Wednesday, December 20, 2023

_సమయం లేదు మిత్రమా..!_* (_సుధామూర్తి రచనకు_ _నా అనువాద ప్రయత్నం.._)

 *_సమయం లేదు మిత్రమా..!_*

(_సుధామూర్తి రచనకు_
_నా అనువాద ప్రయత్నం.._)

ఈ రోజు 
అలా మొదలైందో లేదో..
అప్పుడే సాయంత్రం 
ఆరై పోయింది..

సోమవారం..గడిచింది..
తర్వాత మంగళవారమే అనుకునేటప్పటికి 
శుక్రవారం వచ్చేసిందే..

కళ్ళు మూసి తెరిచేలోగా
నెల గడచిపోయింది..

అరె..జనవరి..ఫిబ్రవరి..
ఇలా నెలలు దాటి 
డిసెంబర్ వచ్చేసిందా..

జీవితంలో అప్పుడే యాభై..అరవై సంవత్సరాలు గడచిపోయాయి..

మనల్ని కన్న తల్లిదండ్రులు..
సహాధ్యాయులు కొందరు..
చిన్ననాటి స్నేహితులు..
తెలిసిన అనేక మంది
కాలం చేసేశారు..

ఇప్పుడు వెనక్కి వెళ్ళేది అసాధ్యం..

సరే..జరిగిందేదో జరిగిపోయింది..

మిగిలిన కాలాన్ని..
జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చెయ్యాలి..

నచ్చిన పనులు చేద్దాం..

కాస్త సోగ్గా తయారు కూడా అవుదాం..తప్పేంటి..

మనం నవ్వుతూ ఉందాం..
తోటి వారిని సంతోష పెడదాం..అలసిన హృదయాలకు 
నవ్వుల పూతమందు రాద్దాం..

శరీరం కొంతమేర సహకరించదేమో..

అయినా..

జీవితంలో మిగిలిన సమయాన్ని ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిద్దాం..

అన్నట్టు..
అన్నిటికంటే ముఖ్యంగా..

జీవితంలో తర్వాత అనే పదాన్ని శాశ్వతంగా తొలగిద్దాం..

తర్వాత చూద్దాం..
తర్వాత చేద్దాం..
తర్వాత ఆలోచిద్దాం..

ఇలాంటి పదాలకు 
తావు ఇవ్వొద్దు..
వాయిదా పద్దతుంది దేనికైనా..ఇదే మొదటి నుంచి మన ఫిలాసఫీ..
దానికి స్వస్తి పలుకుదాం..
ఎందుకంటే ఇక మన దగ్గర అంత సమయం లేదు..

చూడండి..
తర్వాత ఎప్పుడూ 
మనది కాదు..
ఒక్కోసారి రాదు కూడా..

మనకి తెలియదా..
తర్వాత తాగాలనుకంటే
కాఫీ చల్లబడిపోతుంది..

తర్వాత అనేది వచ్చేపాటికి
మన ప్రాధాన్యతలు మారిపోవచ్చు..

మన రూపం..శరీర తత్వం..
మారిపోతాయి..
ఓపిక..శక్తి తగ్గిపోతాయి..!

పగలూ..రాత్రులూ గడచిపోతాయి..
తేదీలు మారిపోతాయి..
క్యాలండర్ తిరిగిపోతుంది..
బ్రతుకే అంతం అయిపోతుంది..!!

అందుకే..అందుకే..
దేన్నీ కాలానికి వదలొద్దు..
వదిలితే..
చక్కటి అనుభూతులు..
మరిన్ని అనుభవాలు..
మంచి స్నేహితులు..
చక్కటి కుటుంబం..
అందమైన పరిసరాలు..
బోలెడన్ని రుచులు..
ఇంకా ఎన్నో..ఎన్నెన్నో
మిస్ అయిపోవచ్చు..

అందుకే మేలుకో..
తెలివి తెచ్చుకో..
ఈరోజే నీది..
ఈ క్షణం మాత్రమే  నీకు అందుబాటులో
ఉంటుంది..

వాయిదాలు వేసే 
వయసు కాదు..
అయినా వాయిదాలతో
ఫాయిదా లేదు..

ఇదే ఇదే వాస్తవం..

శరీరం సహకరించకున్నా..

నచ్చిన ప్రదేశాలు 
చూసి వద్దాం..

ఇన్నాళ్లు ఏవైతే మిస్సయ్యాము అని బాధ పడ్డామో అవన్నీ చేసేద్దాం..

జీవితం మొదలే చిన్నది..
రోజు గడుస్తున్న కొద్దీ
ఇంకా ఇంకా చిన్నది..

చేదుగా అనిపించినా..
కరకుగా వినిపించినా 
ఇది నిజం..!

(స్వేచ్ఛానువాదం..)

*_సురేష్..9948546286_*

A beautiful writeup from Sudha Murthy  

I feel...... 

"Barely the 
_Day Started_ 
and... it's 
 _Already six in the evening._ 

Barely 
 _Monday Arrived....._ 
 And it's 
 _Already Friday._ .......

Before we could _Realise_ .....
The _Month_ is 
 _Already Over....._ 

And, And....

 _The Year is Almost Over._ 

As of now......
Already 
 _40, 50 or 60+_  
 _Years of Our Lives_ 
 have passed.......

... And Suddenly 
 _We Realise_ 
that 
we 
Lost our 
_Parents_ ...
 _Friends......_ 
and some 
_Beloved Ones......_ 

And than we _Realize_ it's 
 _Too Late to Go Back......._ 

So... 
 _Despite Everything......_ 

Let's Try.......
To 
 _Enjoy the Remaining Time........._ 

Let's keep looking for _Activities_ that _we like..._ 

Let's put some _Color_ in our _Grey_ (if we aren't _Bald_ yet)........

Let's _Smile_ at the 
 _Little Things in Life_ 
that put 
 _Balm in our Hearts._ ......

And despite 
 _Our Physical Discomfort_ ......

Lets continue to 
 _Enjoy_ with _Serenity_ the _Time Left in Us...._

Basically the implied meaning of this _Message_ is 

That 
Let's try to 
 _Eliminate_ 
 _The Afters_ ...

I'm _Doing_ it _After_ ...
I'll  _Say After_ .......
I'll _Think_ about it _After_ .......

Yes.....
We are habituated to _Leave everything_ to 
 _Postponing_.... 

High time we understand 
′′ _After_ ′′ is 
" _Never Ours"......_ 

 _Aren't We Aware....._ 

_Afterwards Means_ , 
The _Coffee_ gets _Cold_ ...

 _Afterwards Means_ , 
 _Our Priorities_ tend to _Change_ .......

 _Afterwards_ _Means_ , the _Charm_ is _Broken_ .......

 _Afterwards_ _Means_ _Health Passes..._ 

 _Afterwards Means..._ 
 _The Day_ becomes 
 _The Night..._ 

And 
 _Suddenly Afterwards_ _Life Ends....._ 

So... 
Let's _Leave Nothing_ for _Later_ .......

If we continue to 
 _Harp_ on 
 _Afterwards/Later Syndrome_ .........

We will _Lose_ the 
 _Best Moments_ .....
 _Best Experiences...._ 
 _Best Friends....._ 
 _Best Time_ with _Family_ ...

Lets Wake Up.....
Realise
 _The Day is Today..._ 
 _The Moment is Now...._ 

 _Lets Face Stark_ 
 _Reality ......._ 

We are 
 _No Longer_ 
at the 
_Age_ 
where we can 
 _Afford to Postpone_ ....

Hope You have 
 _Time to Read_
 this Message and Share it with 
_Like Minded_ 
Similar Aged Persons who 
 _No Longer_  
 _Have Luxury__ 
To _Postpone_ .......

(Or maybe you'll leave it for... ′′ _Later_ "...
And you'll never Share it..).

No comments:

Post a Comment