Monday, November 16, 2020

సంకల్పమే మహా బలం..

సంకల్పమే మహా బలం..🌸

🌸 సంకల్పం అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో ఎలాంటి ఫలితం కావాలో చెపుతూ పని మొదలు పెడతాం... అది వ్యక్తిగత0గా... ఆధ్యాత్మిక0గా పరిస్థితిని బట్టి అందరికి ఉపయోగకరమైన నిర్ణయం అనుకోవచ్చు... ఇదే స్వయానికి వచ్చేసరికి సంకల్పం చేసిన తర్వాత దానిని నెరవేర్చుకోవాలి అంటే సాధన అవసరం కొంతవరకు...
కానీ సంకల్పం కొరకు సాధన రాను రాను తీవ్రం చెయ్యాలి.. అదే అందరి కోఱకు అయితే ఆనందంగా ఉంటాం... ఎందుకు అంటే జరగవలసినది జరుగుతుంది అనే విశ్వాసం తో ఉంటాము కాబట్టీ... అసలు విషయం ఏమిటంటే అందరికొఱకు చేసేది ప్రకృతికి అందిచ్చేస్తాం కాబట్టే..

🌸 మనలో రోజువారీ ఆలోచనలు అనంతంగా ప్రవహిస్తూ ఉంటాయి.. అన్ని అలోచనలు సంకల్పాలుగా ఎందుకు మారడంలేదు కొన్ని మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి... సంకల్పం అంటే మనలో జ్వలించే కోరిక అనుకోవచ్చు... కోరిక కోసం ప్రయత్నాలు చేస్తాం అదే సంకల్పం చేస్తే.. సంకల్పమే నెరవేర్చుకుంటుంది... అంటే మనలోని శక్తిని సంకల్పంగా మార్చేసా0... సంకల్పం అంటే మన subconcious కి పని అప్పజెప్పటం...ఒకరకంగా.. ఇంతవరకు బాగానే ఉంది..
వ్యక్తిగత సంకల్పం మన మనస్సులో తిరుగుతూనే ఉంటుంది.. అదే విశ్వం కోసం చేస్తే super concious కి వెళుతుంది... సంకల్పం చేసాము సరే వ్యక్తిగత సంకల్పం నెరవేరాలి అంటే మన ధ్యాసా సంకల్పం తాలూకా అవకాశాలు ఒడిసి పట్టుకునేల చేస్తుంది.. అంటే ఆ అవకాశాలు కోసం మనం చూడం కానీ ఇన్నర్ చూస్తుంది లేదా సృష్టిస్తుంది... అదే ప్రకృతిది అయితే తాను మనతో చేయిస్తూ దానికి సంబంచిన వారిని రప్పి0చుకుని మరీ చేయించుకుంటుంది.. ఇక్కడ ఎవరు వచ్చిన స్వీకరించాలి, ఆదరించాలి.. వారి తాలూకా పని అవ్వగానే ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోతారు.. అదే సాక్ష్యంగా తెలుస్తుంది..

🌸 ఇది చాలామందికి అనుభవమే... కానీ ప్రతిదీ అలా చూస్తే విశ్వప్రణాళిక లో మనం.. మనమే చేస్తున్నాం అనుకుంటే ప్రపంచంలో దానికి మించిన కష్టం ఇంకొకటి ఉంటుంది అని అనుకోలేము.. కానీ అనుభవం కోసం నేను చేస్తున్న అనే భావన కలగటం సహజం... ఎరుక ఉంటే త్వరగా బయటకు వచ్చేస్తాం..
ఇవన్నీ కూడా మనం నేర్చుకునే అంశాలే... సంకల్పం అనేది నెరవేరెవరకు మనకు శక్తి ప్రసారం చేస్తూనే ఉంటుంది ప్రకృతి... ఎప్పుడైతే సంకల్పం త్వరగా నెరవేరాలి అనుకుంటామో అప్పటి నుంచి శక్తి ప్రసారం కూడా తీవ్రంగా ఉంటుంది... ఇక్కడ ఎరుక,సంయమనం చాలా అవసరం... అదే సంకల్పం చేసి విశ్వంలోకి వదిలివేస్తే సరైన సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది అనేది కూడా అంతే వాస్తవం... ఇక్కడ ఆడుతూ పాడుతూ నెరవర్చుకోవడం అన్నమాట.. ఏదైనా మన ఫ్రీవిల్ బట్టి ఉంటుంది... ఒకసారి సంకల్పించుకుంటే అది నెరవేరెవరకు మనలో సానుకూల దృక్పథమే ఉండాలి అదే సంకల్పానికి బలం.. సంకల్పం నెరవేరెవరకు మనల్ని సంకల్పమే నిలబెడుతుంది... అది సంకల్ప బలం

Thank you...🌸🌸🌸

🍀🌸🌲💖🧚‍♀️

Source - Whatsapp Message

No comments:

Post a Comment