🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(235వ రోజు):--
స్వదేశంనుంచి దూరమైనా, ఈ హిందువులు తమ మతాన్ని విస్మ రించలేదు. సరైన నాయకత్వం లేక పోవటం, ఒక శతాబ్ది పైగా స్వదేశం తో సంపర్కం లేకపోవటం వంటి కారణాలవల్ల వేదాంతగ్రంథాల గురించి, ఆచారకర్మల గురించి వారి లో చాలా అపోహలు వ్యాపించాయి. ఈ దేశాల ప్రజలు స్వామీజీని ఆహ్వా నించి వేదాంతవిద్య నేర్చుకోవటం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా, భారతదేశంనుంచి వచ్చిన గురువులంటే అందరికీ ఆసక్తి ఉండే ది. అన్యమతాలవారు కూడా ఆయన ఉపన్యాసాలు వినడానికి వచ్చేవారు. డాక్టర్ జార్జ్ బాల్డ్విన్ అనే నల్లజాతి క్రైస్తవ మతాచార్యుడు ట్రినిడాడ్ నుంచి వచ్చి సాందీపని సాధనాలయంలో శిక్షణపొందారు.
బౌద్ధమతస్థుల దేశాల్లో కూడా స్వామీజీకి ఆదరం లభించింది. బౌద్ధ మతం స్థాపించబడింది భారతదేశం లోనే. అందుకే, బౌద్దమతస్థులు ఏ దేశంవారైనా, అందరికీ వారి మతా నికి జన్మస్థానమైన భారతదేశమంటే గౌరవముంది. క్రీస్తుశకం మొదటి శతాబ్దాల్లో భారతదేశం గురించి లభించిన సమాచారమంతా చైనా నుంచి వచ్చి భారతదేశంలోని బౌద్ధ క్షేత్రాల్ని దర్శించిన బౌద్ధసన్యాసులు వర్ణించినవే.
తమ మూడు నెలల పర్యటనను రెడ్డిగారు ఇలా వర్ణించారు:
అదొక దివ్యగానం. అంతా చక్కగా జరిగింది. ఇంతకు ముందెన్నడూ స్వామీజీ భాషణలను వినకపోయి నా, వెళ్లిన ప్రతిచోటా - పాత ప్రేమికు ల్లా కాకపోయినా - పాత స్నేహితులు మళ్ళీ కలుసుకున్నప్పటి ఆప్యాయత తో కూడిన వాతావరణం నెలకొంది.
1965 జూన్ 15న గ్రీకుదేశానికి చెందిన ఏథెన్స్ పట్టణంనుంచి స్వామీజీ మిషన్ సభ్యుల నుద్దేశిస్తూ తపోవన్ ప్రసాద్ లో ప్రచురించడం కోసం ఈ జాబు వ్రాశారు :
నేను ఇంచుమించు భారతదేశా నికి చేరినట్లే. ఇక్కడినుంచి ఆమెను హత్తుకోగలిగేంత సమీపంలో ఉన్నా ను. మార్చి 7 న నేను బయలుదేరి నప్పటినుంచి ఈనాటివరకూ ఒక్కరో జైనా విశ్రాంతి కాని, వృథాగా కాలం గడపటం కాని జరగలేదు. ప్రతిరోజూ రెండో మూడో సభల్లో మాట్లాడటం జరిగింది. అవికాక వివిధ బృందాల తో చర్చలూ,వార్తాపత్రికలవారితోనూ రేడియోవారితోనూ ప్రస్నోత్తర సమా వేశాలూ, టెలివిజన్ సంభాషణలూ కూడా ఉండేవి. ఎందరో రాజకీయ నాయకుల్నీ, ఆర్థిక శాస్త్రవేత్తల్నీ, కవుల్నీ, అధ్యాపకుల్నీ కలుసుకున్నా ను. వస్తుప్రదర్శనశాలల్ని, పాఠశాల ల్నీ, కళాశాలల్నీ, క్లబ్బులనీ, హోటళ్ల నీ, భోజనశాలల్నీ, అన్నీ దొరికే బజా ర్లనీ, ఆసుపత్రులనీ దర్శించాను. వీటన్నిటిమధ్యా దొరికిన కొద్దిపాటి సమయంలో సామాన్లు సర్దుకోవటం విప్పుకోవటం, తర్వాతి విమానాన్ని అందుకొని ప్రయాణంచేయటం జరి గింది. భిక్షకు ఎవరూ ఆహ్వానించక పోవటంచేత శాకాహారం కోసం వెతు క్కోవాల్సివచ్చేది. నివేదికలు తయా రు చేయటం, ఉత్తరప్రత్యుత్తరాలు, సాందీపని సాధనాలయం విద్యార్థు లకూ, కేంద్ర చిన్మయమిషన్ నిర్వా హకులకూ ఆదేశాలివ్వటం వంటి పనులు కూడా తప్పనిసరిగా చెయ్యాల్సినవే.
మొత్తానికి వ్యాకులపాటుకు కాని, అలసటచెందటానికి కాని సమయం దొరకలేదు. అంతేకాదు, నిజానికి జరుగుతున్నదానిని జీర్ణంచేసుకోడా నికి కూడా సమయంలేదు. అంతా కదిలిపోతున్న అనుభవాల్లా, మసక మసగ్గా గుర్తున్న జ్ఞాపకాల్లా ఉంది.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment