Tuesday, October 27, 2020

ఉన్న స్తితి నుండి ఉన్నతమైన స్థితికి చేరుకునే ఆలోచన శక్తి... దైవం ఇప్పటికి..

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

🌸 నరుడా ఏమి కోరిక...? 🌸

🌸 మానవుడు జననం ఎలా ఉన్నా మానవుడు మారింది మాత్రం అవసరం కోసమే అనేది వాస్తవం... అవసరమే అన్ని నేర్పింది... అవసరం లేకపోతే ఇక్కడివరకు ప్రయాణం జరిగేది కాదు... మొదట తిండి కోసం తర్వాత నిద్ర కోసం ఆ తర్వాత ప్రకృతిని అర్ధం చేసుకోవడం కోసం.. ఇలా ప్రయాణం చేయడం వల్ల తనని తాను మార్చుకుంటూ కొత్త కొత్త దారులను చేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు... ఈ మార్పులకు కారణం ప్రకృతే అనేది అక్షర సత్యం... మార్పు అనేది గమనించి దానికి ప్రత్యామ్నాయ0 కోసం చేసిన ఆలోచనే ఇప్పటి మానవుడు..

🌸 మానవుడి ఆలోచనే అన్ని సృష్టించినది.. ఇన్ని సృష్టించిన మానవుడుకు దేవుని అవసరం ఎలా వచ్చింది అనేదే ప్రశ్న... దేముడు వచ్చిన తర్వాత స్వర్గం, నరకం అనేవి వచ్చాయా... దేముడికి ముందే అవి ఉన్నాయా...? అనేది మరో ప్రశ్న... ఈ ప్రశ్న గురించి ఆలోచన చేస్తే చిక్కుముడి వీడేదే... ఇప్పటివారికి... ఆ ఆలోచన చేయ్యకపోవడానికి కారణం సౌలభ్యం అనేది వాస్తవం.. ఇలా చెప్పటానికి కారణం ఇప్పటి వరకు సృష్టించిన దారులు, వస్తువులు, అవసరానికి కొన్ని ఉంటే సుఖపడతానికి కొన్ని ఇక్కడ గోల మొదలైంది... అంటే సృష్టించటం తెలిసిన మానవుడు అవసరానికి కాకుండా ఆధిపత్యం కోసం వాడటం మొదలు పెట్టి తన పరిస్థితి తన చేతిలో లేకుండా చేసుకున్నాడు... తను అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకోటిగా మారేసరికి... తనుచేసే పనులు మీద, కోరికల మీద, ఆలోచనల మీద నియంత్రణ కావలసి వచ్చింది..
దానికోసం చేసిన ప్రయత్నం ఇంకో సృష్టి... ఇలా సాగుతొంది అని గమనించిన మానవుడు ఆధిపత్యం కోసం చేసిన ఆలోచన... దేముడు..

🌸 అప్పుడు జరిగిన సృష్టి దేముడు... తరువాత పాప పుణ్యాలు... వీటిని అర్ధం చేసుకోవాలి అంటే మంచి చెడులు... వీటిని దాటేస్తాడేమో అని స్వర్గం నరకాలు సృష్టించిన తర్వాత కుటుంబాలు, అనేక కుటుంబాలు ఒక తెగ ఆ తర్వాత సమాజం అనేది నిర్మాణం జరిగింది... అందుకే ఇప్పటికి సమాజ పరిధినుంచి ఎవరు బయటకు రాలెరు.. సమాజం ప్రశ్నించేవారిని నిద్రపుచ్చుతుంది అనేది వాస్తం.. కానీ ఇక్కడ సరైన దారిలో నడిచిన వ్యక్తులు తమను నడిపించే శక్తి కోసం చేసిన ప్రయత్నాలు చేసిన సృష్టి దైవం.. సరైన దారి అనటానికి కారణం అక్కడ ఆధిపత్యం కోసం కాకుండా అంతకు మించిన ఆలోచన కోసం ప్రయాణం చేశారు అనడం సబబు.. ఇదే మానవుడి లేదా నరుడి కోరిక...

🌸 ఇక్కడ మనకు స్పష్టం ఐనది ఏమిటంటే ఉన్నది శక్తి..
ఆ శక్తిని ఎవరు త్వరగా తమలో గుర్తుకు తెచ్చుకుంటారో వారు దానిద్వారా తమను తాము ఉన్నంతస్థాయిలో నిలబెట్టుకుంటున్నారు.. ఎవరైతే తమ శక్తిని ఆలోచనను నమ్మరో లేదా ప్రవాహంలో కొట్టుకెలుతున్నారో వారు ఎవరో ఒకరిమీద ఆధారపడి జీవనం సాగిస్తూన్నారు అనేది వాస్తవం...
ఉన్న స్తితి నుండి ఉన్నతమైన స్థితికి చేరుకునే ఆలోచన శక్తి... దైవం ఇప్పటికి..

Thank you...🌸🌸🌸

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

Source - Whatsapp Message

No comments:

Post a Comment