నా(Madhu) ఫిలాసఫీ..... - పరిచయం
..... నా ఫిలాసఫీ లోంచి కొన్ని సత్యాలు...
" జ్ఞానానికి,విజ్ఞానానికి దారులెప్పుడూ తెరిచే ఉంటాయి "...
@.... మన జీవితంలో సంభవించే ప్రతీ అనుభవానికి మనమే బాధ్యులను....
@....మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది....
@....ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంది.....
@.... ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడం , తోనూ, మరి తప్పు చేశా మేమో అన్న భావం తోనూ బాధపడుతుంటారు....
@...ప్రతి ఒక్కరూ తమలోపల నేను బాగాలేను... అన్న అసంతృప్తితో ఉంటారు...
@...ఇది కేవలం "ఆలోచన" మాత్రమే ....మరి ఆలోచనలను మనం మార్చుకోవచ్చును.....
@...మనమే "రోగాలు" అనబడే వాటికి మన శరీరాల్లో సృష్టించుకుంటున్నాము.....
@.... క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామేమో అన్న భావన, మరియు భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచనా విధానాలు......
@....క్రోధ భావనను వదిలిపెట్టేస్తే "కాన్సర్" సైతము నయమవుతుంది.....
@.....మనం గతాన్ని పూర్తిగా విసర్జించి,ప్రతీ ఒక్కరినీ క్షమించేయాలి.......
@....మనల్ని మనం ప్రేమించు కోవడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాలి....
@.....ఈ క్షణంలో మనల్ని మనం మంచిగా భావించడంతోనూ,మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోడంతోనూ, మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతాయి.....
@....మనల్ని మనం "నిజం"గా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతీదీ మనకు అనుకూలిస్తుంది......
Part____1(a)
.....నా విశ్వాసము.....
#నిజానికి జీవించడం చాలా సులభము....మనం వేటినైతే బయటకు పంపుతామో వారినే తిరిగి పొందుతున్నాము.......
మన గురించి మనం చేసే ప్రతి ఆలోచనా మన పట్ల వాస్తవం అవుతుంది .... నాతో సహా ప్రతి ఒక్కరూ, వారి వారి జీవన పరిస్థితులకు వారే బాధ్యులు... అవి ఎంతటి ఉన్నతమైనవి అయినా సరే ,లేదా నీచమైనవి అయినా సరే.... మనం చేసే ప్రతి ఆలోచనా మన భవిష్యత్తుని సృష్టి స్తోంది.... మనమందరమూ మన ఆలోచనలతో, మన భావనలతో మన జీవితానుభావాల్ని సృష్టించుకుంటున్నాము.... మన మనస్సు ల్లోంచి జనించే ప్రతీ ఆలోచనా,మన నోటిలోంచి వెలువడే ప్రతి వాక్కూ మన జీవితానుభావాల్ని సృష్టిస్తున్నాయి......
* మన పరిస్థితులను మనమే సృష్టించుకుని, మన నిరాశా నిస్పృహలకు ఇతరులను అందిస్తూ ,మన శక్తిని మనం కోల్పోతున్నాము.... ఏ వ్యక్తి గాని ,ఏ ప్రదేశం కానీ మనల్ని ప్రభావం చేయలేదు.... ఎందుకంటే మన మనసుల్లో ఆలోచనలు చేసేది నిష్చయంగగా మనమే కాబట్టి.... మన మనసుల్లో శాంతిని, సామరస్యాన్ని మరి సమతుల్యాన్ని సృష్టించుకుంటే, వీటినే మన జీవితాల్లనూ దర్శించవచ్చును....
@ ఈ క్రింది వాటిలో ఏ వాక్యము మీ నమ్మకాలకు అణగుణంగా ఉందో కాస్త గమనించండి.....
#... ఎవ్వరూ,ఎప్పుడూ నాకు సహకరించరు.
#...అందరూ అన్నివేళలా నాకు సహకరిస్తారు...
*పై వాటిలో ఒక్కొక్క నమ్మకమూ పూర్తిగా భిన్నమైన అనుభవాల్ని సృష్టిస్తోంది...ఈ విధముగా మనము దేన్ని మన గురించి, మన జీవితం గురించి నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది......
🌹... ఈ విశ్వము మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను మరి ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది...🌹
*... మనం ఎంపిక చేసుకునే నమ్మకాలను మన సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా అంగీకరిస్తుంది ....నా గురించి, నా జీవితం గురించి నేను నమ్మేది నా పట్ల వాస్తవం అవుతుంది ....అలాగే మీ గురించి, మీ జీవితం గురించి , మీ నమ్మకాలే మీ పట్ల వాస్తవాలు అవుతాయి.... మరి మనం ఎంపిక చేసుకోవడానికి లెక్కలేనన్ని ఆలోచనలు ఉన్నాయి....
* ఇది తెలుసుకున్నప్పుడు "ఎవ్వరూ, ఎప్పుడూ నాకు సహకరించారు" అని నమ్మడానికి ఎంపిక చేసుకోవడం కన్నా " అన్నివేళలా నాకు సహకరిస్తారు" అని నమ్మడానికి ,*ఎంపిక" చేసుకోవడం మంచి స్పృహరిస్తుంది కదా!!!!
🌹.... విశ్వశక్తి మన గురించి ఇవ్వడం గాని మనల్ని ఒప్పుకొనకపోవడం గాని, ఎప్పుడూ చేయదు ....🌹
*విశ్వశక్తి మనలో ఉన్నది ఉన్నట్లుగానే మనల్ని అంగీకరిస్తుంది ...మరి మన నమ్మకాల్నే మన జీవితాల్లో ప్రతిఫలిస్తుంది....' నాకెవ్వరు లేరు' 'నేను ఒంటరి వాడిని' 'నన్ను ఎవరు ప్రేమించరు' అనే నమ్మకంతో నేను ఉంటే నా జీవితం లో నేను ఆ ప్రతిఫలాలనే పొందుతాను.....
* అలా కాక ఈ నమ్మకాన్ని నేను వదిలి పెట్టేసి ,"ప్రేమ అంతటా ఉన్నది... నేను ప్రేమ స్వరూపాన్ని,! నన్ను అందరూ ప్రేమిస్తారు" అని ప్రగాఢంగా విశ్వసించి భావిస్తే, అదే నా జీవితంలో వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది... అప్పుడు ప్రేమ పూర్వకంగా ఆదరించే వారే నా జీవితం లో తారసపడతారు.... ఇదివరకే నా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, నన్ను మరింతగా ప్రేమిస్తారు .,.మరి నాలోని ప్రేమను ఇతరులకు నేను మరింత సులువుగా ప్రకటించగలుగుతాను....
🌹.... మనలో చాలామందికి మన గురించిన కొన్ని మూర్ఖపు నమ్మకాలు ఉన్నాయి ....మరి "ఇలాగే జీవించాలి"! అని కొన్ని కటినమైన నిర్ణయాలు ఉన్నాయి....🌹
*ఇలా అనడం మీలో తప్పుల్ని ఎత్తిచూపడం లాంటిది కాదు... ఈ క్షణంలో మనమందరమూ మన శక్తి కొలదీ తగినట్లుగానే జీవిస్తున్నాము... మనకు ఇంకా ఎక్కువ జ్ఞానం, అవగాహన, ఎరుక ఉండి ఉంటే మనం ఇంకా ఉన్నతంగా జీవించి ఉండేవాళ్ళము కదా !!!దయచేసి మీరు ఇప్పుడు ఉన్న స్థితికి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి... నిజానికి ఈ పుస్తకం దరికి చేరిందంటేనే .... మీ జీవితంలో నూతన శుభ పరిణామాలను ఆహ్వానించడానికి, మీరు సిద్ధంగా ఉన్నట్లే లెక్క ......
*" మగవారు ఎప్పుడూ ఏడవరు" "స్త్రీలు డబ్బుకు సంబంధించిన విషయాలను సక్రమంగా నిర్వర్తించలేరు "ఇటువంటి నమ్మకాలను నిజం అనుకోవడం ఎంత అజ్ఞానమో కదా!!! ఆలోచించండి....
🌹.... మనం చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు, జీవితం పట్ల ఎలా స్పందించే వారో, ప్రవర్తించేవారో గమనించి మనము కూడా అలా స్పందించాలని, ప్రవర్తించాలని నేర్చుకున్నాము....🌹
*అలాగే మన గురించి ,మన జీవితం గురించి ఏమీ ఆలోచించాలో నేర్చుకున్నాము... భయాలు, బాధలు కోపాలు, అపరాధ భావనలు, ఉన్నవారి మధ్య మీరు జీవించి ఉంటే, తప్పకుండా చాలా అజ్ఞానాన్ని మీరు మీ గురించి, మీ ప్రపంచం గురించి మీ మనసులో నేర్చుకొని ఉంటారు......
#"ఏదీ నేను సరిగా చేయను"
# "తప్పంతా నాదే "
# "నాకే గనుక కోపం వస్తే , నేను మనిషిని కాను" ఇలాంటి భావాలు చాలా నిరాశ పూరితమైన జీవితాన్నే సృష్టిస్తాయి....
మనము తిరిగి పెద్దయ్యాక మా చిన్ననాటి భావన పరిస్థితులను తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది ఇక్కడ మంచి చెడులను మరి తప్పు ఒప్పుల ప్రసక్తి లేదు నా అంతరంగంలో ఒక కుటుంబం అంటే అది మనకు తెలిసింది నీతో మీ తల్లి ఎలా ప్రవర్తించేది లేదా మీ తండ్రి మీతో ఎలా ప్రవర్తించేవాడు లేదా వారిద్దరూ ఒకరితో ఒకరు పరస్పరం ఎలా ఉండేవారు ఇలాంటి కొన్ని వ్యక్తిగత సంబంధాన్ని మనం ఉంటుంది లేదా మీ బాస్ గాని మీ తల్లిలాగోలేదా మీ తండ్రి లాగా ఉన్నారేమో జాగ్రత్తగా పరిశీలించి చూడండి మన తల్లిదండ్రులు మనల్ని ఎలా చూసుకునేవారో అలాగే మనల్ని మనం చూసుకుంటాము మనల్ని మనము అదేవిధంగా చేస్తాము మీరు జాగ్రత్తగా వినగలిగితే అవే మాటల్ని ఇప్పుడు కూడా మీ మనసులో వినగలుగుతారు అలాగే బాల్యంలో మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించే ప్రోత్సహించి ఉంటే అని కూడా మనల్ని అలాగే ప్రేమించుకుంటాము మరి ప్రోత్సహించుకుంటాము
*" ఒకటైన సక్రమంగా చేశావా నువ్వు"? "తప్పంతా నీదే "? ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు తిట్టుకొన్నారో
గమనించండి ....
*నువ్వు చాలా బాగా చేశావు ..నువ్వంటే నాకు ఇష్టం... ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రోత్సహించికున్నారో గమనించండి....
🌹.... ఎదేలా ఉన్నా,ఈ పరిస్థితికి నేను తల్లిదండ్రులను నిందించను...🌹
*మనమంతా బలికాబడ్డ వారి చేత బలి కాబడ్డ బలి పశువులం.... వాళ్లకు తెలియని విషయాల్ని, వాళ్ళు మనకు ఎలా నేర్పగలరు చెప్పండి !!!మీ తల్లి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు, మీ తండ్రి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు, వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎలాగో నేర్పించడం అసంభవం.. వారి బాల్యంలో వారేమీ నేర్చుకున్నారో, అదే మీకు నేర్పించారు... మీకు వారి గురించి తెలుసుకోవాలనిపిస్తే వారి బాల్యం గురించి ప్రశ్నించి తెలుసుకోండి... మీరు ఓపిగ్గా వినగలిగితే వారిలోని భయాలు, మూడవిశ్వాసాలు, వారికి ఎలా ఏర్పడ్డాయో మీరు తెలుసుకోగలరు.... అవన్నీ వారు వారి బాల్యంలో అనుభవించిన భయబ్రాంతులే సుమా!!!
🌹...మన తల్లిదండ్రులను మనమే " ఎంపిక "చేసుకొని జన్మ తీసుకుంటాము...🌹
* మనమందరము ఒక నిర్ణీత కాలంలో, నిర్నిత ప్రదేశంలో ఈ భూతలంపై భౌతిక శరీర ధారణ చేయడానికి విచ్చేస్తాము.... ఆధ్యాత్మిక పథములో మన చైతన్య విస్తరణకు ఒక నిర్ణీత పాఠాన్ని లేదా పాఠాల్ని నేర్చుకోవడానికి మనం ఈ భూతలానికి రావడానికి" ఎంపిక " చేసుకుంటాము ...మన లింగాన్ని, మన రంగుని మన దేశాన్ని ,ఎంపిక చేసుకుని ఈ ప్రస్తుత జీవిత కాలంలో మనం నేర్చుకొనుబోయే జీవిత పాఠాలకు అనుకూల పరిస్థితులను సమకూర్చగలిగే తల్లిదండ్రులను కూడా మనమే "ఎంపిక" చేసుకుంటాము.... తర్వాత పెరిగి పెద్దయ్యాక, మన జీవిత పరిస్థితులకు, మన సమస్యలకు, మన చేతి వేలుని వారి వైపు చూపిస్తూ....."అంతా మీ వల్లే "అని మన తల్లిదండ్రులను నిందిస్తాము.... నిజానికి మనము అధిగమించడానికి ఎంపిక చేసుకున్న జీవిత సవాళ్లకు ,పాఠాలకు ,మన తల్లిదండ్రులే మనకు తగిన వారు.....
* చిన్నతనంలో మనము జీవితం పట్ల కొన్ని నమ్మకాలను ఏర్పరచుకొని, వాటికి అనుగుణంగా మన జీవన పరిస్థితులను సృష్టించుకుంటాము... ఎన్నిసార్లు మీరు ఒకే రకమైన అనుభవాన్ని లేదా సమస్యల్ని మళ్లీ మళ్లీ సృష్టించుకోలేదు? ఆలోచించండి...! ఒకసారి జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ విషయం మీకే తెలుస్తుంది...అలా జరగడానికి కారణం మీ అంతరంగంలో మీకు మీ గురించి అటువంటి నమ్మకాలే ఉన్నాయి కాబట్టి.... ఇక్కడ ఆ సమస్యలు ఎంత కాలం పాటు మనల్ని వేధించాయి లేదా అవి ఎంత పెద్ద సమస్యలు లేదా ఆ సమస్యలు మనల్ని మన జీవితాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురిచే అన్నది ముఖ్యం కాదు ....ఆ నమ్మకాలు మనలో ఉన్నాయా లేదా? అన్నదే ముఖ్యం ....ఆ నమ్మకాన్ని మన అంతరంగంలోంచి తొలగించి వేస్తే ఆ పరిస్థితులు ,ఆ సమస్యలు ఇక తలెత్తవు.....
🌹.... మన శక్తి ఎల్లప్పుడూ ప్రత్యక్షణం లోనే కేంద్రీకరింపబడి ఉంటుంది ....🌹
*ఇంతకాలం మీరు మీ జీవితంలో అనుభవించిన పరిస్థితులన్నీ ,మీకు మీ గతంలో ఉన్న ఆలోచనల వలన, మరి నమ్మకాల వలన, సృష్టించబడినవే !ఇవన్నీ మీ గతంలో మీరు చేసిన ఆలోచనలు... మరియు మీరు పలికిన పలుకులలోంచి, ఉత్పన్నమైనవే... అవన్నీ మీరే నిన్న, పోయిన వారం ,పోయిన నెల, పోయిన సంవత్సరము ,ఇంకా అంతకుముందు ,10, 20 ,30 ,40 ,సంవత్సరాల ముందు మీ వయస్సుని బట్టి ఆలోచించినవే... మరి పలికినవే ....ఏది ఏమైనా అది అంతా గతము ...అది అయిపోయింది.... జరిగిపోయింది ...ఇకపై క్షణంలో మీరు ఏ ఆలోచనలను, నమ్మకాలను "ఎంపిక" చేసుకుంటారో ఎటువంటి పలుకులు పలుకుతారో, అన్నదే ప్రధానము... ఎందుకంటే ఈ ఆలోచనలే ,ఆ నమ్మకాలే, ఈ మాటలే ఇకపై మీ భవిష్యత్తుని సృష్టిస్తాయి ....మీ శక్తి ఎల్లప్పుడూ ఈ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి, రేపటిని వచ్చే వారాన్ని, వచ్చే నెలనీ, వచ్చే సంవత్సరాన్ని, ఆపై మీ జీవితాన్ని సృష్టిస్తున్నది ....
*ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఆలోచిస్తున్న ఆలోచనలను సునిశితంగా గమనించాలి..... అవి "నెగటివ్" పరిస్థితులను సృష్టిస్తాయా? లేక "పాజిటివ్ "పరిస్థితులను సృష్టిస్తాయా? అని పరిశీలించాలి... మీరు ఇప్పుడు చేస్తున్న ప్రస్తుత ఆలోచన మీ భవిష్యత్తును సృష్టించాలా వద్దా ?అని మీకు మీరు నిర్ణయించు కోవాలి... మీరు ఎప్పుడూ, మీ ప్రస్తుతపు ఆలోచనల పట్ల "ఎరుక"తో ఉండాలి ...కావాలంటే ఇప్పుడే మీ బుర్రలో మొదలుకుతున్న ఆలోచనలను పరిశీలించండి......
Part____1(b)
🌹 ఇప్పుడు మనం పట్టించుకోవాల్సినది మనం ఏర్పరచుకున్న మన ఆలోచనలే...ఈ ఆలోచనలను మనము మార్చుకోవచ్చును🌹
*బహిర్ ప్రపంచంలో మన సమస్య ఏదైనా ,మన పరిస్థితి ఏదైనా అది మన అంతర్ ప్రపంచపు ఆలోచనలోంచి జనించినదే....మన అంతరంగాన్ని మనం మార్చుకోగలిగితే బహిర్ ప్రపంచంలో మనకు కావాల్సిన మార్పుకు తీసుకురావచ్చు....
*మన పట్ల మనకున్న" ద్వేషం,"కూడా నువ్విలా ఉన్నావు,నువ్వలా చేశావు, నువ్వంటే నాకు అసహ్యం, లాంటి ఆలోచనలే!!! నేను చాలా చెడ్డవాడిని,అన్న ఆలోచనే మీలో లేకుంటే మీరు చెడ్డవాడివని అసలు మీరు భావించరు.... ఇలా ఆలోచనలే మనలో భావాన్ని సృష్టిస్తాయి... ఏదేమైనా మీకు ఆలోచనే లేకుంటే మీకు ఆ భావనే ఉండదు కదా!!! మనకు ఇష్టం వచ్చిన విధంగా మన ఆలోచనలను మార్చుకొనవచ్చును... మొదట నీలోని ఆలోచనను మార్చుకుంటే, ఆలోచనల వల్ల జనించే భావన కచ్చితంగా మిమ్మల్ని వదిలి పెడుతుంది....
*ఈ వివరణ అంతా మనలో నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో తెలియజేయడానికి... అంతే తప్ప ,"మనకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి.. మన గతి ఇంతే! ఈ బాధల్లోనే మనం ఊరుకో పోవాలి ..."అని మాత్రం కాదు ...గతం గతః భూతకాలం మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు... ఎప్పుడు కూడాను మన శక్తి అంతా ప్రస్తుతక్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది... ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎరుకలోకి తీసుకోవడము ఎంత అద్భుతమో కదా!!! ఇక నిశ్చితంగా మనమీ ప్రస్తుత క్షణంలో పూర్తిగా స్వతంత్రులై పోవచ్చు....
🌹....మీరు నమ్మినా నమ్మకపోయినా, మన ఆలోచనలన్నీ మనమే ఎంపిక చేసుకొన్నాము... అన్నది సత్యము.....🌹
* ఒకే ఆలోచనని పదే పదే, ఆలోచించి ఆలోచించి, అలా ఆలోచించడము మనకు ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది... అందువలన అది మనము ఎంపిక చేసుకున్న ఆలోచనగా మనకు అనిపించదు.... కానీ ఆ ఆలోచనను మొట్టమొదట ఎంపిక చేసుకుని మొదలుపెట్టింది మనమే....!!!
కొన్ని విధాలుగా ఆలోచించడానికి మనకు మనమే ఒప్పుకోము మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడానికి ఎన్నిసార్లు మీరే ఒప్పుకోలేదు గమనించండి అలాగే ఇప్పుడు మీ గురించి మీరు నీటుగా ఆలోచించడానికి కూడా నిరాకరించవచ్చును ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనను తాను ద్వేషించుకోవడం తోను తనలో ఏదో తప్పు ఉన్నదన్న భావంతోనూ బాధపడుతుంటారు ఈ విషయాన్ని నా కంప్లైంట్స్ లోను మరి నాకు తెలిసిన వాళ్ళందరిలోనూ గమనించాను ఈ భావనల తీవ్రతల్లో తేడా ఉండవచ్చును అది వేరే విషయం ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంతా ప్రతికూలంగా ఉంటుంది మరి భావనలు ఎంత తక్కువగా ఉంటే వారి జీవితము అనుకూలంగా ఉంటుంది
🌹 నన్ను సంప్రదించిన వారి అందరిలోనూ వారి అంతరంగంలో నేను బాగాలేను అన్న అసలు తృప్తి ఉంది 🌹
*నేను అనుకున్నవి చేస్తానో, లేదో?
* నేను కోరుకున్నది పొందుతానో లేదో ?*నాకు అర్హత లేదు....
ఇలాంటి నమ్మకాలు మీలోనూ ఉన్నాయేమో కాస్త వేతకండి ...మీరు బాగా లేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకుని ఉంటారు? ఏ పరిణామాలతో పోల్చుకొని మీరు అలా అనుకున్నారు ...లేదా ఎవరి ఆదర్శాల కొరకు, ఆశయాల కొరకు మీరు ఎలా అనుకున్నారు....
* ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకుపోయి ఉంటే మీరు ఎలా ఒక ప్రేమపూరితమైన , ఆనందమయమైన సిరిసంపదలతో కూడిన, ఆరోగ్య దాయకమైన, జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు... ఒకవేళ సృష్టించుకోవాలి అనుకున్న, మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఇదివరకే పాతుకుపోయిన మీ సొంత ఆలోచనలు, అమ్మకాలే మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి.... అందువలన నీ జీవితంలోకి పైవన్నీ రాకుండా ఏదో ఒక తప్పిదము ప్రతిసారి జరుగుతూ ఉంటుంది....
🌹 క్రోధము, మనల్ని మనం ఒప్పుకొనక పోవడం, తప్పు చేశాము అన్న భావన మరియు భయం లాంటి ఆలోచనా విధానం మన జీవితాల్లో సర్వ సమస్యలకు కారణభూతాలు...🌹
*పై భావాలే మన శరీరాల్లో, మన జీవితాల్లో ప్రధాన సమస్యల్ని సృష్టిస్తున్నాయి... మన జీవన పరిస్థితులకు, అనుభవాలకు మన బాధ్యతను గుర్తించకుండా ,ఇతరులను నిందిస్తూ పోవడం వల్ల కూడా ఈ భావాలు తలెత్తుతున్నాయి ... మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే! ఇంకెవరిని నిందించాలి??? ఏమని నిందించాలి??? బయట జరిగే సంఘటనలు, లోపలి ఆలోచనలకు ప్రతిరూపాలు... అలాగని ఇక్కడ నేను మీ పట్ల ఇతరుల యొక్క బాధ్యతారహితమైన ప్రవర్తనను సమర్పించడం లేదు... అటువంటి వ్యక్తుల్ని, అటువంటి ప్రవర్తనలను మనము ఆకర్షిస్తున్నామంటే, మనలో అటువంటి లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయని గుర్తించాలి....
* అందరూ నా పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు... ఆలోచించుతారు...
* నన్ను అవసరాలకు వాడుకుని వదిలేస్తారు...
* ప్రతిదానికి నన్నే నిందిస్తారు...
* నాకే ఎందుకిలా జరుగుతోంది....
*ఇలాంటివి మీరు నమ్ముతున్నట్లయితే, అవి మీ సొంత ఆలోచన విధానాలు... అలాంటి వ్యక్తులను ,ప్రవర్తనలను మీరు ఆకర్షిస్తున్నారంటే మీలో అలాంటి ఆలోచనలు ఏవో ఉండి తీరాలి... మీరు అలా ఆలోచించి, ఆ పరిస్థితుల్ని, ఆ ప్రవర్తనలను మీ వైపుకు ఆకర్షించకపోతే అవి వేరొకరికి ,వేరే ఎక్కడో ఆకర్షితమవుతాయి.... మీలో అటువంటి ఆలోచనలే ఉండకపోతే అటువంటి పరిస్థితులు మీ వైపు రానే రావు....
🌹శారీరక రోగాలు_మానసిక కారణాలు🌹
*ఎలా మన ఆలోచనా విధానాలు మన శరీరంలో అనారోగ్యాలతో సృష్టిస్తాయో కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాం.... చాలా కాలం నుండి క్రోతభావాలను, అణిచివేసుకుని మన మనసులో పర్చుకొని ఉంటే అది క్రమ క్రమంగా మన శరీరాన్ని దహించి వేసి" కాన్సర్" అని పిలవబడే రోగంగా పరిణమిస్తుంది... మనల్ని మనము ఒప్పుకొనకపోవడం వలన మనం మనలోనూ ఇతరులలోను తప్పులు వెతుకుతూ పోతాము... అది భవిష్యత్తులో "కీళ్ల నొప్పులుగా" తయారవుతుంది ...తప్పు చేశాము అన్న భావన, శిక్షనీ కోరుకుంటుంది... తీరమైన బాధని కలగజేస్తుంది... ఎవరైనా నా వద్దకు తీవ్రమైన బాధతో వస్తే, తప్పు చేశాము అన్న భావన వారిలో ఎంతగా పేరుకుపోయిందో గమనిస్తాను.... భయము మరి ఆందోళనలు మన శరీరాల్లో బట్టతల, కడుపులో పుండ్లు మరియు పాదాల్లో నొప్పులు మొదలైన వాటిని కలగజేస్తాయి....
*చాలా కాలంగా మనలో అణిచి పెట్టుకున్న క్రోధాన్ని వదిలి పెట్టేసి, మొదట మనల్ని క్షమించుకుని, తర్వాత తక్కిన వారందరిని క్షమించి వేస్తే, ఎంత సైతం" క్యాన్సరు" సైతం నయం అవుతుంది... ఇది నా స్వంత అనుభవంతో చెబుతున్నాను...
🌹..గతం పట్ల మన దృక్పథాన్ని మర్చుకొనవచ్చును...🌹
గతం అనేది అయిపోయింది,, జరిగిపోయింది....మనం ఇప్పుడు దాన్ని మార్చలేము ..కానీ గతం పట్ల మన ఆలోచనలను మాత్రం మార్చుకోవచ్చు...చాలా కాలం కిందట ఎవరో మనల్ని బాధపెట్టారని, ఈ క్షణంలో వాటిని తలచుకుని మనల్ని మనం శిక్షించుకోవడం, ఎంత మూర్ఖత్వం!!! ఒకసారి ఆలోచించి చూడండి ...
*ఎవరైనా ఎక్కువగా క్రోధ భావనతో బాధపడుతుంటే ,తక్షణమే ఆ భావాన్ని వదిలిపెట్టేయమని చెప్తాను... ఎందుకంటే మొదట్లోనే అది చాలా సులభం ...లేకపోతే అది ముదిరి ముదిరి వారిని మరణశయ్యపై అది పడుకోబెడుతుంది... అప్పుడు తీవ్ర భయాందోళనలకు గురి కావాల్సి వస్తుంది....
* మనం భయాందోళనలతో ఉన్నప్పుడు స్వస్థతపై దృష్టి పెట్టలేము.... మొదట మనలోనీ భయాలు అన్నింటిని వదిలించుకోవాలి.....
*ఆ భవిష్యత్తు బూడిదైపోయింది... నేను ఇక ఇలాగే నిస్సహాయంగా బలైపోవాల్సిందే!!! ఈ పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడల్సిందే ...అని నమ్మడానికి ఎంపిక చేసుకుంటే ,ఆ నమ్మకాన్ని ఈ విశ్వం సమర్థిస్తుంది ..... అటువంటి అప్పుడు మనం ఇంకా దిగజారిపోయి , అగాదలోకి కూరుకుంటున్నావాల్సిందే !!ఇటువంటి మూర్ఖపు చాదస్తపు నమ్మకాల్ని ,నెగిటివ్ భావాలను, తక్షణమే వదిలిపెట్టేయాలి.... అప్పుడే మన జీవితానికి స్వస్థత చేకూరుతుంది .....
*దైవత్వం అనబడేది కూడా మనకు అనుకూలంగానే ఉంటుందే తప్ప వ్యతిరేకంగా ఎప్పటికీ ఉండజాలదు....
🌹 మనము గతాన్ని వదిలిపెట్టేయాలంటే క్షమించడానికి సిద్ధంగా ఉండాలి...🌹
*మొదట మనల్ని మనం క్షమించుకుని తర్వాత అందరినీ క్షమించి వేసి గతాన్ని వదిల పెట్టేసేందుకు మనం నిర్ణయించుకోవాలి... ఎలా క్షమించాలో తెలియకపోయినా, క్షమించడానికి మీ మనసు అంగీకరించకపోయినా పర్వాలేదు... నేను క్షమించేయాలి !!!అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు... మనకు స్వస్థత చేకూరి ప్రక్రియ మొదలైపోతుంది ...మనకు స్వస్థత చేకూరడానికి గతాన్ని పూర్తిగా విసర్జించడం, మరి మనతో సహా అందరిని క్షమించేయడం, తప్పనిసరి ....
*నువ్వ నాకు అణగుణంగా ప్రవర్తించకపోయినా పరవాలేదు... నిన్ను నేను ప్రేమిస్తున్నాను.. మరి నిన్ను క్షమించడం వల్ల నేను స్వేచ్ఛ జీవినైపోతాను... అని గాఢంగా అనుకున్నా చాలు... మనము ఆ గతపు పరిస్థితులను నుండి విముక్తులైపోతాము....
🌹అన్ని అనారోగ్యాలు క్షమాగుణం లేకపోవడం వలన ఉత్పన్నం అవుతాయి...🌹
*మనము ఎప్పుడైనా, ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనం ఎవరినైనా క్షమించాలేమో నని మన హృదయాల్లో వెతకాలి... మనము ఎవరినైతే క్షమించడానికి చాలా కష్టపడుతున్నామో వారిని మొదట క్షమించేయాలి... మనలోంచి వారిని గురించి ఆలోచనలను పూర్తిగా వదిలి పెట్టేయాలి... క్షమించడం అంటే వారిని వదిలి పెట్టేయడం... పూర్తిగా వారి గురించి పట్టించుకోకపోవడం ...ఇక్కడ మీరు వారితో అంగీకరిస్తున్నారా ?లేదా నిరాకరిస్తున్నారా ?అన్నది కాదు ప్రశ్న ...ఇది కేవలం విషయాన్ని అంతటితో వదిలిపెట్టేసేయడం ...మనం చేయవలసిందల్లా క్షమించడానికి నిర్ణయించుకోవడమే... ఎలా క్షమించాలి అన్నది ఈ విశ్వమే చూసుకుంటుంది...
*మన బాధను అయితే మనం చక్కగా అర్థం చేసుకుంటాము... ఇతరులు కూడా మీ వలన బాధపడ్డారని అర్థం చేసుకోరేం....ఆ సమయం లో వారు వారికున్న జ్ఞానము, అవగాహన ఎరుకను బట్టి మనతో వారాల ప్రవర్తించారన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి... ఎవరైనా సమస్యతో
*ఎప్పుడైనా నన్ను సంప్రదిస్తే అనారోగ్యానికి సంబంధించినదైనా, సృజనాత్మకతా రాహిత్యమునకు సంబంధించినదైనా, నేను అసలు పట్టించుకోను... నేను పరిశీలించేది, మరి ప్రయోగించేది ఒకే ఒక్క మౌలిక.. ఆధ్యాత్మిక సత్యాన్ని అది "మనల్ని మనం ప్రేమించుకోవడo"
🌹మనల్ని మనం ప్రేమించుకుని, అంగీకరించుకొని మన పట్ల మనం మంచి భావనతో ఉంటే ,జీవితం మనకు అనుకూలిస్తుంది... జీవితపు అన్నీ క్షణాల్లోనూ అద్భుతాలు సంభవించడం ప్రారంభం అవుతాయి ...మన ఆరోగ్యము చక్కబడుతుంది ...మన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది... సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లభిస్తుంది ...మనల్ని మనం మరింత సృజనాత్మకతతో వ్యక్తపరచుకోగలుగుతాము... ఇవన్నీ మన ప్రయత్నం కూడా అవసరం లేకుండానే అవంతటావే జరిగిపోవడం కూడా గమనించగలుగుతాము....🌹
*మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరించడం, మన పట్ల మనం మంచి భావనతో ఉండడము ,మనల్ని మనం సంరక్షించుకోవడం ,సృష్టి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉండడము, అన్నిటికి మనము అర్హులమని భావించడం, మొదలైనవి మన మనసుని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుతాయి ...ఈ భావనలు మన జీవితాల్లో ప్రేమ మయమైన సంబంధాల్ని, కొత్త ఉద్యోగాన్ని ,చూపించడానికి ఉన్నతమైన ,నూతనమైన, ప్రదేశాన్ని .... ఇంకా మన శరీరపు బరువుని సహజం చేయడం లాంటి వాటిని కూడా సమకూర్చుతాయి... ఎవరైతే వారిని ప్రేమించుకుంటారో, వారు ఇతరులని దూషించారు ...
*మన పట్ల మనం మంచి భావంతో ఉండడము, మరి మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడం, అనే భావాలే ప్రస్తత క్షణములో మన జీవితాల్లో అన్నీ కోణాలలో శుభ ప్రదమైన మార్పులు సంభవించడానికి అవసరమైన, కీలక అంశాలు....
"నా దృష్టిలో మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది ,దేనికి గాని, ఎప్పుడు గాని మనలో మనం తప్పులు పెంచకపోవడంతో మొదలవుతుంది... ఈ తప్పులు ఎంచడం అనేది మనల్ని మార్పు చెందుటకు ప్రయత్నించడం వద్దే కట్టిపడేస్తుంది... మనల్ని మనం అర్థం చేసుకొని ,మనతో మనం సున్నితంగా వ్యవహరిస్తే చాలు... ఈ ఆత్మ నిందలోంచి బయటపడవచ్చు... మిత్రులారా !!ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు ఎత్తి పొడుచుకుంటూ , గ డుపుతున్నారు ...అది మీకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు... ఇప్పుడు మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడానికి ప్రయత్నించి చూడండి ఏమవుతుందో.....
🌹ధన్యవాదములు 🌹
నా ఫిలాసఫీ part ___2(a)
🌹నా శరీరం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది...🌹
🌹 నా శరీరం గాయపడుతుంది.. రక్తము స్రవిస్తుంది... నొప్పిస్తుంది....ఉబ్బుతుంది.. మడదబడుతుంది... కాలుతుంది పుండ్లపాలు అవుతుంది... ముడతలు పడుతుంది... వయసు అయిపోతోంది... సరిగ్గా నడవలేదు... చూడలేదు.. వినలేదు... ఎన్నో రోగాలు మారిన పడుచుంది... ఇలా ఎన్నో మీరు మీ శరీరాల్లో సృష్టించుకుని ఉండవచ్చు ...వీటన్నిటిని నేను విని ఉన్నాను
🌻 ఇతరులతో నా సంబంధిత బాంధవ్యాలు సరిగ్గా ఉండవు....
🌹 అందరూ నా భావాలను వ్యక్తపరిచ నివ్వకుండా నన్ను అణచి వేస్తున్నారు....
🌹నాకు ఎవరూ లేరు...
🌹 నాతో బెట్టు చేసినట్లు ప్రవర్తిస్తారు....
🌹 నన్ను ఎవరు సమర్థించరు....
🌹 నన్ను ఎప్పుడు ఎగతాళి చేస్తారు
🌹 నా దారిన నన్ను వదలరు...
🌹ప్రతిదానికి నన్నే ఎత్తి పొడుస్తారు...
🌹 నన్ను ఎవరు ప్రేమించరు...
🌹 నేను చెప్పేది మాత్రం ఎవరూ వినిపించుకోరు...
🌹 నేను ఒంటరి వాడిని/ దానను....
🌹 నన్ను అందరూ అవమానిస్తారు ...
🌹వాళ్లు మానసికంగా నెగ్గెందుకు నన్ను ఓడిస్తారు ....ఇంకా ఇలాంటి ఎన్నో రకాల సంబంధాల్ని మీరు మీ జీవితంలో సృష్టించుకుని ఉండవచ్చు ....
వీటిని నేను విని ఉన్నాను
🌻 నా ఆర్థిక పరిస్థితి బాగుండదు.
🌹 నా దగ్గర డబ్బు అసలు ఎప్పుడూ నిలవదు ....
🌹అప్పుడప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుంది
🌹 సమయానికి చేతిలో డబ్బు ఉండదు....
🌹 డబ్బు వచ్చినంత వేగంగా నా నుంచి వెళ్ళిపోతుంది....
🌹 నా ఖర్చులకు అస్సలు సరిపోదు....
🌹 అప్పుడప్పుడు నేను డబ్బు పోగొట్టుకుంటాను ....
ఇంకా ఇలాంటి వాటిని కూడా నేను విని ఉన్నాను.....
🌻 నా జీవితం ఏం బాగాలేదు....
🌹 నేను చేయాలనుకున్నవి అసలు చేయలేకపోతున్నాను ...
🌹నేను ఎవరిని మెప్పించలేను
🌹నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు
🌹నా టైం ఎప్పుడూ బాగుండదు...
🌹నా ఆశలు అవసరాలు ఎప్పటికీ తీరేది???
🌹 నేను చేసేవన్నీ ఇతరుల కోసమేనా???
🌹 నన్ను అందరూ అవసరాలకు వాడుకొని వదిలేస్తారు ....
🌹నేనేం చేయాలో ఎవరికీ అవసరం లేదు....
🌹 నాలో ఏ టాలెంట్లు లేవు ...
🌹నేను ఏది సక్రమంగా చెయ్యను
🌹 నేను అన్ని పనులు వాయిదా వేస్తుంటాను
🌹 నాకు ఏది అనుకూలించదు....
🌹 ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎన్నో మీ జీవితంలో మీరు సృష్టించుకుని ఉండవచ్చు....
ఇవి నేను విని ఉన్నాను....
నా వద్దకు ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే వారి జీవితం ఎలా ఉందని నేను ప్రశ్నించినప్పుడు ,వారు ఇచ్చ సమాధానాలలో పై వాటిలో ఏదో ఒక దాన్ని లేదా కొన్నింటిని బదులిస్తారు... వారికి వారి సమస్య తెలిసి అనుకుంటారు... కానీ ఈ సమస్యలన్నీ వారి అంతర్ ఆలోచన విధానాల వల్ల ఏర్పడిన, బహిర్ ప్రభావాలని నాకు తెలుసు.... ఇంకా లోతుగా ఆలోచిస్తే అంతర్ ఆలోచన విధానాల అట్టడుగునా మరో ఆలోచన విధానం ఒకటి ఈ బహిర్ ప్రభావాలన్నింటికీ మూలహేతువుగా ఉంది.... అదేమిటో ఇప్పుడు పరిశీలిద్దాము ....
🌻నేను మొదటగా నా క్లైంట్స్ ని ఈ క్రింది ప్రశ్నలను అడిగి మారిచ్చే సమాధానాలలో వారు వాడుతున్న పదజాలాన్ని పరిశీలిస్తాను
🌹మీ జీవితంలో ఏమి జరుగుతోంది
🌹మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
🌹మీరు మీ జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తారు
🌹మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
🌹మీ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? 🌹చివరగా మీ సంబంధము ఎలా అంతమయింది ....?
🌹అంతకు ముందటి సంబంధము ఎలా అంతమైంది....?
🌹మీ బాల్యం గురించి కాస్త చెబుతారా?
🌹వారు సమాధానాలు చెప్పే సమయంలో వారి శారీరక కదలికలని మరి ముఖ కవళికల్ని గమనిస్తాను... కానీ ఎక్కువగా వారు ఉపయోగిస్తున్న పదజాలాన్ని శ్రద్ధగా వింటాను ...ఎందుకంటే ఆలోచనలు, మాటలే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి.... అలా వినడం వలన ప్రస్తుతం వారా సమస్యతో ఎందుకున్నారో అర్థమవుతుంది.... కొన్నిసార్లు వారు వాడే పదాలకు వారి సమస్యలకు అస్సలు కొంతనే ఉండదు.... అప్పుడు వారికి వారు సమస్య గురించి తెలియదని లేదా వారు నిజం చెప్పడం లేదని అర్థమవుతుంది.... ఈ విధంగా ఏదో ఒక విషయం తేలిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కడినుంచి ప్రారంభించాలోనని నాకు ఆధారాలు దొరుకుతాయి.....
🌹తర్వాత వారి చేతికి ఒక పెన్ను ,పేపరు, ప్యాడ్ ఇచ్చి, ఆ పేపర్ పై భాగంలో క్రింది విధంగా రాయమంటాను.....
నేను "ఖచ్చితంగా"...చేయాలి...
1_________________
1_________________
3_________________
4_________________
5_________________
6_________________
🌹 పై విధంగా వారు కచ్చితంగా చేసే తీరాల్సిన విషయాలలో ఐదు లేక ఆరు వాక్యాల,ను ఆ పేపరుపై రాయమంటాను... కొంతమంది ప్రారంభించడానికి కష్టపడతారు.... మరికొందరు ఆపమున్న ఆపరు ...రాస్తూనే పోతారు ....
🌹తర్వాత వారు రాసిన ప్రతి వాక్యాన్ని చదవమంటాను ..."కచ్చితంగా" ఇలానే ఎందుకు చేయాలి !అని వారు చదివిన ప్రతి వాక్యాన్ని ప్రశ్నిస్తాను.... వారిచ్చే సమాధానాలు చాలా ఆసక్తిగా, వారిని గురించి తెలియజేసే లాగా ఉంటాయి.....
🌹మా అమ్మ చెప్పింది కాబట్టి!!!
🌹అమ్మో అలా చేయకపోతే ఎలా ..?నాకు భయం తల్లీ!!!
🌹ఎందుకంటే నేను చాలా పద్ధతి గల వ్యక్తిని...
🌹 బాగుందే అందరూ అలానే చేస్తారు కదా!!!
🌹 ఇంకా నేను చాలా సోమరి ,చాలా పొట్టి, చాలా పొడవు, చాలా లావు, చాలా బక్క, చాలా నత్తి, నేను అంత అందంగా ఉండను... నాకా భాగ్యం లేదు.... అంటూ కొనసాగుతాయి వారి సమాధానాలు ....
🌹వారు ఏ నమ్మకాల్లో అతుక్కుపోయారు మరి ఏ ఆలోచన విధానాలలో తమని తాము పరిమితం చేసుకున్నారో, పై సమాధానాల వల్ల నాకు అవగతం అవుతుంది....
🌹వారు చెప్పిన సమాధానాలకు నేనెటువంటి వాక్యాలు చేయను.... కచ్చితంగా అనే విషయం గురించే నేను మాట్లాడుతాను.....
🌹 మిత్రులారా ఈ ఖచ్చితంగా అనే పదము ఒకానొక వినాశకారి అయిన పదము దీన్ని మన భాషలోంచి తొలగించాలి ఖచ్చితంగా అలాగే చేయాలి అని మనం చెబుతున్న ప్రతిసారి అలా చేయకపోతే తప్పు అనే అర్థం స్ఫూర్తిస్తుంది అలా చెప్పినప్పుడు మనం తప్పన్న చేసుండాలి లేదా తప్పు చేస్తూ ఉండాలి లేదా తప్పు చేయబోతూ ఉండాలి అని అర్థం వస్తుంది జీవితంలో అన్ని తప్పులు అవసరం లేదు అనుకుంటాను మనం చేయాల్సిన పనులను ఎంపిక చేసుకోవడానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. కచ్చితంగా ఇలానే చేయాలి అనే పదజాలాన్ని మన పరిభాషలోంచి తొలగించి దాన్ని స్థానంలో ఇలా చేయాలనిపిస్తే చేయొచ్చు అనే పదాన్ని ఉపయోగించాలి అటువంటి అప్పుడు మనం చేసేది ఎప్పటికీ తప్పు కదు మరి ఏమి చేయాలో ఎంపిక చేసుకోవడానికి మనం పూర్తి స్వేచ్ఛ ఉంటుంది
🌹తరువాత వారు ఇంతకుముందు రాసిన వ్యాఖ్యాన్ని నాకు నిజంగా చేయాలనిపిస్తే చేయొచ్చు అని అర్థాన్ని ఇచ్చే విధంగా చదవమంటాను ఇది వారి సమస్యలపై ఒక సరి కొత్త దృక్పథాన్ని చూపిస్తుంది
🌹వారెలా చదివిన ప్రతి వ్యాఖ్యానికి మరి ఎందుకు చేయలేదు అని సున్నితంగా ప్రశ్నిస్తాను ఈసారి వారిచ్చే సమాధానాలు చాలా భిన్నంగా క్రింది విధంగా ఉంటాయి. ....
🌹నాకు చేయడం ఇష్టం లేదు ....
🌹చేయాలంటే నాకు భయం
🌹ఎలా చేయాలో తెలియదు....
🌹 అలా చేయడానికి నేను అర్హుడినా ...???
🌹వారు రాసిన మొట్టమొదటి వాక్యము వారినీ ఇన్నాళ్లుగా వేధిస్తున్న అతి పెద్ద సమస్య అయి ఉంటుంది.... వారికి ఇష్టము లేకపోయినా ఆ పనిని వారు చేస్తున్నందుకు వారిని వారు కొన్ని సంవత్సరాలుగా కోపంతో తిట్టుకుంటూ, ఉండి ఉంటారు.... అలా చేయడం అసలు వారి ఊహే కానందుకు ,ఇన్నాళ్లు వారిని వారే ఒప్పుకొనకుండా ఉండి ఉంటారు.... లేదా ఇతరులు ఎవరైనా వారు ఆ పనిని చేసే తీరాలని నిర్బంధించి ఉంటారు ....వారు ఈ విషయాన్ని గ్రహించి ఆ అంశాన్ని వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన లిస్టులోంచి తొలగించుకుంటారు..... వారికిది ఎంత గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందో తెలుసా......?
🌻కొంతమందిని చూస్తే వారికి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని వృత్తుల్లో సంవత్సరాల పాటు ఎవరో నిర్బంధించినట్లు బలవంతంగా కొనసాగుతూ ఉంటారు..... ఎందుకంటే వారి తల్లిదండ్రులు వారిని డాక్టర్ కావాలనో, లేదా ఇంజనీరు కావాలనో, లేదా ఇటువంటిదే ఇంకేదో కావాలనో నిర్ణయించి ఉంటారు.... మన బంధువులతోనో లేదా చుట్టుపక్కల వారితోను మనల్ని పోల్చి వారు మన కన్నా తెలివైన వారనో ,లేక ధన వంతులనో, మన పెద్దలు మనతో చెప్పినప్పుడు ,మనం ఎన్నిసార్లు మనల్ని మనం తక్కువగా భావించుకున్నాము గుర్తుకు తెచ్చుకోండి!!!
🌻కచ్చితంగా మీరు చేసే తీరాలి అని మిమ్మల్ని మీరు ఇబ్బంది చేయకుండా నిర్ణయాలను లేదా ఇతరులచే మీపై మోపబడిన నిర్ణయాలను తక్షణమే వదిలి పెట్టేసి ,హాయిగా స్వతంత్రులై పోండి!... ఇంకా ఇలాంటివి మీలో ఎన్ని ఉన్నాయో వెతికి మరీ వదిలిపెట్టండి ....
🌻ఈ విధంగా లిస్టులోని విషయాలను ఒక్కొక్కటిని పరిశీలించిన తర్వాత, వారు వారి జీవితాన్ని ఓసారి కొత్త కోణంలో దర్శిస్తారు ....వారు చేసే తీరాల్సిన విషయాలు వారి కసలు ఇష్టమే లేనివని లేదా ఇతరులను నొప్పించకుండా ఉండడానికో, లేదా , మెప్పించడానికో వారా పనులు చేస్తున్నట్లు గ్రహిస్తారు ....ఇలా ఎన్నోసార్లు భయపడో లేదా వారికి ఇష్టం వచ్చిన విధంగా చేయడానికి వారు అనర్హులని భావించే వారికి ఇష్టం లేకపోయినా మునుపటి నిర్ణయాలతోనే కొనసాగి ఉంటారు.....
🌻ఇప్పుడు సమస్య ఓ కొత్త మలుపు తిరిగింది ....వారు ఇతరుల ప్రమాణాలను అందుకోలేనందుకు వారిని వారు తప్పు చేస్తున్నట్లుగా భావింపజేసే ఆలోచనల్ని వదిలించే ప్రక్రియనే నేనిప్పుడు ప్రారంభించాను .....
🌻తరువాత వారికి జీవితం పట్ల నా ఫిలాసఫీ నీ వివరిస్తాను.., నిజానికి జీవించడం చాలా సులభము.... మనము వేటినైతే బయటికి పంపుతామో, తిరిగి వాటినే పొందుతాము ....మనము ఆలోచించడానికి ఎంపిక చేసుకుని ప్రతి ఆలోచనని, ప్రతి నమ్మకాన్ని ఈ విశ్వం సమర్పిస్తుంది.... మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు మన పెద్దలు జీవితం పట్ల ,ఎలా స్పందించేవారో చూసి మన పట్ల, మన జీవితం పట్ల ,మనము అలాగే ప్రవర్తించాలని నేర్చుకున్నాము ....ఈ నమ్మకాలు ఎటువంటివైనా, అవే మనము తిరిగి పెద్దయ్యాక మన జీవిత అనుభవాలుగా మారుతాయి... ఏది ఏమైనా ఇప్పుడు పట్టించుకుంటున్నది ఆలోచనా విధానాలనే...
🌻 మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది ....మార్పులు సంభవించడం అన్నది ప్రస్తుత క్షణము నుంచే ప్రారంభం అవుతుంది....
🌻 ధన్యవాదములు 🌻
నా ఫిలాసఫీ పార్ట్__3(b)
🌻మనల్ని మనము ప్రేమించుకోవడం
🌹 సమస్య ఏదైనా, నేనెప్పుడైనా, ఎవరితోనైనా ,ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని... అది "మనల్ని మనం ప్రేమించుకోవడం"... ప్రేమ అనేది అద్భుతమైన ఔషధము ....మనల్ని మనం ప్రేమించుకోవడం మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది.... మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే.... మనం సాధించిన అభివృద్ధికి లేదా, విజయాలకు గర్వపడడమో,లేక అహంభావంతో ఉండడమో, లేక మీరు ఉన్న స్థితితో పోల్చుకొని ఇతరులను తక్కువ చూడడమో, కాదు ....ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు....
🌹 ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది, మనపై మనకు ఉండాల్సిన ఒక గొప్ప గౌరవ భావాన్ని, మరి మన శరీరాల్లో నిరంతరము సంభవం అవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల ,మన మనసు యొక్క మహత్తరమైన శక్తి పట్ల, మనకు ఉండాల్సిన కృతజ్ఞతా భావం గురించి.....
🌹ఇక్కడ" ప్రేమ "అంటే మనల్ని మనం మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకోవడం ....ప్రేమ అనేది జీవితపు ఏ కోణంలోనైనా ప్రవహించవచ్చు.....
🌹 నేను ప్రేమను కిందివిధాలుగా ప్రకటిస్తాను.....
🌹జీవితం సాగే తీరు తెన్నుల పట్ల...
🌹అసలు నేను జీవించి ఉన్నందుకు....
🌹నేను చూసే సౌందర్యము పట్ల ...
🌹ఇతర వ్యక్తుల పట్ల
🌹జ్ఞానం పట్ల,
🌹మనసు యొక్క పనితీరు పట్ల,
🌹మన శరీరాల పట్ల మరి వాటి పనితీరు పట్ల
🌹జంతుజాలం పట్ల,పక్షుల పట్ల,చేపల పట్ల....
🌹చుట్టూ ఉండే పచ్చదనం పట్ల,
🌹ఈ సృష్టి పట్ల
🌹మన సృష్టి యొక్క అద్భుత వ్యక్తి కరణ పట్ల,
నేను ప్రేమను ప్రకటిస్తాను.....
🌹 పై వాటికి మీరు ఇంకా ఎన్ని చేర్చగలరో చూడండి.....
🌹ఇప్పుడు మనము ఎన్ని విధాలుగా మనల్ని మనం ప్రేమించుకోము చూద్దాం....
🌹 మనల్ని మనం విడవకుండా నిరంతరం తిట్టుకుంటూ పోతాము....
🌹 మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ,ఆల్కహాల్ లాంటి వాటిని సేవించడం వల్ల ,మరి డ్రగ్స్ తీసుకోవడం ద్వారా, మన శరీరాన్ని పాడు చేసుకుంటాము.....
🌹మనం ప్రేమించబడము అని నమ్మడానికే ఎంపిక చేసుకుంటాము....
🌹మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడుతాము....
🌹మనల్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయాల్ని వాయిదా వేస్తాము....
🌹మనం పూర్తిగా విస్మయంతో అస్తవ్యస్తంగా జీవిస్తాము....
🌹అప్పుల్ని ,ఒత్తిడి లని నెత్తినేసుకుంటాము....
🌹మనకే మాత్రము విలువనివ్వకుండా, కొట్టి పారేసే వారిని ,మనం ప్రేమికులుగా, భాగస్వాములుగా ఆకర్షిస్తాము.....
....ఇలాగే మీరెన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోరు ఆలోచించండి
🌻మనము ఏవిధంగానైనా మనం మంచినీ నిరాకరిస్తే ,అది కూడా మనల్ని మనం ప్రేమించుకొనకపోవడమే అవుతుంది....
🌹 నా క్లైంట్ ఒకామేకు కళ్ళజోడుండేవి... ఒక రోజు కౌన్సిలింగ్లో ఆమె తన చిన్నతనంలో ఏర్పరుచుకున్న పాత భయాన్ని తొలగించేశాను... మురుసటి రోజు పొద్దున్న ఆమె నిద్ర లేవగానే ఆమెకు కళ్ళజోడు ఇబ్బందిగా అనిపించి, వాటిని తీసివేసింది.... ఆమె చుట్టూ పరికించి చూసింది ...ఆమెకు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తించింది... కానీ ఆమె ఆ రోజంతా నేను ఇది నమ్మలేను ...అని అంటూనే ఉంది ....తర్వాత రోజుకే ఆమెకు మళ్ళీ కళ్ళజోడు అవసరం వచ్చి పడింది.... మన సబ్కాన్షియస్ మైండ్ మనతో ఎటువంటి విధంగాను పరిహాసాలాడదు... మనము ఏది నమ్మితే దాన్ని అలాగే సంభవింప చేస్తుంది... ఆమెకు ఇక కళ్ళజోడు అవసరం లేదని, ఆమెకు అన్ని స్పష్టంగా కనిపిస్తాయి ...అన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది....
🌻మనల్ని మనం అనర్హులుగా భావించడము, కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడం అనే దానికి ఇంకొక రూపము .....
🌹టామ్ అనే ఒక మంచి చిత్రకారుడు ఉండేవాడు... అతడికి చాలా ధనవంతులైన కస్టమర్స్ ఉండేవారు... అతను వారి ఇళ్లల్లో గోడలపై చిత్రాలు గీస్తుండేవాడు.. కానీ, అతనికి తన ఖర్చులకు కూడా చాలినంత డబ్బులు ఉండేవి కాదు... ఇచ్చిన సమయంలో అతడు చిత్రాన్ని వేయలేకపోయేవాడు... ఇదంతా 'సంపాదించడానికి నేను అనర్హుడను' అని అతడు భావించడం లోంచే సంభవించింది..... ఎవరైనా ఏదైనా వస్తువుని తయారుచేసిన, లేదా ఎటువంటి సేవలు చేసిన దానికి ఎంతైనా రేటును నిర్ణయించవచ్చు ...ధనవంతులైన వారు వారికి ఇష్టమైన వస్తువులను వారి స్వంతం చేసుకోవడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి వెనకాడరు ....పైగా ఇది ఆ వస్తువు యొక్క విలువను పెంచుతుంది ... విషయాన్ని అతడు గ్రహించలేకపోయాడు...
🌹ఇంకొన్ని ఉదాహరణలు
🌹మన భాగస్వామి త్వరగా అలసిపోయి, మనతో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తాడు...
దీనికి మనం ఏం పాపము చేసామని విస్తు పోతాము....
🌹 మన భాగస్వామి ఒకటో, రెండో సార్లు మనల్ని బయటకు తీసుకెళ్తాడు...ఆ తర్వాత మనల్ని అస్సలు పట్టించుకోడు.... మనలో ఏదో లోపం ఉందని మనం ఆలోచిస్తాము.....
🌹మనకు మన భాగస్వామితో సంబంధం తెగిపోతుంది ...మనం జీవితంలో ఓడిపోయామని కృంగిపోతాము ....
🌹మనం జీతం పెంచమని యాజమాన్యాన్ని అడగడానికి వెనకాడతాము....
🌹పత్రికలలో, టీవీలలో సినిమాలలో ,వచ్చే తారల శరీరాలతో మనల్ని పోల్చి చూసుకొని ,మనల్ని మనం తక్కువగా భావించుకుంటాము....
🌹మీ వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, మీకు రావాల్సిన వాట మీకు రాకపోయినా, మీరందుకు తగిన వారు కారని మీకు ఆ పని అచ్చి రాదని భావిస్తారు....
🌹 మీరు ఎవరితోనైనా దగ్గర అయ్యేందుకు భయపడతారు....ఎందుకంటే అదెక్కడ సెక్స్ సంబంధానికి దారితీస్తుందో అని లోపల భయపడుతుంటారు....
🌹మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వెనకాడుతారు.... ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా తప్పవుతాయని మీరు ముందే నిర్ణయించుకుంటారు కాబట్టి....
🌹పై విధాలుగానే కాక మరెన్ని విధాలుగా మీరు అనర్హులనే భావాన్ని మీరు వ్యక్తపరుస్తారో గమనించండి....
🌻పసిపిల్లలు చాలా పరిపూర్ణలో పసిపిల్లలు గా ఉన్నప్పుడు మీరు ఎంత పరిపూర్ణలో తెలుసా!!!
🌹 పసిపిల్లలు పరిపూర్ణులు అయ్యేందుకు ఏమీ చేయనవసరం లేదు ...ఎందుకంటే వారు పరిపూర్ణంగానే ఉంటారు ..వారికి విషయం తెలిసినట్లుగానే వారు ప్రవర్తిస్తారు... వారు ఈ విశ్వానికి కేంద్రాలని వారికి తెలుసు ..వారికి ఏది కావాలో అడగడానికి వారే మాత్రం సంకోచించరు... వారు వారి భావాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారు ...ఒక పసి పాపకు కోపం వస్తే ఏమవుతుందో మీకు తెలుసు ...నిజానికి ఆ వీధి మొత్తానికి తెలుస్తుంది... అదే వారు సంతోషంగా ఉంటే ఆ ఇంటిని వారి నవ్వులతో వెలిగిస్తారు... ఈ విషయము మీకు తెలుసు... వారు ఎప్పుడూ పూర్తిగా ప్రేమతో నిండి ఉంటారు...
🌹 పసి పిల్లలు ప్రేమను పొందకపోతే చచ్చిపోతారు... కానీ పెరిగి పెద్దయ్యాక మనం ప్రేమ లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాము ....పసిపిల్లలు అలా బ్రతకలేరు పసిపిల్లలు వారి శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రేమించుకుంటారు ...వారి శరీరాల నుండి విసర్జింపబడే మలమూత్రాలను సైతం వారు ప్రేమిస్తారు ....వారికి అనూషమైన ధైర్యం ఉంది....
🌹"మీరు అలాగే ఉండేవారు "మనమంతా అలాగే ఉండేవాళ్ళం... తర్వాత మన చుట్టూ ఉన్న పెద్దల మాటలు విని ఎలా భయపడాలో, ఎలా ప్రేమ రహితంగా జీవించాలో, ఎలా మన దివ్యత్వాన్ని దిగజార్చుకోవాలో, నేర్చుకున్నాము...
🌹 నా క్లైంట్స్ లో ఎవరైనా ఎంతగా తీవ్ర భయభ్రాంతులతో దయనీయంగా ఉన్నా... ఎంతగా ప్రేమ లేక మకుటచిన హృదయాలతో ఉన్నా నేను నమ్మను... నా పని అంతా వారిని కాలంలో వెనక్కి తీసుకువెళ్లి ,నిజంగా వారిని వారు ప్రేమించుకునేది, వారికి తెలుసు అనే విషయాన్ని వారికి తిరిగి గుర్తుకు చేయడమే....
🌻 మిర్రర్ వర్క్ ......
🌹తర్వాత వారి చేతికి ఒక చిన్న అద్దాన్ని ఇచ్చి, అందులో వారి కళ్ళల్లోకి వారిని చూసుకోమని చెబుతాను.... తర్వాత వారి పేర్లు చెప్పుకొని ,"నేను నిన్ను ప్రేమిస్తున్నాను". నేను నిన్నుగా అంగీకరిస్తున్నాను ...అని చెప్పుకున్నమంటాను...
🌹 ఇది చాలా మందికి కష్టం అనిపించేది... చాలా తక్కువ మంది దీనికి చక్కగా స్పందించి ,ఈ పనిని ఆనందించేవారు... కొంతమంది "నో" అని అరిచేవారు... కొంతమంది ఏడ్చేవారు... కొంతమంది కోప్పడేవారు... కొంతమంది వారి రూపాన్ని, గుణగణాల్ని తక్కువ చేసుకునేవారు... కొంతమంది ఈ పని చేయలేమని అనేవారు... ఒక వ్యక్తి అయితే అద్దాన్ని విసిరేసి ,పారిపోవాలని చూసాడు ... అతడికి అద్దం ముందు నిల్చుని తన కళ్ళలోకి తాను చూసుకోవడం కొన్ని నెలలు పట్టింది....
🌹కొన్ని సంవత్సరాలుగా అద్దంలో కనిపించే నా మొహాన్ని నిందించుకోవడానికి నేను అద్దంలో చూసేదాన్ని.... గంటలకొద్దీ అద్దం ముందు నిలబడి ఊరికే నా కనుబొమ్మలపై వెంట్రుకల్ని పీక్కుంటూ ఇన్నాళ్లు ఎలా గడిపానా అని తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది.... అప్పుడు అద్దములో, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకోవడానికి నేను భయపడే దాన్ని....
🌹ఈ విధంగా అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ,"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" "నిన్ను నీవుగా అంగీకరిస్తున్నాను "అని చెప్పుకోవడం నాకు చాలా బాగా పనిచేసింది ...అరగంట కాలంలోనే నా బహిర్ సమస్యలకి కారణమైన నాలో అంతర్గతంగా ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నా నమ్మకాలు ,ఆలోచన విధానాలు, నా మాటలు ,ఇతరుల మాటలు పైకి తేలాయి ....ఇలా మన అంతరంగంలోనికి చూసుకొనకుండా, సమస్యలకు కారణాలనీ కేవలం బహిర్గతంగా వెతుక్కుంటూ పోతే ,ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ ఎంతసేపైనా గడపవచ్చు.... అలా చేసినప్పుడు సమస్యకు సమాధానం దొరికిందని మనం తెల్చేలోపే అది ఇంకో దగ్గర మొలకెత్తి ఉంటుంది.........
🌹 ధన్యవాదములు 🌹
నా ఫిలాసఫీ
Part __2(c)
🌹నిజానికి మీరు అనుకునేది అసలు సమస్య కాదు🌹
🌹ఒక ఆమె తన రూపురేఖల్ని ఎక్కువగా పట్టించుకునేది.... మరీ ముఖ్యంగా ఆమె పంటివరుసలనీ.... ఆమె ఎంతో మంది "పంటి "డాక్టర్లను కలిసింది ...వారంతా కలిసి ఆమె పళ్ళను మరింత అద్వాన్నంగా చేశారు ....అలాగే ఆమె తన ముక్కును కూడా నాశనం చేసుకుంది... ప్రతి డాక్టర్ ఆమె అంతర్గత నమ్మకమైన, "నేను అందంగా లేను "అనే నమ్మకాన్ని బహిర్ ప్రపంచంలో సరిగ్గా సంభవింపజేశారు.... నిజానికి ఆమె అసలు సమస్య ,ఆమె రూపురేఖలు కావు ...ఆమెలో ఏదో లోపం ఉందని ఆమె అంతర్గతంగా భావించడం....
🌹 ఇంకొక ఆమె చాలా అసహ్యంగా గురక పెట్టేది.... చుట్టూ ఉన్నవాళ్లు చాలా అసహనంగా భావించేవారు ...ఆమె ఒక చర్చికి అధిపతి అయ్యేందుకు ఒక కోర్స్ చేస్తుండేది ....బయటికి ఆమె చాలా పవిత్రంగా ఆధ్యాత్మికంగా కనిపించేది... కానీ, ఆమె అంతరంగంలో మాత్రం ఆమె పదవికి ఎవరైనా పోటీ పడతారేమో అన్న కోపంతో ,అసూయతో, రగిలిపోతుండేది.... ఆమె అంతర్గతపు ఆలోచన విధానాలే ఆమెను అలా అసహ్యకరంగా గురకపెట్టేటట్లు చేశాయి ....దీన్ని కప్పిపుచ్చుకోవడానికి బయటికి ఆమె ఎంత ప్రేమ పూరితంగా నటించినా ,ఆమె లోపల చాలా బాధపడుతూ ఉండేది ...ఆమెను ఎవరు భయపెట్టలేదు! ఆమె తప్ప ......
🌹ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు... అతడు "హాడ్జ్ కీన్స్" ( Hodgkin's disease) అనే వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు.... అతని తల్లి ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకు వచ్చింది ....ఇక అతడు మూడు నెలలు బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారట.... వాళ్ళ అమ్మ అతడిని ఎలా బ్రతికించుకోవాలో తెలియక చాలా భయపడితూ ఉండేది.... కానీ ఆ అబ్బాయి చాలా చలాకీగా, తెలివిగా ఉన్నాడు... అతడికి చావాలని లేదు.... బ్రతకడానికి అతడు ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు.... తన ఆలోచన విధానాలను, మాటల తీరును ,మార్చుకోవడానికి తయారయ్యాడు ....తన తల్లిదండ్రులు విడిపోయారు.... ఇంకా వాదులాడుకుంటున్నారు.... అతడు ఇంకా జీవితంలో స్థిరపడలేదు ... ఇదీ అతడి పరిస్థితి......
🌹 కానీ అతడికీ ఒక నటుడు కావాలని తీవ్రమైన కాంక్ష ఉండేది.... పేరు ప్రతిష్టలు లేవని భావించడం ,అదృష్టం లేదని భావించడం ,వల్ల తన తీవ్ర ఆకాంక్షను అణచుకున్నాడు... అతడికి బాగా పేరు ఉంటేనే తప్ప అతన్ని నటించడానికి ఒప్పుకోరని అనుకున్నాడు.... నేను అతడికి తనను తాను మంచిగా భావించడం నేర్పించాను ...అతడు చాలా చక్కగా వీటన్నిటినీ పాటించాడు....అప్పుడు అతను టీవీ ప్రోగ్రామ్స్ లో తరచుగా కనిపిస్తుంటాడు.... అతడు తనను తాను అంగీకరించుకోవడం, వలన తనలాగే తాను ఉండడము, వలన అవకాశాలు అతడి ముంగిటకి చేరాయి ....అ
🌹" అధిక బరువు"ను తగ్గించుకోవడానికి మనం ఎన్నో పరిష్కారాల్ని వెతికి వెతికి మన శక్తినంత వ్యర్థము చేసుకుంటాము.... ఎన్నో ఆహార విధానాలను పాటిస్తాము.... ఇక్కడ "అధిక బరువు"కాదు అసలు సమస్య, కొంతమంది తమ లావుతో పోరాడి ,పోరాడి ఇంకా లావు అవుతారు.... తత్ఫలితంగా అధిక బరువు వలన వారు ఎదుర్కొనే సమస్యలకు, ఇంకా ఎక్కువగా తమను తాను నిందించుకుంటూ ఉంటారు.... ఈ బహిర్గతమైన అధిక బరువు అనేది వారి అంతరంగంలోని ఒకానొక ఆలోచనా విధానం వల్ల ఉత్పన్నమైనదే ....ఈ సమస్య భయం మరి రక్షణ అవసరం అనే ఆలోచనా విధానాల వల్ల తలెత్తుతుంది.... మనం ఎప్పుడైతే భయపడతామో లేక అభద్రతతో ఉంటామో, లేక బాగాలేమని అనుకుంటామో, అప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంకా అధికంగా బరువు అవుతాము.....
🌹 మనం ఎన్నో సంవత్సరాలుగా బరువుగా ఉండడం పట్ల మనల్ని మనం కోపగించుకోవడం ,తిట్టుకోవడం, తినే పదార్థాలను జాగ్రత్తగా తీసుకోవడం, మరి ప్రతిసారి ఎంత బరువు పెరిగాము అని చెక్ చేసుకోవడం ,చాలా వ్యర్థము ....ఇలా చేస్తే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగే ఉంటారు ...ఎందుకంటే మీరు సమస్యకు అసలు కారణాన్ని సరి చేసుకోవడం ప్రారంభించలేదు... మనము చేసినదంతా ఇంకా ఎక్కువ భయపడి ఇంకా ఎక్కువ ఆభద్రతాభావంతో ఉండి, మన రక్షణ కోసం ఇంకా ఎక్కువ బరువెక్కినాము అంతే.... అందుకే నేను అధిక బరువు పట్ల లేదా ఆహార నియమాల పట్ల దృష్టి పెట్టను... ఇక్కడ ఆహార నియమాలు పనిచేయవు ...ఒకే ఒక నియమం పనిచేస్తుంది అది "నెగిటివ్ గా ఆలోచించకపోవడం" అనే నియమం....
🌹 ఎవరన్నా నన్ను అధిక బరువు సమస్యతో సంప్రదిస్తే ,ముందు ఈ అధిక బరువు విషయాన్ని పక్కన పెట్టండి. అని చెప్పి ,వారికి మనల్ని మనం ప్రేమించుకోవాలని, మనల్ని మనం అంగీకరించుకోవాలని, మన పట్ల మనం మంచిగా భావించాలని వివరిస్తాను.... అలా చెప్పినప్పుడు లావుగా ఉన్నందుకు, చూసేందుకు అసహ్యంగా ఉన్నందుకు, వారిని వారు ప్రేమించుకోలేరని బదులిస్తారు... అప్పుడు మీరు లావుగా ఉండడానికి కారణం మీరు మిమ్మల్ని ప్రేమించుకోకపోవడమేనని నేను వివరిస్తాను.... మనల్ని మనం ప్రేమించుకుని, మన పట్ల మనం మంచిగా భావించి, ఉంటే ఆశ్చర్యకరంగా మన శరీరాలు లావు తగ్గిపోయి ,ఎలా సహజమవుతామో అన్నది చాలా అద్భుతమైన విషయము....
🌹మనల్ని మనం మార్చుకోవడం చాలా సులభమని చెప్తే కొన్నిసార్లు వినేవారికి చాలా కోపం వస్తుంది... వారి సమస్య నాకర్థం కాలేదని కూడా వారు భావిస్తారు... ఒక ఆమె అయితే చాలా నిరుత్సాహంతో నేను మీ దగ్గరకు వచ్చింది నా డిగ్రీ ని ఎలా పూర్తి చేసుకోవాలోనని, మీరు ఇచ్చే సలహా కోసమే గాని! నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో తెలుసుకోవడానికి కాదు ...అని చెప్పేది... ఆమె ఒక డిగ్రీ పట్టా కోసం ఒక "థీసిస్" వ్రాస్తోంది.... ఆమె పట్ల ఆమెకు ఎంత ద్వేష భావన ఉందో నాకు స్పష్టంగా తెలుస్తోంది ....ఆ బావని ఆమె జీవితంలో అన్ని దిశాలూ వ్యాపించి ,ఆమె 'థీసిస్ 'ను పూర్తి చేసుకోకుండా అడ్డుకుంటోంది.... ఆమె అయోగ్యురాలని ఆమె భావించేంతవరకూ ఆమె ఎలా విజయం సాధించగలదు? చెప్పండి ?
🌹ఆమె నా మాటలు విడచెవిన పెట్టింది... ఏడ్చింది ...తర్వాత సంవత్సరానికి ఉన్నదానికి తోడు ఇంకొన్ని సమస్యల్ని నెత్తిన వేసుకొని వచ్చింది... కొంతమంది మారేందుకు సిద్ధంగా ఉండరు ...అలాగని వారిలో తప్పులు ఎంచాల్సిన అవసరం లేదు ...జీవితంలో మార్పులు సంభవించడం, సరైన సమయంలో ,సరైన ప్రదేశంలో ,సరైన క్రమంలో, జరుగుతుంది.... నా జీవితంలో మార్పులు సంభవించడము ప్రారంభమైనది ,నాకు 40 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.....
🌻అసలు సమస్య🌻
🌹ఎటువంటి అపాయం తలపెట్టలేని ఆ చిన్న అద్దములో వారిని వారు చూసుకుని నిరుత్సాహపడ్డాక, నాకు సమస్య అర్థమైందన్నట్లుగా ,ఒక ఓ చిరునవ్వుతో నేనిలా అంటాను ...మంచిది ఇప్పుడు మీరు అసలు సమస్యని చూస్తున్నారు ...ఇప్పుడు మన దారికి నిజంగా అడ్డం వచ్చే విషయాల్ని బయటకు గెంటే యవ... తర్వాత మనల్ని మనం ప్రేమించుకోవడం, అనే విషయంపై ఎక్కువగా మాట్లాడుతాను.... మనల్ని మనం ఎప్పుడు గానీ ,దేనికి గాని నిందించుకోకూడదు.... మనల్ని మనం ప్రేమించుకోవడం దీనితోనే మొదలవుతుంది ....
🌹తర్వాత ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మీరు ఒప్పుకోకుండా నిందించుకుంటూ ఉంటారు...??? అని ప్రశ్నిస్తాను... సమాధానం చెప్పేటప్పుడు వారి స్పందనలను గమనిస్తాను...
🌹 ఊ.... కొన్నిసార్లు...
🌹 ఇంతకుముందు చేసినన్ని సార్లు కాదు...
🌹సరే నన్ను నేను ఒప్పుకుంటే మార్పు ఎలా వస్తుందంటారు ?
🌹అందరూ అంతే కదా?
🌹 పై విధంగా సమాధానాలు ఇస్తారు.... 🌹తర్వాత నేను" మనం ఇక్కడ మాట్లాడుతున్నది అందరి గురించి కాదు మనం మాట్లాడేది 'నీ 'గురించి !నువ్వు ఎందుకు నిన్ను నీవు ఒప్పుకోవు? నీలో ఏం లోపం ఉందని? ప్రశ్నిస్తాను....
🌹 అలా అడుగుతూ వారిచ్చే సమాధానాలను ఒక' లిస్ట్' గా రాస్తాను... ఇప్పుడు వారు చెప్పేవి ఇంతకుముందు వారు కచ్చితంగా చేసి తీరాల్సిన '' తో పోల్చుతాను ...చాలా వరకు రెండు ఒకటిగా ఉంటాయి.... వారు చాలా పోడవని ,చాలా పొట్టి అని ,చాలా లావు అని ,చాలా బక్క అని ,వారికి చాలా నత్తి అని ,వారికి చాలా వయసైపోయిందని ,మరి వయసులో చిన్న అని ,అందంగా ఉండరని (చాలా అందంగా ఉండే వారే ఇలా) చెప్తారు లేదా వారు పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారని, అన్నింటికీ చాలా ఆత్రుత పడతారని, ఇంకా ఎన్నెన్నో చెప్తారు.... మీరు ఇక్కడ ఓ విషయం గమనించాలి ....అన్ని సమస్యలలోనూ "చాలా" అన్నదే సమస్యగా ఉంది ...ఇలా వారి అంతః కరణాలను తవ్వుతూ పోతే వారు వారి అంతరంగంలో నేను బాగాలేను అని అసంతృప్తితో ఉన్నారన్న విషయం అర్థం అవుతుంది....
🌹 హమ్మయ్య !!! చివరికి మనం సమస్యలు అన్నిటికీ కారణభూతమైన కేంద్ర బిందువుని చేరుకున్నాము ...వారిని వారే ఎందుకు ఒప్పుకోరు ,అంటే "నేను బాగాలేను అని వారి అంతరంగంలో తీవ్ర అసంతృప్తి" దాగి ఉంది కాబట్టి .....ఈ విషయమే వారికి చెబితే వారినంతగా అన్ని ఏళ్లుగా వేధించిన సమస్యలకు కారణం ఇంత త్వరగా తేలినందుకు చాలా ఆశ్చర్యపోతారు..... "ఈ నేను బాగాలేను" అన్న భావన ,మన పట్ల మనకు ప్రేమ లేకపోవడం వల్ల జనిస్తోంది ....అప్పుడు సమస్యలు ఏవైనా, అవి శారీరక సమస్యలైనా, సంబంధం సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, లేక సృజనాత్మక వ్యక్తీకరణ లోపానికి సంబంధించినవైనా పట్టించుకోనవసరం లేదు.... మన శక్తినంత ఈ సమస్యలనన్నింటికీ అసలు కారణమైన "మనల్ని మనం ప్రేమించుకొనకపోవడం "పై కేంద్రీకరించాలి.......
🌹 నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది ...నేను సదా దైవ శక్తిచే పరిరక్షించబడుతూ, సరియైన మార్గంలో నడపబడుతున్నాను.... నా అంతరంగంలోకి చూసుకోవడం నాకెంతో క్షేమకరము.... నా గతంలోకి చూసుకొని దాన్ని సమీక్షించుకోవడం నాకెంతో క్షేమకరము.... జీవితం పట్ల నా దృక్పతాన్ని విస్తరించుకోవడం నాకెంతో క్షేమకరము.... "నేను" అనబడేది నా వ్యక్తిత్వం కన్నా... భూత,భవిష్యత్తు ,వర్తమాన కాలాల కన్నా,, ఎంతో ఉన్నతమైనది ....నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి ,నా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఎదగడానికి, నేను నిశ్చయించుకుంటున్నాను..... నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను పూర్తిగా సంసిద్ధతతో ఉన్నాను.... మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది 🌹
🌹ధన్యవాదములు 🌹
సమస్య ఎక్కడి నుండి వస్తుంది ?
🌹Part ____3(a)
🌟 "గాతకాలం యొక్క ప్రభావం నాపై ఏ మాత్రమూ లేదు"
🌹సరే!!! మనమెన్నో విషయాల్ని ప్రస్తావించు కున్నాము ...మనము సమస్య అనుకొనే దాని నుండి ప్రారంభించి, ఎన్నో మలుపులు తిరిగి, 'అసలు సమస్య 'ఏమిటో తెలుసుకున్నాము..." మనము బాగాలేము" అన్న భావన మరి" మన పైన మనకు ప్రేమ లేకపోవడం "అనేది మనలో ఉండడమే అసలు సమస్య .అని తెలుసుకున్నాము. జీవితంలో ఏదైనా సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ భావనలోంచి ఉత్పన్నమవుతుంది .ఇప్పుడు ఈ ఆలోచన విధానాలు ఎక్కడి నడి వచ్చాయో చర్చిద్దాం....
🌹తమ గురించి, తమ జీవితం గురించి, పరిపూర్ణంగా తెలిసిన చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి నిరంతరము సమస్యలతో సుతమతమవుతూ తాము అనర్హులమని, తాము ప్రేమించబడమని, భావించే పెద్దలుగా ఎలా ఎదిగామో కదా? అనర్హులమనే భావన, తాము ప్రేమించబడము ,అనే భావనలు అందరిలోనూ ఏదో తీవ్రతల్లో ఉంటాయి. ఎవరైతే తమను తాము ఇప్పటికే ప్రేమించుకుంటున్నారో వారు వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించుకోవచ్చు.
🌹ఒక చిన్న రోజా పువ్వు యొక్క మొగ్గను ఊహించుకోండి .అది మొగ్గ గా ఉన్నప్పుడు, ఒక పువ్వుగా వికసించేటప్పుడు, చివరి రేకు నేల రాలినప్పుడు, మరి దాని ప్రతి స్థితిలోనూ అది ఎప్పుడు పరిపూర్ణమైనదే! మరి నిరంతరం మార్పు చెందేదే... అలాగే మనము కూడా ,మనం ఎప్పుడూ పరిపూర్ణులమే... ఎప్పుడు సౌందర్యంతో నిండి ఉన్నవారమే... మరి నిరంతరము మార్పు చెందే వాళ్లమే... మనకుండే అవగాహన, జ్ఞానము ,చైతన్యపు స్థాయిని బట్టి, మనము చక్కగానే జీవిస్తున్నాం... మనకు ఇంకా ఎక్కువ అవగాహన,౭ జ్ఞానం వరి చైతన్యపు స్థాయి ఉండి ఉంటే మనం విషయాల్ని విభిన్నంగా చేస్తాము!( అంతే తేడా!
🌻మన మనసు అని ఇంటిని శుభ్రపరచుకోవడం..,
🌹ఇప్పుడు మన గతాన్ని ఇంకాస్త పరిశీలించి, మనలో కొనసాగుతున్న కొన్ని ఆలోచన విధానాలను ,కొన్ని నమ్మకాలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.....
🌹 కొంతమంది వారి మనసులని శుభ్రపరచుకోవడానికి ,చాలా బాధాకరంగా భావిస్తారు ....ఇక్కడ అంత బాధ పడవలసిన అవసరం లేదు ..ముందు మనం మనసులో ఏముందో చూసుకోవాలి. అప్పుడే కదా అనవసరమైన వాటిని తొలగిస్తాను....
🌹 మీరు ఒక గదిని పూర్తిగా శుభ్రపరచాలనుకుంటే, ఆ గదిలో అన్ని వస్తువులను జాగ్రత్తగా పరిశీలిస్తారు కదా! కొన్ని వస్తువులను ప్రేమతో చూస్తారు. వాటికి పట్టిన దుమ్మును వదిలించి, లేదా వాటిని చక్కగా పాలిష్ చేసి వా±టికి ఒక సరికొత్త అందాన్ని ఇస్తారు... కొన్ని వస్తువులకు రిపేర్ అవసరమవుతుంది... కొన్ని వస్తువులు మీకు అసలు పనికిరావు… వాటిని మీరు పారేస్తారు. పాత పుస్తకాలు, పాత న్యూస్ పేపర్లు, చెత్త కాగితాలాంటి వాటిని చెత్తబుట్టలో పడ వేస్తారు గదిని శుభ్రపరచుకొనేటప్పుడు కోపము అవసరం లేదు కదా!!!
🌹అదేవిధంగా మన మనసులోనీ గదులను శుభ్రపరిచే టప్పుడు కూడా అంతే, అలాగే మీలోని కొన్ని నమ్మకాన్ని బయటకు విసిరేయడానికి కోపం అవసరం లేదు ...అన్నము తినేసాక మిగిలిన వెతుకుల్ని పడవేసినంత సులభంగా వాటిని వదిలేయండి. ఈరోజు వంట చేయడానికి నిన్న తరిగి పారవేసిన కూరగాయల కోసం చెత్తబుట్టను త్రవ్వరు కదా! అలాగే రేపటి జీవితాన్ని ,భావాలని సృష్టించుకోవడానికి మనసులోని పనికిరాని ,పాత చెత్తను తవ్వాల్సిన అవసరం లేదు కదా!
🌹మీలోని కొన్ని ఆలోచనలు ,నమ్మకాలు మీకేం మాత్రం పనికి రాకపోతే వాటిని మీలోంచి వెళ్లి పోనివ్వండి ...ఒకసారి నమ్మితే ,ఇంకెప్పటికీ అదే నమ్మకాలతో ఊగులాడాలని ఎక్కడా రాసి పెట్టలేదు...
🌹 మనం ఎప్పుడు కొన్ని పరిమితమైన నమ్మకాలను మరి అవి ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకుందాము.....
🌻పరిమితమైన నమ్మకము:---" నేను బాగాలేను అన్న సంతృప్తి"
ఎక్కడినుండి వస్తోంది:---" నువ్వు మూర్ఖుడివి. దేనికి పనికిరావు అని పదేపదే తన తల్లిదండ్రులు అంటూ ఉంటే ,పిల్లల్లో ఈ భావన తలెత్తుతుంది....
🌹తను విజయం సాధించాలని, అది చూసి తన తండ్రి గర్వపడాలని, ఒక అబ్బాయి చెబుతుండేవాడు... కానీ అతడు వరుసగా పరాజయాలు పాలవడంతో ,అతడు అపరాధ భావంతో కృంగిపోయేవాడు...మరి క్రోధంతో ఊగిపోయేవాడు.... అతడికి విజయం సాధించడం ఒక "చిక్కుముడిగా" మారి పోయింది.....
🌹వాళ్ళ నాన్న అతనికి ఒక ఫైనాన్సింగ్ బిజినెస్ అప్పజెప్పాడు. కానీ వరుసగా అతడు ఓడిపోతున్నాడు. అతడి ఓటమి అలాగే కొనసాగి వాళ్ళ నాన్న ఆ నష్టాల్ని ఉడుచుకునేందుకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చింది. వాళ్ళ నాన్న కూడా చాలా నష్టపోయాడు..
🌻పరిమితమైన నమ్మకము:-- "తనపై తనకు ప్రేమ లేకపోవడం"
ఎక్కడినుండి వస్తోంది :---నాన్నను మెప్పించడానికి ప్రయత్నిస్తుండడం....
🌻ఒక అమ్మాయికి ఎప్పుడూ తన తండ్రితో అభిప్రాయ బేధాలు వస్తుండేవి. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు వాదులాడుకునేవారు. ఆమె తనను తాను ఒప్పుకుందాం అనుకునేది. కానీ చివరికి ఆమెకు మిగిలింది విమర్శలు మాత్రమే .ఆ అమ్మాయి చివరకు వాళ్ళ నాన్న లాగా ఉండవలెనని నిర్ణయించుకుంది. ఆమె శరీరం అంతా నొప్పులు వచ్చేవి...ఆమె తండ్రికి కూడా అలాంటి నొప్పులే వచ్చేవి ...తన కోపమే ఇలాంటి నొప్పిని తన శరీరంలో సృష్టిస్తున్నదన్న విషయాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అలాగే ఆమె తండ్రికి తన కోపం తన శరీరంలో నొప్పిని సృష్టించింది...
🌻పరిమితమైన నమ్మకము :-- జీవితం చాలా భయానకమైనది:_ ఎక్కడినుండి వస్తోంది
...భయకంపితుడైన తండ్రి / తల్లి
🌹 నా క్లైంట్ ఒకవే ఎప్పుడూ చాలా సీరియస్ గా, పద్ధతిగా ఉండేది... ఆమె మనసారా నవ్వేందుకు కూడా సంకించేది... ఎందుకంటే అలా నవ్వితే ఏదైనా చెడు జరిగి తర్వాత దుఃఖపడతామని భయపడేది...
🌹తన తండ్రి పెంపకంలో ఏయ్ !నవ్వద్దు, అలా నవ్వితే తర్వాత అంతకంత ఏడ్వాల్సి వస్తుంది ...అని హెచ్చరింపబడింది. అందుకే ఆమె అలా తయారయింది...
🌻పరిమితమైన నమ్మకము :-- "నేను బాగాలేను" ఎక్కడి నుండి వస్తోంది....
🌻 తల్లిదండ్రులు పూర్తిగా పట్టించుకోకుండా వదిలిపెట్టబడటం వలన తలెత్తుతోంది...
🌹 ఒకతనికి మాట్లాడడమే కష్టం అయ్యేది. నిశ్శబ్దమే అతని జీవన విధానం అయినది. డ్రగ్స్ కు, ఆల్కహాల్కు అలవాటు పడి ,నేను చాలా చెడిపోయాను అన్న నిర్ధారణకు వచ్చాడు... నాకు తెలిసిందేమిటంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అతడు తన పిన తల్లి పెంపకంలో పెరిగాడు. ఆమె అతడితో ఎప్పుడో, ఏదైనా పని చెప్పడానికి తప్ప మాట్లాడేది కాదట .కావున అతడు నిశ్శబ్దంగా పెంచబడ్డాడు. అతడు ఒంటరిగానే తింటాడు... కావాలంటే అతడు ఒంటరిగానే ఎన్ని రోజులైనా గడిపేయగలడు. అతడికి ఒక ప్రియురాలు ఉండేది .ఆమె కూడా నిశ్శబ్దంగా ఉండే మనిషి. ఎంతో కాలం నిశ్శబ్దంగానే కలిసి గడిపారు. ఈమధ్య అతడి ప్రియురాలు చనిపోయింది. అతడు మళ్ళీ ఒంటరి వాడయ్యాడు...
🌻మన మనసులోకి ఎక్కించబడ్డ నెగిటివ్ సందేశాలు....
🌹ఇప్పుడు ఇక మనం ఏం చేయాలంటే ఒక పెద్ద పేపరు షీట్ తీసుకొని, మీ తల్లిదండ్రులు మీలో ఏ ఏ లోపాలు ఉన్నాయని చెప్పారో రాయండి.... మీరు విన్నటువంటి అన్ని నెగటివ్ నమ్మకాలను రాయండి.... గుర్తుకు తెచ్చుకొని మరీ వ్రాయండి... దీనికి కావాల్సినంత ఎక్కువ సమయాన్ని కేటాయించండి.... కనీసం అరగంటైనా.....
🌹వారు మీకు డబ్బు గురించి ఏమేమి చెప్పారు... మీ శరీరం గురించి ఏమేమి చెప్పారు... ప్రేమ గురించి ,మరి సంబంధం బాంధవ్యాల గురించి ,ఏమి చెప్పారు... మీలోని సృజనాత్మకత గురించి, ఏమి చెప్పారు ...వారు మీకు చెప్పిన పరిమితమైన నమ్మకాలు, లేక నెగటివ్ ఆలోచన విధానాలు ఏవి.?
🌹ఈ విధంగా పరిశీలిస్తూ పోతే, మీలోని నమ్మకాలు ఎక్కడినుండి వచ్చాయో అర్థం అవుతుంది.... ఆ!!! ఈ నమ్మకము ఇక్కడి నుండి వచ్చిందా ???అని మీతో మీరు చాలా ఆశ్చర్యంగా చెప్పుకుంటారు....
🌹ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకోండి.... ఈ విషయంలోనే ఇంకాస్త లోతుగా వెళదాము.... మీరు చిన్నతనంలో విన్న నెగటివ్ నమ్మకాలన్నింటినీ రాయండి...
🌹మీ బంధువుల నుండి విన్నవి ...
🌹టీచర్ల నుండి విన్నవి ...
🌹మీ స్నేహితుల నుండి విన్నవి....
🌹అధికారుల నుండి విన్నవి....
🌹 మీ మత పెద్దల నుండి విన్నవి....
🌹అన్నింటినీ వ్రాయండి ....కావలసినంత ఎక్కువ సమయాన్ని తీసుకోండి ....అలా వ్రాసేటప్పుడు మీలో మెదులుతున్న భావాలను గమనించండి.....
🌹మీరు ఇప్పుడు రాసిన రెండు పేపర్లలోని విషయాలను మీ చైతన్యంలోంచి తొలగించాలి.... ఈ నమ్మకాలే " నీవు పరిపూర్ణుడవు కావు" "నీలో ఏదో లోపం ఉంది" అనే భావాన్ని సృష్టించి," నేను బాగాలేను "అన్న కొరతను మీలో కలుగజేస్తున్నాయి......
🌹 ధన్యవాదములు 🌹🌹
Reference links -
https://telugu.matrubharti.com/book/read/content/19931927/my-philosophy-introduction
https://telugu.matrubharti.com/book/read/content/19931928/my-philosophy-1
https://telugu.matrubharti.com/book/read/content/19931929/my-philosophy-is-2
https://telugu.matrubharti.com/book/read/content/19931930/my-philosophy-is-3
https://telugu.matrubharti.com/book/read/content/19931931/my-philosophy-is-4
https://telugu.matrubharti.com/book/read/content/19931932/my-philosophy-is-5
No comments:
Post a Comment