Monday, January 1, 2024

చెట్టు చితికిపోతున్నది...

 *చెట్టు చితికిపోతున్నది...*

చెట్టు ఒకప్పుడు
మునిపుంగవులను తల్లై లాలపోసింది...

ఆ తరువాత 
గుడిసెల నీడలో 
గుమ్మమై నిలిచింది...

ఆ తరువాత 
మట్టి గోడల మిద్దెకు
మెడై మెరిసింది...

ఆ తరువాత 
కర్మగారాల కబేళాలకు
నిలువెత్తు దేహాన్ని ముక్కలు చేసుకుంది...

ఆ తరువాత
సిమెంట్ మేడల దేహాలకు
తన అవయవాలను కిటికీలుగా 
ఆరేసుకుని 
ఆధునిక యుగపు సమాధికింద 
తన ఊపిరిని విడిచి వల్లకాటికి వలస వెళుతున్నది చెట్టు...

సెల్పీల కొమ్మలకు 
మొక్కలు వాడిపోయాయి
చెట్ల జాడ ఆన్లైన్ మైదానంలో 
చూడాలేమో ముందు ముందు....


*అభిరామ్ 9704153642*

No comments:

Post a Comment