Tuesday, December 2, 2025

ఆరోగ్యం గా బతకడం ఆర్థిక నేరం..?? #gym #excercise #health #hospital #villagelife | WISE TV

 ఆరోగ్యం గా బతకడం ఆర్థిక నేరం..?? #gym #excercise #health #hospital #villagelife | WISE TV

https://youtube.com/shorts/tiUON0W7Ck8?si=RW8DkCvPeLpQrrP0


https://www.youtube.com/watch?v=tiUON0W7Ck8

Transcript:
(00:00) మనిషి ఆరోగ్యంగా బతకాలనుకోవడం ఒక ఆర్థిక నేరం కిందకి పరిగణించబడతది. లేకపోతే వందల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టేటోళ్ళు ఏం కావాలి కోట్లు కోట్లు ఖర్చుపెట్టి డాక్టర్లు చదివి డాక్టర్లు అయినోళ్ళ గతి ఏం కావాలి ఇటు జిమ్ములు, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు వీళ్ళందరూ ఎటు పోవాలి అందుకే ఆరోగ్యంగా బతకడం అనేది సమాజానికి హానికరం.
(00:23)  ఇంట్లో చేసే ప్రతి పని పెద్ద కష్టం అయిపోయింది అని చెప్పేసి పైసలు పెట్టి మరి మిషన్లు కొనుక్కొని మొత్తం మిషన్ల పైన ఆధారపడేటట్టు చేసిరు. తర్వాత ఆరోగ్యాలు పాడైతున్నాయి అని చెప్పేసి మళ్లా పైసలు కట్టి జిమ్లలో జాయిన్ చేసి అక్కడ తీసుకుపోయి ఇంట్లో చేసుకునే పనులే చేపిస్తున్నారు [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] చూసిరు కదా మనం అనారోగ్యంగా ఉంటేనే అందరూ బతుకుతారు.
(01:13)  అదే ఒకవేళ మనం ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేసినామ అనుకో అది ఆర్థిక నేరం కిందికి వస్తది అన్నట్టు ఇంకా చెప్పాలంటే మీరు చుట్టూ చూస్తే మేజర్ గా రెండు రకాల కొలువులు కనిపిస్తాయి మీకు ఒకటేమో మన ఆరోగ్యాన్ని చెడగొట్టేటోళ్ళు అన్నట్టు అంటే సిగరెట్లు మందు జంక్ ఫుడ్ ఇవన్నీ తయారు చేసేటోళ్ళు అవన్నీ తీసుకొచ్చుకొని షాప్లలో పెట్టుకొని అమ్ముకునేటోళ్ళు వీళ్ళందరూ మన చుట్టూ ఓన్లీ మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికే కష్టపడుతుంటారు అన్నట్టు మళ్లా ఈ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత దాన్ని రిపేర్ చేసేటందుకు మళ్ళీ ఒక వ్యవస్థ తయారవుతుంటది అన్నట్టు పక్కకు వాళ్ళేమో ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఒక పెద్ద సెటప్
(01:43) పెట్టుకుంటారు. అంటే ఇటు మన ఆరోగ్యాన్ని చెడగొడుతూ పైసలు తీసుకుంటారు చెడిపోయిన తర్వాత దాన్ని బాగు చేస్తామని కూడా పైసలు తీసుకుంటారు. మొత్తం మీద సమాజానికి పైసలు పంచే పనిలో మనం ఉంటాం.

No comments:

Post a Comment