ఇంటర్ ఫలితాలు వచ్చాయి. నాకు తెలిసిన ఓ పదిమంది పిల్లలు పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు. వారి రిజుల్త్స్ కనుక్కుందామని కొందరికి ఫోన్ చేసాను. ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ రిసీవ్ చేసుకింది. "అమ్మాయి కు మూడ్ బాగా లేదు. పడుకుంది" అని చెప్పింది ఆమె. ఆ పిల్ల చాలా తెలివికలది. పొరపాటున తప్పిందా అని అనుమానం వచ్చి "ఎన్ని మార్కులు వచ్చాయి?" అని అడిగాను. 975 అని జవాబిచ్చిది ఆమె. అబ్బో.... చాలా మంచి మార్కులు... మరి మూడ్ బాగా లేకపోవడం ఏమిటి? అన్నాను. 985 ఎక్స్పెక్ట్ చేసింది. దాంతో డిప్రెషన్ లో ఉంది. మాకు కూడా తృప్తి లేదు. అందుకే ఎక్కడికీ వెళ్ళలేదు" అని చెప్పింది ఆమె.
మరొకరికి ఫోన్ చేసాను. ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుంది. " మార్కులు బాగా తక్కువ వచ్చాయి. పొద్దుటినుంచి ఏడుస్తున్నది. ఓదార్చడం మా వల్ల కావడం లేదు" అన్నది ఆమె. "ఎన్ని వచ్చాయి?" అడిగాను. " 988 వచ్చాయి." చెప్పింది ఆమె. నాకు చిరుకోపం వచ్చింది. "పార్టీ అడుగుతాము అని మీరు అలా అంటున్నారు. 988 అంటే చాలా గొప్ప మార్కులు కదా? " అన్నాను. "మార్కులు రాగానే వాళ్ళ కాలేజి నుంచి ఎవరో ఫోన్ చేసారు. ఇంకొక్క రెండు మార్కులు వచ్చినట్లయితే, నీ పేరు, ఫోటో ఫ్లెక్సీ లకు ఎక్కేది. మంచి చాన్స్ మిస్ చేసుకున్నావు. ఇంత తక్కువ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యలేదు" అని అన్నదట ఆమె ఎవరో...దాంతో దిగులు పడింది." అన్నది ఆ తల్లి.
మరొకరికి ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రి మాట్లాడాడు. "ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. డాక్టర్ని చేయ్యాలనుకున్నాము. 20 వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాము. అయిదారు వేల రూపాయలతో డ్రస్సులు అడిగితే కొనిపెట్టాము. లక్షల ఫీజులు కట్టాము. కాలేజీ కి వెళ్ళడానికి హోండా ఆక్టివా కావాలంటే కొనిపెట్టాము. చివరకు 965 మార్కులు తెచ్చుకుని మా ఆశలు నీరు కార్చింది. వాళ్ళ అమ్మ కోపం పట్టలేక చీపురు కట్టె తో చితక కొట్టింది. ఇద్దరు ఏడుస్తూ గదిలో పడుకున్నారు" అని చెప్పాడు ఆ జనకుడు.
మరొకరికి ఫోన్ చేస్తే 750 మార్కులు వచ్చాయట. వాళ్లకు అప్పటి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పడుకున్నారట. అయిదారుగురు పిల్లలకు 850-950 మధ్యన మార్కులు వచ్చాయి. వాళ్ళు కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయి, ఇక జీవితం వ్యర్ధం అన్నంతగా కుమిలి పోతున్నారు.
750 వచ్చినా, 850 వచ్చినా, 988 వచ్చినా ఎవరికీ సంతోషం లేదు. అందరూ ఏడుస్తున్నారు.
లోపం ఎక్కడుంది? విద్యా వ్యవస్థ లోనా? టీచర్ల లోనా, చదువులలోనా, పిల్లలలోనా, తల్లితండ్రుల లోనా, సమాజం లోనా, ప్రభుత్వం లోనా?
ఇప్పుడు 40 ఏళ్ల వయసు దాటి దేశ విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వారిలో ఎక్కువ మంది టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ఏవరేజ్ మార్కులతో పాస్ అయిన వారేనని ఈ పిల్లలు, తల్లితండ్రులు ఎప్పుడు తెలుసుకుంటారు?
ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అందరిలో మార్పు రావాలి. పిల్లల యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారు సంవత్సరం మొత్తం చేసే శ్రమను బట్టి, వారి ఇన్వాల్వ్మెంట్ టి బట్టి, పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసే వారిని బట్టి ఫలితాలు చేకూరుతాయని అర్థం చేసుకోకుండా, విధ్యార్థులు వేరే వారితో వారిని వారు పోల్చుకోవడం, తల్లి తండ్రులు కూడా అదే విధంగా ఆలోచించడం, విద్యాసంస్థల్లోని కొద్ది మంది, వారి బంధువుల్లో కొద్ది మంది తెలిసి తెలియక ఇలాగే ఆలోచించడం కారణాలు.
ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అందరిలో మార్పు రావాలి. లేకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. అందరు దీని గురించి ఆలోచించడం మొదలు పెడతారని కోరుకుంటూ అందరికీ నమస్సులు.
తెలిసిన వారు వేరే గ్రూపు లో పెట్టినారు, మనకు సంబంధించినది. ఒకసారి మనం అందరం చదివితే మంచిది, అని మన గ్రూపు లో పోస్ట్ చేస్తున్నాను.
సేకరణ
No comments:
Post a Comment