Saturday, April 20, 2024

🚩" TURNING POINT" ( "మలుపు" )

 👍👍👍👍👍👍"
🚩" TURNING POINT" ( "మలుపు" )
      🔥🔥🔥
"ఎవరి జీవిత చరిత్ర చూసినా, వారి "జీవన సరళి"," గమ్యము" అనూహ్యమైన  
వివిధ పరిణామములు వలన "మార్పు "జరిగే అవకాశం ఉంది.  మరి ఏమిటో తెలుసుకుందామా!
     🙏🙏🙏
🚩"సమర్పణ & సేకరణ:
"MAZUMDAR" BANGALORE Karnataka
87925-86125.
     &
"IMPACT " సౌజన్యంతో,
      🙏🙏🙏

" నేడు సైకాలజీ ప్రకారము
ప్రతి వ్యక్తి జీవితంలోనూ,
అవమానాల ద్వారా,
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, కొందరి జీవితాలలో పెను మార్పులు, చేర్పులు, చేసుకుంటూ ఉంటారు.
అవి ఎందుకు? ఎలా? ఎవరి వల్ల? ఏ పరిస్థితులు కారణాలై ఉండవచ్చు?  వాటి గురించి వివరంగా, విశదీకరించుకుందాం!

🌷" వ్యక్తుల" ద్వారా:-
మీ బంధు,మిత్రులు, మీ బాస్, లేదా ఒక నాయకుడు ద్వారా మీ సాధారణమైన జీవితం మలుపు తిరగవచ్చు,. 
🙏ఉదా:-1. "శ్రీ వివేకానంద జీవితం"  - శ్రీ రామకృష్ణ పరమహంస ద్వారా,

🙏2. "గాంధీ జీవితం"- సత్య హరిశ్చంద్ర, ని జీవితం ద్వారా, మారిందని మనం తెలుసుకున్నాం!
      🙏🙏🙏

🌹" అనుభవాల ద్వారా":- మీ జీవితంలో మీరు చేయ పనులు వల్ల, వచ్చే అనుభవం ప్రకారము నేర్చుకున్న విషయాలు, పాఠాలుగా గైకొని, ప్రవర్తిస్తారు.

🙏ఉదా:- 1)"చాణిక్యుడు,- ని "నందరాజులు" అవమానిస్తే,

🔥2)" South Africa" లో  "మన గాంధీ గారిని అవమానిచ్చి, రైలు నుండి త్రోసి వేయగా, ఆయన చిరునవ్వు నవ్వి, మన భారత దేశము నుండి వారిని త్రోసివేసినాడు.
        🙏🙏🙏

🪷" మాట" ద్వారా:-
మాట ను గురించి విశేషంగా, ప్రత్యేకంగా రాసిన "శీర్షిక"ను ఒకసారి చదవండి!.  "టీచర్లు"  ఒక గొప్ప స్పీకర్ గా మారారు.
అనేక సినిమాలలో, వ్యక్తుల యొక్క జీవితాలలో, మాట అనే తూట, ఒక ఆయుధమై పని చేసింది.  వారి జీవితాలని మార్చినట్లు, వీక్షించినాము.  ఎవరైనా ఒక వ్యక్తి మనలను ఒక మాట అన్న, మనం  వెంటనే "రియాక్ట్" కాకూడదు.
"యాక్సెప్ట్" చేయండి.  ఆ మాటకు తగిన ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో! మీ జీవితంలో అని "ఎనాల్సిస్" చేసుకుంటే,
మారావలెనన్న మారండి! (లేదా ) ఆ విషయము (మాట ను) వదిలి పెట్టండి.  మీ ఆరోగ్యము ముఖ్యము.కదా! ఎవరో అన్న మాటను పట్టించుకోవద్దు. 

       🙏🙏🙏
🌸" దృశ్యము":- ద్వారా
కొంతమంది వ్యక్తులు, వారి జీవితంలో, చూసి పరిణామము చెంది మారగలరు, వారి జీవితం "మలుపు తిప్పుకోగలరు"
.
🙏;ఉదా:- 1)" "సిద్ధార్థుడు"  అనే రాజ కుమారుడు- "గౌతమ బుద్ధుడు"గా  ఏవిధము మీకు అందరికీ తెలిసి ఉండును.

🔥2)" రత్నాకరుడు" అనే బోయవాడు." "వాల్మీకి ఋషి" గా మారిన విషయము గురించి వేరే చెప్పవలసిన పనిలేదు.
      ❤️❤️❤️
" మీ జీవితంలో కొత్త మెరుగైన మార్పు, మార్గాలు అన్వేషిద్దాం!

🔥" ఏ విషయాన్ని మీరు అవైడ్( Avoid)చేయవద్దు "Respond " అవటం నేర్చుకోండి.

🔥" Brack" : ఆ విషయాన్ని" ఆత్మ పరిశీలన" చేసుకోండి.

🔥" Creative Thinking:- ( out of box thinking) ఇంతకుమించి నేను ఏమి చేయగలను? అంతకుమించి నేను ఏమి చేయగలను?  అని ప్రశ్నించుకొని, ప్రయత్నం చేయండి. ( "Creative Thinking" మీద పెద్ద ఎపిసోడ్ లా రాయడమైనది.   మన సభ్యులు చదవని వాళ్ళు కూడా చదవండి)

🔥" Decision making" సరి అయిన మెరుగైన నిర్ణయాలు తీసుకొనుట, చాలా అవసరము.  ఈ విషయము గురించి
చాలా పొడవైన, అతిపెద్ద,
"శీర్షిక రాయడం" అయినది , చదవని వాళ్ళు చదవండి) 

     🙏🙏🙏
" నేటి నుండి మీరందరూ,
నిన్నటి లాగా-- ఈ రోజు ఉండకండి.

🔥" ఈరోజు లాగా-- రేపు అలా ఉండకండి.

"👍" రేపటి రోజు మీరు ఎలా ఉండబోతున్నారో-- మరుసటి రోజు అలా ఉండకండి.   ఎందుకంటే మీ జీవితాన్ని ఎలా గొప్పగా, హుందాగా, తీర్చిదిద్దుకోండి.  అభివృద్ధిని కాంక్షించండి!
కరోనా ముందు, కరోనా తరువాత చాలా మార్పులు వచ్చినవి కదా!
మార్పుని గౌరవించండి? ఆహ్వానించండి.?
మంచి విషయాలు పై శ్రద్ధ, ఓపిక, తీరిక, సమయం కేటాయించి, మీ జీవితాలు ఆనందమయం, సుఖమయము చేసుకోండి.
ఇలాంటి అద్భుతాలు, చేయవలసిన మంచి పనులు, పాజిటివ్ ఆలోచనలు, దుఃఖ రహిత జీవితం సరైన సాధన ద్వారా సాధ్యం అందరికి. 

👍👍👍👍👍👍

No comments:

Post a Comment