Wednesday, July 24, 2024

శ్రమ శరీరానికి ఎంత అవసరమో - మంచిగా, ధర్మముగా జీవించటం అంతరంగానికి అంత అవసరం. ఆలోచించి చూడండి.

 🌹గుడ్ మార్నింగ్ 🌹మన శరీరం ఆహారముతో రోజు ఎలా ఎదుగుతూ శక్తివంతము అవుతున్నదో - ఆహారము తీసుకోక పొతే నీరసించటం - సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్యాల బారిన పడటం ఎలాజరుగుతున్నదో - అలాగే రోజు జ్ఞానం తెలుసుకోకపొతే బుద్ది బలం తగ్గుతుంది, సరైన మంచి జ్ఞానం తెలుసుకోకపోతే - చెడు ప్రవర్తనలోకి వెళ్ళిపోతాము. ఆలోచనలు, బుద్ది, మనసు, అన్ని చెడులోకి వెళ్ళిపోతాయి. ఆహారం తీసుకున్న దానికి తగినంత పనికూడా చేయాలి. శ్రమ లేకపోయినా శరీరం అనారోగ్యాలకు గురి అవుతుంది. ఇదే మాదిరిగా జ్ఞానము తెలుసుకుంటూ - దానిని జీవితములో ఆచరించాలి అంటే మంచిగా మాత్రమే జీవించాలి. లేకపోయినా తెలుసుకున్న జ్ఞానం కూడా వక్రతకు వాడుకుంటాము. ఆహారం శరీరానికి ఎంత అవసరమో - మంచి జ్ఞానం మనసుకు, బుద్ధికి అంత అవసరం. శ్రమ శరీరానికి ఎంత అవసరమో - మంచిగా, ధర్మముగా జీవించటం అంతరంగానికి అంత అవసరం. ఆలోచించి చూడండి. 🌹god bless you 🌹

No comments:

Post a Comment