Thursday, March 28, 2024

చదువు

*🍁చదువు*🍁

✍️ మురళీ మోహన్ 

👉"ఏంటి రా గోపి, బడికి వెళ్లకుండా గేదలు కాయటానికి వచ్చావ్"
అని అడిగింది గేదలలో 
వెనకనున్న  *ఆవు*. 

"నాకు ఇక చదువు రాదని 
మానాన్న మరియు సర్ 
నిన్న ఓ నిర్ణయనికి వచ్చారు" 
బాధగా చెప్పాడు *గోపి.* 

*"చదువేముందిరా, నేను గడ్డి తిన్నంత సులువు"* 
అంది ఆవు.

 *"అలనా ఎలా?"* 
ఆశగా అడిగాడు గోపి. 
అప్పటికే పొలం వచ్చింది. 
"ముందు నన్ను కాస్త తినివ్వు తరువాత చదువు మర్మం చెపుతా "అని మేత లో మునిగి పోయింది ఆవు. 

కాసేపు ఓపిక పట్టిన గోపి 
"ఎం చేస్తున్నావ్? 
నాకు ఎదో చెపుతానని 
నీవు తింటూ ఉన్నావ్" 
అని అడిగాడు. 
నేను ఏకాగ్రతగా 
*ఆంత్ర గ్రహణం* చేస్తున్నా....  
కదిలించకు అంది ఆవు. 

అదేమిటి కొత్త గా ఉంది అని గోపి అనగా "ఆహారాన్ని లోపలకు తీసుకోవడాన్ని *ఆంత్ర గ్రహణం*  అంటారు.
అంటే *క్లాస్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినటం లాంటిది.* ఇక్కడ శ్రద్ధ అవసరం. 
అర్ధమైన కాకున్నా ముందు ఆలకించాలి. 
*ఇది చదువు మొక్క మొదటి లక్షణం.*

ముందు నన్ను సరిపడినంత తిననివ్వు. 
మిగిలినది తరువాత చెపుతా" అంటూ తినటం కొనసాగించింది. 
గోపి పరికించి 

*తినటం లో ఉన్న శ్రద్ధ వినటం లో ఉండాలన్నమాట* 
" అనుకున్నాడు.

కాసేపు గడిచాక  ఆవు , 
గోపి ఇద్దరూ చెట్టు కిందకు చేరారు.
 "అదేంటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నములుతున్నావ్" 
వింత గా అడిగాడు గోపి. 
దానికి ఆవు నవ్వుతూ ..... 
దీనిని *నెమరు వేయటం* 
అంటారు. 
ఇందాక  గబ గబ తిన్న ఆహారాన్ని తీరుబడిగా నోటిలోకి తెచ్చుకొని నమలటం. 
ఇది చాలా ముఖ్యం.

"ఎందుకలా" అడిగాడు గోపి. 
*సర్ చెపుతున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి.*
*కానీ కాసేపటికి మర్చిపోతాం.* 
*అందుకే ఇంటికి వచ్చాక తీరుబడి గా నెమరు వేసుకోవాలి.* 
*ఎవరికైతే నేమరు వేసే అలవాటు ఉంటుందో వారికి చదువు బాగా జీర్ణమౌతుంది.*

నిజానికి చదువు లోని మర్మం ఇదే.
అని రహస్యంగా చెప్పింది ఆవు.

 గోపీకి తన పొరపాటు ఇప్పుడు అర్ధమైంది. 
తాను ఏనాడు ఇంటికొచ్చి 
పుస్తకం ముట్టింది లేదు.

సాయంత్రమయ్యింది. 
గేదలు ఇంటికి మల్లాయి. 
గోపి చూపు అంతా ఆవు మీదనే ఉంది. 
అది ఉదయం కన్నా హుషారుగా ఆనందగా ఉంది. 
ఏంటి విషయమని గోపి అడిగాడు.

దీనిని *స్వాంగీకరణ* అంటారు. జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి మనకు శక్తిని హుషారు ను ఇస్తుంది. జీర్ణం సరిగా జరిగితేనే ఈ ఆనందం అనుభవించగలం.

అంటే చదువు నీకు అర్థమై *ఒంటపట్టటం*. 
అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది. 
నీకు ఒక పేరును గుర్తిపును తెస్తుంది. 
నీ ముఖం లో ఓ వెలుగు, 
నీ పేరుకు ఓ మెరుపు వస్తాయి అంది ఆవు. 

గోపి గుండె పట్టుదలతో కొట్టుకోగా రక్తం వేగంగా పంతంగా పరిగెత్తింది.

అంతేనా ఇంకేమైనా ఉందా? ఆలోచనగా అడిగాడు గోపి.

ఇంకో విషయం ఉంది. 
పేడ తట్ట తీసుకొని రా చెపుతా అంది అవు. 
గోపీకి విషయం అర్థమై తట్ట తెచ్చి పేడ పట్టి పక్కన పెట్టి చెప్పు అన్నాడు. 

చదువులో చివరి విషయం 
*మల విసర్జన* .  
అంటే *పనికి మాలిన పనులు వదిలేయడం*.  
కబుర్లు.... సెల్ ఫోన్ ,  
tv  లు ముచ్చట్లు .... 
వీటిని విసర్జించాలి.

అప్పుడు నీకు జీర్ణం చేసుకోవటానికి మరింత   సమయం దొరుకుద్ది. 
అని నవ్వుతూ చెప్పి ముగించింది ఆవు.
 ఆవుకు మేత పెట్టి గోపి ఇంటికెళ్లాడు.

నెల గడిచింది. 
గోపికి SA 2 ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ .... 
సర్ ఆశ్చర్యముగా మెచ్చుకోలుగా 
చూసాడు.

ఈ సారి గోపి ఇంటి కెళ్లకుండా నేరుగా ఆవుల వద్దకు బయలు దేరాడు. 
"ఆ " రోజు సాయంత్రం ఆవు నడిచిన నడకలోని శక్తి  గోపి అడుగులలో ఈ రోజు  కనిపిస్తుంది.🚩

No comments:

Post a Comment