Saturday, April 20, 2024

ఒత్తిడి రావడానికి మూల కారణం ఏమిటి | stress management | Kanth’Risa

 
ఒత్తిడి రావడానికి మూల కారణం ఏమిటి | stress management | Kanth’Risa




నమ్మకం(belief) - two stories నా నోట్లోకి ఈగ దూరింది | two stories about belief | Kanth’Risa

 
నమ్మకం(belief) - two stories నా నోట్లోకి ఈగ దూరింది | two stories about belief | Kanth’Risa




నిజమైన స్నేహితుడు

 *నిజమైన స్నేహితుడు* 

పూర్వం ఒక అడివిలో ఒక కుక్క ఉండేది. అది ఒంటరిగా ఉండడం వల్ల ఎవరైనా స్నేహితుడు దొరికితే బాగుండును అనుకొన్నది. స్నేహితుడి కోసం అడివి అంతా తిరగ్గా తిరగ్గా చివరకు దానికో కుందేలు తారసపడింది.

అప్పుడు కుక్క ఆడిగింది - "కుందేలా మనం ఇద్దరం స్నేహితులుగా ఉంటే బాగుండుననిపి స్తోంది. మరి నీ ఉద్దేశం ఏమిటి?” అంది.

"సరే మంచిదే!" అని కుందేలు జవాబు చెప్పింది.

కుక్క, కుందేలు అడివిలో ఒక మంచి చోటు చూసుకుని రాత్రికి అక్కడే పడుకొన్నాయి. కుందేలేమో నిద్రపోయిందిగాని కుక్కకు మాత్రం నిద్రే రాలేదు. దగ్గరలో ఉన్న ఒక చెట్టు కొమ్మ గాలికి 'టపాటపా' కొట్టుకుంటోంది. ఆ శబ్దానికి కుక్క ఒకటే మొరగడం మొదలు పెట్టింది. కుందేలుకు నిద్ర పాడైపోయింది. దాంతో అది కుక్క మీదకు విరుచుకుపడింది.

"కుక్కా, ఎందుకు అదే పనిగా మొరుగుతు న్నావు? ఎవరైనా శత్రువుల్ని పసిగట్టావా?నీవిలా మొరుగుతూ ఉంటే ఏదైనా తోడేలు మన ఉనికి తెలిసికొని మన ఇద్దరినీ తినేస్తుంది జాగ్రత్త!" అని హెచ్చరించింది కుందేలు. కుక్క ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయి మనసులో అనుకుంది.

'అయ్యో, ఈ అల్పజీవిని స్నేహితుడిగా ఎన్నుకున్నానే. నా తెలివిమండా, ఈ కుందేలు వట్టి పిరికిది. అదే తోడేలు ఐతేనో. ఎవరికీ భయపడనే భయపడదు."

మర్నాడు కుక్క కుందేలు స్నేహం వదిలేసి తోడేలు కోసం అడివి అంతా వెదుక్కుంటూ పోయింది. వెతగ్గా వెతగ్గా ఎలాగైతేనేమి ఒక తోడేలు దొరికింది.

కుక్క అసలు సంగతి చెప్పింది.

“తోడేలు బావా! నాదో చిన్న మనవి. మనం ఇద్దరం స్నేహితులుగా ఉంటే బాగుంటుందను కొంటున్నాను. మరి నీకు ఇష్టమైతే....” సందేహంగా నసిగింది కుక్క.

“ఓ, ఇష్టమా అని అడగడమెందుకు? ఇద్దరం కలిసి ఉంటే ఎంత బావుంటుందో వేరే చెప్పాలా” అని తన ఇష్టాన్ని ప్రకటించింది తోడేలు బావ.

రాత్రి అయింది. కుక్క, తోడేలు నిద్రపోయాయి. అర్థరాత్రి కుక్కకేదో చప్పుడు వినపడింది. కుక్క మొరగడం ప్రారంభించింది. తోడేలుకు ఎక్కడ లేని భయం వేసింది. గుండె వేగంగా కొట్టుకోవడంతో కుక్కను కసురుకుంది.

అస్తమాను ఏమిటా మొరగడం, మనం ఇక్కడ ఉన్నట్టు ఎలుగ్గొడ్డుకు తెలిసిందంటే, క్షణంలో మన ఇద్దరి పని స్వాహా అంతే!” అని తోడేలు చివాట్లు పెట్టింది కుక్కను.

కుక్క అనుకొందప్పుడు 'తోడేలుకు ధైర్యం ఎక్కువ అనుకొన్నా గాని దీనికీ భయమే. ఆ ఎలుగ్గొడే నయం. దానికి ధైర్యం ఎక్కువ.'

తెల్లవారగానే కుక్క తోడేలుతో స్నేహం తెగ తెంపులు చేసుకొంది. అడివంతా తిరిగి తిరిగి చివరకు ఒక ఏలుగ్గొడ్డును కనుక్కొంది. ఎలుగ్గొడ్డును చూడగానే కుక్క చిన్నగా నవ్వి-

"బలశాలీ. ఎలుగ్గొడ్డు మామా! మనం ఇద్దరు స్నేహితులుగా ఉందామా మరి?" కుక్క అడిగింది తోక ఆడిస్తూ.

“ఓస్ ఇంతేనా. దానికేం? ఈ క్షణం నుండే మనం ఇద్దరం మంచి స్నేహితులం" చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసింది ఎలుగ్గొడ్డు.

ఆడుతూ పాడుతూ పగలంతా తిరిగి బాగా అలిసిపోయాయి కుక్క, ఎలుగ్గొడ్డూ.

ఇంతలో రాత్రి అయింది. రెండూ గాఢనిద్రలోకి జారుకొన్నాయి. సరిగ్గా అర్థరాత్రి అయిందో లేదో టక్కున లేచి కూర్చొంది కుక్క. గట్టిగా మొరగడం మొదలెట్టింది. కొంపమునిగి ఏం ప్రమాదం వచ్చి పడిందోనని భయంతో ఎలుగ్గొడ్డు లేచి కూర్చుని విసుగ్గా కుక్కను తిట్టింది.

“కుక్కా, ఎందుకా మొరుగుడు? ఊరికే ఉండలేవా? మనం ఇక్కడ ఉన్నట్టు ఎవడైనా మనిషి పసిగట్టాడంటే ఇద్దరినీ తప్పక చంపుతాడు తెలుసా?" అన్నది.

కుక్క బాగా తిట్లు తిన్నది. మనసులో ఇలా అనుకొంది. "అయ్యోరామ, ఇదీ పిరికిదే. ఈ పిరికిదానితో స్నేహం కన్నా మనిషితో స్నేహం చేస్తేనే మంచిది.”

ఆ రాత్రి ఎలాగో గడిపేసి తెల్లవారిన తర్వాత ప్రయాణానికి సిద్ధమైంది కుక్క. ఎలుగ్గొడ్డుకు రాత్రి నిద్ర సరిపోలేదు గనుక ఇంకా గుర్రుపెట్టి నిద్రపోతోంది. అదే మంచి సమయమను కొంది కుక్క.

అక్కడ నుండి దూరంగా ఒక్క పరుగుతీసింది. అడివిలో అడ్డుపడి ఆ మూల ఈమూలా గాలించింది మనిషి ఎక్కడయినా తారస పడతాడేమోనవి. తిరిగి తిరిగి అలిసిపోయిన కుక్క ఒక చెట్టు నీడలో రవ్వంతసేపు విశ్రమిం చింది. అనుకోకుండా అక్కడే కొద్ది దూరంలో కనిపించాడు ఓ మనిషి కట్టెలు కొట్టుకుంటూ, కుక్కకు చెప్పలేనంత సంతోషం కలిగింది.

ఒక్క గెంతులో అతడి దగ్గరకు పరిగెత్తి
అడిగింది.

"ఏమయ్యా మనిషీ, మనం ఇద్దరం స్నేహంగా ఉంటే బావుండదూ..!”

"సరే మంచిది, నాకేం అభ్యంతరం లేదు" అని కుక్కను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అతడు. రాత్రి తనతో పాటు కుక్కకు తృప్తిగా అన్నం పెట్టి గొలుసుతో దాన్ని తన మంచానికి కట్టబెట్టాడు. అతడు మంచం మీద నిద్ర పోయాడు.

అర్థరాత్రి కాగానే ఎప్పటిలాగే కుక్క మొరగడం ప్రారంభించింది. దాని అరుపులకు మంచం మీదున్న మనిషి లేచి కూర్చున్నాడు. నిద్ర పాడయిందనే కోపంతో కుక్కను కసిరాడు.

కసిరి ఇలా అడిగాడు. "ఏమే ఎందుకలా మొరుగుతూ కూర్చొని నా నిద్రని మొత్తం పాడుచేస్తావు ? నువు కూడా కాస్త నిద్ర  పోరాదూ?”

సమాధానంగా కుక్క “స్వామీ! శత్రువుల నుండి మనకేదయినా ప్రమాదం వస్తుందని అనుమానం కలిగినప్పుడు నేను ముందుగానే మొరుగుతాను. అది నా నైజగుణం. ఇప్పుడే ఒక క్షణం క్రితం మన ఇల్లు దోచుకోడానికి ఒక దొంగ వచ్చాడు. ప్రమాదం నుండి మిమ్మల్ని హెచ్చరించాలనే నేను మొరిగాను. నేను మొరగడం వల్లనే దొంగ భయపడి ఠక్కున పారిపోయాడు. నన్ను మంచానికి కట్టకుండా ఉన్నట్టయితే దొంగ మీదకు ఎగిరి వాడి కాలుని నా వాడి పళ్ళతో పట్టుకొనేదాన్ని. మేలు చేసిన మీకు విశ్వాసంగా ఉండకపోతే ఎలా, అది నిజమైన స్నేహం ఎలా అవుతుంది ?" అని వినయంగా పలికింది కుక్క.

అతడు ఆనందపరవశుడై కుక్కకు కట్టిన గొలుసు తీనేసి, కుక్క తలను మృదువుగా నిమిరాడు. దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు.

ఆనాటి నుండి ఈనాటి వరకూ కుక్కకూ మనిషికీ నిజమైన.. విలువైన స్నేహం అలా సాగుతూనే ఉంది !

*సమాప్తం*

చిన్న పక్షి రోజుకి సగటున 950 కి.మి ప్రయాణం చేయగలవు.

 


*అర్జెంటినా నుండి బార్న్ స్వాలొ అనే ఆరు ఇంచెలు ఉండే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 8300 కి.మి. ప్రయాణం చేసి మార్చ్ నెల చివరికల్లా కాలిఫోర్నియా చేరుకుని అక్కడే నివాసం ఏర్పరుచుకుంటాయి. రోజుకి సగటున 950 కి.మి ప్రయాణం చేయగలవు. తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్‌లో తన పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి. ఇందులో వింత ఏముంది అంటారా, కానీ అవి దాదాపుగా 16600 కి.మి ప్రయాణం చేస్తాయి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు మొత్తం ప్రయాణం అంత సముద్ర మార్గానే సాగుతుంది. అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు,ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి. అవి అలసిపోయినప్పుడు, ఆకలి వేసినప్పుడు, ఆ పుల్లను నీటి పైన వేసుకుని సేద తీరుతాయి అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళి ప్రయాణం మొదలెడతాయి. ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం, పట్టుదల. చిన్న పక్షులు వాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు అపార మెధోసంపత్తినిచ్చాడు మన మీద మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి.*

లోక జ్ఞానం

 *లోక జ్ఞానం*

ఇంటర్ లో 99% మార్కులు తెచ్చుకుని, ఐ.ఐ.టి ఢిల్లీలో సీట్ కొట్టి.....ఆ జిల్లాలోనే తెలివైన కుర్రోడిగా పేరు తెచ్చుకున్న సుందరం కొడుకు, ఎక్కడికన్నా తీసుకెళ్లమని వాళ్ళ నాన్నతో ఒకటే గోల.
కొడుకు బాధ పడలేక ఎక్కడకి తీసుకెళ్ళాలో  చెప్పమన్నాడు సుందరం. చలికాలం రాత్రి లంబసింగిలో టెంట్ వేసుకుని ఉంటే బాగుంటుంది అన్నాడా అబ్బాయి. టెంట్ ఒకటి కొని, 
శనివారం ఉదయం బయలుదేరి సాయంత్రం లంబసింగి చేరుకుని, 
మంచి ప్లేస్ ఒకటి పట్టుకుని, టెంటు వేసుకుని పడుకున్నారు 
తండ్రి కొడుకులు. 
. 
. 
మధ్య రాత్రి లేపి 
కొడుకుని పైకి చూడమన్నాడు సుందరం. చూశాడు కొడుకు...... 
"ఏమి  కనపడుతుందిరా?" అడిగాడు సుందరం. 
"నక్షత్రాలు!" అన్నాడు కొడుకు.
"నీకేం అర్ధం అయింది" అనడిగాడు సుందరం. 
.
"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే శుక్రుడు మకరరాశిలోకి వెళ్తున్నాడు, 
జీవ శాస్త్రం ప్రకారం చూస్తే జీవం ఉన్న ఏకైక గ్రహం మీద మనమున్నాం, 
అంతరిక్ష శాస్త్రం ప్రకారం చూస్తే ఈ విశ్వము అనంతమైనది,
భౌతిక శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుడు తన గురుత్వాకర్షణ శక్తితో భూమిని, దాని మీద ఉన్న మనల్ని తిప్పుకుంటున్నాడు, 
రసాయన శాస్త్రం ప్రకారం చూస్తే, ఈ విశ్వములో ఉదజని 99 శాతం ఉంది" అన్నాడా కొడుకు.
ఇంతలా అడుగుతున్నావు, "ఇంతకీ నీకేమర్థమయింది నాన్నా?" అనడిగాడా అబ్బాయి,

*"మన టెంట్ ఎవడో దొబ్బుకెళ్ళాడ్రా నిద్రమోహం నా కొడకా"*- 
అని తిట్టాడాయన 
ఐ.ఐ.టి లో నెంబర్ వన్ తెచ్చుకున్న కొడుకుని😌
అందుకే చెప్పేది....
లోకజ్ఞానం కూడా నేర్పండి అని...🙏.

ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అందరిలో మార్పు రావాలి. లేకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. అందరు దీని గురించి ఆలోచించడం మొదలు పెడతారని కోరుకుంటూ అందరికీ నమస్సులు.

 ఇంటర్ ఫలితాలు వచ్చాయి.  నాకు తెలిసిన ఓ పదిమంది పిల్లలు పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు.  వారి రిజుల్త్స్ కనుక్కుందామని కొందరికి ఫోన్ చేసాను.  ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ రిసీవ్ చేసుకింది.  "అమ్మాయి కు మూడ్ బాగా లేదు. పడుకుంది"  అని చెప్పింది ఆమె.  ఆ పిల్ల చాలా తెలివికలది.  పొరపాటున తప్పిందా అని అనుమానం వచ్చి "ఎన్ని మార్కులు వచ్చాయి?" అని అడిగాను.  975 అని జవాబిచ్చిది ఆమె.  అబ్బో.... చాలా మంచి మార్కులు... మరి మూడ్ బాగా లేకపోవడం ఏమిటి?  అన్నాను.  985 ఎక్స్పెక్ట్ చేసింది.  దాంతో డిప్రెషన్ లో ఉంది.  మాకు కూడా తృప్తి లేదు. అందుకే ఎక్కడికీ వెళ్ళలేదు"  అని చెప్పింది ఆమె.

  మరొకరికి ఫోన్ చేసాను.  ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తున్న సౌండ్ వినిపించింది.  వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుంది.  " మార్కులు బాగా తక్కువ వచ్చాయి.  పొద్దుటినుంచి ఏడుస్తున్నది. ఓదార్చడం మా వల్ల కావడం లేదు"  అన్నది ఆమె.  "ఎన్ని వచ్చాయి?" అడిగాను. " 988 వచ్చాయి."  చెప్పింది ఆమె.  నాకు చిరుకోపం వచ్చింది.  "పార్టీ అడుగుతాము అని మీరు అలా అంటున్నారు.  988 అంటే చాలా గొప్ప మార్కులు కదా? "  అన్నాను.  "మార్కులు రాగానే వాళ్ళ కాలేజి నుంచి ఎవరో ఫోన్ చేసారు.  ఇంకొక్క రెండు మార్కులు వచ్చినట్లయితే, నీ పేరు, ఫోటో ఫ్లెక్సీ లకు ఎక్కేది.  మంచి చాన్స్ మిస్ చేసుకున్నావు.  ఇంత తక్కువ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యలేదు"  అని అన్నదట ఆమె ఎవరో...దాంతో దిగులు పడింది."  అన్నది ఆ తల్లి.  

 మరొకరికి ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రి మాట్లాడాడు.  "ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. డాక్టర్ని చేయ్యాలనుకున్నాము.  20 వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాము.  అయిదారు వేల రూపాయలతో డ్రస్సులు అడిగితే కొనిపెట్టాము.  లక్షల ఫీజులు కట్టాము.  కాలేజీ కి వెళ్ళడానికి హోండా ఆక్టివా కావాలంటే కొనిపెట్టాము.  చివరకు 965 మార్కులు తెచ్చుకుని మా ఆశలు నీరు కార్చింది.  వాళ్ళ అమ్మ కోపం పట్టలేక చీపురు కట్టె తో చితక కొట్టింది.  ఇద్దరు ఏడుస్తూ గదిలో పడుకున్నారు"  అని చెప్పాడు ఆ జనకుడు.  

 మరొకరికి ఫోన్ చేస్తే 750 మార్కులు వచ్చాయట.  వాళ్లకు అప్పటి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పడుకున్నారట.   అయిదారుగురు పిల్లలకు 850-950 మధ్యన మార్కులు వచ్చాయి.  వాళ్ళు  కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయి, ఇక  జీవితం వ్యర్ధం అన్నంతగా కుమిలి పోతున్నారు.  

  750 వచ్చినా, 850 వచ్చినా, 988 వచ్చినా ఎవరికీ సంతోషం లేదు.  అందరూ ఏడుస్తున్నారు.  

 లోపం ఎక్కడుంది?  విద్యా వ్యవస్థ లోనా?  టీచర్ల లోనా, చదువులలోనా, పిల్లలలోనా, తల్లితండ్రుల లోనా, సమాజం లోనా, ప్రభుత్వం లోనా?  

  ఇప్పుడు 40 ఏళ్ల వయసు దాటి దేశ విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వారిలో ఎక్కువ మంది టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ఏవరేజ్ మార్కులతో పాస్ అయిన వారేనని ఈ పిల్లలు, తల్లితండ్రులు ఎప్పుడు తెలుసుకుంటారు? 

 ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అందరిలో మార్పు రావాలి. పిల్లల యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారు సంవత్సరం మొత్తం చేసే శ్రమను బట్టి, వారి ఇన్వాల్వ్మెంట్ టి బట్టి, పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసే వారిని బట్టి  ఫలితాలు చేకూరుతాయని అర్థం చేసుకోకుండా, విధ్యార్థులు వేరే వారితో వారిని వారు పోల్చుకోవడం, తల్లి తండ్రులు కూడా అదే విధంగా ఆలోచించడం, విద్యాసంస్థల్లోని కొద్ది మంది, వారి బంధువుల్లో కొద్ది మంది తెలిసి తెలియక ఇలాగే ఆలోచించడం కారణాలు.

ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అందరిలో మార్పు రావాలి. లేకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. అందరు దీని గురించి ఆలోచించడం మొదలు పెడతారని కోరుకుంటూ అందరికీ నమస్సులు.

తెలిసిన వారు వేరే గ్రూపు లో పెట్టినారు, మనకు సంబంధించినది. ఒకసారి మనం అందరం చదివితే మంచిది, అని మన గ్రూపు లో పోస్ట్ చేస్తున్నాను.

సేకరణ

కర్మ ఫలం ఒదిలించుకోతరం కానిది !!!

 *కర్మ ఫలం ఒదిలించుకోతరం కానిది !!!*

*కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు.*

*ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు...*

*శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు...*

*భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు.*

*కర్ణుడు నేలపై పడిపోయాడు, మరణానికి ముందు నేలమీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, "నీవేనా ప్రభూ ఇలా చేసింది?ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా! నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా"...*

*సచ్చిదానందమయుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, "అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా చక్రవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు, అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణా...*

*అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది, అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడుగా ఉన్నాడని ఇది అధర్మం అని ఎప్పుడు అనిపించలేదా కర్ణా, ఇది కర్మ ప్రతిఫలం. ఇదే న్యాయం, అన్నాడు కృష్ణ పరమాత్మ...*

*ఆలోచనాత్మకంగా పని చేయండి, ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి, అదే కర్మ భవిష్యత్తులో మీ కోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది.*

*ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు, రామాయణ, భారతం మొదలగు ఇతిహాసాలు, చరిత్ర, కథలు, పురాణాలు చూసినా అదే బోధ పడుతుంది...*

 *🙏||కృష్ణం వందే జగద్గురుమ్||🙏*
🌸🕉️🌸 🌸🕉️🌸 🌸🕉️🌸

🚩" TURNING POINT" ( "మలుపు" )

 👍👍👍👍👍👍"
🚩" TURNING POINT" ( "మలుపు" )
      🔥🔥🔥
"ఎవరి జీవిత చరిత్ర చూసినా, వారి "జీవన సరళి"," గమ్యము" అనూహ్యమైన  
వివిధ పరిణామములు వలన "మార్పు "జరిగే అవకాశం ఉంది.  మరి ఏమిటో తెలుసుకుందామా!
     🙏🙏🙏
🚩"సమర్పణ & సేకరణ:
"MAZUMDAR" BANGALORE Karnataka
87925-86125.
     &
"IMPACT " సౌజన్యంతో,
      🙏🙏🙏

" నేడు సైకాలజీ ప్రకారము
ప్రతి వ్యక్తి జీవితంలోనూ,
అవమానాల ద్వారా,
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, కొందరి జీవితాలలో పెను మార్పులు, చేర్పులు, చేసుకుంటూ ఉంటారు.
అవి ఎందుకు? ఎలా? ఎవరి వల్ల? ఏ పరిస్థితులు కారణాలై ఉండవచ్చు?  వాటి గురించి వివరంగా, విశదీకరించుకుందాం!

🌷" వ్యక్తుల" ద్వారా:-
మీ బంధు,మిత్రులు, మీ బాస్, లేదా ఒక నాయకుడు ద్వారా మీ సాధారణమైన జీవితం మలుపు తిరగవచ్చు,. 
🙏ఉదా:-1. "శ్రీ వివేకానంద జీవితం"  - శ్రీ రామకృష్ణ పరమహంస ద్వారా,

🙏2. "గాంధీ జీవితం"- సత్య హరిశ్చంద్ర, ని జీవితం ద్వారా, మారిందని మనం తెలుసుకున్నాం!
      🙏🙏🙏

🌹" అనుభవాల ద్వారా":- మీ జీవితంలో మీరు చేయ పనులు వల్ల, వచ్చే అనుభవం ప్రకారము నేర్చుకున్న విషయాలు, పాఠాలుగా గైకొని, ప్రవర్తిస్తారు.

🙏ఉదా:- 1)"చాణిక్యుడు,- ని "నందరాజులు" అవమానిస్తే,

🔥2)" South Africa" లో  "మన గాంధీ గారిని అవమానిచ్చి, రైలు నుండి త్రోసి వేయగా, ఆయన చిరునవ్వు నవ్వి, మన భారత దేశము నుండి వారిని త్రోసివేసినాడు.
        🙏🙏🙏

🪷" మాట" ద్వారా:-
మాట ను గురించి విశేషంగా, ప్రత్యేకంగా రాసిన "శీర్షిక"ను ఒకసారి చదవండి!.  "టీచర్లు"  ఒక గొప్ప స్పీకర్ గా మారారు.
అనేక సినిమాలలో, వ్యక్తుల యొక్క జీవితాలలో, మాట అనే తూట, ఒక ఆయుధమై పని చేసింది.  వారి జీవితాలని మార్చినట్లు, వీక్షించినాము.  ఎవరైనా ఒక వ్యక్తి మనలను ఒక మాట అన్న, మనం  వెంటనే "రియాక్ట్" కాకూడదు.
"యాక్సెప్ట్" చేయండి.  ఆ మాటకు తగిన ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో! మీ జీవితంలో అని "ఎనాల్సిస్" చేసుకుంటే,
మారావలెనన్న మారండి! (లేదా ) ఆ విషయము (మాట ను) వదిలి పెట్టండి.  మీ ఆరోగ్యము ముఖ్యము.కదా! ఎవరో అన్న మాటను పట్టించుకోవద్దు. 

       🙏🙏🙏
🌸" దృశ్యము":- ద్వారా
కొంతమంది వ్యక్తులు, వారి జీవితంలో, చూసి పరిణామము చెంది మారగలరు, వారి జీవితం "మలుపు తిప్పుకోగలరు"
.
🙏;ఉదా:- 1)" "సిద్ధార్థుడు"  అనే రాజ కుమారుడు- "గౌతమ బుద్ధుడు"గా  ఏవిధము మీకు అందరికీ తెలిసి ఉండును.

🔥2)" రత్నాకరుడు" అనే బోయవాడు." "వాల్మీకి ఋషి" గా మారిన విషయము గురించి వేరే చెప్పవలసిన పనిలేదు.
      ❤️❤️❤️
" మీ జీవితంలో కొత్త మెరుగైన మార్పు, మార్గాలు అన్వేషిద్దాం!

🔥" ఏ విషయాన్ని మీరు అవైడ్( Avoid)చేయవద్దు "Respond " అవటం నేర్చుకోండి.

🔥" Brack" : ఆ విషయాన్ని" ఆత్మ పరిశీలన" చేసుకోండి.

🔥" Creative Thinking:- ( out of box thinking) ఇంతకుమించి నేను ఏమి చేయగలను? అంతకుమించి నేను ఏమి చేయగలను?  అని ప్రశ్నించుకొని, ప్రయత్నం చేయండి. ( "Creative Thinking" మీద పెద్ద ఎపిసోడ్ లా రాయడమైనది.   మన సభ్యులు చదవని వాళ్ళు కూడా చదవండి)

🔥" Decision making" సరి అయిన మెరుగైన నిర్ణయాలు తీసుకొనుట, చాలా అవసరము.  ఈ విషయము గురించి
చాలా పొడవైన, అతిపెద్ద,
"శీర్షిక రాయడం" అయినది , చదవని వాళ్ళు చదవండి) 

     🙏🙏🙏
" నేటి నుండి మీరందరూ,
నిన్నటి లాగా-- ఈ రోజు ఉండకండి.

🔥" ఈరోజు లాగా-- రేపు అలా ఉండకండి.

"👍" రేపటి రోజు మీరు ఎలా ఉండబోతున్నారో-- మరుసటి రోజు అలా ఉండకండి.   ఎందుకంటే మీ జీవితాన్ని ఎలా గొప్పగా, హుందాగా, తీర్చిదిద్దుకోండి.  అభివృద్ధిని కాంక్షించండి!
కరోనా ముందు, కరోనా తరువాత చాలా మార్పులు వచ్చినవి కదా!
మార్పుని గౌరవించండి? ఆహ్వానించండి.?
మంచి విషయాలు పై శ్రద్ధ, ఓపిక, తీరిక, సమయం కేటాయించి, మీ జీవితాలు ఆనందమయం, సుఖమయము చేసుకోండి.
ఇలాంటి అద్భుతాలు, చేయవలసిన మంచి పనులు, పాజిటివ్ ఆలోచనలు, దుఃఖ రహిత జీవితం సరైన సాధన ద్వారా సాధ్యం అందరికి. 

👍👍👍👍👍👍

Wednesday, April 17, 2024

నా(Madhu) ఫిలాసఫీ..... కొన్ని సత్యాలు... " జ్ఞానానికి,విజ్ఞానానికి దారులెప్పుడూ తెరిచే ఉంటాయి "...

 నా(Madhu) ఫిలాసఫీ..... - పరిచయం

..... నా ఫిలాసఫీ లోంచి కొన్ని సత్యాలు...

" జ్ఞానానికి,విజ్ఞానానికి దారులెప్పుడూ తెరిచే ఉంటాయి "...


@.... మన జీవితంలో సంభవించే ప్రతీ అనుభవానికి మనమే బాధ్యులను....

@....మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది....

@....ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంది.....

@.... ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడం , తోనూ, మరి తప్పు చేశా మేమో అన్న భావం తోనూ బాధపడుతుంటారు....

@...ప్రతి ఒక్కరూ తమలోపల నేను బాగాలేను... అన్న అసంతృప్తితో ఉంటారు...

@...ఇది కేవలం "ఆలోచన" మాత్రమే ....మరి ఆలోచనలను మనం మార్చుకోవచ్చును.....

@...మనమే "రోగాలు" అనబడే వాటికి మన శరీరాల్లో సృష్టించుకుంటున్నాము.....

@.... క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామేమో అన్న భావన, మరియు భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచనా విధానాలు......

@....క్రోధ భావనను వదిలిపెట్టేస్తే "కాన్సర్" సైతము నయమవుతుంది.....

@.....మనం గతాన్ని పూర్తిగా విసర్జించి,ప్రతీ ఒక్కరినీ క్షమించేయాలి.......

@....మనల్ని మనం ప్రేమించు కోవడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాలి....

@.....ఈ క్షణంలో మనల్ని మనం మంచిగా భావించడంతోనూ,మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోడంతోనూ, మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతాయి.....

@....మనల్ని మనం "నిజం"గా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతీదీ మనకు అనుకూలిస్తుంది......

Part____1(a)

.....నా విశ్వాసము.....

#నిజానికి జీవించడం చాలా సులభము....మనం వేటినైతే బయటకు పంపుతామో వారినే తిరిగి పొందుతున్నాము.......

మన గురించి మనం చేసే ప్రతి ఆలోచనా మన పట్ల వాస్తవం అవుతుంది .... నాతో సహా ప్రతి ఒక్కరూ, వారి వారి జీవన పరిస్థితులకు వారే బాధ్యులు... అవి ఎంతటి ఉన్నతమైనవి అయినా సరే ,లేదా నీచమైనవి అయినా సరే.... మనం చేసే ప్రతి ఆలోచనా మన భవిష్యత్తుని సృష్టి స్తోంది.... మనమందరమూ మన ఆలోచనలతో, మన భావనలతో మన జీవితానుభావాల్ని సృష్టించుకుంటున్నాము.... మన మనస్సు ల్లోంచి జనించే ప్రతీ ఆలోచనా,మన నోటిలోంచి వెలువడే ప్రతి వాక్కూ మన జీవితానుభావాల్ని సృష్టిస్తున్నాయి......

* మన పరిస్థితులను మనమే సృష్టించుకుని, మన నిరాశా నిస్పృహలకు ఇతరులను అందిస్తూ ,మన శక్తిని మనం కోల్పోతున్నాము.... ఏ వ్యక్తి గాని ,ఏ ప్రదేశం కానీ మనల్ని ప్రభావం చేయలేదు.... ఎందుకంటే మన మనసుల్లో ఆలోచనలు చేసేది నిష్చయంగగా మనమే కాబట్టి.... మన మనసుల్లో శాంతిని, సామరస్యాన్ని మరి సమతుల్యాన్ని సృష్టించుకుంటే, వీటినే మన జీవితాల్లనూ దర్శించవచ్చును....

@ ఈ క్రింది వాటిలో ఏ వాక్యము మీ నమ్మకాలకు అణగుణంగా ఉందో కాస్త గమనించండి.....

#... ఎవ్వరూ,ఎప్పుడూ నాకు సహకరించరు.
#...అందరూ అన్నివేళలా నాకు సహకరిస్తారు...

*పై వాటిలో ఒక్కొక్క నమ్మకమూ పూర్తిగా భిన్నమైన అనుభవాల్ని సృష్టిస్తోంది...ఈ విధముగా మనము దేన్ని మన గురించి, మన జీవితం గురించి నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది......


🌹... ఈ విశ్వము మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను మరి ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది...🌹


*... మనం ఎంపిక చేసుకునే నమ్మకాలను మన సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా అంగీకరిస్తుంది ....నా గురించి, నా జీవితం గురించి నేను నమ్మేది నా పట్ల వాస్తవం అవుతుంది ....అలాగే మీ గురించి, మీ జీవితం గురించి , మీ నమ్మకాలే మీ పట్ల వాస్తవాలు అవుతాయి.... మరి మనం ఎంపిక చేసుకోవడానికి లెక్కలేనన్ని ఆలోచనలు ఉన్నాయి....

* ఇది తెలుసుకున్నప్పుడు "ఎవ్వరూ, ఎప్పుడూ నాకు సహకరించారు" అని నమ్మడానికి ఎంపిక చేసుకోవడం కన్నా " అన్నివేళలా నాకు సహకరిస్తారు" అని నమ్మడానికి ,*ఎంపిక" చేసుకోవడం మంచి స్పృహరిస్తుంది కదా!!!!


🌹.... విశ్వశక్తి మన గురించి ఇవ్వడం గాని మనల్ని ఒప్పుకొనకపోవడం గాని, ఎప్పుడూ చేయదు ....🌹


*విశ్వశక్తి మనలో ఉన్నది ఉన్నట్లుగానే మనల్ని అంగీకరిస్తుంది ...మరి మన నమ్మకాల్నే మన జీవితాల్లో ప్రతిఫలిస్తుంది....' నాకెవ్వరు లేరు' 'నేను ఒంటరి వాడిని' 'నన్ను ఎవరు ప్రేమించరు' అనే నమ్మకంతో నేను ఉంటే నా జీవితం లో నేను ఆ ప్రతిఫలాలనే పొందుతాను.....

* అలా కాక ఈ నమ్మకాన్ని నేను వదిలి పెట్టేసి ,"ప్రేమ అంతటా ఉన్నది... నేను ప్రేమ స్వరూపాన్ని,! నన్ను అందరూ ప్రేమిస్తారు" అని ప్రగాఢంగా విశ్వసించి భావిస్తే, అదే నా జీవితంలో వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది... అప్పుడు ప్రేమ పూర్వకంగా ఆదరించే వారే నా జీవితం లో తారసపడతారు.... ఇదివరకే నా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, నన్ను మరింతగా ప్రేమిస్తారు .,.మరి నాలోని ప్రేమను ఇతరులకు నేను మరింత సులువుగా ప్రకటించగలుగుతాను....

🌹.... మనలో చాలామందికి మన గురించిన కొన్ని మూర్ఖపు నమ్మకాలు ఉన్నాయి ....మరి "ఇలాగే జీవించాలి"! అని కొన్ని కటినమైన నిర్ణయాలు ఉన్నాయి....🌹


*ఇలా అనడం మీలో తప్పుల్ని ఎత్తిచూపడం లాంటిది కాదు... ఈ క్షణంలో మనమందరమూ మన శక్తి కొలదీ తగినట్లుగానే జీవిస్తున్నాము... మనకు ఇంకా ఎక్కువ జ్ఞానం, అవగాహన, ఎరుక ఉండి ఉంటే మనం ఇంకా ఉన్నతంగా జీవించి ఉండేవాళ్ళము కదా !!!దయచేసి మీరు ఇప్పుడు ఉన్న స్థితికి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి... నిజానికి ఈ పుస్తకం దరికి చేరిందంటేనే .... మీ జీవితంలో నూతన శుభ పరిణామాలను ఆహ్వానించడానికి, మీరు సిద్ధంగా ఉన్నట్లే లెక్క ......

*" మగవారు ఎప్పుడూ ఏడవరు" "స్త్రీలు డబ్బుకు సంబంధించిన విషయాలను సక్రమంగా నిర్వర్తించలేరు "ఇటువంటి నమ్మకాలను నిజం అనుకోవడం ఎంత అజ్ఞానమో కదా!!! ఆలోచించండి....

🌹.... మనం చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు, జీవితం పట్ల ఎలా స్పందించే వారో, ప్రవర్తించేవారో గమనించి మనము కూడా అలా స్పందించాలని, ప్రవర్తించాలని నేర్చుకున్నాము....🌹


*అలాగే మన గురించి ,మన జీవితం గురించి ఏమీ ఆలోచించాలో నేర్చుకున్నాము... భయాలు, బాధలు కోపాలు, అపరాధ భావనలు, ఉన్నవారి మధ్య మీరు జీవించి ఉంటే, తప్పకుండా చాలా అజ్ఞానాన్ని మీరు మీ గురించి, మీ ప్రపంచం గురించి మీ మనసులో నేర్చుకొని ఉంటారు......

#"ఏదీ నేను సరిగా చేయను"
# "తప్పంతా నాదే "
# "నాకే గనుక కోపం వస్తే , నేను మనిషిని కాను" ఇలాంటి భావాలు చాలా నిరాశ పూరితమైన జీవితాన్నే సృష్టిస్తాయి....


మనము తిరిగి పెద్దయ్యాక మా చిన్ననాటి భావన పరిస్థితులను తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది ఇక్కడ మంచి చెడులను మరి తప్పు ఒప్పుల ప్రసక్తి లేదు నా అంతరంగంలో ఒక కుటుంబం అంటే అది మనకు తెలిసింది నీతో మీ తల్లి ఎలా ప్రవర్తించేది లేదా మీ తండ్రి మీతో ఎలా ప్రవర్తించేవాడు లేదా వారిద్దరూ ఒకరితో ఒకరు పరస్పరం ఎలా ఉండేవారు ఇలాంటి కొన్ని వ్యక్తిగత సంబంధాన్ని మనం ఉంటుంది లేదా మీ బాస్ గాని మీ తల్లిలాగోలేదా మీ తండ్రి లాగా ఉన్నారేమో జాగ్రత్తగా పరిశీలించి చూడండి మన తల్లిదండ్రులు మనల్ని ఎలా చూసుకునేవారో అలాగే మనల్ని మనం చూసుకుంటాము మనల్ని మనము అదేవిధంగా చేస్తాము మీరు జాగ్రత్తగా వినగలిగితే అవే మాటల్ని ఇప్పుడు కూడా మీ మనసులో వినగలుగుతారు అలాగే బాల్యంలో మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించే ప్రోత్సహించి ఉంటే అని కూడా మనల్ని అలాగే ప్రేమించుకుంటాము మరి ప్రోత్సహించుకుంటాము


*" ఒకటైన సక్రమంగా చేశావా నువ్వు"? "తప్పంతా నీదే "? ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు తిట్టుకొన్నారో
గమనించండి ....
*నువ్వు చాలా బాగా చేశావు ..నువ్వంటే నాకు ఇష్టం... ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రోత్సహించికున్నారో గమనించండి....

🌹.... ఎదేలా ఉన్నా,ఈ పరిస్థితికి నేను తల్లిదండ్రులను నిందించను...🌹

*మనమంతా బలికాబడ్డ వారి చేత బలి కాబడ్డ బలి పశువులం.... వాళ్లకు తెలియని విషయాల్ని, వాళ్ళు మనకు ఎలా నేర్పగలరు చెప్పండి !!!మీ తల్లి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు, మీ తండ్రి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు, వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎలాగో నేర్పించడం అసంభవం.. వారి బాల్యంలో వారేమీ నేర్చుకున్నారో, అదే మీకు నేర్పించారు... మీకు వారి గురించి తెలుసుకోవాలనిపిస్తే వారి బాల్యం గురించి ప్రశ్నించి తెలుసుకోండి... మీరు ఓపిగ్గా వినగలిగితే వారిలోని భయాలు, మూడవిశ్వాసాలు, వారికి ఎలా ఏర్పడ్డాయో మీరు తెలుసుకోగలరు.... అవన్నీ వారు వారి బాల్యంలో అనుభవించిన భయబ్రాంతులే సుమా!!!

🌹...మన తల్లిదండ్రులను మనమే " ఎంపిక "చేసుకొని జన్మ తీసుకుంటాము...🌹

* మనమందరము ఒక నిర్ణీత కాలంలో, నిర్నిత ప్రదేశంలో ఈ భూతలంపై భౌతిక శరీర ధారణ చేయడానికి విచ్చేస్తాము.... ఆధ్యాత్మిక పథములో మన చైతన్య విస్తరణకు ఒక నిర్ణీత పాఠాన్ని లేదా పాఠాల్ని నేర్చుకోవడానికి మనం ఈ భూతలానికి రావడానికి" ఎంపిక " చేసుకుంటాము ...మన లింగాన్ని, మన రంగుని మన దేశాన్ని ,ఎంపిక చేసుకుని ఈ ప్రస్తుత జీవిత కాలంలో మనం నేర్చుకొనుబోయే జీవిత పాఠాలకు అనుకూల పరిస్థితులను సమకూర్చగలిగే తల్లిదండ్రులను కూడా మనమే "ఎంపిక" చేసుకుంటాము.... తర్వాత పెరిగి పెద్దయ్యాక, మన జీవిత పరిస్థితులకు, మన సమస్యలకు, మన చేతి వేలుని వారి వైపు చూపిస్తూ....."అంతా మీ వల్లే "అని మన తల్లిదండ్రులను నిందిస్తాము.... నిజానికి మనము అధిగమించడానికి ఎంపిక చేసుకున్న జీవిత సవాళ్లకు ,పాఠాలకు ,మన తల్లిదండ్రులే మనకు తగిన వారు.....


* చిన్నతనంలో మనము జీవితం పట్ల కొన్ని నమ్మకాలను ఏర్పరచుకొని, వాటికి అనుగుణంగా మన జీవన పరిస్థితులను సృష్టించుకుంటాము... ఎన్నిసార్లు మీరు ఒకే రకమైన అనుభవాన్ని లేదా సమస్యల్ని మళ్లీ మళ్లీ సృష్టించుకోలేదు? ఆలోచించండి...! ఒకసారి జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ విషయం మీకే తెలుస్తుంది...అలా జరగడానికి కారణం మీ అంతరంగంలో మీకు మీ గురించి అటువంటి నమ్మకాలే ఉన్నాయి కాబట్టి.... ఇక్కడ ఆ సమస్యలు ఎంత కాలం పాటు మనల్ని వేధించాయి లేదా అవి ఎంత పెద్ద సమస్యలు లేదా ఆ సమస్యలు మనల్ని మన జీవితాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురిచే అన్నది ముఖ్యం కాదు ....ఆ నమ్మకాలు మనలో ఉన్నాయా లేదా? అన్నదే ముఖ్యం ....ఆ నమ్మకాన్ని మన అంతరంగంలోంచి తొలగించి వేస్తే ఆ పరిస్థితులు ,ఆ సమస్యలు ఇక తలెత్తవు.....


🌹.... మన శక్తి ఎల్లప్పుడూ ప్రత్యక్షణం లోనే కేంద్రీకరింపబడి ఉంటుంది ....🌹


*ఇంతకాలం మీరు మీ జీవితంలో అనుభవించిన పరిస్థితులన్నీ ,మీకు మీ గతంలో ఉన్న ఆలోచనల వలన, మరి నమ్మకాల వలన, సృష్టించబడినవే !ఇవన్నీ మీ గతంలో మీరు చేసిన ఆలోచనలు... మరియు మీరు పలికిన పలుకులలోంచి, ఉత్పన్నమైనవే... అవన్నీ మీరే నిన్న, పోయిన వారం ,పోయిన నెల, పోయిన సంవత్సరము ,ఇంకా అంతకుముందు ,10, 20 ,30 ,40 ,సంవత్సరాల ముందు మీ వయస్సుని బట్టి ఆలోచించినవే... మరి పలికినవే ....ఏది ఏమైనా అది అంతా గతము ...అది అయిపోయింది.... జరిగిపోయింది ...ఇకపై క్షణంలో మీరు ఏ ఆలోచనలను, నమ్మకాలను "ఎంపిక" చేసుకుంటారో ఎటువంటి పలుకులు పలుకుతారో, అన్నదే ప్రధానము... ఎందుకంటే ఈ ఆలోచనలే ,ఆ నమ్మకాలే, ఈ మాటలే ఇకపై మీ భవిష్యత్తుని సృష్టిస్తాయి ....మీ శక్తి ఎల్లప్పుడూ ఈ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి, రేపటిని వచ్చే వారాన్ని, వచ్చే నెలనీ, వచ్చే సంవత్సరాన్ని, ఆపై మీ జీవితాన్ని సృష్టిస్తున్నది ....


*ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఆలోచిస్తున్న ఆలోచనలను సునిశితంగా గమనించాలి..... అవి "నెగటివ్" పరిస్థితులను సృష్టిస్తాయా? లేక "పాజిటివ్ "పరిస్థితులను సృష్టిస్తాయా? అని పరిశీలించాలి... మీరు ఇప్పుడు చేస్తున్న ప్రస్తుత ఆలోచన మీ భవిష్యత్తును సృష్టించాలా వద్దా ?అని మీకు మీరు నిర్ణయించు కోవాలి... మీరు ఎప్పుడూ, మీ ప్రస్తుతపు ఆలోచనల పట్ల "ఎరుక"తో ఉండాలి ...కావాలంటే ఇప్పుడే మీ బుర్రలో మొదలుకుతున్న ఆలోచనలను పరిశీలించండి......


Part____1(b)


🌹 ఇప్పుడు మనం పట్టించుకోవాల్సినది మనం ఏర్పరచుకున్న మన ఆలోచనలే...ఈ ఆలోచనలను మనము మార్చుకోవచ్చును🌹



*బహిర్ ప్రపంచంలో మన సమస్య ఏదైనా ,మన పరిస్థితి ఏదైనా అది మన అంతర్ ప్రపంచపు ఆలోచనలోంచి జనించినదే....మన అంతరంగాన్ని మనం మార్చుకోగలిగితే బహిర్ ప్రపంచంలో మనకు కావాల్సిన మార్పుకు తీసుకురావచ్చు....


*మన పట్ల మనకున్న" ద్వేషం,"కూడా నువ్విలా ఉన్నావు,నువ్వలా చేశావు, నువ్వంటే నాకు అసహ్యం, లాంటి ఆలోచనలే!!! నేను చాలా చెడ్డవాడిని,అన్న ఆలోచనే మీలో లేకుంటే మీరు చెడ్డవాడివని అసలు మీరు భావించరు.... ఇలా ఆలోచనలే మనలో భావాన్ని సృష్టిస్తాయి... ఏదేమైనా మీకు ఆలోచనే లేకుంటే మీకు ఆ భావనే ఉండదు కదా!!! మనకు ఇష్టం వచ్చిన విధంగా మన ఆలోచనలను మార్చుకొనవచ్చును... మొదట నీలోని ఆలోచనను మార్చుకుంటే, ఆలోచనల వల్ల జనించే భావన కచ్చితంగా మిమ్మల్ని వదిలి పెడుతుంది....


*ఈ వివరణ అంతా మనలో నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో తెలియజేయడానికి... అంతే తప్ప ,"మనకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి.. మన గతి ఇంతే! ఈ బాధల్లోనే మనం ఊరుకో పోవాలి ..."అని మాత్రం కాదు ...గతం గతః భూతకాలం మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు... ఎప్పుడు కూడాను మన శక్తి అంతా ప్రస్తుతక్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది... ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎరుకలోకి తీసుకోవడము ఎంత అద్భుతమో కదా!!! ఇక నిశ్చితంగా మనమీ ప్రస్తుత క్షణంలో పూర్తిగా స్వతంత్రులై పోవచ్చు....


🌹....మీరు నమ్మినా నమ్మకపోయినా, మన ఆలోచనలన్నీ మనమే ఎంపిక చేసుకొన్నాము... అన్నది సత్యము.....🌹


* ఒకే ఆలోచనని పదే పదే, ఆలోచించి ఆలోచించి, అలా ఆలోచించడము మనకు ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది... అందువలన అది మనము ఎంపిక చేసుకున్న ఆలోచనగా మనకు అనిపించదు.... కానీ ఆ ఆలోచనను మొట్టమొదట ఎంపిక చేసుకుని మొదలుపెట్టింది మనమే....!!!


కొన్ని విధాలుగా ఆలోచించడానికి మనకు మనమే ఒప్పుకోము మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడానికి ఎన్నిసార్లు మీరే ఒప్పుకోలేదు గమనించండి అలాగే ఇప్పుడు మీ గురించి మీరు నీటుగా ఆలోచించడానికి కూడా నిరాకరించవచ్చును ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనను తాను ద్వేషించుకోవడం తోను తనలో ఏదో తప్పు ఉన్నదన్న భావంతోనూ బాధపడుతుంటారు ఈ విషయాన్ని నా కంప్లైంట్స్ లోను మరి నాకు తెలిసిన వాళ్ళందరిలోనూ గమనించాను ఈ భావనల తీవ్రతల్లో తేడా ఉండవచ్చును అది వేరే విషయం ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంతా ప్రతికూలంగా ఉంటుంది మరి భావనలు ఎంత తక్కువగా ఉంటే వారి జీవితము అనుకూలంగా ఉంటుంది


🌹 నన్ను సంప్రదించిన వారి అందరిలోనూ వారి అంతరంగంలో నేను బాగాలేను అన్న అసలు తృప్తి ఉంది 🌹

*నేను అనుకున్నవి చేస్తానో, లేదో?
* నేను కోరుకున్నది పొందుతానో లేదో ?*నాకు అర్హత లేదు....
ఇలాంటి నమ్మకాలు మీలోనూ ఉన్నాయేమో కాస్త వేతకండి ...మీరు బాగా లేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకుని ఉంటారు? ఏ పరిణామాలతో పోల్చుకొని మీరు అలా అనుకున్నారు ...లేదా ఎవరి ఆదర్శాల కొరకు, ఆశయాల కొరకు మీరు ఎలా అనుకున్నారు....


* ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకుపోయి ఉంటే మీరు ఎలా ఒక ప్రేమపూరితమైన , ఆనందమయమైన సిరిసంపదలతో కూడిన, ఆరోగ్య దాయకమైన, జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు... ఒకవేళ సృష్టించుకోవాలి అనుకున్న, మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఇదివరకే పాతుకుపోయిన మీ సొంత ఆలోచనలు, అమ్మకాలే మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి.... అందువలన నీ జీవితంలోకి పైవన్నీ రాకుండా ఏదో ఒక తప్పిదము ప్రతిసారి జరుగుతూ ఉంటుంది....


🌹 క్రోధము, మనల్ని మనం ఒప్పుకొనక పోవడం, తప్పు చేశాము అన్న భావన మరియు భయం లాంటి ఆలోచనా విధానం మన జీవితాల్లో సర్వ సమస్యలకు కారణభూతాలు...🌹


*పై భావాలే మన శరీరాల్లో, మన జీవితాల్లో ప్రధాన సమస్యల్ని సృష్టిస్తున్నాయి... మన జీవన పరిస్థితులకు, అనుభవాలకు మన బాధ్యతను గుర్తించకుండా ,ఇతరులను నిందిస్తూ పోవడం వల్ల కూడా ఈ భావాలు తలెత్తుతున్నాయి ... మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే! ఇంకెవరిని నిందించాలి??? ఏమని నిందించాలి??? బయట జరిగే సంఘటనలు, లోపలి ఆలోచనలకు ప్రతిరూపాలు... అలాగని ఇక్కడ నేను మీ పట్ల ఇతరుల యొక్క బాధ్యతారహితమైన ప్రవర్తనను సమర్పించడం లేదు... అటువంటి వ్యక్తుల్ని, అటువంటి ప్రవర్తనలను మనము ఆకర్షిస్తున్నామంటే, మనలో అటువంటి లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయని గుర్తించాలి....

* అందరూ నా పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు... ఆలోచించుతారు...
* నన్ను అవసరాలకు వాడుకుని వదిలేస్తారు...
* ప్రతిదానికి నన్నే నిందిస్తారు...
* నాకే ఎందుకిలా జరుగుతోంది....


*ఇలాంటివి మీరు నమ్ముతున్నట్లయితే, అవి మీ సొంత ఆలోచన విధానాలు... అలాంటి వ్యక్తులను ,ప్రవర్తనలను మీరు ఆకర్షిస్తున్నారంటే మీలో అలాంటి ఆలోచనలు ఏవో ఉండి తీరాలి... మీరు అలా ఆలోచించి, ఆ పరిస్థితుల్ని, ఆ ప్రవర్తనలను మీ వైపుకు ఆకర్షించకపోతే అవి వేరొకరికి ,వేరే ఎక్కడో ఆకర్షితమవుతాయి.... మీలో అటువంటి ఆలోచనలే ఉండకపోతే అటువంటి పరిస్థితులు మీ వైపు రానే రావు....


🌹శారీరక రోగాలు_మానసిక కారణాలు🌹


*ఎలా మన ఆలోచనా విధానాలు మన శరీరంలో అనారోగ్యాలతో సృష్టిస్తాయో కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాం.... చాలా కాలం నుండి క్రోతభావాలను, అణిచివేసుకుని మన మనసులో పర్చుకొని ఉంటే అది క్రమ క్రమంగా మన శరీరాన్ని దహించి వేసి" కాన్సర్" అని పిలవబడే రోగంగా పరిణమిస్తుంది... మనల్ని మనము ఒప్పుకొనకపోవడం వలన మనం మనలోనూ ఇతరులలోను తప్పులు వెతుకుతూ పోతాము... అది భవిష్యత్తులో "కీళ్ల నొప్పులుగా" తయారవుతుంది ...తప్పు చేశాము అన్న భావన, శిక్షనీ కోరుకుంటుంది... తీరమైన బాధని కలగజేస్తుంది... ఎవరైనా నా వద్దకు తీవ్రమైన బాధతో వస్తే, తప్పు చేశాము అన్న భావన వారిలో ఎంతగా పేరుకుపోయిందో గమనిస్తాను.... భయము మరి ఆందోళనలు మన శరీరాల్లో బట్టతల, కడుపులో పుండ్లు మరియు పాదాల్లో నొప్పులు మొదలైన వాటిని కలగజేస్తాయి....

*చాలా కాలంగా మనలో అణిచి పెట్టుకున్న క్రోధాన్ని వదిలి పెట్టేసి, మొదట మనల్ని క్షమించుకుని, తర్వాత తక్కిన వారందరిని క్షమించి వేస్తే, ఎంత సైతం" క్యాన్సరు" సైతం నయం అవుతుంది... ఇది నా స్వంత అనుభవంతో చెబుతున్నాను...


🌹..గతం పట్ల మన దృక్పథాన్ని మర్చుకొనవచ్చును...🌹


గతం అనేది అయిపోయింది,, జరిగిపోయింది....మనం ఇప్పుడు దాన్ని మార్చలేము ..కానీ గతం పట్ల మన ఆలోచనలను మాత్రం మార్చుకోవచ్చు...చాలా కాలం కిందట ఎవరో మనల్ని బాధపెట్టారని, ఈ క్షణంలో వాటిని తలచుకుని మనల్ని మనం శిక్షించుకోవడం, ఎంత మూర్ఖత్వం!!! ఒకసారి ఆలోచించి చూడండి ...

*ఎవరైనా ఎక్కువగా క్రోధ భావనతో బాధపడుతుంటే ,తక్షణమే ఆ భావాన్ని వదిలిపెట్టేయమని చెప్తాను... ఎందుకంటే మొదట్లోనే అది చాలా సులభం ...లేకపోతే అది ముదిరి ముదిరి వారిని మరణశయ్యపై అది పడుకోబెడుతుంది... అప్పుడు తీవ్ర భయాందోళనలకు గురి కావాల్సి వస్తుంది....


* మనం భయాందోళనలతో ఉన్నప్పుడు స్వస్థతపై దృష్టి పెట్టలేము.... మొదట మనలోనీ భయాలు అన్నింటిని వదిలించుకోవాలి.....


*ఆ భవిష్యత్తు బూడిదైపోయింది... నేను ఇక ఇలాగే నిస్సహాయంగా బలైపోవాల్సిందే!!! ఈ పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడల్సిందే ...అని నమ్మడానికి ఎంపిక చేసుకుంటే ,ఆ నమ్మకాన్ని ఈ విశ్వం సమర్థిస్తుంది ..... అటువంటి అప్పుడు మనం ఇంకా దిగజారిపోయి , అగాదలోకి కూరుకుంటున్నావాల్సిందే !!ఇటువంటి మూర్ఖపు చాదస్తపు నమ్మకాల్ని ,నెగిటివ్ భావాలను, తక్షణమే వదిలిపెట్టేయాలి.... అప్పుడే మన జీవితానికి స్వస్థత చేకూరుతుంది .....


*దైవత్వం అనబడేది కూడా మనకు అనుకూలంగానే ఉంటుందే తప్ప వ్యతిరేకంగా ఎప్పటికీ ఉండజాలదు....


🌹 మనము గతాన్ని వదిలిపెట్టేయాలంటే క్షమించడానికి సిద్ధంగా ఉండాలి...🌹


*మొదట మనల్ని మనం క్షమించుకుని తర్వాత అందరినీ క్షమించి వేసి గతాన్ని వదిల పెట్టేసేందుకు మనం నిర్ణయించుకోవాలి... ఎలా క్షమించాలో తెలియకపోయినా, క్షమించడానికి మీ మనసు అంగీకరించకపోయినా పర్వాలేదు... నేను క్షమించేయాలి !!!అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు... మనకు స్వస్థత చేకూరి ప్రక్రియ మొదలైపోతుంది ...మనకు స్వస్థత చేకూరడానికి గతాన్ని పూర్తిగా విసర్జించడం, మరి మనతో సహా అందరిని క్షమించేయడం, తప్పనిసరి ....


*నువ్వ నాకు అణగుణంగా ప్రవర్తించకపోయినా పరవాలేదు... నిన్ను నేను ప్రేమిస్తున్నాను.. మరి నిన్ను క్షమించడం వల్ల నేను స్వేచ్ఛ జీవినైపోతాను... అని గాఢంగా అనుకున్నా చాలు... మనము ఆ గతపు పరిస్థితులను నుండి విముక్తులైపోతాము....


🌹అన్ని అనారోగ్యాలు క్షమాగుణం లేకపోవడం వలన ఉత్పన్నం అవుతాయి...🌹


*మనము ఎప్పుడైనా, ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనం ఎవరినైనా క్షమించాలేమో నని మన హృదయాల్లో వెతకాలి... మనము ఎవరినైతే క్షమించడానికి చాలా కష్టపడుతున్నామో వారిని మొదట క్షమించేయాలి... మనలోంచి వారిని గురించి ఆలోచనలను పూర్తిగా వదిలి పెట్టేయాలి... క్షమించడం అంటే వారిని వదిలి పెట్టేయడం... పూర్తిగా వారి గురించి పట్టించుకోకపోవడం ...ఇక్కడ మీరు వారితో అంగీకరిస్తున్నారా ?లేదా నిరాకరిస్తున్నారా ?అన్నది కాదు ప్రశ్న ...ఇది కేవలం విషయాన్ని అంతటితో వదిలిపెట్టేసేయడం ...మనం చేయవలసిందల్లా క్షమించడానికి నిర్ణయించుకోవడమే... ఎలా క్షమించాలి అన్నది ఈ విశ్వమే చూసుకుంటుంది...



*మన బాధను అయితే మనం చక్కగా అర్థం చేసుకుంటాము... ఇతరులు కూడా మీ వలన బాధపడ్డారని అర్థం చేసుకోరేం....ఆ సమయం లో వారు వారికున్న జ్ఞానము, అవగాహన ఎరుకను బట్టి మనతో వారాల ప్రవర్తించారన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి... ఎవరైనా సమస్యతో



*ఎప్పుడైనా నన్ను సంప్రదిస్తే అనారోగ్యానికి సంబంధించినదైనా, సృజనాత్మకతా రాహిత్యమునకు సంబంధించినదైనా, నేను అసలు పట్టించుకోను... నేను పరిశీలించేది, మరి ప్రయోగించేది ఒకే ఒక్క మౌలిక.. ఆధ్యాత్మిక సత్యాన్ని అది "మనల్ని మనం ప్రేమించుకోవడo"


🌹మనల్ని మనం ప్రేమించుకుని, అంగీకరించుకొని మన పట్ల మనం మంచి భావనతో ఉంటే ,జీవితం మనకు అనుకూలిస్తుంది... జీవితపు అన్నీ క్షణాల్లోనూ అద్భుతాలు సంభవించడం ప్రారంభం అవుతాయి ...మన ఆరోగ్యము చక్కబడుతుంది ...మన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది... సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లభిస్తుంది ...మనల్ని మనం మరింత సృజనాత్మకతతో వ్యక్తపరచుకోగలుగుతాము... ఇవన్నీ మన ప్రయత్నం కూడా అవసరం లేకుండానే అవంతటావే జరిగిపోవడం కూడా గమనించగలుగుతాము....🌹


*మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరించడం, మన పట్ల మనం మంచి భావనతో ఉండడము ,మనల్ని మనం సంరక్షించుకోవడం ,సృష్టి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉండడము, అన్నిటికి మనము అర్హులమని భావించడం, మొదలైనవి మన మనసుని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుతాయి ...ఈ భావనలు మన జీవితాల్లో ప్రేమ మయమైన సంబంధాల్ని, కొత్త ఉద్యోగాన్ని ,చూపించడానికి ఉన్నతమైన ,నూతనమైన, ప్రదేశాన్ని .... ఇంకా మన శరీరపు బరువుని సహజం చేయడం లాంటి వాటిని కూడా సమకూర్చుతాయి... ఎవరైతే వారిని ప్రేమించుకుంటారో, వారు ఇతరులని దూషించారు ...


*మన పట్ల మనం మంచి భావంతో ఉండడము, మరి మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడం, అనే భావాలే ప్రస్తత క్షణములో మన జీవితాల్లో అన్నీ కోణాలలో శుభ ప్రదమైన మార్పులు సంభవించడానికి అవసరమైన, కీలక అంశాలు....


"నా దృష్టిలో మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది ,దేనికి గాని, ఎప్పుడు గాని మనలో మనం తప్పులు పెంచకపోవడంతో మొదలవుతుంది... ఈ తప్పులు ఎంచడం అనేది మనల్ని మార్పు చెందుటకు ప్రయత్నించడం వద్దే కట్టిపడేస్తుంది... మనల్ని మనం అర్థం చేసుకొని ,మనతో మనం సున్నితంగా వ్యవహరిస్తే చాలు... ఈ ఆత్మ నిందలోంచి బయటపడవచ్చు... మిత్రులారా !!ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు ఎత్తి పొడుచుకుంటూ , గ డుపుతున్నారు ...అది మీకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు... ఇప్పుడు మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడానికి ప్రయత్నించి చూడండి ఏమవుతుందో.....


🌹ధన్యవాదములు 🌹



నా ఫిలాసఫీ part ___2(a)



🌹నా శరీరం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది...🌹

🌹 నా శరీరం గాయపడుతుంది.. రక్తము స్రవిస్తుంది... నొప్పిస్తుంది....ఉబ్బుతుంది.. మడదబడుతుంది... కాలుతుంది పుండ్లపాలు అవుతుంది... ముడతలు పడుతుంది... వయసు అయిపోతోంది... సరిగ్గా నడవలేదు... చూడలేదు.. వినలేదు... ఎన్నో రోగాలు మారిన పడుచుంది... ఇలా ఎన్నో మీరు మీ శరీరాల్లో సృష్టించుకుని ఉండవచ్చు ...వీటన్నిటిని నేను విని ఉన్నాను

🌻 ఇతరులతో నా సంబంధిత బాంధవ్యాలు సరిగ్గా ఉండవు....
🌹 అందరూ నా భావాలను వ్యక్తపరిచ నివ్వకుండా నన్ను అణచి వేస్తున్నారు....
🌹నాకు ఎవరూ లేరు...
🌹 నాతో బెట్టు చేసినట్లు ప్రవర్తిస్తారు....
🌹 నన్ను ఎవరు సమర్థించరు....
🌹 నన్ను ఎప్పుడు ఎగతాళి చేస్తారు
🌹 నా దారిన నన్ను వదలరు...
🌹ప్రతిదానికి నన్నే ఎత్తి పొడుస్తారు...
🌹 నన్ను ఎవరు ప్రేమించరు...
🌹 నేను చెప్పేది మాత్రం ఎవరూ వినిపించుకోరు...
🌹 నేను ఒంటరి వాడిని/ దానను....
🌹 నన్ను అందరూ అవమానిస్తారు ...
🌹వాళ్లు మానసికంగా నెగ్గెందుకు నన్ను ఓడిస్తారు ....ఇంకా ఇలాంటి ఎన్నో రకాల సంబంధాల్ని మీరు మీ జీవితంలో సృష్టించుకుని ఉండవచ్చు ....
వీటిని నేను విని ఉన్నాను

🌻 నా ఆర్థిక పరిస్థితి బాగుండదు.

🌹 నా దగ్గర డబ్బు అసలు ఎప్పుడూ నిలవదు ....
🌹అప్పుడప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుంది
🌹 సమయానికి చేతిలో డబ్బు ఉండదు....
🌹 డబ్బు వచ్చినంత వేగంగా నా నుంచి వెళ్ళిపోతుంది....
🌹 నా ఖర్చులకు అస్సలు సరిపోదు....
🌹 అప్పుడప్పుడు నేను డబ్బు పోగొట్టుకుంటాను ....
ఇంకా ఇలాంటి వాటిని కూడా నేను విని ఉన్నాను.....
🌻 నా జీవితం ఏం బాగాలేదు....

🌹 నేను చేయాలనుకున్నవి అసలు చేయలేకపోతున్నాను ...
🌹నేను ఎవరిని మెప్పించలేను
🌹నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు
🌹నా టైం ఎప్పుడూ బాగుండదు...
🌹నా ఆశలు అవసరాలు ఎప్పటికీ తీరేది???
🌹 నేను చేసేవన్నీ ఇతరుల కోసమేనా???
🌹 నన్ను అందరూ అవసరాలకు వాడుకొని వదిలేస్తారు ....
🌹నేనేం చేయాలో ఎవరికీ అవసరం లేదు....
🌹 నాలో ఏ టాలెంట్లు లేవు ...
🌹నేను ఏది సక్రమంగా చెయ్యను
🌹 నేను అన్ని పనులు వాయిదా వేస్తుంటాను
🌹 నాకు ఏది అనుకూలించదు....
🌹 ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎన్నో మీ జీవితంలో మీరు సృష్టించుకుని ఉండవచ్చు....
ఇవి నేను విని ఉన్నాను....

నా వద్దకు ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే వారి జీవితం ఎలా ఉందని నేను ప్రశ్నించినప్పుడు ,వారు ఇచ్చ సమాధానాలలో పై వాటిలో ఏదో ఒక దాన్ని లేదా కొన్నింటిని బదులిస్తారు... వారికి వారి సమస్య తెలిసి అనుకుంటారు... కానీ ఈ సమస్యలన్నీ వారి అంతర్ ఆలోచన విధానాల వల్ల ఏర్పడిన, బహిర్ ప్రభావాలని నాకు తెలుసు.... ఇంకా లోతుగా ఆలోచిస్తే అంతర్ ఆలోచన విధానాల అట్టడుగునా మరో ఆలోచన విధానం ఒకటి ఈ బహిర్ ప్రభావాలన్నింటికీ మూలహేతువుగా ఉంది.... అదేమిటో ఇప్పుడు పరిశీలిద్దాము ....


🌻నేను మొదటగా నా క్లైంట్స్ ని ఈ క్రింది ప్రశ్నలను అడిగి మారిచ్చే సమాధానాలలో వారు వాడుతున్న పదజాలాన్ని పరిశీలిస్తాను

🌹మీ జీవితంలో ఏమి జరుగుతోంది
🌹మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
🌹మీరు మీ జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తారు
🌹మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
🌹మీ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? 🌹చివరగా మీ సంబంధము ఎలా అంతమయింది ....?
🌹అంతకు ముందటి సంబంధము ఎలా అంతమైంది....?
🌹మీ బాల్యం గురించి కాస్త చెబుతారా?

🌹వారు సమాధానాలు చెప్పే సమయంలో వారి శారీరక కదలికలని మరి ముఖ కవళికల్ని గమనిస్తాను... కానీ ఎక్కువగా వారు ఉపయోగిస్తున్న పదజాలాన్ని శ్రద్ధగా వింటాను ...ఎందుకంటే ఆలోచనలు, మాటలే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి.... అలా వినడం వలన ప్రస్తుతం వారా సమస్యతో ఎందుకున్నారో అర్థమవుతుంది.... కొన్నిసార్లు వారు వాడే పదాలకు వారి సమస్యలకు అస్సలు కొంతనే ఉండదు.... అప్పుడు వారికి వారు సమస్య గురించి తెలియదని లేదా వారు నిజం చెప్పడం లేదని అర్థమవుతుంది.... ఈ విధంగా ఏదో ఒక విషయం తేలిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కడినుంచి ప్రారంభించాలోనని నాకు ఆధారాలు దొరుకుతాయి.....

🌹తర్వాత వారి చేతికి ఒక పెన్ను ,పేపరు, ప్యాడ్ ఇచ్చి, ఆ పేపర్ పై భాగంలో క్రింది విధంగా రాయమంటాను.....

నేను "ఖచ్చితంగా"...చేయాలి...

1_________________
1_________________
3_________________
4_________________
5_________________
6_________________



🌹 పై విధంగా వారు కచ్చితంగా చేసే తీరాల్సిన విషయాలలో ఐదు లేక ఆరు వాక్యాల,ను ఆ పేపరుపై రాయమంటాను... కొంతమంది ప్రారంభించడానికి కష్టపడతారు.... మరికొందరు ఆపమున్న ఆపరు ...రాస్తూనే పోతారు ....

🌹తర్వాత వారు రాసిన ప్రతి వాక్యాన్ని చదవమంటాను ..."కచ్చితంగా" ఇలానే ఎందుకు చేయాలి !అని వారు చదివిన ప్రతి వాక్యాన్ని ప్రశ్నిస్తాను.... వారిచ్చే సమాధానాలు చాలా ఆసక్తిగా, వారిని గురించి తెలియజేసే లాగా ఉంటాయి.....

🌹మా అమ్మ చెప్పింది కాబట్టి!!!
🌹అమ్మో అలా చేయకపోతే ఎలా ..?నాకు భయం తల్లీ!!!
🌹ఎందుకంటే నేను చాలా పద్ధతి గల వ్యక్తిని...
🌹 బాగుందే అందరూ అలానే చేస్తారు కదా!!!
🌹 ఇంకా నేను చాలా సోమరి ,చాలా పొట్టి, చాలా పొడవు, చాలా లావు, చాలా బక్క, చాలా నత్తి, నేను అంత అందంగా ఉండను... నాకా భాగ్యం లేదు.... అంటూ కొనసాగుతాయి వారి సమాధానాలు ....

🌹వారు ఏ నమ్మకాల్లో అతుక్కుపోయారు మరి ఏ ఆలోచన విధానాలలో తమని తాము పరిమితం చేసుకున్నారో, పై సమాధానాల వల్ల నాకు అవగతం అవుతుంది....

🌹వారు చెప్పిన సమాధానాలకు నేనెటువంటి వాక్యాలు చేయను.... కచ్చితంగా అనే విషయం గురించే నేను మాట్లాడుతాను.....


🌹 మిత్రులారా ఈ ఖచ్చితంగా అనే పదము ఒకానొక వినాశకారి అయిన పదము దీన్ని మన భాషలోంచి తొలగించాలి ఖచ్చితంగా అలాగే చేయాలి అని మనం చెబుతున్న ప్రతిసారి అలా చేయకపోతే తప్పు అనే అర్థం స్ఫూర్తిస్తుంది అలా చెప్పినప్పుడు మనం తప్పన్న చేసుండాలి లేదా తప్పు చేస్తూ ఉండాలి లేదా తప్పు చేయబోతూ ఉండాలి అని అర్థం వస్తుంది జీవితంలో అన్ని తప్పులు అవసరం లేదు అనుకుంటాను మనం చేయాల్సిన పనులను ఎంపిక చేసుకోవడానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. కచ్చితంగా ఇలానే చేయాలి అనే పదజాలాన్ని మన పరిభాషలోంచి తొలగించి దాన్ని స్థానంలో ఇలా చేయాలనిపిస్తే చేయొచ్చు అనే పదాన్ని ఉపయోగించాలి అటువంటి అప్పుడు మనం చేసేది ఎప్పటికీ తప్పు కదు మరి ఏమి చేయాలో ఎంపిక చేసుకోవడానికి మనం పూర్తి స్వేచ్ఛ ఉంటుంది

🌹తరువాత వారు ఇంతకుముందు రాసిన వ్యాఖ్యాన్ని నాకు నిజంగా చేయాలనిపిస్తే చేయొచ్చు అని అర్థాన్ని ఇచ్చే విధంగా చదవమంటాను ఇది వారి సమస్యలపై ఒక సరి కొత్త దృక్పథాన్ని చూపిస్తుంది

🌹వారెలా చదివిన ప్రతి వ్యాఖ్యానికి మరి ఎందుకు చేయలేదు అని సున్నితంగా ప్రశ్నిస్తాను ఈసారి వారిచ్చే సమాధానాలు చాలా భిన్నంగా క్రింది విధంగా ఉంటాయి. ....

🌹నాకు చేయడం ఇష్టం లేదు ....
🌹చేయాలంటే నాకు భయం
🌹ఎలా చేయాలో తెలియదు....
🌹 అలా చేయడానికి నేను అర్హుడినా ...???


🌹వారు రాసిన మొట్టమొదటి వాక్యము వారినీ ఇన్నాళ్లుగా వేధిస్తున్న అతి పెద్ద సమస్య అయి ఉంటుంది.... వారికి ఇష్టము లేకపోయినా ఆ పనిని వారు చేస్తున్నందుకు వారిని వారు కొన్ని సంవత్సరాలుగా కోపంతో తిట్టుకుంటూ, ఉండి ఉంటారు.... అలా చేయడం అసలు వారి ఊహే కానందుకు ,ఇన్నాళ్లు వారిని వారే ఒప్పుకొనకుండా ఉండి ఉంటారు.... లేదా ఇతరులు ఎవరైనా వారు ఆ పనిని చేసే తీరాలని నిర్బంధించి ఉంటారు ....వారు ఈ విషయాన్ని గ్రహించి ఆ అంశాన్ని వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన లిస్టులోంచి తొలగించుకుంటారు..... వారికిది ఎంత గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందో తెలుసా......?


🌻కొంతమందిని చూస్తే వారికి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని వృత్తుల్లో సంవత్సరాల పాటు ఎవరో నిర్బంధించినట్లు బలవంతంగా కొనసాగుతూ ఉంటారు..... ఎందుకంటే వారి తల్లిదండ్రులు వారిని డాక్టర్ కావాలనో, లేదా ఇంజనీరు కావాలనో, లేదా ఇటువంటిదే ఇంకేదో కావాలనో నిర్ణయించి ఉంటారు.... మన బంధువులతోనో లేదా చుట్టుపక్కల వారితోను మనల్ని పోల్చి వారు మన కన్నా తెలివైన వారనో ,లేక ధన వంతులనో, మన పెద్దలు మనతో చెప్పినప్పుడు ,మనం ఎన్నిసార్లు మనల్ని మనం తక్కువగా భావించుకున్నాము గుర్తుకు తెచ్చుకోండి!!!


🌻కచ్చితంగా మీరు చేసే తీరాలి అని మిమ్మల్ని మీరు ఇబ్బంది చేయకుండా నిర్ణయాలను లేదా ఇతరులచే మీపై మోపబడిన నిర్ణయాలను తక్షణమే వదిలి పెట్టేసి ,హాయిగా స్వతంత్రులై పోండి!... ఇంకా ఇలాంటివి మీలో ఎన్ని ఉన్నాయో వెతికి మరీ వదిలిపెట్టండి ....


🌻ఈ విధంగా లిస్టులోని విషయాలను ఒక్కొక్కటిని పరిశీలించిన తర్వాత, వారు వారి జీవితాన్ని ఓసారి కొత్త కోణంలో దర్శిస్తారు ....వారు చేసే తీరాల్సిన విషయాలు వారి కసలు ఇష్టమే లేనివని లేదా ఇతరులను నొప్పించకుండా ఉండడానికో, లేదా , మెప్పించడానికో వారా పనులు చేస్తున్నట్లు గ్రహిస్తారు ....ఇలా ఎన్నోసార్లు భయపడో లేదా వారికి ఇష్టం వచ్చిన విధంగా చేయడానికి వారు అనర్హులని భావించే వారికి ఇష్టం లేకపోయినా మునుపటి నిర్ణయాలతోనే కొనసాగి ఉంటారు.....


🌻ఇప్పుడు సమస్య ఓ కొత్త మలుపు తిరిగింది ....వారు ఇతరుల ప్రమాణాలను అందుకోలేనందుకు వారిని వారు తప్పు చేస్తున్నట్లుగా భావింపజేసే ఆలోచనల్ని వదిలించే ప్రక్రియనే నేనిప్పుడు ప్రారంభించాను .....


🌻తరువాత వారికి జీవితం పట్ల నా ఫిలాసఫీ నీ వివరిస్తాను.., నిజానికి జీవించడం చాలా సులభము.... మనము వేటినైతే బయటికి పంపుతామో, తిరిగి వాటినే పొందుతాము ....మనము ఆలోచించడానికి ఎంపిక చేసుకుని ప్రతి ఆలోచనని, ప్రతి నమ్మకాన్ని ఈ విశ్వం సమర్పిస్తుంది.... మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు మన పెద్దలు జీవితం పట్ల ,ఎలా స్పందించేవారో చూసి మన పట్ల, మన జీవితం పట్ల ,మనము అలాగే ప్రవర్తించాలని నేర్చుకున్నాము ....ఈ నమ్మకాలు ఎటువంటివైనా, అవే మనము తిరిగి పెద్దయ్యాక మన జీవిత అనుభవాలుగా మారుతాయి... ఏది ఏమైనా ఇప్పుడు పట్టించుకుంటున్నది ఆలోచనా విధానాలనే...




🌻 మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది ....మార్పులు సంభవించడం అన్నది ప్రస్తుత క్షణము నుంచే ప్రారంభం అవుతుంది....


🌻 ధన్యవాదములు 🌻


నా ఫిలాసఫీ పార్ట్__3(b)

🌻మనల్ని మనము ప్రేమించుకోవడం

🌹 సమస్య ఏదైనా, నేనెప్పుడైనా, ఎవరితోనైనా ,ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని... అది "మనల్ని మనం ప్రేమించుకోవడం"... ప్రేమ అనేది అద్భుతమైన ఔషధము ....మనల్ని మనం ప్రేమించుకోవడం మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది.... మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే.... మనం సాధించిన అభివృద్ధికి లేదా, విజయాలకు గర్వపడడమో,లేక అహంభావంతో ఉండడమో, లేక మీరు ఉన్న స్థితితో పోల్చుకొని ఇతరులను తక్కువ చూడడమో, కాదు ....ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు....


🌹 ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది, మనపై మనకు ఉండాల్సిన ఒక గొప్ప గౌరవ భావాన్ని, మరి మన శరీరాల్లో నిరంతరము సంభవం అవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల ,మన మనసు యొక్క మహత్తరమైన శక్తి పట్ల, మనకు ఉండాల్సిన కృతజ్ఞతా భావం గురించి.....


🌹ఇక్కడ" ప్రేమ "అంటే మనల్ని మనం మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకోవడం ....ప్రేమ అనేది జీవితపు ఏ కోణంలోనైనా ప్రవహించవచ్చు.....

🌹 నేను ప్రేమను కిందివిధాలుగా ప్రకటిస్తాను.....


🌹జీవితం సాగే తీరు తెన్నుల పట్ల...
🌹అసలు నేను జీవించి ఉన్నందుకు....
🌹నేను చూసే సౌందర్యము పట్ల ...
🌹ఇతర వ్యక్తుల పట్ల
🌹జ్ఞానం పట్ల,
🌹మనసు యొక్క పనితీరు పట్ల,
🌹మన శరీరాల పట్ల మరి వాటి పనితీరు పట్ల
🌹జంతుజాలం పట్ల,పక్షుల పట్ల,చేపల పట్ల....
🌹చుట్టూ ఉండే పచ్చదనం పట్ల,
🌹ఈ సృష్టి పట్ల
🌹మన సృష్టి యొక్క అద్భుత వ్యక్తి కరణ పట్ల,
నేను ప్రేమను ప్రకటిస్తాను.....


🌹 పై వాటికి మీరు ఇంకా ఎన్ని చేర్చగలరో చూడండి.....

🌹ఇప్పుడు మనము ఎన్ని విధాలుగా మనల్ని మనం ప్రేమించుకోము చూద్దాం....


🌹 మనల్ని మనం విడవకుండా నిరంతరం తిట్టుకుంటూ పోతాము....

🌹 మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ,ఆల్కహాల్ లాంటి వాటిని సేవించడం వల్ల ,మరి డ్రగ్స్ తీసుకోవడం ద్వారా, మన శరీరాన్ని పాడు చేసుకుంటాము.....
🌹మనం ప్రేమించబడము అని నమ్మడానికే ఎంపిక చేసుకుంటాము....
🌹మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడుతాము....
🌹మనల్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయాల్ని వాయిదా వేస్తాము....
🌹మనం పూర్తిగా విస్మయంతో అస్తవ్యస్తంగా జీవిస్తాము....
🌹అప్పుల్ని ,ఒత్తిడి లని నెత్తినేసుకుంటాము....
🌹మనకే మాత్రము విలువనివ్వకుండా, కొట్టి పారేసే వారిని ,మనం ప్రేమికులుగా, భాగస్వాములుగా ఆకర్షిస్తాము.....

....ఇలాగే మీరెన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోరు ఆలోచించండి



🌻మనము ఏవిధంగానైనా మనం మంచినీ నిరాకరిస్తే ,అది కూడా మనల్ని మనం ప్రేమించుకొనకపోవడమే అవుతుంది....


🌹 నా క్లైంట్ ఒకామేకు కళ్ళజోడుండేవి... ఒక రోజు కౌన్సిలింగ్లో ఆమె తన చిన్నతనంలో ఏర్పరుచుకున్న పాత భయాన్ని తొలగించేశాను... మురుసటి రోజు పొద్దున్న ఆమె నిద్ర లేవగానే ఆమెకు కళ్ళజోడు ఇబ్బందిగా అనిపించి, వాటిని తీసివేసింది.... ఆమె చుట్టూ పరికించి చూసింది ...ఆమెకు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తించింది... కానీ ఆమె ఆ రోజంతా నేను ఇది నమ్మలేను ...అని అంటూనే ఉంది ....తర్వాత రోజుకే ఆమెకు మళ్ళీ కళ్ళజోడు అవసరం వచ్చి పడింది.... మన సబ్కాన్షియస్ మైండ్ మనతో ఎటువంటి విధంగాను పరిహాసాలాడదు... మనము ఏది నమ్మితే దాన్ని అలాగే సంభవింప చేస్తుంది... ఆమెకు ఇక కళ్ళజోడు అవసరం లేదని, ఆమెకు అన్ని స్పష్టంగా కనిపిస్తాయి ...అన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది....


🌻మనల్ని మనం అనర్హులుగా భావించడము, కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడం అనే దానికి ఇంకొక రూపము .....


🌹టామ్ అనే ఒక మంచి చిత్రకారుడు ఉండేవాడు... అతడికి చాలా ధనవంతులైన కస్టమర్స్ ఉండేవారు... అతను వారి ఇళ్లల్లో గోడలపై చిత్రాలు గీస్తుండేవాడు.. కానీ, అతనికి తన ఖర్చులకు కూడా చాలినంత డబ్బులు ఉండేవి కాదు... ఇచ్చిన సమయంలో అతడు చిత్రాన్ని వేయలేకపోయేవాడు... ఇదంతా 'సంపాదించడానికి నేను అనర్హుడను' అని అతడు భావించడం లోంచే సంభవించింది..... ఎవరైనా ఏదైనా వస్తువుని తయారుచేసిన, లేదా ఎటువంటి సేవలు చేసిన దానికి ఎంతైనా రేటును నిర్ణయించవచ్చు ...ధనవంతులైన వారు వారికి ఇష్టమైన వస్తువులను వారి స్వంతం చేసుకోవడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి వెనకాడరు ....పైగా ఇది ఆ వస్తువు యొక్క విలువను పెంచుతుంది ... విషయాన్ని అతడు గ్రహించలేకపోయాడు...


🌹ఇంకొన్ని ఉదాహరణలు

🌹మన భాగస్వామి త్వరగా అలసిపోయి, మనతో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తాడు...
దీనికి మనం ఏం పాపము చేసామని విస్తు పోతాము....

🌹 మన భాగస్వామి ఒకటో, రెండో సార్లు మనల్ని బయటకు తీసుకెళ్తాడు...ఆ తర్వాత మనల్ని అస్సలు పట్టించుకోడు.... మనలో ఏదో లోపం ఉందని మనం ఆలోచిస్తాము.....

🌹మనకు మన భాగస్వామితో సంబంధం తెగిపోతుంది ...మనం జీవితంలో ఓడిపోయామని కృంగిపోతాము ....

🌹మనం జీతం పెంచమని యాజమాన్యాన్ని అడగడానికి వెనకాడతాము....

🌹పత్రికలలో, టీవీలలో సినిమాలలో ,వచ్చే తారల శరీరాలతో మనల్ని పోల్చి చూసుకొని ,మనల్ని మనం తక్కువగా భావించుకుంటాము....

🌹మీ వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, మీకు రావాల్సిన వాట మీకు రాకపోయినా, మీరందుకు తగిన వారు కారని మీకు ఆ పని అచ్చి రాదని భావిస్తారు....

🌹 మీరు ఎవరితోనైనా దగ్గర అయ్యేందుకు భయపడతారు....ఎందుకంటే అదెక్కడ సెక్స్ సంబంధానికి దారితీస్తుందో అని లోపల భయపడుతుంటారు....


🌹మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వెనకాడుతారు.... ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా తప్పవుతాయని మీరు ముందే నిర్ణయించుకుంటారు కాబట్టి....

🌹పై విధాలుగానే కాక మరెన్ని విధాలుగా మీరు అనర్హులనే భావాన్ని మీరు వ్యక్తపరుస్తారో గమనించండి....

🌻పసిపిల్లలు చాలా పరిపూర్ణలో పసిపిల్లలు గా ఉన్నప్పుడు మీరు ఎంత పరిపూర్ణలో తెలుసా!!!


🌹 పసిపిల్లలు పరిపూర్ణులు అయ్యేందుకు ఏమీ చేయనవసరం లేదు ...ఎందుకంటే వారు పరిపూర్ణంగానే ఉంటారు ..వారికి విషయం తెలిసినట్లుగానే వారు ప్రవర్తిస్తారు... వారు ఈ విశ్వానికి కేంద్రాలని వారికి తెలుసు ..వారికి ఏది కావాలో అడగడానికి వారే మాత్రం సంకోచించరు... వారు వారి భావాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారు ...ఒక పసి పాపకు కోపం వస్తే ఏమవుతుందో మీకు తెలుసు ...నిజానికి ఆ వీధి మొత్తానికి తెలుస్తుంది... అదే వారు సంతోషంగా ఉంటే ఆ ఇంటిని వారి నవ్వులతో వెలిగిస్తారు... ఈ విషయము మీకు తెలుసు... వారు ఎప్పుడూ పూర్తిగా ప్రేమతో నిండి ఉంటారు...


🌹 పసి పిల్లలు ప్రేమను పొందకపోతే చచ్చిపోతారు... కానీ పెరిగి పెద్దయ్యాక మనం ప్రేమ లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాము ....పసిపిల్లలు అలా బ్రతకలేరు పసిపిల్లలు వారి శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రేమించుకుంటారు ...వారి శరీరాల నుండి విసర్జింపబడే మలమూత్రాలను సైతం వారు ప్రేమిస్తారు ....వారికి అనూషమైన ధైర్యం ఉంది....


🌹"మీరు అలాగే ఉండేవారు "మనమంతా అలాగే ఉండేవాళ్ళం... తర్వాత మన చుట్టూ ఉన్న పెద్దల మాటలు విని ఎలా భయపడాలో, ఎలా ప్రేమ రహితంగా జీవించాలో, ఎలా మన దివ్యత్వాన్ని దిగజార్చుకోవాలో, నేర్చుకున్నాము...

🌹 నా క్లైంట్స్ లో ఎవరైనా ఎంతగా తీవ్ర భయభ్రాంతులతో దయనీయంగా ఉన్నా... ఎంతగా ప్రేమ లేక మకుటచిన హృదయాలతో ఉన్నా నేను నమ్మను... నా పని అంతా వారిని కాలంలో వెనక్కి తీసుకువెళ్లి ,నిజంగా వారిని వారు ప్రేమించుకునేది, వారికి తెలుసు అనే విషయాన్ని వారికి తిరిగి గుర్తుకు చేయడమే....

🌻 మిర్రర్ వర్క్ ......


🌹తర్వాత వారి చేతికి ఒక చిన్న అద్దాన్ని ఇచ్చి, అందులో వారి కళ్ళల్లోకి వారిని చూసుకోమని చెబుతాను.... తర్వాత వారి పేర్లు చెప్పుకొని ,"నేను నిన్ను ప్రేమిస్తున్నాను". నేను నిన్నుగా అంగీకరిస్తున్నాను ...అని చెప్పుకున్నమంటాను...

🌹 ఇది చాలా మందికి కష్టం అనిపించేది... చాలా తక్కువ మంది దీనికి చక్కగా స్పందించి ,ఈ పనిని ఆనందించేవారు... కొంతమంది "నో" అని అరిచేవారు... కొంతమంది ఏడ్చేవారు... కొంతమంది కోప్పడేవారు... కొంతమంది వారి రూపాన్ని, గుణగణాల్ని తక్కువ చేసుకునేవారు... కొంతమంది ఈ పని చేయలేమని అనేవారు... ఒక వ్యక్తి అయితే అద్దాన్ని విసిరేసి ,పారిపోవాలని చూసాడు ... అతడికి అద్దం ముందు నిల్చుని తన కళ్ళలోకి తాను చూసుకోవడం కొన్ని నెలలు పట్టింది....


🌹కొన్ని సంవత్సరాలుగా అద్దంలో కనిపించే నా మొహాన్ని నిందించుకోవడానికి నేను అద్దంలో చూసేదాన్ని.... గంటలకొద్దీ అద్దం ముందు నిలబడి ఊరికే నా కనుబొమ్మలపై వెంట్రుకల్ని పీక్కుంటూ ఇన్నాళ్లు ఎలా గడిపానా అని తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది.... అప్పుడు అద్దములో, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకోవడానికి నేను భయపడే దాన్ని....


🌹ఈ విధంగా అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ,"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" "నిన్ను నీవుగా అంగీకరిస్తున్నాను "అని చెప్పుకోవడం నాకు చాలా బాగా పనిచేసింది ...అరగంట కాలంలోనే నా బహిర్ సమస్యలకి కారణమైన నాలో అంతర్గతంగా ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నా నమ్మకాలు ,ఆలోచన విధానాలు, నా మాటలు ,ఇతరుల మాటలు పైకి తేలాయి ....ఇలా మన అంతరంగంలోనికి చూసుకొనకుండా, సమస్యలకు కారణాలనీ కేవలం బహిర్గతంగా వెతుక్కుంటూ పోతే ,ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ ఎంతసేపైనా గడపవచ్చు.... అలా చేసినప్పుడు సమస్యకు సమాధానం దొరికిందని మనం తెల్చేలోపే అది ఇంకో దగ్గర మొలకెత్తి ఉంటుంది.........



🌹 ధన్యవాదములు 🌹


నా ఫిలాసఫీ
Part __2(c)

🌹నిజానికి మీరు అనుకునేది అసలు సమస్య కాదు🌹


🌹ఒక ఆమె తన రూపురేఖల్ని ఎక్కువగా పట్టించుకునేది.... మరీ ముఖ్యంగా ఆమె పంటివరుసలనీ.... ఆమె ఎంతో మంది "పంటి "డాక్టర్లను కలిసింది ...వారంతా కలిసి ఆమె పళ్ళను మరింత అద్వాన్నంగా చేశారు ....అలాగే ఆమె తన ముక్కును కూడా నాశనం చేసుకుంది... ప్రతి డాక్టర్ ఆమె అంతర్గత నమ్మకమైన, "నేను అందంగా లేను "అనే నమ్మకాన్ని బహిర్ ప్రపంచంలో సరిగ్గా సంభవింపజేశారు.... నిజానికి ఆమె అసలు సమస్య ,ఆమె రూపురేఖలు కావు ...ఆమెలో ఏదో లోపం ఉందని ఆమె అంతర్గతంగా భావించడం....


🌹 ఇంకొక ఆమె చాలా అసహ్యంగా గురక పెట్టేది.... చుట్టూ ఉన్నవాళ్లు చాలా అసహనంగా భావించేవారు ...ఆమె ఒక చర్చికి అధిపతి అయ్యేందుకు ఒక కోర్స్ చేస్తుండేది ....బయటికి ఆమె చాలా పవిత్రంగా ఆధ్యాత్మికంగా కనిపించేది... కానీ, ఆమె అంతరంగంలో మాత్రం ఆమె పదవికి ఎవరైనా పోటీ పడతారేమో అన్న కోపంతో ,అసూయతో, రగిలిపోతుండేది.... ఆమె అంతర్గతపు ఆలోచన విధానాలే ఆమెను అలా అసహ్యకరంగా గురకపెట్టేటట్లు చేశాయి ....దీన్ని కప్పిపుచ్చుకోవడానికి బయటికి ఆమె ఎంత ప్రేమ పూరితంగా నటించినా ,ఆమె లోపల చాలా బాధపడుతూ ఉండేది ...ఆమెను ఎవరు భయపెట్టలేదు! ఆమె తప్ప ......


🌹ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు... అతడు "హాడ్జ్ కీన్స్" ( Hodgkin's disease) అనే వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు.... అతని తల్లి ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకు వచ్చింది ....ఇక అతడు మూడు నెలలు బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారట.... వాళ్ళ అమ్మ అతడిని ఎలా బ్రతికించుకోవాలో తెలియక చాలా భయపడితూ ఉండేది.... కానీ ఆ అబ్బాయి చాలా చలాకీగా, తెలివిగా ఉన్నాడు... అతడికి చావాలని లేదు.... బ్రతకడానికి అతడు ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు.... తన ఆలోచన విధానాలను, మాటల తీరును ,మార్చుకోవడానికి తయారయ్యాడు ....తన తల్లిదండ్రులు విడిపోయారు.... ఇంకా వాదులాడుకుంటున్నారు.... అతడు ఇంకా జీవితంలో స్థిరపడలేదు ... ఇదీ అతడి పరిస్థితి......


🌹 కానీ అతడికీ ఒక నటుడు కావాలని తీవ్రమైన కాంక్ష ఉండేది.... పేరు ప్రతిష్టలు లేవని భావించడం ,అదృష్టం లేదని భావించడం ,వల్ల తన తీవ్ర ఆకాంక్షను అణచుకున్నాడు... అతడికి బాగా పేరు ఉంటేనే తప్ప అతన్ని నటించడానికి ఒప్పుకోరని అనుకున్నాడు.... నేను అతడికి తనను తాను మంచిగా భావించడం నేర్పించాను ...అతడు చాలా చక్కగా వీటన్నిటినీ పాటించాడు....అప్పుడు అతను టీవీ ప్రోగ్రామ్స్ లో తరచుగా కనిపిస్తుంటాడు.... అతడు తనను తాను అంగీకరించుకోవడం, వలన తనలాగే తాను ఉండడము, వలన అవకాశాలు అతడి ముంగిటకి చేరాయి ....అ


🌹" అధిక బరువు"ను తగ్గించుకోవడానికి మనం ఎన్నో పరిష్కారాల్ని వెతికి వెతికి మన శక్తినంత వ్యర్థము చేసుకుంటాము.... ఎన్నో ఆహార విధానాలను పాటిస్తాము.... ఇక్కడ "అధిక బరువు"కాదు అసలు సమస్య, కొంతమంది తమ లావుతో పోరాడి ,పోరాడి ఇంకా లావు అవుతారు.... తత్ఫలితంగా అధిక బరువు వలన వారు ఎదుర్కొనే సమస్యలకు, ఇంకా ఎక్కువగా తమను తాను నిందించుకుంటూ ఉంటారు.... ఈ బహిర్గతమైన అధిక బరువు అనేది వారి అంతరంగంలోని ఒకానొక ఆలోచనా విధానం వల్ల ఉత్పన్నమైనదే ....ఈ సమస్య భయం మరి రక్షణ అవసరం అనే ఆలోచనా విధానాల వల్ల తలెత్తుతుంది.... మనం ఎప్పుడైతే భయపడతామో లేక అభద్రతతో ఉంటామో, లేక బాగాలేమని అనుకుంటామో, అప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంకా అధికంగా బరువు అవుతాము.....


🌹 మనం ఎన్నో సంవత్సరాలుగా బరువుగా ఉండడం పట్ల మనల్ని మనం కోపగించుకోవడం ,తిట్టుకోవడం, తినే పదార్థాలను జాగ్రత్తగా తీసుకోవడం, మరి ప్రతిసారి ఎంత బరువు పెరిగాము అని చెక్ చేసుకోవడం ,చాలా వ్యర్థము ....ఇలా చేస్తే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగే ఉంటారు ...ఎందుకంటే మీరు సమస్యకు అసలు కారణాన్ని సరి చేసుకోవడం ప్రారంభించలేదు... మనము చేసినదంతా ఇంకా ఎక్కువ భయపడి ఇంకా ఎక్కువ ఆభద్రతాభావంతో ఉండి, మన రక్షణ కోసం ఇంకా ఎక్కువ బరువెక్కినాము అంతే.... అందుకే నేను అధిక బరువు పట్ల లేదా ఆహార నియమాల పట్ల దృష్టి పెట్టను... ఇక్కడ ఆహార నియమాలు పనిచేయవు ...ఒకే ఒక నియమం పనిచేస్తుంది అది "నెగిటివ్ గా ఆలోచించకపోవడం" అనే నియమం....


🌹 ఎవరన్నా నన్ను అధిక బరువు సమస్యతో సంప్రదిస్తే ,ముందు ఈ అధిక బరువు విషయాన్ని పక్కన పెట్టండి. అని చెప్పి ,వారికి మనల్ని మనం ప్రేమించుకోవాలని, మనల్ని మనం అంగీకరించుకోవాలని, మన పట్ల మనం మంచిగా భావించాలని వివరిస్తాను.... అలా చెప్పినప్పుడు లావుగా ఉన్నందుకు, చూసేందుకు అసహ్యంగా ఉన్నందుకు, వారిని వారు ప్రేమించుకోలేరని బదులిస్తారు... అప్పుడు మీరు లావుగా ఉండడానికి కారణం మీరు మిమ్మల్ని ప్రేమించుకోకపోవడమేనని నేను వివరిస్తాను.... మనల్ని మనం ప్రేమించుకుని, మన పట్ల మనం మంచిగా భావించి, ఉంటే ఆశ్చర్యకరంగా మన శరీరాలు లావు తగ్గిపోయి ,ఎలా సహజమవుతామో అన్నది చాలా అద్భుతమైన విషయము....


🌹మనల్ని మనం మార్చుకోవడం చాలా సులభమని చెప్తే కొన్నిసార్లు వినేవారికి చాలా కోపం వస్తుంది... వారి సమస్య నాకర్థం కాలేదని కూడా వారు భావిస్తారు... ఒక ఆమె అయితే చాలా నిరుత్సాహంతో నేను మీ దగ్గరకు వచ్చింది నా డిగ్రీ ని ఎలా పూర్తి చేసుకోవాలోనని, మీరు ఇచ్చే సలహా కోసమే గాని! నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో తెలుసుకోవడానికి కాదు ...అని చెప్పేది... ఆమె ఒక డిగ్రీ పట్టా కోసం ఒక "థీసిస్" వ్రాస్తోంది.... ఆమె పట్ల ఆమెకు ఎంత ద్వేష భావన ఉందో నాకు స్పష్టంగా తెలుస్తోంది ....ఆ బావని ఆమె జీవితంలో అన్ని దిశాలూ వ్యాపించి ,ఆమె 'థీసిస్ 'ను పూర్తి చేసుకోకుండా అడ్డుకుంటోంది.... ఆమె అయోగ్యురాలని ఆమె భావించేంతవరకూ ఆమె ఎలా విజయం సాధించగలదు? చెప్పండి ?


🌹ఆమె నా మాటలు విడచెవిన పెట్టింది... ఏడ్చింది ...తర్వాత సంవత్సరానికి ఉన్నదానికి తోడు ఇంకొన్ని సమస్యల్ని నెత్తిన వేసుకొని వచ్చింది... కొంతమంది మారేందుకు సిద్ధంగా ఉండరు ...అలాగని వారిలో తప్పులు ఎంచాల్సిన అవసరం లేదు ...జీవితంలో మార్పులు సంభవించడం, సరైన సమయంలో ,సరైన ప్రదేశంలో ,సరైన క్రమంలో, జరుగుతుంది.... నా జీవితంలో మార్పులు సంభవించడము ప్రారంభమైనది ,నాకు 40 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.....

🌻అసలు సమస్య🌻


🌹ఎటువంటి అపాయం తలపెట్టలేని ఆ చిన్న అద్దములో వారిని వారు చూసుకుని నిరుత్సాహపడ్డాక, నాకు సమస్య అర్థమైందన్నట్లుగా ,ఒక ఓ చిరునవ్వుతో నేనిలా అంటాను ...మంచిది ఇప్పుడు మీరు అసలు సమస్యని చూస్తున్నారు ...ఇప్పుడు మన దారికి నిజంగా అడ్డం వచ్చే విషయాల్ని బయటకు గెంటే యవ... తర్వాత మనల్ని మనం ప్రేమించుకోవడం, అనే విషయంపై ఎక్కువగా మాట్లాడుతాను.... మనల్ని మనం ఎప్పుడు గానీ ,దేనికి గాని నిందించుకోకూడదు.... మనల్ని మనం ప్రేమించుకోవడం దీనితోనే మొదలవుతుంది ....


🌹తర్వాత ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మీరు ఒప్పుకోకుండా నిందించుకుంటూ ఉంటారు...??? అని ప్రశ్నిస్తాను... సమాధానం చెప్పేటప్పుడు వారి స్పందనలను గమనిస్తాను...

🌹 ఊ.... కొన్నిసార్లు...
🌹 ఇంతకుముందు చేసినన్ని సార్లు కాదు...
🌹సరే నన్ను నేను ఒప్పుకుంటే మార్పు ఎలా వస్తుందంటారు ?
🌹అందరూ అంతే కదా?


🌹 పై విధంగా సమాధానాలు ఇస్తారు.... 🌹తర్వాత నేను" మనం ఇక్కడ మాట్లాడుతున్నది అందరి గురించి కాదు మనం మాట్లాడేది 'నీ 'గురించి !నువ్వు ఎందుకు నిన్ను నీవు ఒప్పుకోవు? నీలో ఏం లోపం ఉందని? ప్రశ్నిస్తాను....


🌹 అలా అడుగుతూ వారిచ్చే సమాధానాలను ఒక' లిస్ట్' గా రాస్తాను... ఇప్పుడు వారు చెప్పేవి ఇంతకుముందు వారు కచ్చితంగా చేసి తీరాల్సిన '' తో పోల్చుతాను ...చాలా వరకు రెండు ఒకటిగా ఉంటాయి.... వారు చాలా పోడవని ,చాలా పొట్టి అని ,చాలా లావు అని ,చాలా బక్క అని ,వారికి చాలా నత్తి అని ,వారికి చాలా వయసైపోయిందని ,మరి వయసులో చిన్న అని ,అందంగా ఉండరని (చాలా అందంగా ఉండే వారే ఇలా) చెప్తారు లేదా వారు పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారని, అన్నింటికీ చాలా ఆత్రుత పడతారని, ఇంకా ఎన్నెన్నో చెప్తారు.... మీరు ఇక్కడ ఓ విషయం గమనించాలి ....అన్ని సమస్యలలోనూ "చాలా" అన్నదే సమస్యగా ఉంది ...ఇలా వారి అంతః కరణాలను తవ్వుతూ పోతే వారు వారి అంతరంగంలో నేను బాగాలేను అని అసంతృప్తితో ఉన్నారన్న విషయం అర్థం అవుతుంది....



🌹 హమ్మయ్య !!! చివరికి మనం సమస్యలు అన్నిటికీ కారణభూతమైన కేంద్ర బిందువుని చేరుకున్నాము ...వారిని వారే ఎందుకు ఒప్పుకోరు ,అంటే "నేను బాగాలేను అని వారి అంతరంగంలో తీవ్ర అసంతృప్తి" దాగి ఉంది కాబట్టి .....ఈ విషయమే వారికి చెబితే వారినంతగా అన్ని ఏళ్లుగా వేధించిన సమస్యలకు కారణం ఇంత త్వరగా తేలినందుకు చాలా ఆశ్చర్యపోతారు..... "ఈ నేను బాగాలేను" అన్న భావన ,మన పట్ల మనకు ప్రేమ లేకపోవడం వల్ల జనిస్తోంది ....అప్పుడు సమస్యలు ఏవైనా, అవి శారీరక సమస్యలైనా, సంబంధం సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, లేక సృజనాత్మక వ్యక్తీకరణ లోపానికి సంబంధించినవైనా పట్టించుకోనవసరం లేదు.... మన శక్తినంత ఈ సమస్యలనన్నింటికీ అసలు కారణమైన "మనల్ని మనం ప్రేమించుకొనకపోవడం "పై కేంద్రీకరించాలి.......

🌹 నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది ...నేను సదా దైవ శక్తిచే పరిరక్షించబడుతూ, సరియైన మార్గంలో నడపబడుతున్నాను.... నా అంతరంగంలోకి చూసుకోవడం నాకెంతో క్షేమకరము.... నా గతంలోకి చూసుకొని దాన్ని సమీక్షించుకోవడం నాకెంతో క్షేమకరము.... జీవితం పట్ల నా దృక్పతాన్ని విస్తరించుకోవడం నాకెంతో క్షేమకరము.... "నేను" అనబడేది నా వ్యక్తిత్వం కన్నా... భూత,భవిష్యత్తు ,వర్తమాన కాలాల కన్నా,, ఎంతో ఉన్నతమైనది ....నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి ,నా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఎదగడానికి, నేను నిశ్చయించుకుంటున్నాను..... నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను పూర్తిగా సంసిద్ధతతో ఉన్నాను.... మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది 🌹



🌹ధన్యవాదములు 🌹


సమస్య ఎక్కడి నుండి వస్తుంది ?

🌹Part ____3(a)

🌟 "గాతకాలం యొక్క ప్రభావం నాపై ఏ మాత్రమూ లేదు"


🌹సరే!!! మనమెన్నో విషయాల్ని ప్రస్తావించు కున్నాము ...మనము సమస్య అనుకొనే దాని నుండి ప్రారంభించి, ఎన్నో మలుపులు తిరిగి, 'అసలు సమస్య 'ఏమిటో తెలుసుకున్నాము..." మనము బాగాలేము" అన్న భావన మరి" మన పైన మనకు ప్రేమ లేకపోవడం "అనేది మనలో ఉండడమే అసలు సమస్య .అని తెలుసుకున్నాము. జీవితంలో ఏదైనా సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ భావనలోంచి ఉత్పన్నమవుతుంది .ఇప్పుడు ఈ ఆలోచన విధానాలు ఎక్కడి నడి వచ్చాయో చర్చిద్దాం....


🌹తమ గురించి, తమ జీవితం గురించి, పరిపూర్ణంగా తెలిసిన చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి నిరంతరము సమస్యలతో సుతమతమవుతూ తాము అనర్హులమని, తాము ప్రేమించబడమని, భావించే పెద్దలుగా ఎలా ఎదిగామో కదా? అనర్హులమనే భావన, తాము ప్రేమించబడము ,అనే భావనలు అందరిలోనూ ఏదో తీవ్రతల్లో ఉంటాయి. ఎవరైతే తమను తాము ఇప్పటికే ప్రేమించుకుంటున్నారో వారు వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించుకోవచ్చు.


🌹ఒక చిన్న రోజా పువ్వు యొక్క మొగ్గను ఊహించుకోండి .అది మొగ్గ గా ఉన్నప్పుడు, ఒక పువ్వుగా వికసించేటప్పుడు, చివరి రేకు నేల రాలినప్పుడు, మరి దాని ప్రతి స్థితిలోనూ అది ఎప్పుడు పరిపూర్ణమైనదే! మరి నిరంతరం మార్పు చెందేదే... అలాగే మనము కూడా ,మనం ఎప్పుడూ పరిపూర్ణులమే... ఎప్పుడు సౌందర్యంతో నిండి ఉన్నవారమే... మరి నిరంతరము మార్పు చెందే వాళ్లమే... మనకుండే అవగాహన, జ్ఞానము ,చైతన్యపు స్థాయిని బట్టి, మనము చక్కగానే జీవిస్తున్నాం... మనకు ఇంకా ఎక్కువ అవగాహన,౭ జ్ఞానం వరి చైతన్యపు స్థాయి ఉండి ఉంటే మనం విషయాల్ని విభిన్నంగా చేస్తాము!( అంతే తేడా!


🌻మన మనసు అని ఇంటిని శుభ్రపరచుకోవడం..,


🌹ఇప్పుడు మన గతాన్ని ఇంకాస్త పరిశీలించి, మనలో కొనసాగుతున్న కొన్ని ఆలోచన విధానాలను ,కొన్ని నమ్మకాలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.....


🌹 కొంతమంది వారి మనసులని శుభ్రపరచుకోవడానికి ,చాలా బాధాకరంగా భావిస్తారు ....ఇక్కడ అంత బాధ పడవలసిన అవసరం లేదు ..ముందు మనం మనసులో ఏముందో చూసుకోవాలి. అప్పుడే కదా అనవసరమైన వాటిని తొలగిస్తాను....



🌹 మీరు ఒక గదిని పూర్తిగా శుభ్రపరచాలనుకుంటే, ఆ గదిలో అన్ని వస్తువులను జాగ్రత్తగా పరిశీలిస్తారు కదా! కొన్ని వస్తువులను ప్రేమతో చూస్తారు. వాటికి పట్టిన దుమ్మును వదిలించి, లేదా వాటిని చక్కగా పాలిష్ చేసి వా±టికి ఒక సరికొత్త అందాన్ని ఇస్తారు... కొన్ని వస్తువులకు రిపేర్ అవసరమవుతుంది... కొన్ని వస్తువులు మీకు అసలు పనికిరావు… వాటిని మీరు పారేస్తారు. పాత పుస్తకాలు, పాత న్యూస్ పేపర్లు, చెత్త కాగితాలాంటి వాటిని చెత్తబుట్టలో పడ వేస్తారు గదిని శుభ్రపరచుకొనేటప్పుడు కోపము అవసరం లేదు కదా!!!



🌹అదేవిధంగా మన మనసులోనీ గదులను శుభ్రపరిచే టప్పుడు కూడా అంతే, అలాగే మీలోని కొన్ని నమ్మకాన్ని బయటకు విసిరేయడానికి కోపం అవసరం లేదు ...అన్నము తినేసాక మిగిలిన వెతుకుల్ని పడవేసినంత సులభంగా వాటిని వదిలేయండి. ఈరోజు వంట చేయడానికి నిన్న తరిగి పారవేసిన కూరగాయల కోసం చెత్తబుట్టను త్రవ్వరు కదా! అలాగే రేపటి జీవితాన్ని ,భావాలని సృష్టించుకోవడానికి మనసులోని పనికిరాని ,పాత చెత్తను తవ్వాల్సిన అవసరం లేదు కదా!


🌹మీలోని కొన్ని ఆలోచనలు ,నమ్మకాలు మీకేం మాత్రం పనికి రాకపోతే వాటిని మీలోంచి వెళ్లి పోనివ్వండి ...ఒకసారి నమ్మితే ,ఇంకెప్పటికీ అదే నమ్మకాలతో ఊగులాడాలని ఎక్కడా రాసి పెట్టలేదు...


🌹 మనం ఎప్పుడు కొన్ని పరిమితమైన నమ్మకాలను మరి అవి ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకుందాము.....


🌻పరిమితమైన నమ్మకము:---" నేను బాగాలేను అన్న సంతృప్తి"
ఎక్కడినుండి వస్తోంది:---" నువ్వు మూర్ఖుడివి. దేనికి పనికిరావు అని పదేపదే తన తల్లిదండ్రులు అంటూ ఉంటే ,పిల్లల్లో ఈ భావన తలెత్తుతుంది....


🌹తను విజయం సాధించాలని, అది చూసి తన తండ్రి గర్వపడాలని, ఒక అబ్బాయి చెబుతుండేవాడు... కానీ అతడు వరుసగా పరాజయాలు పాలవడంతో ,అతడు అపరాధ భావంతో కృంగిపోయేవాడు...మరి క్రోధంతో ఊగిపోయేవాడు.... అతడికి విజయం సాధించడం ఒక "చిక్కుముడిగా" మారి పోయింది.....


🌹వాళ్ళ నాన్న అతనికి ఒక ఫైనాన్సింగ్ బిజినెస్ అప్పజెప్పాడు. కానీ వరుసగా అతడు ఓడిపోతున్నాడు. అతడి ఓటమి అలాగే కొనసాగి వాళ్ళ నాన్న ఆ నష్టాల్ని ఉడుచుకునేందుకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చింది. వాళ్ళ నాన్న కూడా చాలా నష్టపోయాడు..


🌻పరిమితమైన నమ్మకము:-- "తనపై తనకు ప్రేమ లేకపోవడం"
ఎక్కడినుండి వస్తోంది :---నాన్నను మెప్పించడానికి ప్రయత్నిస్తుండడం....



🌻ఒక అమ్మాయికి ఎప్పుడూ తన తండ్రితో అభిప్రాయ బేధాలు వస్తుండేవి. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు వాదులాడుకునేవారు. ఆమె తనను తాను ఒప్పుకుందాం అనుకునేది. కానీ చివరికి ఆమెకు మిగిలింది విమర్శలు మాత్రమే .ఆ అమ్మాయి చివరకు వాళ్ళ నాన్న లాగా ఉండవలెనని నిర్ణయించుకుంది. ఆమె శరీరం అంతా నొప్పులు వచ్చేవి...ఆమె తండ్రికి కూడా అలాంటి నొప్పులే వచ్చేవి ...తన కోపమే ఇలాంటి నొప్పిని తన శరీరంలో సృష్టిస్తున్నదన్న విషయాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అలాగే ఆమె తండ్రికి తన కోపం తన శరీరంలో నొప్పిని సృష్టించింది...


🌻పరిమితమైన నమ్మకము :-- జీవితం చాలా భయానకమైనది:_ ఎక్కడినుండి వస్తోంది
...భయకంపితుడైన తండ్రి / తల్లి


🌹 నా క్లైంట్ ఒకవే ఎప్పుడూ చాలా సీరియస్ గా, పద్ధతిగా ఉండేది... ఆమె మనసారా నవ్వేందుకు కూడా సంకించేది... ఎందుకంటే అలా నవ్వితే ఏదైనా చెడు జరిగి తర్వాత దుఃఖపడతామని భయపడేది...


🌹తన తండ్రి పెంపకంలో ఏయ్ !నవ్వద్దు, అలా నవ్వితే తర్వాత అంతకంత ఏడ్వాల్సి వస్తుంది ...అని హెచ్చరింపబడింది. అందుకే ఆమె అలా తయారయింది...


🌻పరిమితమైన నమ్మకము :-- "నేను బాగాలేను" ఎక్కడి నుండి వస్తోంది....
🌻 తల్లిదండ్రులు పూర్తిగా పట్టించుకోకుండా వదిలిపెట్టబడటం వలన తలెత్తుతోంది...


🌹 ఒకతనికి మాట్లాడడమే కష్టం అయ్యేది. నిశ్శబ్దమే అతని జీవన విధానం అయినది. డ్రగ్స్ కు, ఆల్కహాల్కు అలవాటు పడి ,నేను చాలా చెడిపోయాను అన్న నిర్ధారణకు వచ్చాడు... నాకు తెలిసిందేమిటంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అతడు తన పిన తల్లి పెంపకంలో పెరిగాడు. ఆమె అతడితో ఎప్పుడో, ఏదైనా పని చెప్పడానికి తప్ప మాట్లాడేది కాదట .కావున అతడు నిశ్శబ్దంగా పెంచబడ్డాడు. అతడు ఒంటరిగానే తింటాడు... కావాలంటే అతడు ఒంటరిగానే ఎన్ని రోజులైనా గడిపేయగలడు. అతడికి ఒక ప్రియురాలు ఉండేది .ఆమె కూడా నిశ్శబ్దంగా ఉండే మనిషి. ఎంతో కాలం నిశ్శబ్దంగానే కలిసి గడిపారు. ఈమధ్య అతడి ప్రియురాలు చనిపోయింది. అతడు మళ్ళీ ఒంటరి వాడయ్యాడు...


🌻మన మనసులోకి ఎక్కించబడ్డ నెగిటివ్ సందేశాలు....


🌹ఇప్పుడు ఇక మనం ఏం చేయాలంటే ఒక పెద్ద పేపరు షీట్ తీసుకొని, మీ తల్లిదండ్రులు మీలో ఏ ఏ లోపాలు ఉన్నాయని చెప్పారో రాయండి.... మీరు విన్నటువంటి అన్ని నెగటివ్ నమ్మకాలను రాయండి.... గుర్తుకు తెచ్చుకొని మరీ వ్రాయండి... దీనికి కావాల్సినంత ఎక్కువ సమయాన్ని కేటాయించండి.... కనీసం అరగంటైనా.....


🌹వారు మీకు డబ్బు గురించి ఏమేమి చెప్పారు... మీ శరీరం గురించి ఏమేమి చెప్పారు... ప్రేమ గురించి ,మరి సంబంధం బాంధవ్యాల గురించి ,ఏమి చెప్పారు... మీలోని సృజనాత్మకత గురించి, ఏమి చెప్పారు ...వారు మీకు చెప్పిన పరిమితమైన నమ్మకాలు, లేక నెగటివ్ ఆలోచన విధానాలు ఏవి.?



🌹ఈ విధంగా పరిశీలిస్తూ పోతే, మీలోని నమ్మకాలు ఎక్కడినుండి వచ్చాయో అర్థం అవుతుంది.... ఆ!!! ఈ నమ్మకము ఇక్కడి నుండి వచ్చిందా ???అని మీతో మీరు చాలా ఆశ్చర్యంగా చెప్పుకుంటారు....


🌹ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకోండి.... ఈ విషయంలోనే ఇంకాస్త లోతుగా వెళదాము.... మీరు చిన్నతనంలో విన్న నెగటివ్ నమ్మకాలన్నింటినీ రాయండి...
🌹మీ బంధువుల నుండి విన్నవి ...
🌹టీచర్ల నుండి విన్నవి ...
🌹మీ స్నేహితుల నుండి విన్నవి....
🌹అధికారుల నుండి విన్నవి....
🌹 మీ మత పెద్దల నుండి విన్నవి....

🌹అన్నింటినీ వ్రాయండి ....కావలసినంత ఎక్కువ సమయాన్ని తీసుకోండి ....అలా వ్రాసేటప్పుడు మీలో మెదులుతున్న భావాలను గమనించండి.....

🌹మీరు ఇప్పుడు రాసిన రెండు పేపర్లలోని విషయాలను మీ చైతన్యంలోంచి తొలగించాలి.... ఈ నమ్మకాలే " నీవు పరిపూర్ణుడవు కావు" "నీలో ఏదో లోపం ఉంది" అనే భావాన్ని సృష్టించి," నేను బాగాలేను "అన్న కొరతను మీలో కలుగజేస్తున్నాయి......



🌹 ధన్యవాదములు 🌹🌹


Reference links - 
https://telugu.matrubharti.com/book/read/content/19931927/my-philosophy-introduction
https://telugu.matrubharti.com/book/read/content/19931928/my-philosophy-1
https://telugu.matrubharti.com/book/read/content/19931929/my-philosophy-is-2
https://telugu.matrubharti.com/book/read/content/19931930/my-philosophy-is-3
https://telugu.matrubharti.com/book/read/content/19931931/my-philosophy-is-4
https://telugu.matrubharti.com/book/read/content/19931932/my-philosophy-is-5


నవ్విస్తూనే... సమాజపు డొల్లతనాన్నీ చూపించిన దేశ దిమ్మరి(Tramp) చార్లీ చాప్లిన్

 *నవ్విస్తూనే... సమాజపు డొల్లతనాన్నీ చూపించిన దేశ దిమ్మరి(Tramp) చార్లీ చాప్లిన్* 
~~~

పుడుతూనే నడకతోపాటుగా నటన నేర్చుకున్నవాడు చార్లీ చాప్లిన్! 

వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే, దానికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందిస్తుంటే, తనుమాత్రం మీదకు విసిరిన చిల్లరడబ్బుల్ని ఏరుకోవడంలో మునిగిపోయాడు. చప్పట్లు ఆకలి తీర్చుతాయా! 

ఆకలికి మాడినవాడు కాబట్టే, ‘బూట్లను ఉడికించి, తినాల్సివచ్చిన’ సన్నివేశాన్ని(గోల్డ్ రష్) సృజించగలిగాడు.
 
 తాగుబోతు తండ్రి, మతిస్థిమితం తప్పిన తల్లి, అనాధాశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి, రెండేళ్లు మాత్రమే చదివిన చదువు... ఖరీదైనదిగానే తప్ప మరోలా మన ఊహకు అందని లండన్ నగరంలోని అతిపేదరికాన్ని చిన్న వయసులోనే చాప్లిన్ అనుభవించాడు. 

అందుకేనేమో, ‘‘నేనెప్పుడూ వాననీటిలో నడవడానికి ఇష్టపడతాను, నా కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా’’ అన్నాడు.
 
పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడకముందు చాప్లిన్ చాలాపనులు చేశాడు. 

స్టేషనరీ స్టోరులో, డాక్టర్ ఆఫీసులో, గ్లాసు ఫ్యాక్టరీలో, షాండ్లియర్ షాపులో, ప్రింటింగ్ ప్లాంటులో..

అయినా అదంతా జీవితం ఇవ్వగలిగే అనుభవంగానే లెక్కించాడు.అసలంటూ బతక్కపోవడంకంటే అది మేలే కదా!
 
 ‘‘జీవితంలో ట్రాజెడీ ఒక భాగం. కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ’’ అన్నాడు చాప్లిన్.

 కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి? ‘‘నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావొచ్చుగాక, కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు’’. 

‘‘ఒక వృద్ధుడు అరటితొక్క మీద కాలువేసి జారి పడితే- దానికి మనం నవ్వం. అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం’’. 

ఇదీ చాప్లిన్ హాస్యం!  #PDSO

కానీ ఆయన సినిమా అంటే హాస్యమొక్కటేనా? నలుపు తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్నీ చూపించాడు.

నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శ్యాల్నీ వ్యాఖ్యానించాడు.
 
 బ్యాగీప్యాంటు, టైటుకోటు, పెద్ద తల, చిన్న టోపీ, వెలిసిపోయిన బట్టలు, అయినా హుందాతనాన్ని కాపాడుకునే యత్నంగా చేతికర్ర, చేసేది కామెడీయే అయినా సీరియస్‌నెస్ తేవడానికి చిన్నమీసాలు, పెద్దబూట్లు, పెంగ్విన్ లాంటి నడక... 

ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు; కానీ దిమ్మరి వేషానికి (ట్రాంప్) మాత్రం జేబుల్నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్.
 
పెట్టుబడిదారీ  వ్యవస్థ చేసే దోపిడీని,అది సృష్టించే నిరుద్యోగాన్ని,పేదరికాన్ని,దారిద్య్రాన్ని.." మోడర్న్ టైమ్స్," లో చూపితే...

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో (1940) తీసిన "ద గ్రేట్ డిక్టేటర్‍"లో చాప్లిన్ హిట్లర్‍ను,ఫాసిజాన్నీ అద్భుతంగా సెటైర్ చేశాడు. 

కాని కేవలం సెటై‍ర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుడిని విముక్తుడిని చేయగలగేది సమసమాజమేనని ఘంటాపథంగా చెప్తాడు. 

ఈ చిత్రంలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు.

 ఒకటి హింకెల్ అనే నియంత పాత్ర. రెండవది ఒక సామాన్య క్షురకుని పాత్ర. 

ఇద్దరూ ఒకే పోలికలో వుంటారు. నియంతగా అందరు పొరబడిన క్షురకుని అధ్బుత ప్రసంగంతో చిత్రం ముగుస్తుంది. 

" మబ్బులు విడిపోతున్నాయి, మేఘాలను చీల్చుకుని సూర్యుడు వస్తున్నాడు, చీకటి నుంచి విముక్తులమై మనం ఒక నవ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాము. 

అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు, దురాశను జయిస్తారు, పాశవికతను జయిస్తారు.

మానవుడి ఆత్మ రెక్కలు తొడుక్కుంది. 
ఎట్టకేలకు అతడు ఎగరడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. 

ఒక ఆశల ఇంద్రధనుస్సులోనికి, 
ఒక కాంతివలయంలోకి,
ఒక ఉజ్వల భవిష్యత్తులోకి మనిషి ఎగిరిపోతున్నాడు. 

ఆ భవిష్యత్తు నీది , నాది, మనందరిది....... " 

అని మహావేశంతో ప్రసంగం ముగిస్తాడు.

                           ******
1889 ఏప్రిల్ 16 న ఇంగ్లాండ్ లో జన్మించిన చాప్లిన్,1977 డిసెంబర్ 25 న స్విట్జర్లాండ్ లో మరణించాడు.చివరి వరకు పేద ప్రజలపక్షానే నిలిచిన చార్లీ చాప్లిన్ కు జోహార్లు అర్పిద్దామ్.💐💐💐

నిరంతరం blame చేసేవారికి ఎలా బుద్ధి చెప్పాలి | blaming disease | Kanth’Risa

 
నిరంతరం blame చేసేవారికి ఎలా బుద్ధి చెప్పాలి | blaming disease | Kanth’Risa

What is love? చాల తేలికైన అవగాహన | Kanth’Risa

 What is love? చాల తేలికైన అవగాహన | Kanth’Risa

Tuesday, April 16, 2024

#హలాల్ .....vs #జట్కా పద్దతి

 #హలాల్ .....ప్రతి ఒక్క హిందువు తప్పక చదవండి....

ఒక  కోడి , మేక , ఆవు , బఱ్ఱె  లాంటి జంతువులను బలవంతంగా లాక్కొచ్చి దాని మెడని మక్కా వైపుకు అంటే ముస్లింలు రోజూ ఏ దిక్కునైతే తిరిగి నమాజ్ చేస్తారో  ఆ దిక్కుకు దాని మెడని విరిచి పట్టుకుని "లాఇలాహి ఇల్లల్లా మహమ్మద్ రాసులల్లా" అని ఒక ఖురాన్ వాక్యం చదువుతారు. 
అంటే  ( అల్లా ఒక్కడే దేవుడు. అల్లా తప్ప వేరొక దేవుడు లేడు.  మహమ్మద్ ప్రవక్త అల్లా చివరి ప్రవక్త. ) అనేది దాని అర్ధం..
అలా ఒక వైపుకు ఆ జీవి మెడని విరిచి పట్టుకున్నప్పుడే ఆ జీవికి ఒక రకమైన భయం ఏర్పడుతుంది. తరువాత  ఆ జీవి  మొండెము నుండి తలకు రక్త సరఫరా అయ్యే పెద్ద నరాన్ని కోసి, దాన్ని  అలా వదిలేస్తారు. మెల్లి మెల్లిగా ఆ రక్తం కారడానికి ఎంత సమయం పడుతుందో...  జంతువుని బట్టి 30 సెకన్ల నుండి 5 నిముషాలు పట్టొచ్చు. అంత సేపు అది భయబ్రాంతులకు గురవుతూ తనకు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో శరీరంలో వివిధ రకాల స్ట్రెస్ హార్మోన్స్ , నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. తరువాత  అది చచ్చిపోతుంది. 

 ఇలా హింసించి హింసించి చంపడాన్ని #హలాల్ అంటారు. చాలా చికెన్ షాప్ లలో చూసే ఉంటారు... కోడి మెడ  కోసి ఒక డ్రమ్ లో పడేస్తే అది సుమారు 30 సెకన్ల పాటు గిల గిలా కొట్టుకుంటూ ఉంటుంది. దానిలో అప్పటికే రిలీజ్ అయిన స్ట్రెస్ హార్మోన్స్ ఆ మాంసం లో చేరిపోతాయి.
  అవి తిన్న మనుషులకు కూడా విపరీతమైన కోరికలు , క్రూరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తు ఉంటాయి. 
అందుకే కాశ్మీర్ లో పోలీసుల మీద రాళ్లు వేయడానికి ఆడాళ్ళు కూడా ఎగబడుతూ ఉంటారు. 

( ఒక జంతువుకి విషం ఎక్కించి ఆ జంతువు ఆ విషానికి విరుగుడుగా తన శరీరం లో విడుదల చేసిన హార్మోన్స్ , యాంటీ బాడీస్ ని  పాము విషానికి విరుగుడుగా వాడుతున్నారు. ఇప్పటి సైన్స్ ప్రకారం అలాంటిది చచ్చేటప్పుడు విడుదల అయ్యే హార్మోన్స్ మన మీద ప్రభావం చూపవా...?! )

 #హలాల్ చేసిన మాంసం తినడం అంటే హిందువులకు నిషిద్ధం అని చాలా మందికి తెలియదు. హిందువులు #హలాల్ మాంసం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అది మన సంప్రదాయానికి విరుద్ధం కూడా..! #హలాల్ చేసేటప్పుడు విడుదలయ్యే హార్మోన్స్  మెదళ్లను మొద్దుబార్చడమే కాకుండా అనారోగ్యానికి కూడా కారణం అవుతాయి. ఇలా నెగిటివ్ హార్మోన్ లు రిలీజ్ అయిన ఫుడ్ ని  చిన్నపిల్లలకి తినిపిస్తే వాళ్లకి చిన్నతనం నుండే క్రూరత్వం, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి.
వాళ్ళు మంచి పనులకు దూరంగా జరిగి అధర్మ  కార్యాలపై ఆసక్తి పెంచుకుంటారు..

ఇక  హిందువులు, సిక్కులు #జట్కా చేసిన మాంసంనే తింటారు. 
#జట్కా పద్దతిలో అంటే  జంతువుని ఒక కత్తితో  ఒకే సారి తల నుండి మొండాన్ని వేరు చేయడం. 
   దీనిలో ఆ జంతువుకు నొప్పి తెలిసే లోపు ప్రాణం పోతుంది.  స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే అవకాశం తక్కువ.
హిందువులలో కటిక వాళ్ళు మాంసం అమ్ముతూ ఉంటారు. 
రాను  రాను హిందువులు ఎంత  దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వచ్చారు అంటే 
గ్రామ దేవతలకు మొక్కి బలి ఇచ్చేటప్పుడు కూడా గడ్డం టోపీ సాయుబుని తెచ్చి #హలాల్ చేయిస్తున్నారు. అమాయకులైన గ్రామ ప్రజలు ఇదే ఆచారం  అంటూ వాదిస్తున్నారు. 

అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని ఖురాన్ వాక్యాలు చదువుతూ  వాడు హిందూ దేవుళ్ళయిన పోచమ్మకి, ఎల్లమ్మకి కోడిని కోయడం ఏంటో... హిందువులు పవిత్రంగా పూజించే ఆవుని చంపుకు తినే వాళ్ళు కోసిన మాంసం మనవాళ్ళు ఎగబడి తినడం ఏమిటో... మన హిందూ సమాజం అమాయకత్వానికి పరాకాష్ట!
ఐనా మనకేం ఖర్మండి భావదారిద్ర్యం కాకపోతే..!👍

విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించండి... #హలాల్  చేసిన మాంసం తిని హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించకండి.

✨ఆలోచనలే మన జీవితం

 *✨ఆలోచనలే మన జీవితం* 
   🕉️🌞🌎🏵️🌼🚩

 *మనం ఎంతగా ఆలోచిస్తే మన మెదడు అంతగా పనిచేస్తుంది. మన ఆలోచ నల ప్రతిరూపమే మనం. మనలోని బలమైన ఆలోచనలకు మన జీవితమే అద్దం. మనకు విచక్షణా జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచనలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఉద్దేశపూర్వకంగా మనసుతో ఆలోచించి జీవితాన్ని తీర్చిదిద్దుకోగల స్వేచ్ఛ మనకు ఉంది. ఆలోచనలు లేని మనిషంటూ ఉండడు.* 

 *టీవీకి రిమోటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఛానల్ మార్చాలంటే రిమోట్ ఉపయోగిస్తాం. అంటే, మనం మార్చిన ఛానల్ మనకు కావాల్సిన ప్రోగ్రాం ఇస్తుంది. అలాగే మనిషి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఒక విషయం, మరొక ఆలో చనకు మారినప్పుడు మరొక విషయం మెదులుతాయి. వ్యతిరేక, ప్రతికూల భావనలను ఛానల్ మార్చినట్టుగా మార్చి అనుకూల భావనల ఛానల్ ప్రసారాలు చూడాలంటే మనసు అనే రిమోట్ను మనం ఉపయోగించాలి.* 

 *మనకు అక్కర లేని అంశాలు, భయం కలిగించే విషయాల మీద, బాధ కలిగించే వాటి పైన ఆలోచన లను కేంద్రీకరించడం మాని, కావాల్సిన వాటిపై దృష్టి పెడితేనే మన జీవితం మారుతుంది. అందుకే ఆలోచ నల పై జీవితం ఆధారపడి ఉంది. ఎక్కువ కాలం వ్యతిరేక ఆలోచనలు చేస్తుంటే మనసు మరింతగా ఆందోళనకు గురవు తుంది. మంచి ఆలోచనలు భావన చేస్తే అవి ఎక్కువ శక్తినిస్తాయి.* 

 *మనలోని మంచి ఆలోచనలు శక్తిగా మారి సాకారం కాకపోతే, ఆశించినవి జరగక పోతే అదీ మంచికే అని అనుకోవాలి. మన ఆలోచన లను పునఃపరిశీలన చేసు కొని లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. జీవితాన్ని సృష్టించుకోగల శక్తి ఈ 'క్షణానికి' మాత్రమే ఉంది. యద్భావం తద్భవతి. మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను మనం అదుపు చేయలేం. రోజుకు దాదాపు అరవై వేల ఆలోచనలు మనసులోకి వస్తాయన్నది పరిశోధకుల మాట.* 

 *మనకు బాధ కలిగినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మనలో ప్రతికూల భావనలను దూరం చేసుకోవాలి. లేకుంటే, మరింత వేదన తప్పదు. పదేపదే ప్రతికూల భావనల గురించి ఆలోచించడమంటే- నేను మరింత బాధపడే పరిస్థితి తీసుకురా అని మన మనసుకు స్వయంగా చెప్పడమే! నచ్చని ఛానల్ మార్చినట్లే, దుఃఖ భావనల ఛానల్ మార్చుకోవాలి. మనసు రిమోట్కు అలా శిక్షణ ఇవ్వాలి. మనసుకు అటువంటి శిక్షణ ఇవ్వాలంటే ధ్యానం, క్రమశిక్షణాయుత జీవనం, నిర్మలమైన భావనలు అవసరం. ధ్యానం మనిషి అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. మానసిక బలం పెంచుతుంది. మనల్ని మనం కొత్త రూపంలోకి మార్చుకునేందుకు అవసరమైన జ్ఞానం అందిస్తుంది.* 

 *'నా ఆలోచనలపై నాదే అధికారం' అని మనం తరచూ అనుకోవాలి. మన ఆలోచనల మంచి చెడులకు పూర్తి బాధ్యులం మనమేనని నిత్యం భావించాలి. అసలు ముందుగా మనం ఏం చేయాలో, ఏం కావాలో నిశ్చయించుకోవాలి. దాని ప్రకారమే పనిచేయాలి. అప్పుడు ఆలోచనలే మన జీవితంగా రూపుదాలుస్తాయి. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, మన దృష్టిని దేనిపై ఎక్కువగా కేంద్రీకరిస్తామో... అదే మన జీవితం!* 

 *🎣సేకరణ* 

🕉️🌞🌎🏵️🌼🚩

కలలు ఎందుకు వస్తాయంటే

 కలలు ఎందుకు వస్తాయంటే పచ్చి నిజాన్ని, పరమసత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజూ మీకు గుచ్చి గుచ్చి వివరించడానికే. ఆ పచ్చి నిజం ఆ పరమ సత్యం అర్ధం చేసుకుంటే పక్షికి రెండు రెక్కలొచ్చినట్లుగా వుంటుంది. లేకపోతే "ఎందుకిలా? ఎందుకలా?" అంటూ సతమతమయిపోతుంటాము.  ఎందుకంటే మనకు ఏది పచ్చినిజమో, ఏది పరమ సత్యమో తెలియదు.

ఎవరో చంపడానికి మన వెంటపడుతుంటారు, మనం చాలా కష్టపడి పరిగెడుతుంటాము. తీరా కళ్ళు తెరచి చూసేసరికి అంతా మాయమైపోతుంది. అప్పుడనిపిస్తుంది “అరే! ఇదంతా కలేనా!”... అని

అలాగే 20 సం॥, 30సం॥, 70సం॥ జీవించి జీవించి రకరకాల కష్టాలు, సుఖాలు అనుభవించి ఎప్పుడైతే మనం మన శరీరం విడిచి పెడతామో అప్పుడు “అరే! ఇదంతా కలేనా!" అనిపిస్తుంది.

మీరు కలలోంచి లేవగానే మీకొక పచ్చినిజం అర్ధమవుతుంది. “ఇదంతా... జరిగిందంతా... కలేనా! నీటి మీద గీత, రాయి మీద గీత కాదు" కనుక “ఈ జీవితమంతా కూడా నీటి మీద గీత" అని స్వప్నం యొక్క అనుభవం ద్వారా అర్ధమవుతుంది.

“ఇదే పచ్చినిజం, పరమ సత్యం" అని చనిపోయాక మీకు తెలుస్తుంది. ఇది చెప్పడానికే ప్రతిరోజూ కలలు వస్తూంటాయి.

వేదం యొక్క అంతం వేదాంతమని గ్రహింప జేయడానికి ప్రతిరోజూ కలలు వస్తుంటాయి. "భవబంధాలన్నీ నీటి మీద గీతలు" అని తెలుసుకొని బ్రతకాలి. ఇదంతా ఒక గొప్ప నాటకరంగం. కలల్లో వచ్చే లాంటి మాయా ప్రపంచమే ఈ జీవితం ఈ జీవితంలో జరిగేదంతా కలే. మనకు చావు లేదన్న వేదాంతాన్ని తెలియజెప్పేదే కల.

జననమరణాలన్నీ కలలవంటివే. పైలోకంలో నిద్రపోతే ఈ లోకంలో మేల్కొంటాము. ఈ లోకంలో నిద్రపోతే పైలోకంలో మేల్కొంటాము. ఎరుక వస్తే గతంలో జరిగిన మంచి చెడులన్నీ కూడా కలలు అనే పచ్చి నిజం మనకు అర్ధమవుతుంది.

"మనం చూసేదంతా కలే" అన్న దృక్పధం ఎప్పుడూ కలిగి వుండాలి. ఎందుకంటే అదే పరమ సత్యం. కలలో చేసే మంచి నిజ జీవితంలో చెయ్యాలి. "కలలో ఆనందం వుంది మరి జీవితంలో కూడా ఆనందంగా వుండాలి". ఎందుకంటే చివరికి మనకు మిగిలేది ఆనందమే.

ఆత్మజ్ఞానం వున్నవాళ్ళంతా మేల్కొన్నవాళ్ళు, దుఃఖంలో వున్న వాళ్ళంతా నిద్రపోతున్న వాళ్ళు. నా దగ్గరకొచ్చి కష్టాలు చెప్పుకొనే వారందరికీ నేను చెప్పేదేమంటే "కళ్ళు తెరచి చూడండి, ఈ కష్టాలన్నీ ఒక కల మాత్రమే!”

రచయిత పేరు లేకుండా వచ్చిన* *ఒక మంచి కథ.* 👇 *"ఆస్తి..."*

 *అక్షర ఫౌండేషన్-తెలంగాణ*

*రచయిత పేరు లేకుండా వచ్చిన*
*ఒక మంచి కథ.* 
👇

*"ఆస్తి..."*

వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు.. 
పెద్దయ్యారు..పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళకు..ఒకరు గోవింద్...ఇంకొకరు శ్రీనాథ్..

 ఇద్దరి పుట్టిన ఊరు బాసర.. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు..
 
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.. గోవింద్ స్కూల్ టీచర్.
 శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం..ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళది... 

జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది..
గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు..అద్దె ఇల్లు, సిటీబస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి..కానీ ఎప్పుడూ తన స్థితికి బాధ పడలేదు..

పెళ్ళయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో... 

గోవింద్ భార్య  సరళ..పేదింటి అమ్మాయి.. గోవింద్ మేనమామ కూతురే.. అందలం ఎక్కాలని ఆశ సరళ కు..కానీ తీరేదెలా ?

ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్.. "మన దేశంలో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు..వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా" అంటాడు..పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు.

ఆడవాళ్ళు తమ పక్కవాళ్ళతో పోల్చుకుని, తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు...వాళ్ళకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది... సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు....  

శ్రీనాథ్ భార్య లక్ష్మి.. మంచి కుటుంబం నుండి వచ్చింది.. దానధర్మాలు చేయటం అలవాటు..దైవ భక్తి మెండుగా ఉంది...ఉన్న సంపదను చూసి మిడిసిపాటు లేదు లక్ష్మికి. లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు. 
ఇళ్ళకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి...లక్ష్మికి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది.
పిచ్చి పిల్ల.. సంపదలు ఉన్నా , సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితంలో..అదే చెప్పింది చాలా సార్లు.. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ... డబ్బులున్న దారే వేరు..చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..?? 

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు...

అది ఆగస్ట్ నెల..ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు...మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ ..

ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది..
శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.. రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని... పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది...శ్రీనాథ్ యూడీసీగా రిటైర్ అయ్యాడు.. ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.. చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు..
మంచి వాడు...పనిలో చురుకుదనం చూపించేవాడని.. అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తుచేసుకున్నారు.

స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు... మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని..స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.. అందరూ ఆనందించారు...

ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు... చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.. ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను...

💐💐

వచ్చే నెలలో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.. మామూలు స్కూలు టీచర్ గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో ??

శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు...
కనీసం లో కనీసం తలదించుకోకుండా జరిగితే చాలు...అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..

రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళలో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది...ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మినీ పిలిచారు ఫంక్షన్ కి..మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన ,  సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది.. గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు.. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..

ఆ రోజు మామూలుగా స్కూల్ కి వెళ్ళి, కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు...అదే తన ఆఖరి క్లాసు కావటంతో రుద్ధమైంది ఆయన గొంతు..  కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..

సాయంత్రం నాలుగు గంటలయ్యింది..ఆ పాటికే సరళను, పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్ళు కూడా స్కూల్ కి వచ్చారు.

శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు...వాడూ...తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.

సరళ కు బెంగగా ఉంది..
ముళ్ళమీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది.

తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది..తను తట్టుకోలేదు.
మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షలమంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...

సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు..

అప్పటి వరకూ పెద్దగా జనంలేరు. విద్యార్థులు, టీచర్లు అందరూ కలిసి, ఒక వంద మంది ఉంటారు.. వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్ళే కదా.. సరళకు పెద్దగా సంతోషం కలగ లేదు...ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా...ఎక్కడి నుండి వచ్చారో..దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది... 

ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు...అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..చాలామంది నుంచునే ఉన్నారు...ఫంక్షన్ అయ్యేంత వరకూ...

ఎక్కడి నుండో పల్లకీని తీసుకువచ్చారు...మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీలో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు... సరళకు అంతా కలగా ఉంది... పల్లకీ లో  గోవింద్ ని కూర్చోబెట్టి లేపబోతుండగా, ఎవరో అరిచారు..
మాస్టారి ధర్మపత్నిని కూడా పల్లకీలో కూర్చో బెట్టాలని..అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ.. గోవింద్ తో...పెళ్ళిరోజు తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు..పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషంతో కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి..

పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలుకూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. 
ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళకు..గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి.." అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..
అయినా వాళ్ళు వినటం లేదు ...

ఇంతలో పల్లకీని దింపారు.. ఎందుకో అర్థం కాలేదు సరళకు, గోవింద్ కు... 

కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి. 
ఆ వచ్చినాయన...గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు..ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు.. ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా 
జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు.. 

జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు, 
మిగతా వాళ్ళు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు..

నీళ్ళు, కాళ్ళు కడిగే ఇత్తడిపళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో...ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి, తలమీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆరోజు అందరూ పూలవాన కురిపించారు వారిద్దరి మీద...

పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు.
ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి..జిల్లా ఎస్పీ, జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితంలో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు...
ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు... 

అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు..తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం..అది.. వాడికి జరిగినా తనకూ జరిగినట్లే... 

శ్రీనాథ్ మాట్లాడుతూ,
"ఇక్కడున్న ఇన్ని వందలమందిలో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్ అని పిలువగల అర్హత  కలవాడవటం సంతోషంగా ఉంది" అన్నాడు..

చివరగా గోవింద్ మాట్లాడాడు..
*"పిల్లలందరికీ నా ఆశీస్సులు... ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వకారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి, ఐశ్వర్యం, వీళ్ళే నా సర్వస్వం"* అంటూ ...మాట్లాడలేక పోయాడు.
 
*"నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే ! నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాను"*...అన్నాడు.

పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు గోవింద్ మాస్టారును.. 

ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి, గోవింద్ ని ఇంటి వరకూ దిగబెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...

ఆ రోజు రాత్రి  శ్రీనాథ్, లక్ష్మి, వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు...

భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం, తల్లితో అన్నాడు... "నాన్న గారికి ఇంత *ఆస్తి* ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా"...

"నాకూ ఇంత వరకూ తెలియదురా.." అన్నది సరళ ఎంతో సంతోషంగా.. .

శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..
*"వీడు కుబేరుడికి ఏమీ తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను.."*

సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ ...*"మనకు ఈ సంపద చాలు సరళా  ఈ జన్మకు"* ...
అన్నాడు..

ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజనీయులు ..వారు ప్రోగుచేసుకున్న *అక్షర ఆస్తి*...తమ వద్ద చదువుకున్న పిల్లల మంచి భవిష్యత్తు, అభిమానమే....,

*ఆస్తులు, సంపాదన అని వెంపర్లాడే మనుషులు  మారాలని ఆశిస్తూ..,* 

*ఇది మీకే అంకితం👍*

ఆత్మీయులకు షేర్ చేయగలరని కోరుతూ..,

💐🙏🫡😷