Wednesday, October 28, 2020

మనం చేసే పనులను బట్టి దైవం దర్శనమిస్తాడు

🦚ఒక ఊరిలో ఒక వ్యాపారికి రోజు రాత్రుళ్ళు దయ్యాలు కనిపించి భయపెడుతూ ఉంటాయి

పాపం ఆ వ్యాపారి రాను రాను కొంత కాలానికి భయం తో రాత్రుళ్ళు నిద్ర పోవడమే మానేస్తాడు

ఈ దయ్యలను వదిలించు కోవడం కోసం తాను సంపాదించిన సంపాదన అంతా కూడా

భూత,ప్రేత, పిశాచ మాంత్రికుల దగ్గరకు మోహిని, శాకిని, డాకిని లను కూడ అటాడించే
అఘోరాల దగ్గరకు

ఎన్నో ఏళ్లుగా శక్తివంతంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలకు, దర్గాలకు తిరిగి తిరిగి అలసి పోతాడు

ఇలా కాదని విజ్ఞాన పరంగా వైద్యం అందిస్తున్న సైకియాట్రిస్ట్ ల దగ్గరకు కూడ వెళ్లి

వారిచ్చిన మందులు ప్రారంభిస్తాడు వారిచ్చిన ఆ మందులతో
పగటి పూట కూడ నిద్ర వచ్చి
నిద్రపోతే అప్పుడు కూడ ఆ దయ్యాలు వ్యాపారిని భయపెడుతూ ఉంటాయి

ఇంకా తన దగ్గర ఉన్న సంపాదన అంత కర్చు అయిపోయి ఇంకా అప్పులు కూడా పెరిగి పోతాయి
ఇంకా లాభం లేదనుకొని ఆత్మహత్యే శరణ్యం అనుకొని తను ఆత్మహత్య కు
సిద్ధపడతాడు

ఇంతలో తన సమస్య తెలిసిన
ఒక స్నేహితుడు అతని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు నీకు వచ్చిన సమస్యకు మన ఊరి చివర ఉన్నకొండ దగ్గరి గుడి ముందు ఒక పకీరు ఉన్నాడంట

అతని దగ్గరకు వెళితే నయం అవుతుందని విన్నాను ఒక సారి వెళ్దామా అంటాడు

ఆ వ్యాపారికి మనసులో నమ్మకం లేకున్నా
ఎలాగు చనిపోదమని అనుకుంటున్న కదా ఒక సారి చూస్తే పోలే అని చిన్న ఆశతో
తన మిత్రునితో కలసి పకీర్ దగ్గరకు వెళతాడు

ఆ పకిరుతో తనకున్న సమస్య
అంతా కూడ వివరిస్తాడు
అది విన్న పకిరు
నీవు ఏ వృత్తిలో జీవనం సాగిస్తు ఉన్నావు అని అడుగు తాడు

దానికి బదులుగా వ్యాపారి
నేను మన ఊరి మధ్యలో వున్న
ఐదు అంతస్థుల భవనం అద్దెకు తీసుకొని హోటల్ నడుపుతున్నాను అంటాడు

అప్పుడు పకీర్ నీ హోటల్లో ఏమేం ఏమేం ఉంటాయి అని అడుగుతాడు

దానికి వ్యాపారి నా హోటల్లో
దేశ విదేశాలకు సంబంధించిన
మాంసాహార శాకాహార వంటకాలు ఇంకా అనేక రకాల భోజనాలు ఉంటాయి స్వామి
నా దగ్గర యాభై మంది పని వాళ్ళు కూడ వున్నారు అంటాడు

అబ్బో చాల పెద్ద వ్యాపారమే
కానీ ఇప్పుడు నీకు ఉన్న సమస్యకు ఇంత ఇబ్బంది తో కూడుకున్న వ్యాపారం సరి కాదు నువ్వు ఇప్పుడు నడుపుతున్న వ్యాపారాన్ని అపేసి
కొన్ని రోజులు చిన్న వ్యాపారం చేసుకో అంటాడు

దానికి వ్యాపారి చిన్న వ్యాపారం అంటే ఏ వ్యాపారం
చేయమంటారు స్వామి అని అడుగుతాడు

దానికి పకీరు బదులుగా కూరగాయలు లేదా పండ్లు అలాంటి వ్యాపారాలు అని చెప్పి తన దగ్గర ఉన్న తావిజుని వ్యాపారి మెడలో వేసి మళ్లీ కొంత కాలానికి వచ్చి
ఎలావుందో చెప్పు నాయన అంటాడు

అక్కడినుండి వెళ్ళిన వ్యాపారి
తన పాత వ్యాపారాన్ని నిలిపివేసి కొత్తగా పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించి కొంత కాలానికి ఎంతో సంతోషం తో
ఫకీర్ దగ్గరకు వెళతాడు

అప్పుడు పకీరు ఎలా ఉంది నాయన ఇప్పుడు అని అడుగుతాడు

వ్యాపారి తమరి దయవల్ల ఇప్పుడు నా జీవితం ఎంతో ఆనందం తో చాలా బావుంది నేను మీకు ఎప్పుడు రుణ పడి ఉంటాను స్వామి

ఇప్పుడు నాకు రాత్రుళ్ళు దయ్యాలు కనిపించట్లేదు దయ్యాలు కనిపించక పోగ తమరి తాయత్తు మహిమతో

నాకు కలలో అప్పుడప్పుడు దేవుళ్ళు కూడ నాకు దర్శనం ఇస్తున్నారు స్వామి అంటాడు

దానికి పకిరు చూడు నాయన నా దగ్గర కాని నేనిచ్చిన తావిజు దగ్గర కాని ఎటువంటి మహిమల్లేవు

నీకు వచ్చిన సమస్య నీ నుండే వచ్చింది నీ నుండే పోయింది
గతంలో నువ్వు హింసతో కూడుకున్న వ్యాపారం చేశావు
నువ్వు చేసిన ఆ వ్యాపారం ఎంతో జీవ హింస తో కూడుకొని ఉన్నది

అందువల్ల ఆ భగవంతుడే రోజు నీకు కలలో దయ్యాల రూపంలో
భయపెట్టాడు ఇప్పుడు నువ్వు
ఏ హింస లేని వ్యాపారం చేస్తున్నందున ఇప్పుడు నీకు దేవతలు గా కనిపిస్తున్నాడు

నిజానికి దయ్యం ఎక్కడ లేదు అంతా దైవమే ఒక నాణానికి రెండు రూపాలు ఎట్లనో
మనం చేసే పనులను బట్టి దైవం దర్శనమిస్తాడు

మనం చేసే వృత్తి సరైనద కాద అని మనమే నిర్ధారించుకొని
మన వృత్తిలో మనం ముందుకు సాగాలి

సత్యవాణి

Source - Whatsapp Message

No comments:

Post a Comment