Monday, July 1, 2024

కాంగ్రెస్ కమ్యూనిష్టుల బంధం జన్మ జన్మలది...

 ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడి వేసెనో....

కాంగ్రెస్ కమ్యూనిష్టుల బంధం జన్మ జన్మలది...

జయప్రకాష్ నారాయణ్ బీహార్ లో అప్పటి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఆరెస్సెస్ కార్యకర్తల రిక్వెస్ట్ మీద రంగం లోకి దిగారు...

అది దేశం మొత్తం మీద ఇందిర ఎమర్జన్సీ  పేరుతో విధించిన క్రూర ప్రజాస్వామ్య హత్యకు నిరసనకు నేతృత్వంగా మారింది...

జయప్రకాష్ నారాయణ్ ను హత్య చేయడానికి పురికొల్పింది ఆ ఇద్దరి అనుబంధమే...

సేమ్...లాలా లాజపతిరాయ్ ను లాఠీ ఛార్జ్ చేసి బ్రిటిష్ వాళ్ళు అంతం చేసినట్టే...జయప్రకాష్ నారాయణ్ ను కూడా లేపేద్దామని ప్లాన్ చేసారు...

ఇలాంటి భయంకరమైన కుట్రలకు పల్పడేది ఇందిరా బ్రిగేడ్ అనే ప్రైవేట్ సంస్థ...

ఆ సంస్థకి వెన్నుదన్నుగా నిలిచేది...కమ్యూనిస్టు మహానుభావులు...

ఎమర్జెన్సీ అత్యాచారాలకు సమర్ధనగా మాట్లాడేవాళ్ళు కమ్యూనిస్టులు...

తరువాత్తరువాత వాళ్ళని కూడా లోపలేసి కుమ్మడం ప్రారంభించేవాళ్ళు బ్రిగేడ్ మనుషులు..అది వేరే సంగతి...

జయప్రకాష్ నారాయణ్ కు మొదట్లో కమ్యూనిజం అంటే అభిమానం ఉండేది...దాని అసలు స్వరూపం అర్థం చేసుకుని వదలి పడేసారు...

అప్పట్నుంచి అసూయా ద్వేషాలతో రగిలిపోయేవాళ్ళు కమ్యూనిస్టులు...

అసలు విప్లవం అంటే వాళ్ళ సొంత పదం అన్నట్టు ఫీలయిపోయేవారు...

తీరాచూస్తే...జేపీ నాయకత్వంలో అద్భుతమైన ప్రజాస్వామ్య పరిరక్షణ విప్లవం...ఈ కమ్యూనిస్టు బుడుంగులు అవసరం లేకుండానే జరిగిపోయింది..

ఇంక ఆ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో కోవర్టులుగా జేరిపోయారు ఈ ద్రోహులు...

కాంగ్రెస్ కు అంతర్గతంగా అన్నింట్లో సహాయ సహకారాలు అందజేసేవాళ్ళు...

దానికి ప్రతిఫలంగా అన్ని ప్రభుత్వ, మీడియా విభాగాల్లోనూ ఇందిరా ఖాన్ వాళ్లకు స్థానం కల్పించింది...

వీళ్ళ పని ఏంటంటే...ఆరెస్సెస్ ఇతర జాతీయవాదుల మీద అబద్ధాలు ప్రచారం చెయ్యడం..అత్యాచారాలు చెయ్యడం...

బయటకు మాత్రం పెట్టుబడి వ్యవస్థ మీద పోరాటం అంటూ బిల్డప్ లు ఇవ్వడం...

పొరబాటున ప్రజలు దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా అక్కడక్కడా అధికారం కట్టబెట్టేవాళ్ళు...

ఆ భారం మోయలేక వదుల్చుకోలేక నానా కష్టాలు పడే వాళ్ళు...

వాళ్లకు కాంగ్రెస్ ఇచ్చిన పాత్ర కేవలం విప్లవ ఉద్యమాలలో చేరి చెడగొట్టడం...బ్లాక్ మెయిల్ చెయ్యడం..అంతవరకే...

అప్పట్లో జ్యోతిబసు ప్రధాని అవకాశాన్ని విడిచి వద్దనడం చారిత్రిక తప్పిదం కాదు...వారి బంధంలో ఉన్న కమిట్ మెంట్ అది...

సో..ఇలా కాంగ్రెస్ కమ్యూనిస్టు బంధం అప్రతిహతంగా కొనసాగుతూ... దేశాన్ని సకల భ్రష్టత్వం వైపు తీసుకు పోతూనే ఉంటుంది...

అలా జేపీ అనుచరులుగా ఉన్న లాలూ అండ్ కో లు కూడా అవినీతిలో కూరుకుపోయి...లాఠీ ఛార్జ్ లో జేపీ మీద దెబ్బ పడకుండా కాపాడి రక్తం చిందించిన ఆరెస్సెస్ పట్ల కూడా కృతజ్ఞత చూపని విశ్వాస ఘాతకులుగా మారారు...

స్వాతంత్ర్యం ముందు నుంచీ కాంగ్రెస్ కమ్యూనిస్టు బంధం పెనవేసి ముడివేసి..అమాయక కార్యకర్తలను వాడుకుని జీవితాలు గడిపేయడం ఉంది...

ఇప్పుడు కొత్తేం కాదు...

దేశం వదుల్చుకోవాల్సిన రెండు శక్తులూ అవి...

అంత సులభమా...ఏం చేద్దాం...

కనీసం చరిత్ర తెలుసుకుందాం...నలుగురికీ చెరవేద్దాం!

మంచి పాటను దీనికి వాడినందుకు కోపం వచ్చిందా...🫡

No comments:

Post a Comment