Monday, July 29, 2024

నేటి ఆధ్యాత్మిక సాధన..

 *_🌹'నేటి ఆధ్యాత్మిక సాధన..'🌹_*

*_యోగము అంటే కలయిక అని అర్థం .అంటే జీవాత్మ పరమాత్మ కలయిక యోగము అంటున్నారు ._*

*_మనము పరమాత్మ నుండి వేరైనప్పటి నుంచి అనేక జన్మలు ఎత్తి అజ్ఞానము తో తిరిగి తిరిగి జన్మిస్తూ ఉన్నాము._*

*_ఒక సాలిపురుగులాగా ఒక గూడు నిర్మించుకొని ఇదే జీవితం అనుకుని మనము అలాగే జీవిస్తూ ఉన్నాము. అంటే ఈ భూమిపైన మనం నివసించే ఈ భూమి సాలి పొరుగు గూడు లాగా అనుకుంటే మన వ్యవహార శైలి ఈ భూమి పైన జీవనము జీవిస్తూ ఉన్నాము._*

*_ఇలా ప్రతి జన్మలోను జరుగుతూనే ఉంది. కానీ మనము ఎందుకు పుడుతున్నాము ఎందుకు మరణిస్తున్నారు అని తెలుసుకోవడానికి మానవజన్మ అనేది .మట్టి అగ్ని వాయువు నీరు ఆకాశము అనే పంచతత్వాలతో ఈ భౌతిక దేహాన్ని పరమాత్మ తయారు చేశారు ._*

*_మట్టిలో ఉండే ఎలక్ట్రాన్ ప్రొటన్ న్యూట్రాన్ ఈ అణువులే మన కణాల్లోనూ ఉన్నవి. మరి ఇవి అంతా ఒక దగ్గర చేర్చి ఈ మానవ దేహం తయారు చేయడం అనేది ఎంతో అద్భుతమైన సృష్టి ._*

*_ఏ జీవికి లేని ప్రత్యేకత మానవ జన్మకి ఉంది అదే జ్ఞానం .ఈ జ్ఞానము చేత మనము సర్వ జీవులను అర్థం చేసుకొని వాటిని మనం నియంత్రిస్తున్నాము . ఈ భూమిపైన లభించే ప్రతి వస్తువును మనకోసం ఉపయోగించుకుంటున్నాము. అన్ని జీవులు అవి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా అదే జీవన శైలిని కలిగి ఉంటాయి._*

*_కానీ,మనం ఎన్నో మార్పులు చేసుకొని సుఖాల కోసం ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాము .ప్రకృతిలోని జీవులు అంతరిస్తే ఒక నాటికి మానవ జన్మకి ముప్పుగలుగుతుంది ._*

*_పక్షులు లేకపోతే ప్రకృతి పెరగదు కారణం పక్షులు గింజలు తిని, అనేక చెట్ల పైన వాలి విసర్జన వల్ల తిరిగి గింజలు మొలకెత్తి ప్రకృతి పెరుగుతూ ఉంటుంది .ప్రకృతి ఉంటేనే మనకి వర్షాలు కురుస్తాయి. కాబట్టి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా మన బాధ్యత .చెట్లను కూల్చకూడదు._*

*_మీరు ఆ ప్రకృతిలో కూర్చుని మీరు ధ్యానిస్తూ ఉంటే చుట్టూ వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది .అవి మొక్కలు గ్రహిస్తాయి .అంటే మీలో ఉండే కాంతి మొక్కలలో కూడా వెళుతూ ఉంటుంది. అవి ఎంతో పచ్చదనంతో ఉంటాయి . సూర్యరశ్మి వల్ల ఎలా ఆహారం సంపాదించుకుంటాయో ఆ కారణం చేత పచ్చదనం అనేది వస్తుంది .మీరు చేసే ధ్యానం వల్ల కూడా ఆ కాంతితో ఆ మొక్కలలో ఈ శక్తి వెళ్లడం వల్ల అక్కడ మొక్కలు కూడా పచ్చదనంతో ఉంటాయి ._*

*_పూర్వకాలంలో ఋషులు ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉండేది వాతావరణం . చంద్రుడు ప్రకాశించే వెన్నెల వల్ల కొన్ని దివ్య ఔషధ మొక్కలు పెరుగుతాయి. సత్యయు గంలో ఇవి ఎక్కువగా ఉండేవి. ఈ కలియుగంలో కొన్ని దివ్య ఔషధ మొక్కలు వాటిలోని ప్రభావాన్ని కోల్పోయాయి. మానవుల లాగే._*

*_సత్య యుగంలో మానవులు ఎంతో తేజస్సుతో ఎంతో జ్ఞానముతో ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వారిలోని ఆత్మ తత్వం కూడా ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. కారణం వారు ఆ కాలంలో సత్య ధర్మాలను పాటించేవారు .ఆత్మ ప్రకాశానికి కారణం ధర్మబద్ధమైన జీవనం .ఆ కాలంలో భగవంతుడు పిలిస్తే పలికేవారు మరి ఈ కాలం ఎంతో గొప్ప తపస్సు చేస్తే తప్ప ఆ పలుకులను వినలేక పోతున్నాము. అది మనలోని లోపమే.._*

*_మన ఆత్మ చైతన్యాన్ని కోల్పోవడం వల్ల అంటే అజ్ఞానం మనసును ఆవరించడం వల్ల భగవంతునికి దూరం అయినాము .తిరిగి మనము ఆ భగవంతుని ధ్యానం చేత ఆయనకు దగ్గరవడానికి మన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాము._*

*_ఇక్కడ ధ్యానము అంటే మన ఆత్మ ఆ పరమాత్మ అనుసంధానమే. మన ధ్యానము ఈ భౌతిక దేహం పడిపోయిన ఈ ఆత్మ భగవంతుని చేరుకునే దాకా మన ఆత్మని మనం తెలుసుకోవడం అనేది ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ._*

*_ధ్యానం ద్వారా మీరు ఏ లోకంలో ఉండాలనుకుంటే అక్కడ ఎంత కాలమైనా ఉండవచ్చు .శరీరం లేదు కాబట్టి ఏ లోకాలకైనా క్షణాలలో వెళ్లే శక్తి మీ ఆత్మకు ఉంటుంది. కాంతి కంటే వేగంగా ప్రయాణించే శక్తి ఆత్మకు ఉంటుంది._*

*_ఎప్పుడైతే మీరు నాతో కలిసి ఈ మాటల ద్వారా వింటూ ఉన్నారు.మీరు తప్పకుండా జన్మజన్మల నుండి మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు .కాబట్టి మనము ఈ జన్మలో కూడా తిరిగి ఈ విధంగా కలిసాము._*

*_ఈ జన్మలో కూడా ఆత్మ ప్రకాశానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కావలసింది ఇదే ప్రయత్నం అనేది మానకుండా గట్టిగా పట్టుబట్టాలి. ఎన్ని పనులు ఉన్నా రోజు కొంత సమయం ధ్యానం కొరకే కేటా యించి ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పటికైనా భగవంతుని అనుగ్రహం పొందవచ్చు.☝🏾✍🏾_*

*_'శ్రీ గురుభ్యో నమః '🙏🏾_* 

 *_'సర్వం కృష్ణార్పణమస్తు.. 🚩🙏🏾_*

 *_-మీ డా. తుకారాం జాదవ్. 🙏🏾_*

No comments:

Post a Comment