🪷🌹🪷
మన ఆలోచన అత్యున్నతంగా ఉంటే అది మనలను అత్యున్నత మైన దానితో అనుసంధానం చేస్తుంది.
మనల్ని బాధపెట్టే విషయాలను పక్కన పెట్టేసి సంతోష పెట్టే విషయాలను పదే పదే తలుచుకోండి... అప్పుడే తెలియని శక్తి మనలో నిండి మనం సంతోషంగా ఉండగలం...
ప్రతి రోజు మన పనులు, మాటలు, చేష్టలు గమనించుకుంటూ ఉంటే.మనం చేసే పొరపాట్లు అర్ధమవుతూ ఉంటాయి. మన వలన పొరపాటు లేక తప్పు జరిగింది అని తెలియగానే దానిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మనిషి తప్పులలోకి వెళ్లకుండా వుండే అవకాశం వుంది. ఒకవేళ పొరపాటున చేసినా సరిదిద్దికునే అవకాశం వుంది.
ఇదే విధముగా మనతో వ్యవహరించే మనుషులను గమనించి - వారి ద్వారా మనకు కలిగిన ఇబ్బందులను మనం ఇతరులకు కలిగించకుండా - ఇతరులు మనకు చేసిన మేలును మరువకుండా తిరిగి ఆ మేలును,మంచిని మన చుట్టూ ఉన్న వారికి అందిస్తూ ఉంటే - అది ఆధ్యాత్మిక సాధనే అవుతుంది.
అసలు మన లోపలే తప్పు - ఒప్పులు చెప్పే బుద్ది అనే జ్ఞానం వుంది. కొంచెం లోపల గమనించుకుంటే చాలు.
మనిషే దేముడు మనిషే - రాక్షసుడు. మనలోని దైవాన్ని మేలుకొలపటమే ఆధ్యాత్మికత . సే::మాధవ కొల్లి.
No comments:
Post a Comment