Wednesday, November 18, 2020

ఒక జ్ణానిని ఎవరైన తూలనాడితే దానిని వారు ఎలా స్వీకరిస్తారు ?

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

ఒక జ్ణానిని ఎవరైన తూలనాడితే దానిని వారు ఎలా స్వీకరిస్తారు ?

జవాబు:

పసి పిల్లవాడు, జ్ఞాని ఒక్కటే.

సంఘటనలు జరిగినంతసేపే వారికి ఆసక్తి వుంటుంది. వాటి ప్రభావం వారిమీద ఎంతమాత్రం ఉండదు. దాని గురించిన ఆలోచనలేమీ వుండవు.

గీతలో ఒక శ్లోకము ఇలా వున్నది అహం నశించిన వ్యక్తి తన ధర్మం ప్రకారం శతృవులను (లోకం లోని వారిని) సంహరించినా అతను హంతకుడు కాడు. అతనికి ఏదీ బంధించదు.

అలాగే జ్ఞానికి గతకర్మలు వాసనలు వుండవు. అహం నశించిన వ్యక్తిని అవి ఎలా బంధిస్తాయి.

అలాగే జ్ఞాని యుద్ధంలో ఎంతమందిని చంపినా అతనికి ఏ పాపము అంటదు.

జ్ఞానికి భూత, భవిష్యత్ , వర్తమానము లేమీ లేవు.

ఆయన వీటికి అతీతుడు. ఎందుకంటే కాలాతీతమైన ఆత్మలోనే ఆయన జీవిస్తాడు కనుక.

జ్ఞానులు భవిష్యత్తు గురించి ప్రణాళిక లేమీవేయరు. వారు అలా ఎందుకు చేయాలి.

వాళ్ళలో అహం లేదు కనుక వారు ఆ దివ్యశక్తి చేత కార్యములకు వినియోగింపబడతారు.

ఏమి జరుగుతుందో ఊరక చూస్తూంటారు.

వారు పనులన్నీ దైవేశ్చకే వదిలిపెడతారు.

వారిలో అహం లేదు కనుక ఎపుడూ శాంతిగా ఉంటారు.


🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

Source - Whatsapp Message

No comments:

Post a Comment