Sunday, October 25, 2020

భగవంతుడు మనకంటే వేరని తలచటం అర్థరహితం. మనయందే ఉన్నటువంటి భగవంతుడిని...

🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺

🌷 message of the day 🌷

🌴భగవంతుడు మనకంటే వేరని తలచటం అర్థరహితం. మనయందే ఉన్నటువంటి భగవంతుడిని ఒక గుడికో, చర్చికో, మసీదుకో పరిమితం చేయకూడదు. మన అస్తిత్వమే భగవంతుడు. దేవుడొక వ్యక్తి అయివుంటే మనం ఆయనను బహుశా సోమవారమో లేదా ఇంకేదో వారమో కలుసుకోవచ్చు. మిగతా దినాలలో ఆయన వేరేవారితో బిజీగా ఉండడంచేత మనం ఆయనను కలుసుకోలేకపోవచ్చు! కాని దేవుడొక వ్యక్తికాదు, ఒక మహాచైతన్యం. ఈ చైతన్యాన్ని మనం సరైన సాధనలు చేసి అనుభూతి చెందవచ్చు. కొంతమంది, “నేను దేవుడిని చేరుకోవాలి" అంటూ ఉంటారు. కానీ, భగవంతుడు మనం చేరుకోగల ప్రాంతమో పట్టణమో కాదు. చేప నీళ్ళలోనే ఉంటుంది . చేపయందునూ నీరుంటుంది. అది నీళ్ళకోసం వెతుక్కుంటూ ఎక్కడకో వెళ్ళనక్కర్లేదు కదా! మన పరిస్థితి కూడా ఇటువంటిదే. మనం భగవంతుని యందే ఉన్నాము. మన యందూ భగవంతుడు ఉన్నాడు. మనం భగవంతుడిని కోసం ఎక్కడకీ వెదుక్కుంటూ పోనవసరం లేదు. నిరంతర సాధన చేస్తుంటే ఆయనే మనలను వెదుక్కుంటూ వస్తాడు. మన హృదయం అంతరాళంలో సందడి చేస్తాడు. 🌴

Source - Whatsapp Message

No comments:

Post a Comment