నమ్మకం__విశ్వాసం
ఎత్తు అయిన రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది. దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు. వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవసాగాడు..
చేతిలో పొడవయిన కర్ర ఉంది... భుజాలపై అతని కొడుకు ఉన్నాడు, అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.... అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు..,
అందరూ చప్పట్లు కొట్టారు... కేరింతలతో ఆహ్వానం పలికారు...చేతులు కలిపారు.
ఫోటోలు తీసుకున్నారు.,
నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలనుకుంటున్నాను.. వెళ్లగలనా? అని అతను ప్రశ్నించాడు..
వెళ్లగలవు.., వెళ్లగలవు జనం సమాదానం..
నా మీద నమ్మకం ఉందా?..
ఉంది..,ఉంది. కావాలంటే మేం పందానికి అయినా సిద్దం..!
అయితే మీలో ఎవరయినా నా భుజం మీద ఎక్కండి.., అవతలకి తీసుకు పోతాను..! అన్నాడు... అక్కడంతా నిశబ్దం..
జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు..,
ఉలుకు లేదు.., పలుకు లేదు..,
నమ్మకం వేరు.., విశ్వాసం వేరు...
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి.
ఈ రోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే....
దేవుడు_అంటే_నమ్మకమే___కానీ_విశ్వాసం_లేదు...
భగవంతునిపై మనకు పూర్తి విశ్వాసం వచ్చినప్పుడే దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతుంటాడు.....
🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment