంలో అజ్ఞానం వదల్లేదు.
తన కొడుకు శుకుడు పరమ విరాగియై
వివాహం చేసుకోనంటే,
దీనుడై వ్యాసుడు శోకంలో పడ్డాడు.
సరస్సు లో స్నానం చేస్తున్న అందగత్తెలైన దేవతా స్త్రీలు శుకుడు ని చూసి సిగ్గు పడలేదు
ఒళ్ళు కప్పుకోలేదు
కానీ ఇంకా కోరికలు గల వ్యాసుడు ని చూసి
సిగ్గుతో బట్టలు కప్పుకున్నారు.
ఎలాంటి వ్యామోహం లో
చిక్కుకున్నా
వివేకంగా ఆలోచిస్తే
మనసు అధర్మం వైపు మొగ్గదు.
No comments:
Post a Comment