Wednesday, December 23, 2020

జాతకంలో ఉంటే జరిగితీరుతుంది అంటారు కదా మరి వాటిని మార్చే అవకాశం, శక్తి ఏమైనా ఉందా !?

శ్రీరమణీయం - (747)
🕉🌞🌎🌙🌟🚩

"జాతకంలో ఉంటే జరిగితీరుతుంది అంటారు కదా మరి వాటిని మార్చే అవకాశం, శక్తి ఏమైనా ఉందా !?"

మనిషిని కలిప్రభావం నుండి దూరం చేయగల సత్తా, జాతకాలను సైతం మార్చగలిగిన శక్తి ధర్మానికి ఉంది. మనకి కడుపునొప్పి వచ్చిందని తెలుసు, డాక్టర్ కి అది తగ్గడానికి మందు తెలుసు. డాక్టర్ సూచనలను పాటించగలిగితే కడుపునొప్పి తగ్గుతుంది. అలాగే మనకు దుఃఖం, కష్టం, అశాంతి తెలుస్తున్నాయి. మన పెద్దలకు అది పోగొట్టే మందు తెలుసు. వారిని అనుసరించ గలిగితే మనం వాటి నుండి బయటపడతాం. దుఃఖం పోవాలంటే శాంతి రావాలి. శాంతి ఎక్కడినుండో రాదు. మనలోనే ఉంది. అది తెలియాలంటే అహంకారం పోవాలి. ఉనికే లేని అహంకారంతో యుద్ధం చేయలేము. ధర్మదీపాన్ని వెలిగిస్తే అహంకారం అనే అంధకారం పోతుంది. ధర్మాన్ని ఆచరించాలంటే బలంకావాలి. అందుకు దైవాన్ని, గురువును సాధనను అండగా చేసుకోవాలి. ఎవరు ఏ విధానంలో ఉన్నా ధర్మమార్గం అందరికీ సరిపోతుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"దీపంతో అంధకారం - ధర్మంతో అహంకారం అదృశ్యం !''- (అధ్యాయం -91)

🕉🌞🌎🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment