Monday, January 23, 2023

రెండు తప్పల నుండి తప్పించుకుందాం

 *రెండు తప్పల నుండి తప్పించుకుందాం*

సాధారణంగా మనిషి రెండు తప్పులను చేస్తూ ఉంటాడు. మొదటి తప్పు అత్మస్తుతి. రెండవది పరనింద. రెండూ తప్పులే. ఇతరులు పొగిడితే మంచిదే కానీ మనిషి తానెంత గొప్పవారైనా తనను తాసు పొగుడుకోకూడదు. 

इन्द्रो पि लघुतां याति स्वयं प्रभ्यापितैर्गुणैः |

దేవతల అధిపతి అయిన దేవేంద్రుడు కూడ తన గొప్పతనాన్ని తానే ప్రశంసించుకుంటే ఆ గొప్పతనాన్ని కోల్పోక తప్పదని చెప్తారు. అందువలన ఎట్టి పరిస్థితులలోను మానవుడు ఆత్మస్తుతి చేసుకోకూడదు.
ఇతరులను నిందించడమూ పాపమే. ఒక మనిషిని హత్య చేసినదానికంటే అది ఎక్కువ పాపం. ఇందుకు మహాభారతంలో ఒక ఉదాహరణ ఉంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణునితో యుద్ధం చేయటం ధర్మరాజుకు చాలా కష్టమైంది. ఆ కష్టానికి తట్టుకోలేక ధర్మరాజు యుద్ధభూమి నుండి వెనుదిరిగి శిబిరానికి వెళ్లిపోయాడు. యుద్ధభూమిలో ధర్మరాజు కనపడక అర్జునుడు చాల చింతించాడు. అతని కోసం వెదికివెదకి చివరికి శిబిరానికి చేరాడు. అక్కడ ధర్మరాజును అర్జునుడికి చూసిన వెంటనే 'కర్ణుడిని చంపావా లేదా? అని ప్రశ్నించాడు. ఆశ్చర్యంతో లేదు అని అర్జునుడు సమాధానమిచ్చాడు. మిమ్ములను వెతుకుతూ ఇక్కడికి వచ్చాననీ చెప్పాడు. అప్పుడు కోపంతో ధర్మరాజు ఇలా అన్నాడు. కర్ణుడిని చంపలేకపోతే, నీకు గాండీవమెందుకు? దండగ. దానిని ఎవరికైనా దానం చేయి అని కోపంతో అన్నాడు.
ఆ మాటలు వినగానే అర్జునుడి మనస్సు గాయడింది. శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నించాడు. నా గాండీవాన్ని త్యజించమన్న వారిని నేను చంపుతానని నేను శపథం పట్టాను. అందువలన నేను ధర్మరాజుని చంపాలి. కాని ఆయన నా అగ్రజుడు. ఇప్పుడు నా శపథాన్ని నెరవేర్చు కొనడమెలా? అర్జునుడిని ప్రశ్నకు శ్రీకృష్ణుడిలా సమాధానమిచ్చాడు. ధర్మరాజు వంటి మహా పురుషుని చంపాలనుకోవటమే మహాపాపం. కాని నీ శపథాన్ని నెరవేర్చక తప్పదంటున్నావు. నీవు ధర్మరాజును ఎటువంటి కారణం లేకుండానే నిందించు. అలా నిందించటం హత్య చేసినంత పాపం, అని కృష్ణుడు పలికాడు.
దీని ద్వారా ఒక వ్యక్తిని నిందించటం అతనిని హత్య చేసినదానికంటే ఘోరమైన పాపమని మనకు తెలుస్తోంది. అందువలన మనల్ని మనం పొగుడుకోవటం, ఇతరులను నిందించటం మనం చేయకూడని పనులు. మన జీవితంలో ఆ రెండు తప్పులు చేయకూడదు. 

यदीच्छसि वशी कर्तुं जगदेकेन कर्मणा |
परापवाद सस्येभ्यः गाश्चरन्तीर्निवारय ||

ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం మానివేస్తే వాళ్లు మీకు సహాయపడవచ్చు.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు. 

No comments:

Post a Comment