🔺 *మరణం లేని మీరు* (లోబ్ సాంగ్ రాంపా) 🔺
🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹
🌺 Chapter -- 23 & 24 🌺
🌹 ఊహాశక్తి 🌹
🌹 కర్మ సిద్ధాంతం 🌹
◆ ఇచ్చాశక్తి (Will power) కి , ఊహ(Imagination) కూ యుద్ధం జరిగితే చివరికి ఊహే గెలుస్తుంది.
◆ ఊహాశక్తి యొక్క సహకారం లేకపోతే ఇచ్చాశక్తితో తాము ఏమీ సాధించలేరు.
◆ ఇచ్చాశక్తికంటే ఊహాశక్తే గొప్పది . ఊహాశక్తి కన్నా గొప్ప శక్తి ఏదీ లేదు .
◆ మీ ఊహాశక్తిమీద ఓ పట్టును మీరు సంపాదించుకోగలిగితే మీకేం కావాలన్నా సంపాదించుకోగలుగుతారు. ఈ ఊహాశక్తి మనం శాసిస్తే పనిచేయదు. ఊహాశక్తి ఫలానా విధంగా పనిచేయాలని మీరు నిర్దేశించాలంటే వీలుపడదు.
◆ విల్ పవర్ ' (ఇచ్చాశక్తి ) ను ఉపయోగించి , మీ ఊహలను మీరు నియంత్రించలేరు . అలాంటి ప్రయత్నాన్ని మీరు చేస్తే నరాల జబ్బుల్తో మీరు బాధపడాల్సి వస్తుంది . మీ ఆలోచనలను మీరే నడిపించాలని గుర్తు పెట్టుకోండి . మీ ఊహలను మీరే అదుపుచేసుకోవాలి . ఇష్టం వచ్చినట్లు మీ ఊహలని ఉరకలెత్తిస్తే మీకు అపజయం తప్పదు . మీ ఊహాశక్తిని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఇదివరకు “ దాదాపు అసంభవా " లని అనుకున్న పనులన్నిటినీ సులభంగా నిర్వర్తించగలరు . కాబట్టి ముందుగా " అసంభవం ” అనేది ఏదీ లేదని నమ్మండి .
◆ ఈ జన్మలో " చెడిపోయిన విత్తనాలు " అనే చెడుపనులను మీరు నాటితే , పై జన్మలోనో , అదీ కాకపోతే మూడవ జన్మలోనో చెడిన భవిష్యత్తును " పంట లాగా పొందుతారు . ఒక వేళ ఈ జన్మలో కొంత మంచిని నాటితే - మంచినీ , దయనూ , జాలినీ , సానుభూతిని అర్హులైన వారి పట్ల చూపిస్తే - కాలం గడిచాక మీ వంతు వచ్చి దురదృష్టం మిమ్మల్ని ఆవరించి మీరు బాధపడుతున్నప్పుడు ఎప్పుడో , ఎక్కడో , ఎవరో మీపట్ల అలాంటి దయనే అలాంటి సానుభూతినే అలాంటి సహాయన్నే చూపిస్తారు , అందిస్తారు .
◆ కొంత మంది మహనీయులు (వీరిని అవతారపురుషులు అంటూ ఉంటాం).కొన్ని కార్యాలను సాధించడానికి భూమిమీద జన్మనెత్తుతూ ఉంటారు.ఈ అవతారపురుషులు తరచుగా దరిద్రంలోనే జన్మిస్తూ మానవులకు జాలీ, దయా, సానుభూతి లాంటి ఉత్తమ
గుణాలను నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అవతారపురుషులను దుఃఖం ఏమాత్రం బాధించదనీ దుఃఖానికి వీరు అతీతులనీ " అందరూ అనుకునేలా భూమిమీద జీవితాన్ని గడుపుతారు . “ బాధలు వీరిని బాధించవనే మాట నిజానికి సత్యదూరం . అత్యంత సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి దుఃఖాలు వీరినే ఎక్కువగా బాధిస్తాయి .
◆ ఓ అవతార పురుషుడి జన్మ బలవంతం మీద జన్మించే జన్మ కాదు , విధిగా ఎత్తాల్సిన జన్మకాదు , కర్మానుసారం ఎత్తాల్సిన జన్మ కాదు . మూర్తీభవించిన ఆత్మగా స్వేచ్ఛగా జన్మించిన జన్మ అది . కొన్ని పరిస్థితులలో జన్మించాల్సిన అవసరం కూడా ఉండదు - ఇంకొకరి శరీరాన్ని ఈ అవతార పురుషుడు ఆక్రమించగల సమర్థుడై ( ability to walk - in ) ఉంటాడు . మేము మత విశ్వాసాలనే కాలిమీద పుండ్ల మీద తొక్కి ఎవర్నీ బాధించదలచడం లేదు . కానీ , మళ్ళీ ఒక్కసారి పరిశుద్ధ గ్రంధాన్ని ( బైబిల్ ) జాగ్రత్తగా పరిశీలిస్తే రక్షకుడు ( జీసస్ ) ఓ మనిషిగా జోసెఫ్ మేరీలకు జన్మించినా , కాలాంతరంలో , జీసస్ పెద్దవాడయిన తరువాత నిర్జనారణ్యంలో క్రీస్తు ఆత్మ - రక్షకుడి ఆత్మ - క్రిందకు దిగి వచ్చి , జీసస్ శరీరం నిండా నిండిందని మనం గ్రహించవచ్చు . ఇంకోరకంగా చెప్పాలంటే వేరొక ఆత్మవచ్చి తనను ఆహ్వానిస్తున్న జోసెఫ్ మేరీల కుమారుడైన జీసస్ శరీరాన్ని ఆవహించిందని మనం తెలుసుకోవచ్చు .
◆ మీ ఆలోచన ఎలా ఉంటుందో , మీరూ అలాగే ఉంటారు . పవిత్రమైన ఆలోచనలను మీరు చేస్తూ ఉంటే మీరూ పవిత్రులే అవుతారు . కామం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరూ కాముకులే అయిపోయి మలినులౌతారు , అంతేకాక , మీరు భూమి మీదకు మళ్ళీ మళ్ళీ తిరిగివస్తూ ఉండవలసి వస్తుంది - మీలో కోరికలు " మంచి ఆలోచనల వల్లా , నిర్మలత్వం వల్లా నశించిపోయే వరకూ ఈ జన్మల పరంపర నుంచి మీరు తప్పించుకోలేరు.
◆ అందరికి కర్మసిద్దాతం వర్తిస్తుంది.ఒక్క "అవతార పురుషుడు " తప్ప ! ఈ మహనీయుడిని కర్మ బంధించదు. అవతారపురుషుడికి కర్మ సిద్ధాంతం వర్తించదు .
◆ సత్కర్మ చేయడానికి మంచి మార్గం ఏమిటంటే - ఎవరు మనకోసం ఏం చేస్తే మనకు సంతోషం కలుగుతుందో అలాంటి వాటినే మనం ఇతరుల సంతోషం కోసం చేస్తూండడం ".
◆ ఆధ్యాత్మ సాధన కోసం వచ్చిన అనేక మహనీయులు శారీరక రుగ్మతను ఒకదాన్ని పట్టుకునే ఈ భూమ్మీద నివసించగలుగుతున్నారు. ఓ వ్యక్తి మీ సహాయాన్ని ఆర్జిస్తే మీరు అతడిని కసిరికొడితే మీకన్నా ఎంతో గొప్ప ఆధ్యాత్మికత ఉన్న ఓ మహానుభావుడికి మీరు తీరని క్షోభను కలిగిస్తూ ఉన్నారని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి .
◆ స్థూలశరీరంలో ఏర్పడే ఓ రుగ్మత “ నిజానికి ఆ వ్యక్తి ఆధ్యాత్మిక అభివృ ద్ధి కోసం నిర్దేశింపబడిన ఓ రహస్య విద్యగా , సాధారణంగా స్వీకరించగలిగిన ప్రకంపనాల వేగం గల తరంగాలకన్నా ఎక్కువ ప్రకంపనాల వేగం ఉన్న తరంగాలను స్వీకరించి గ్రహించగలిగిన సిద్ధిని సాధించేందుకు ఉపయోగపడే ఓ సాధన ” మని మీరు ఏ మాత్రం సంశయం లేకుండా గ్రహించాలి . కాబట్టి - రోగులమీద కాస్త సానుభూతిని మీరు చూపించాలి . సరేనా ? ఓ రోగిష్టిని మీరు ఎప్పుడూ కసురుకోకండి . అతడి ముందు మీ ఓర్పును ఎప్పుడూ పోగొట్టుకోకండి . మీకు అర్థం కాని ఎన్నో సమస్యలను ఆ రోగి సహిస్తూ ఉన్నాడని ఎప్పుడూ మరువకండి . ఇలా మీరు ప్రవర్తించాలని చెప్పే మాటలలో మీ స్వార్ధానికి ఉపయోగపడే అంశం ఒకటి ఉంది ! ఆ రోగిష్టి మనిషి ఆధ్యాత్మికంగా మీకన్నా ఎన్నోరెట్లు ఉన్నతిని పొంది ఉండవచ్చు . అలాంటి మహనీయుడికి మీరు చేసే సహాయం మీకే సహాయకారి కావచ్చు .
◆ మరణం లేని మీరు. సే::మాధవ కొల్లి.
No comments:
Post a Comment