Sunday, November 15, 2020

మీ " సమయం " భగవంతుని ఆరాధనలో కొంచమైనా ఖర్చు చేయండి.

మీకో బహుమతి

మీరొక బహుమతి గెలుచుకున్నారు అనుకోండి.

దాని ప్రకారం మీకు మీ బాంక్ వారు మీ అకౌంట్ లో ₹ 86,400 వేస్తారు కానీ కొన్ని షరతులకు లోబడి ఈ బహుమతి ఉంటుంది.

ఆ షరతులు ఏమిటంటే

ఒకటి : మీరు రోజు ఖర్చుపెట్టలేనిదంతా మీ ఖాతానుండి తీసేస్తారు.

రెండు : మీరు మరొకరి అకౌంట్ కు డబ్బు బదలాయించ కూడదు.

మూడు : మీరు ఖర్చు పెట్టుకోవచ్చు.

నాలుగు : మీరు ఉదయం లేవగానే, మీ బాంక్ అకౌంట్ ₹ 86,400 తో మొదలవుతుంది. ఆరోజు వరకే .

ఐదు : ఏ రోజు అయినా, మీ బాంక్ " బహుమతి ఆట అయిపోయింది. మీ ఖాతా ముగిస్తున్నాము. మీకు మరో ఖాతా మేము తెరువలేము" అనవచ్చు.

అలాంటి పరిస్థితులలో మీరు వ్యక్తిగతంగా ఏమి చేస్తారు అన్నదే ప్రశ్న.

మీరు మీకు కావలసినవన్నీ కొనుక్కుంటారు, అవునా ?

మీ కోసమే కాదు. మీరు ప్రేమించే వారి కొసం. అంతేకాదు. మీకు తెలియని వారికోసం కూడా, ఎందుకంటే, రోజు వచ్చి పడే అంత సొమ్ము మీరు మీ కోసం ఖర్చు చేయలేరు.

ఎందుకంటే, ఉదయం కాగానే నిన్నటి బాలన్సు డబ్బు మీ ఖాతాలో ఉండదు కదా ! అందుకని ఈ రోజే అంతా ఖర్చు చేయాలనుకుంటారు. అవునా ?

ప్రతి రూపాయి ఖర్చు చేయలని ప్రయత్నిస్తారు. ఔనా ? కాదా ?

ఇది బహుమతి ఆట కాదు. వాస్తవం.

ఆశ్చర్యపోకండి. నిజం ఇది వాస్తవం.

మనలో ప్రతి ఒక్కరం ఈ బహుమతి గెలుచుకునే ఉన్నాము. కానీ అది మనం చూడటం లేదు.

ఏమిటా బహుమతి అంటారా ? " సమయం " సమయం !

ప్రతిరోజు లేవగానే మనకు 86,400 సెకన్లు జీవితంలోకి బహుమానంగా వస్తున్నాయి.

మనం రాత్రి నిద్రపోయినప్పుడు, మిగిలిపోయిన "సమయం" మన ఖాతాలో ఉండదు.

మనం ఏ సమయం అయితే పోగొట్టుకున్నామో, అది మళ్ళీ మన జీవితం లోకి తిరిగి రాదు కదా !

"నిన్న" అనేది శాశ్వతంగా పోయింది.

ప్రతి రోజు ఉదయం మీ ఖాతా మళ్ళీ 86,400 సెకన్లతో నింపబడుతుంది. కానీ భగవంతుడనే ఆ బాంక్ మీ ఖాతాని చెప్పా పెట్టకుండా ఎప్పుడైనా మూసివేయవచ్చును. ఔనా !

కాబట్టి, ఓరి పిచ్చితండ్రీ / తల్లీ, మీరు మీకు రోజు వచ్చే 86,400 సెకన్లతో ఏం చేస్తారు అనేది ముఖ్యం.

ఈ సెకన్లు ఎంతో విలువైనవి కదా ! ఇవి రూపాయలతో సమానం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి, సమయాన్ని సరిగా ఖర్చు పెట్టాలి కదా !

ప్రతి సెకను మీరు మనస్సును ప్రేమతో నింపి భగవంతుని ఆరాధనతో , పరవశించి పోయారు అనుకోండి, సమయం ఎంత వేగంగా పరిగెత్తినా, మీరు ఏమీ పోగొట్టుకోరు.

ఎందుకంటే మీ చుట్టూ, భగవతుంతుని ఆరాధిస్తూ, మీ సమయం తో ఒక కోట నిర్మించుకున్నారన్నమాట. ఆ కోటలోకి కోపం, దు:ఖం, ద్వేషం, అసూయ, పగ, అనేవి ఏవీ దండయాత్ర చేయలేవు.

కాబట్టి, మీ " సమయం " భగవంతుని ఆరాధనలో కొంచమైనా ఖర్చు చేయండి.



భగవంతుని ఆరాధన అంటే మనలోని భగవంతుని శ్వాసమీద ధ్యాసతో తెలుసుకోవడం,ధ్యానం చేయడం ,చెప్పడం.🙏🙏
👏👏👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment