*ముసలితనం వెనుక...*
ముసలితనం వెనుక
వెలకట్టలేని విలువైన బాల్యం కరిగిపోయి దాక్కుంది...
ముసలితనం వెనుక
ఆకతాయి ఆటల అల్లరితనం అరిగిపోయిన
జాడతడి ఉంది...
ముసలితనం వెనుక
యవ్వనపు యవనిక సరసాల చేల
చేష్టల చిలిపి తనపు పొగరుంది...
ముసలితనం వెనుక
మనసు పనులు పొందిన
అనుభావాల పుట్టుక పరిణతి
దాగి ఉంది...
ముసలితనం వెనుక
ఆత్మీయతల అనుభూతి
ఆందోళనల సమ్మేళన కొండ దాగుంది...
ముసలితనం వెనుక
ఉరుకుల పరుగు ఆశల ఆశయాల ప్రవాహ మలుపుల నది దాగుంది...
ముసలితనం వెనుక
సహన సమారస్య సంతృప్తి సహృదయ
స్నేహ సముద్రం దాగుంది...
ముసలితనం వెనుక
కాలం చేసిన గారడి
వయసు పడిన ఒరవడి
బ్రతుకుతోట తడి
శిథిలావస్థ గుడిలా దాగుంది...
ముసలి తనమని చిన్నచూపేలా...
మనిషి మజిలీకే అది చివరి కళా...
ఆ కళను గౌరవించిన మనిషే భళా...
*అభిరామ్ 9704153642*
★★★★★★★★★★★★
*మీకు పుట్టినరోజు మరియు పెళ్ళిరోజు...లేదా సందర్భం ఏదైనా* *కవిత లేదా వ్యాసం, పాట వ్యకిగతంగా కావాలంటే కింది నా* *నెంబర్ను సంప్రదించగలరు...*
*అభిరామ్ 9704153642*
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
No comments:
Post a Comment