🏵️ నేటి శుభసందేశం 🏵️
నశించే ప్రాపంచిక విద్యకు గురువు అవసరమైనప్పుడు, ఎప్పటికి నశించని,మన వెంబడి వచ్చేఆధ్యాత్మిక విద్యకు సరియైన గురువు చాలా అవసరం.
🌺 నేటి సందేశం 🌺
మనలో ఉన్నదానితో పోలిస్తే మన వెనుక ఉన్నవి మరియు మన ముందు ఉన్నవి చిన్న విషయాలే.
*గతంలోని దుఃఖాలను మరచిపోదాం ; కొత్త సంవత్సరంలో వాటిని గురించి ఆలోచిస్తూ ఉండవద్దనే నిర్ణయం తీసుకుందాము. పట్టుదలతోనూ, దృఢసంకల్పంతోనూ మన జీవితాలనూ, మంచి అలవాట్లనూ, విజయాలనూ కొత్తగా ప్రారంభిద్దాము. గడచిన సంవత్సరం నిరాశ కలిగించేటంత చెడ్డగా గడిస్తే కొత్త సంవత్సరం నిశ్చయంగా ఆశాజనకంగా శుభంగా ఉంటుంది* 🪷 ఓం నమౌవేంకటేశాయ 🪷 🎋🎋ఓం నమశ్శివాయ
*_నేటి విశేషం_*
*ఆంగ్ల నూతన సంవత్సరాది*
ఈనాడు మనము ఒక సంవత్సరమునకు ( తేదీల ప్రకారంగా ) వీడ్కోలు పలికి, మరొక సంవత్సరమునకు స్వాగతము చెబుతున్నాము!!...
దీనినే న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పుకుంటున్నాము ...
నిజానికి మనము గ్రహించ వలసినది ఏమిటంటే, మన జీవితంలో ఒక సంవత్సరము కోల్పోయాము అని, ముఖ్యముగా గమనించాలి,
గడిచిన సంవత్సరములో ఏమి చేసాము?, ఏమి సాధించామని లెక్కచూసుకోవాలి...
భగవంతుడు ప్రసాదించిన ఈ విలువైన కాలంలో , ఎంత మందికి నిస్వార్థంగా సేవలు చేశాను,
నావారు, నా సంసారం, నా బంధువులు అని చూడకుండా ... ఎంతమందికి ఏమి చేశామని ఆలోచించుకోవాలి,
గడిచిన రోజులలో భగవంతుడు నాకిచ్చిన శక్తిలో, నేను ఎంతమంది నిర్భాగ్యుల కడుపులు నింపాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను అని ఆలోచించుకోవాలి...
*మరి మనం ఏ అర్హత సాధించాలి??*
మనం ఈరోజు చేస్తున్నది అంతా కేవలం ప్రపంచ వ్యామోహము కానీ , వేరే ఏమీ లేదు, మనం చేయవలసినది భగవంతుని సామ్రాజ్యం లోనికి ప్రవేశించడానికి, తగిన అర్హత పొందాలి...
సంవత్సరం, రావడం పోవడం అనేది, ప్రాకృత మునకు సంబంధించినది...
ఇది సిధ్ధాంతుల ప్రకారం ఈ సంవత్సరం దాటింది, క్రొత్తది వచ్చింది అనే భావన, మనం అనుసరిస్తున్నాము.
ఇది సత్యం, శాశ్వతం కాదు,
సూర్య చంద్రులు ఎక్కడికీ పోవటం లేదు గనుక, "రాత్రి పగలు" అనేవేలేవు లేవు...
తూర్పు లేదు, పశ్చిమo లేదు, ఇంక సంవత్సరం రావడం పోవడం ఎట్లు జరుగు తుంది, చెప్పండి...
ఇవన్నీ మానవ స్థాయిలో భ్రమించే భ్రమలు మాత్రమే!!...
మనమంతా, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి కి ఎదగాలి!!...
భగవంతునికి రాక పోకలు లేవు, రాక పోకలు లేని చక్రవర్తియే భగవంతుడు...
మానవుడు ఆ అర్హత పొందడానికి తగిన కృషి చేయాలి.
మనిషి కర్మ చేత బంధింప బడినవాడు కనుక,
సత్కర్మలు చేయాలి,
పవిత్రమైన పలుకులు పలుకాలి, ప్రేమను పంచాలి, పవిత్రమైన విషయాలు అభివృద్ధి పరచుకోవాలి,
దాని ద్వారా పవిత్రమైన హృదయమును పొందుతాము, అపుడే మనలో పవిత్రత ఏర్పడుతుంది!!...
ఈరోజు మనం చేస్తున్నది అంతా క్షణికం మాత్రమే, ఈరోజు తిన్నది రేపటికి గుర్తు వుండదు,
అదే ఆకలి గొన్న వారికి కొంతమందికి పెట్టి చూడు, జీవితం వున్నంత వరకు గుర్తు పెట్టుకొని వుంటారు...
భగవంతుడు కూడా తృప్తి చెందుతారు ... అలాంటి రోజే నిజమైన పండుగ, మన జన్మలో నూతన దినంగా ఆనంద పడాలి...
*_💐శుభమస్తు💐_*
No comments:
Post a Comment