Wednesday, November 18, 2020

నిత్యజీవితంలో ధ్యానం - ధ్యానం కోసం స్థలాన్ని సృష్టించడం - చివరి భాగం

🧘🏼‍♀️ నిత్యజీవితంలో ధ్యానం

🧘🏼‍♂️ ధ్యానం కోసం స్థలాన్ని సృష్టించడం - చివరి భాగం🧘🏼‍♀️

🔺 ఉనికికి సంబంధించిన రహస్యం నిండిన తలుపులు తెరిచే తాళం చెవి ధ్యానం.

🔺 మనసు కూడా యంత్రమే. ఒకే చోట, ఒకే సమయంలో రోజూ ధ్యానం చేస్తే మీ శరీరంలో, మనసులో ధ్యానం పట్ల దాహం ఉత్పన్నమవుతుంది. ప్రతి రోజూ ఆ ప్రత్యేక సమయంలో మీ శరీరం, మీ మనస్సు ధ్యానాని కి వెళ్ళమని మిమ్మల్ని ప్రేరేపిస్తాయి, అవి సహాయకారిగా ఉంటాయి. మీలో ఒక స్థలం సృష్టించబడి అదొక ఆకలిగా, దాహం గా మారుతుంది.

🔺 మొదట్లో ఇది చాలా బాగుంటుంది, ఎప్పుడైతే మీరు ఒక బిందువు దగ్గరగా వస్తారో, ఎక్కడైతే ధ్యానం అన్నది సహజం గా మారి మీరు ఎక్కడికైనా, ఏ స్థలంలోనైనా ధ్యానం చేయగలిగే స్థితికి చేరుకుంటారు. అలాంటి స్థితి వచ్చేవరకు శరీరానికి, మనసుకు సంబంధించిన ఈ ఆర్థిక వనరులను వినియోగించండి.

🔺 అది మీకు ఒక వాతావరణాన్ని ఇస్తుంది: మీరు దీపం ఆర్పేయండి గదిని చీకటి గా చేయండి. ఒక ప్రత్యేకమైన పరిమళాన్ని వాడండి. అది గదిలో వ్యాపిస్తుంది, మీకంటూ ఓ ప్రత్యేకమైన వస్త్రాన్ని వాడండి, ప్రత్యేకమైన రగ్గు, ప్రత్యేకమైన భంగిమను ఎంచుకోండి, దాని వల్ల మీలో ప్రత్యేకమైన ఎదుగుదల ప్రత్యేకమైన మృదుత్వం వస్తుంది. ఇవన్నీ సహకరిస్తాయి కానీ ఇవి కారణం కావు. ఇంకెవరో దాన్ని అనుసరిస్తే అది వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికి వాళ్లు వాళ్ల సొంత వ్యవస్థను కనిపెట్టాలి, అది సౌలభ్యానికి, ఎదురు చూడడానికి సహకరిస్తుంది. మీరు విరామంగా, ఎదురుచూపు తో ఉంటే ఇవన్నీ సహకరిస్తాయి. నిద్ర లాగా దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు, ప్రేమ లాగా దేవుడు మిమ్మల్ని సమర్పిస్తాడు. మీరు దాని పై ఆధిపత్యం చేయకూడదు, దాన్ని నిర్బంధించ కూడదు.

🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment