'ఆస్తులు త్యజించి
ఆత్మ శోధనకై ఒక యోగి ప్రస్థానం’.
ది మాంక్
హూ సోల్డ్ హిజ్ ఫెరారీ
కి తెలుగు అనువాదం
***********
చాలా పెద్ద పేరున్న
జూలియన్ మాంటిల్ అనే ట్రయల్ లాయర్
ఒకానొక రోజు కోర్టు హాలులో
గుండెపోటుతో విరుచుకు పడిపోవడంతో మొదలవుతుంది కథ.
పని…పని…
పని… మాత్రమే ప్రపంచం. పనే దేవుడు.
పనినే ప్రాణంగా భావించే జూలియన్ మాంటిల్
రెండు మూడు నెలలకు హాస్పిటల్ లో బతుకుజీవుడా అని ప్రాణాలతో బయటపడతాడు
కాని, మూడు నెలల్లోనే
తన ఆస్తి, ఐశ్వర్యమూ సంపదా అన్నింటినీ
పూచికపుల్లతో సహా అమ్మేస్తాడు.
తనకంటూ ఏ వస్తువూ వుంచుకోడు.
ఆఖరికి తన పడవలాంటి కారుని కూడా అమ్మిపారేస్తాడు.
ఆ తరువాత ఆశ్చర్యకరంగా ఈ ప్రపంచం నుండి అదృశ్యమై పోతాడు. ఎక్కడికి వెళ్లిపోయాడో
తన ఆచూకీ ఎవ్వరికీ తెలీదు.
*********
పదిహేడు సంవత్సరాలుగా
అతడితో కలిసి పనిచేస్తున్న జాన్
మనకీ కథంతా చెపుతుంటాడు.
అలాంటి జాన్ దగ్గరకు
ఒకరోజు సన్నగా, ఆరోగ్యంగా, చలాకీగా మెరుస్తోన్న కళ్లతో
ఓ ముప్పైఏళ్ల యువకుడు వచ్చి
నేనే జూలియన్ మేంటిల్ నని చెప్తే
కథకుడు నమ్మలేకపోతాడు.
బానడు పొట్ట, ఊబ శరీరం, సగం పైబడిన వయస్సు ఎలా మాయమైపోయాయని ప్రశ్నల వర్షం కురిపించిన కథకుడికి
వివరంగా రెండు వందల పేజీలలో చెప్పిన సమాధానమే ఈ నవల.
**********
ఒత్తిడితో ....
విరామమెరుగకుండా .....
యాంత్రికంగా మారిన జీవితంపై విముఖతతో...
ప్రశాంతతను
వెతుక్కుంటూ బయలుదేరిన జూలియన్
వాళ్లూ వీళ్లూ ఇచ్చిన సమాచారం మేరకు భారతదేశం చేరి
హిమాలయాల దారి పడతాడు.
ఆ మంచు ప్రర్వతశ్రేణులలో
మహామునులను అన్వేషిస్తూ సాగించిన మహాప్రస్థానంలో
శివానా పర్వత ప్రాంతంలో
కొంతమంది యోగులు కనిపించి
జీవితసారాన్ని బోధిస్తారు.
బహుశా
ఈ సరికి మీకు అర్థమైపోయుంటుంది.
ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని రచయిత అత్యద్భుతంగా వర్ణించి వుంటాడని,
**********
అవును. నిజమే.
ఈ పుస్తకం అమ్మకాలు,
దీని తర్వాత రచయిత రాసిన పుస్తకాల వివరాలు జాగ్రత్తగా గమనించినట్లయితే,
ముఖ్యంగా
ఈ నవల ప్రచురణ తర్వాత
రాబిన్ శర్మ తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టేసి
పూర్తిగా పబ్లిక్ స్పీకింగ్ వృత్తిలో స్థిరపడిపోయాడంటేనే
మనం అర్థం చేసుకోవచ్చు.
మన జీవనవిధానం పట్ల,
మన తత్త్వం పట్ల
పాశ్చాత్యులు ఎంత మక్కువ చూపిస్తున్నారో తెలుస్తుంది.
*********
జీవితాన్ని
ఏడు సూత్రాలతో ఆనందమయం చేసుకోవచ్చంటాడు రచయిత.
1. మనసుపై అదుపు
2. గమ్యంపై అదుపు
3. కైజెన్ సాధన
4. క్రమశిక్షణతో బతుకు
5. కాలంపై అదుపు
6. నిస్వార్థ ప్రేమ.
7. ప్రస్తుతాన్ని ప్రేమించు
అనేవి ఆ ఏడు సూత్రాలు
ఒక్కో సూత్రంపై ధ్యానానికి ఒక్కో చిహ్నం
ప్రతి సూత్ర మార్గంలో ప్రయాణించడానికి కొన్ని నిర్దిష్టమైన దారులు సూచిస్తాడు.
కొన్ని ఘట్టాలు అభూత కల్పనలు అనిపించేలా ఉన్నప్పటికీ చాలా ఆసక్తకరంగా ఉంటుందీ పుస్తకం.
చాలా ఆసక్తికరమైన సంభాషణలతో,
పిట్ట కథలతో, ఉపదేశాలతో, సూక్తులతో
సాగిపోయే రచన ఈ నవల.
(భక్తి పుస్తకం బ్లాగ్ నుండి)
No comments:
Post a Comment