"నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను.
మీ ’ఆలోచనల’ను మార్చుకోవడానికి, లేదా మీ ’జీవనశైలి’ని మార్చుకోవడానికి, లేదా మీ ’చెడు అలవాట్ల’ను సరిచేయడానికి, లేదా ’భయా’న్ని తొలగించడానికి ప్రయత్నించవద్దు.
దానికి బదులు,
మీరు ‘నేను’ అనే ఆలోచనను
దాని ”మూలం’ వైపు అనుసరించడం ద్వారా
మీ దృష్టిని ఉన్నతమైన దానికి, అత్యున్నతమైన దానికి ఎదగనీయండి.
ఆ తరువాత ఒక రోజు మీరు ఆసక్తికరమైన విషయాన్ని కనుగొంటారు.
మీ ”శరీరం’ కరిగిపోతున్నట్లు, విలీనమవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రపంచం, విశ్వం కరిగిపోతున్నట్లు కనిపిస్తుంది.
మీ దేవుడు కరిగిపోతున్నట్లు కనిపిస్తాడు.
మీరు దేనికోసం నిలబడ్డారో, దేనిని నమ్మారో, మీ ఆలోచనలు, మీ అనుభూతులు, మీ భావోద్వేగాలు అన్నీ కరిగిపోతాయి.
అప్పుడు మిమ్మల్ని మీరు సర్వవ్యాపకత్వం,
అంతటా వ్యాపించి ఉన్న చైతన్యం (consciousnes) గా కనుగొంటారు.
మీరు ఎల్లప్పుడూ అంతిమ ’వాస్తవం’, అంతిమ ’ఏకత్వం’ అని కనుగొంటారు.
No comments:
Post a Comment