Friday, July 26, 2024

*****ప్రకృతి యొక్క 3 నియమాలు

 ప్రకృతి యొక్క 3 నియమాలు 

మొదటి నియమం

ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి.

రెండవ నియమం

ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు. సుఖం కలిగినవారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు. భయస్తులు భయాన్నే పంచగలరు.

మూడవ నియమం

మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి. ధనం అరగక పోతే బడాయి పెరుగుతుంది. మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.. ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది. నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది. అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది. దుఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది.

No comments:

Post a Comment