మీకు తెలుసు!
*************
ఈభూమిపై విచిత్రం!
తనజాతిని తాను
స్వాహా చేసే జీవి
ఒకేఒక్కటిఉంది!
మీకుతెలుసు!
తన సౌఖ్యం కోసం
తనలాంటివారే
తన ప్రక్క జీవుల్ని
దగాచేసే జీవి ఎవరో
మీకుతెలుసు!
ఉద్యోగాలుచేస్తాడు
లంచాలుతింటాడు!
రాజకీయాలుచేస్తాడు
ప్రజాధనం బొక్కేస్తాడు!
మీకు తెలుసు!
నీతులు చెపుతాడు
గోతులు తీస్తాడు!
ధర్మాలు చెపుతాడు
అన్నీ అధర్మాలే!
మీకుతెలుసు!
విద్య,వైద్యం,వ్యాపారం
అంతా 'సేవే' అంటాడు
'సేవ' కనపడడు!
అంతా స్వార్ధమే!
మీకు తెలుసు!
సొంతలాభాలు
కోట్లకుకోట్లు!
ప్రక్కవాణ్ణి మాత్రం
దరిద్రుణ్ణి చేస్తాడు!
మీకుతెలుసు!
ఇంతకంటేపాపాలు
ఇంకేమైనాఉంటాయా?
వీడికి భజనచేసే
'ప్రబుద్ధులు'న్నారు!
మీకుతెలుసు!
బానిసలకాలం నుండి
ఇప్పటివరకు-ఈ
తోడుదొంగలు చేసిన
పాపాలుఇన్నీఅన్నీకాదు!
మీకుతెలుసు!
అందరికీతెలుసు
రోగాన్నిగుర్తించాము!
దీనికిచెయ్యాల్సింది?
సమాజశస్త్రచికిత్స!
మీకుతెలుసు!
మీకుతెలుసు!
మీకుతెలుసు!
అన్నీమీకుతెలుసు!
సమాజమే-ఆపరేషన్
థియేటర్-మీకుతెలుసు!
డాక్టర్లే తక్కువ ఉన్నారు
ఉన్నవాళ్లుఅందరూరారు
రోగం ముదిరిపోతోంది!
కాస్త కంగారుగా ఉంది
ఇది ఆపరేషన్ కంగార్!
కంగారుపడాల్సినప్పుడు
కంగారు పడలేదు!
ఇప్పుడుకంగారుపడొద్దు!
జనం 'మనుభావ'
బంధిఖానాలోఉన్నారు!
వాళ్ళను'మనుభావాల'
బంధిఖాననుండిముందు
విడుదలచ్చెయ్యండి!
ఆ తర్వాత చూద్దాం
ఆపరేషన్ కంగార్!
*******
-తమ్మినేని అక్కిరాజు
హైదరాబాద్
30-11-2025
No comments:
Post a Comment