'పర్వత శిఖరాలపై ధూళి' రస్కిన్ బాండ్ కలం నుండి జాలువారిన ఓ రమ్యమైన కథ
హిమాలయ పర్వత పాదాల దగ్గర ఒకానొక పల్లెలో మొదలౌతుంది కథ
బిష్టు కథానాయకుడు.పన్నెండేళ్ళు అతని వయస్సు. తన చెల్లెలు అమ్మ తో కలసి ఎదురుచూస్తుంటాడు తొలకరి జల్లుల కోసం
తొలకరిస్తే.... అరక దున్నిన తన పొలంలో
విత్తులు జల్లి ధాన్యం పండిద్దామని
కానరావు వానొచ్చే జాడలు తెల్ల మబ్బులే గానీ
పలకరించవు నీలి మేఘాలు
బయలుదేరతాడు ముసోరీకి పని కోసం.... ఆ ఏడాదంతా తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం
పట్టణం చేరే దారంతా చెట్లూ చేమలూ గడ్డిమైదానాలూ లేనేలేని బొడి కొండలు.... ఏమైపోయాయి దట్టంగా ఉండాల్సిన వృక్షాలు అంటాడు పైకే
కారణం.... మనుషులు... రోడ్ల కోసం భవనాల కోసం పట్టణాల కోసం కరెన్సీ కలల కోసం కూలిపోయాయవన్నీ.... దగ్గు తెరల మధ్య సమాధానమిస్తాడో వృద్ధుడు
డబ్బు కోసం ఆశపడి ఢిల్లీ లాంటి పట్టణాలకు పోనే పోవద్దు... పోయి డ్రగ్స్ మాఫియా చేతుల్లో పావు కావద్దు అని సలహా ఇస్తాడతనే బిష్ణూకి
ముసోరీ చేరిన ఆ పిల్లాడు ఓ సినీ థియేటర్ లో టీ అంగడిలో పనిలో కుదురుకుంటాడు.... పర్యాటకులతో కిక్కిరిసిపోయిన ముసోరీ వేసవి పూర్తికాగానే ఒంటరైపోతుంది
ఆ మూడు నెలల సంపాదనా ఇంటికే బిష్ణూ చేతిలో చిల్లిగవ్వ లేదు
ముసోరీ కి కూత వేటు దూరంలో దుమ్మూ ధూళీ ప్రేళుళ్ళ గనులలో పని కోసం పోతాడు విష్ణు....
చిన్నవాడని బండలు మోయలేడని పని ఇవ్వరు కాంట్రాక్టర్లు... ఓ సర్దారు ట్రక్కు బండిపై క్లీనర్ గా చెరతాడు
కళ్ళ నిండా వళ్ళంతా నిరంతరం దుమ్మూ ధూళీ.... చెవులు చిల్లులు పడే ప్రేలుళ్ళు.... బ్రద్దలైపోయే నేలపొరలు ఒరిగి కూలిపోయే సమున్నత వృక్షాలు కలత చెందుతుంటాడు బిష్ణు .....
సంవత్సరం గడిచింది .... ఎన్నెన్నో అనుభవాలు.... సర్దారు ఆత్మీయమైన స్నేహం
ఓ రోజు.... లోయలోకి జారిపోతుంది ట్రక్కు... ఓ పైన్ వృక్షం అడ్డురావడంతో తప్పుతుంది లోయలో పడిపోయే ప్రమాదం.... తుక్కు తుక్కు అయిపోతుంది ట్రక్కు
చిన్నపాటి గాయాలతో కూలీలూ బిష్ణూ బయటపడతారు... సర్దారు గారి ఎముకలు మాత్రం విరిగిపోతాయి
కోలుకున్న తరువాత కొడుకు చెంతకు పోతానంటాడు సర్దారు... మరీ నీ సంగతేంటి అంటాడు విష్ణూతో
మా యింటికి పోతాను అంటాడు....
ఎందుకూ అంటే
పుడమి గర్భాన్ని చిదిమేసి
సంపదను బలవంతంగా లాగేసుకోవడం కంటే
భూమాత కడుపు నుండి సహజంగా ప్రసవింపజేయడమే మేలు కదా ..... అంటాడు బిష్ణూ ...
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment