Monday, July 29, 2024

 *🌺 ఓం నమఃశివాయ 🌺*


*' త్యాగే నైకే అమృతత్వ మానసు: '....అంటుంది వేదం....*

*అంటే త్యాగము ద్వారానే అమృతత్వం సిద్ధిస్తుంది..*

 *నిండిన కుండ ఖాళీ అయితేనే మళ్ళీ నింపడానికి వీలు పడుతుంది..*

 *గుడి ముందు ఉన్న యాచకులను బాగుచేయలేని వాడు దేవుడెలా అవుతాడు !?*

 *మనల్ని ఎలా బాగు చేస్తాడని  కొందరు మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు..*

*అయితే  ఆ యాచకులను ఆదుకొమ్మనే దేవుడు తమకు ధనాన్ని ఇచ్చాడని, వారిని తన దృష్టిలో పడేలా చేశాడని మాత్రం తెలుసుకోరు!*

 *వారికి పైసా విదల్చరు కానీ దేవుని ఉనికిని ప్రశ్నిస్తారు!! ఇది తగని పని..*

 *ఉన్నదానిని పది మందికి పంచి ఆదుకోవాలి..*
 *భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.*

  *తమ గురించి తాము ఎటువంటి ఆందోళన చెందకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచుకోవాలి.*

 *మీ పాత్ర ఖాళీ అవుతుంటే భగవంతుడు దానిని మళ్ళీ నింపుతుంటాడు.*

 *తద్వారా త్యాగమనే చక్రం నిరంతరం తిరుగుతూ ఉండాలి.._*

*🌹ఓం నమఃశివాయ 🌹*

No comments:

Post a Comment