Tuesday, March 26, 2024

 [3/24, 11:42] +91 73963 92086: మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 01
పరిపూర్ణత కొరకు జాగరూకత
పరిశుద్ధ జీవనము, మర్మములేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటుపడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయి యెడల సోదర భావము, సలహాలను, నియమములను స్వీకరించుటకును, ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట,
దేశికుని యెడల విశ్వాసనీయమైన ధర్మానుష్టాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట,
తన సిద్ధాంతములను నిర్భీతిగా నుద్ఘాటించుట, అన్యాయమునకు గురిచేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్తవిద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి,
పరిపూర్ణతల యెడ నిరంతరము, జాగరూకత కలిగి యుండుట అనునవి దివ్యజ్ఞానమను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన సువర్ణ సోపానములు ...
[3/24, 11:42] +91 73963 92086: మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 02
ఆధ్యాత్మిక‌ జీవన విధానమును అవలంబించిన‌ వారు‌ జీవితంలో చాలా కష్టాలను‌ అనుభవించవలసి ఉంటుందని, చాలా పరీక్షలకి వారు తట్టుకొని నిలవాలని చెపుతారు. అది ఎంత వరకు సత్యము ?

తనను అన్వేషించు వారి మార్గంలో అవరోధాలను కలిగించి ముళ్ళను పరచుట భగవంతునికి ఇష్టమైన పనికాదు.

మానవుడు తాను నడిచే దారిలో తానే అరటిపండు తొక్కలు, ముళ్ళు పడవేసుకోకుండా ఉంటే చాలు. ఇతరుల మార్గంలో కూడ అతడు ఆ విధంగా చేయకుండా ఉండాలని కోరుకొనడమైనది.

అతడు బాధ్యతను గుర్తించవలసి యున్నది. పొరబాటైన ఆలోచన, మాట, ఆచరణ అనే వాటిలో పొరబాట్లు రాకుండా ఉండేటట్లుగా అభ్యాసము చేయాలి.

మనకి మనమే ఏర్పరచుకొనే పరీక్షలు తప్ప వేరే పరీక్షలకు మనము గురికావలసిన పనిలేదు. ఒక యువకుడు ఒక యువతితో భావావేశ పూరితమైన స్నేహంలోకి దిగినప్పుడు ఆ వ్యవహారము చక్కబడి అతడు దాని నుండి బయటపడే స్థితిలో తనను తాను ఉంచుతాడు.

ఆ విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుంటాడు. ఆ సన్నవేశాలను పరిష్కరించుకొనే ప్రయత్నంలో తాను వెతుకుచున్న‌ కష్టాలను చవిచూస్తాడు. కారణాలు మాత్రము తనకన్నా బాహ్యములైనవిగా ఉంటాయి.

తన కష్టాలకు గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో అతడు ఇతరులను అనుమానిస్తాడు. నక్షత్రాలను, గ్రహములను, చివరకు తన ఉనికికి కారణమైన భగవంతుని కూడ అనుమానిస్తాడు. ఆ విధంగా నీ ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులు పెట్టే పరీక్షలు ఏమీ ఉండవు.

నీకు మంచిని సూచించడానికే గురువుకు సమయం దొరుకుతుంది గాని నిన్ను పరీక్షించడానికి కాదు.
[3/24, 11:42] +91 73963 92086: ప్ర : పాప,పుణ్య కర్మలు జన్మలకు హేతువులంటారు కదా! మరి కర్మలు చేయకుండా ఉండలేం! చేసిన కర్మల్ని ఎలా క్షయం చేసుకోగలం? ఎంత చేసినా కర్మ అనుభవించవలసిందేనంటారు కదా? ఎలా బయటపడగలం? పాప నాశనానికి మార్గమేమిటి? పూజాదులు ప్రారబ్దాన్ని పోగొట్టగలవా?
జ : కర్మ చేయకుండా మానవుడు ఉండలేడు. అసలు కర్మాచరణ కోసమే జన్మ కర్మాచరణ ద్వారానే కర్మబంధం నుండి విడుదల పొందగలం. ముల్లును ముల్లుతోనే తీయాలి కదా! ఈశ్వరార్పణ బుద్ధితో చేసే సత్కర్మ బంధన హేతువు కాదు.సత్కర్మాచరణ తప్పనిసరిగా చేయాలి.
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవః- 'తన కర్మతో ఈశ్వరుని అర్చించి మానవుడు సిద్ధిని (ముక్తిననీ, జ్ఞానాన్నీ) పొందుతాడు 'అని గీతావచనం.
ఇక - పుణ్యకర్మకి గానీ పాపకర్మకిగానీ మూడు అంశాలుంటాయి.బీజాశం, వృద్ధ్యంశం,భోగాంశం అనే మూడు భాగాలవి.
బీజాంశం -జ్ఞానం చేతను,
వృద్ధ్యంశం- ప్రాయశ్చిత్తాది పుణ్య కర్మలచేతను,
భోగాంశం - అనుభవం చేతను నశిస్తాయి. క్షేత్ర యాత్రలు, అర్చనలు, ఉపవాసాది వ్రతాలు - పాపములు వృద్ధి కాకుండా మనల్ని కాపాడతాయి.
అంతేకాక, దేవతారాధన, దానాదుల వల్ల భోగాంశాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది. ఆ సత్కర్మలు చేయనివాళ్ళు తట్టుకునే శక్తి లేక వీగిపోతారు.
భగవచ్చింతన, కైంకర్యం తాళుకొనే శక్తినిచ్చి భోగాంశను దాటిస్తాయి. వృద్ధ్యంశను పోగొడతాయి. క్రమంగా జ్ఞానం సమ కూరి బీజాంస కూడా పోతుంది. భగవత్ ధ్యానం వల్ల మానసిక పాపం నశిస్తుంది. జపంచేత,సంకీర్తన చేత వాచిక పాపం పోతుంది. ఉపవాస,అర్చనాదుల వల్ల శారీరక (క్రియతో చేసిన )పాపం హరింపబడుతుంది. ధనంతో, ధనంకోసం చేసిన పాపాలు దానం వల్ల పోతాయి. అందుకే మానవులు నిరంతరం పాప నిర్మూలన కోసం ప్రయత్నించాలి. ఈ పాపాలు గతజన్మ పరంపరల నుండి వచ్చినవి కూడా కావచ్చు. లేదా - తరువాతి జన్మలలో అనుభవించవలసినవైనా కావచ్చు.
ఏవేమైనా సర్వపాప క్షయానికీ పైసాధనలే శరణ్యాలు.

No comments:

Post a Comment