Thursday, October 2, 2025

 *🎻🌹 ఆయుధ పూజ.....!! బొమ్మలకొలువు*

🌸🌿🌸🌿🌸🌿

🌿దసరా పండుగకు ఒకరోజు ముందు వచ్చే పండుగే ఆయుధ పూజ. 
దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. 

🌸తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని హిందువులలో చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.

🌿ఈ పవిత్రమైన పర్వదినాన హిందువులలో చాలా మంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నింటినీ , ఇతర సామాగ్రిని దుర్గా మాత ముందు ఉంచి పూజలు చేస్తారు...

🌸రైతులు అయితే కొడవలి , నాగలి , వాహనం ఉన్న వారు తమ వాహనాలకు , టైలర్లు తమ కుట్టు మిషన్లకు , చేనేత కార్మికులు మగ్గాలకు , ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు , ఇతర పనిముట్లకు పసుపు , కుంకుమతో అది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు.

🌿ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. 

🌸ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

🌷పాండవుల ఆయుధాలు...🌷

🌿పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు.

🌸 అలా వారు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు.

🌿 పంచప్రక్రుతి మహా స్వరూపాలలో దుర్గావేది మొదటిది. బవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే.. శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.

🌷ఈ మంత్రాన్ని ఆయుధ పూజ రోజున పఠించాలి... 🌷

🌸‘ఓం దుం దుర్గాయైనమః' అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి.

🌷బొమ్మల కొలువు..🌷

🌿ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. 

🌸తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ దేవి పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను *‘గోలు'* అంటారు. ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు..🚩

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment