Thursday, December 24, 2020

మ‌హ్మాద్ ఘోరీని నంపుస‌కుడిగా చేసి పంపిన భార‌తీయ వీర‌నారి.!

మ‌హ్మాద్ ఘోరీని నంపుస‌కుడిగా చేసి పంపిన భార‌తీయ వీర‌నారి.! అందం, ధైర్యం, రాజ్య‌పాల‌న‌లో ఆమెకు.. ఆమే సాటి!

చ‌రిత్ర పాఠ్య పుస్త‌కాల్లో చాలా మంది మ‌హ‌మ్మ‌ద్ ఘోరీ గురించి చ‌దువుకునే ఉంటారు. నిజానికి ఘోరీ అంత ప‌ర‌మ చండాల రాజు ఎక్క‌డా ఉండ‌డు. అత‌ను మాన‌వ మృగం అన‌డం కూడా త‌క్కువే. అత‌ను తాను యుద్ధం చేసే రాజ్యాల‌కు చెందిన స్త్రీల‌తోపాటు చిన్న‌పిల్ల‌ల‌ను తీసుకుని వ‌చ్చి త‌న రాజ్యంలో బానిస‌లుగా చేసుకునేవాడు. అంత‌టి క‌ర్కోట‌కుడు ఘోరీ.. అయితే అలాంటి వ్య‌క్తికి ఓ భార‌తీయ మ‌హారాణి చుక్క‌లు చూపించింది. అత‌ను జీవితాంతం బాధ‌ప‌డేలా చేసింది. ఆమే.. గుజ‌రాత్ రాజ్‌పూత్ మ‌హారాణి నాయ‌కీదేవి.

నాయ‌కీదేవి త‌న భ‌ర్త చ‌నిపోవ‌డంతో తానే రాజ్య‌పాల‌న బాధ్య‌తలు తీసుకుంది. ప‌సికందు అయిన త‌న కుమారుడు భీమ్‌దేవ్ సోలంకి త‌ర‌ఫున తానే రాజ్యపాల‌న నిర్వ‌ర్తించేది. అప్ప‌టి గుజరాత్ రాజ‌ధాని న‌గ‌రం అన్హిల్‌వారాను ఆమె పాలించేది. అయితే ఆమె అందం గురించి తెలుసుకున్న మ‌హ‌మ్మ‌ద్‌ ఘోరీ ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాల‌ని.. ఆ రాజ్యానికి చెందిన స్త్రీల‌ను కూడా చెర‌బ‌ట్టాల‌ని భావించాడు. అందుక‌నే త‌న సైన్యంతో ముల్తాన్ నుంచి గుజ‌రాత్‌కు బ‌య‌ల్దేరాడు.

మ‌హ‌మ్మ‌ద్ ఘోరీ త‌మ రాజ్యం మీద దండెత్తున్నాడ‌ని తెలుసుకున్నా.. రాణీ నాయ‌కీ దేవి ఏమాత్రం భ‌య‌ప‌డ‌లేదు. త‌న‌తో క‌లిసి వ‌చ్చే రాజులకు వ‌ర్త‌మానాలు పంపింది. త‌న‌తో క‌లిసి ఘోరీకి వ్య‌తిరేకంగా యుద్ధం చేయాల‌ని కోరింది. కానీ ఏ ఒక్క రాజూ స్పందించ‌లేదు. ఒక్క న‌ర్వాలా రాజు మాత్ర‌మే త‌న ఏనుగుల సైన్యంతో ఆమెకు స‌హాయం అందించేందుకు వ‌చ్చాడు. ఇక నాయ‌కీ దేవీ ఇరు రాజ్యాల సైన్యంతో క‌లిసి రాజ‌ధాని నుంచి ఘోరీపై యుద్ధం చేసేందుకు బ‌య‌ల్దేరింది. అత‌ను న‌గ‌రానికి రాక‌ముందే ఎక్క‌డో దూరంగా అత‌నితో యుద్ధం చేస్తే.. ఆ లోపు న‌గ‌రంలో ఉన్న పౌరులు.. ముఖ్యంగా స్త్రీలు, చిన్న పిల్ల‌లు త‌ప్పించుకునేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం దొరుకుతుంద‌ని ఆమె భావించింది. అందుక‌నే సైన్యంతో క‌లిసి ఘోరీపై యుద్ధానికి బ‌య‌ల్దేరింది.

ఇక రాజ‌ధాని న‌గరానికి 40 మైళ్ల దూరంలో క‌య‌ద‌ర అనే ప్రాంతం వ‌ద్ద ఘోరీ త‌న సైన్యంతో నాయ‌కీదేవికి ఎదురుగా వచ్చాడు. ఘోరీ ఆ సైన్యాన్ని చూసి త‌న దూత‌ను ఆమె వ‌ద్ద‌కు పంపాడు. వెంట‌నే నాయ‌కీదేవితోపాటు ఆమె కుమారుడు ఘోరీకి లొంగిపోవాల‌ని, అలాగే ఆమె రాజ్యంలో ఉన్న స్త్రీలంద‌రినీ, బంగారాన్ని త‌న‌కు అప్ప‌గించాల‌ని ఘోరీ ఆ దూత ద్వారా నాయ‌కీ దేవికి వ‌ర్త‌మానం పంపాడు. అయితే నాయ‌కీ దేవి మ‌న‌స్సులో వేరే ఆలోచ‌న ఉంది. దాన్ని ఆ దూత‌కు ఆమె తెలియ‌నివ్వ‌లేదు. ఆ దూత వ‌ర్త‌మానం విన్న ఆమె న‌వ్వుతూ.. స‌రే.. అలాగే కానివ్వండి.. అని ఘోరీకి లొంగిన‌ట్లు ఆ దూత‌కు తెలుపుతుంది. దీంతో ఆ దూత ఘోరీ వ‌ద్ద‌కు వెళ్లి.. ఆమె లొంగిపోయింద‌ని చెబుతాడు. ఘోరీ న‌వ్వుతూ.. ఇంత సుల‌భంగా నాయ‌కీ దేవి లొంగిపోయినందుకు, యుద్ధంలో ఇంత అల‌వోక‌గా గెలిచినందుకు సంబ‌ర‌పడుతాడు. అయితే అంతలోనే ఘోరీ ముఖంలో న‌వ్వు మాయ‌మై భ‌యం ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.

ఘోరీ ఎదురుగా నాయ‌కీదేవి గుర్రంపై వేగంగా దౌడు తీస్తూ అత‌ని వైపుకే వ‌స్తుంటుంది. రెండు చేతుల్లో రెండు క‌త్తులు.. వెనుక భాగంలో బిడ్డ‌ను క‌ట్టుకుని.. గుర్రాన్ని అత‌ని వైపుకే ఆమె తీసుకొస్తుంటుంది. దీంతో ఘోరీ ఈ హఠాత్ ప‌రిణామానికి నిశ్చేష్టుడవుతాడు. ఓ వైపు లొంగిపోయింద‌ని చెప్పింది క‌దా.. మ‌ళ్లీ ఇదేమిటి ? అని అత‌ను విస్మయానికి లోన‌వుతాడు. అంతలోనే నాయ‌కీదేవి గుర్రంపై ఘోరీకి చాలా ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంది. కానీ అత‌ని వెంటే ఉన్న సైనికులు ఆమెను అడ్డ‌గిస్తారు. అయితే అప్ప‌టికే ఘోరీకి చాలా దగ్గ‌ర‌గా వ‌చ్చిన ఆమె అత‌ని ముందు, వెనుక భాగాల్లో ఉన్న అవ‌య‌వాల‌ను క‌త్తుల‌తో గాయాల‌కు గురి చేస్తుంది. దీంతో ఘోరీ సైనికులు ఆమెను అడ్డ‌గిస్తారు. అస‌లు ఆమె ఘోరీ త‌ల‌ను న‌రికేదే. కానీ సైనికులు అడ్డు రావ‌డంతో ఆమె క‌త్తులు అత‌ని అవ‌య‌వాల‌కు తాకుతాయి. దీంతో అత‌ను తీవ్రంగా గాయాల‌కు గురై అక్క‌డి నుంచి గుర్రంపై పారిపోతాడు.

మ‌రోవైపు ఘోరీ సైన్యాన్ని అన్ని వైపుల నుంచి నాయ‌కీదేవి, న‌ర్వాలా రాజు సైన్యాలు చుట్టుముడ‌తాయి. ఘోరీ పారిపోవ‌డాన్ని చూసి ఆ సైన్యాలు తోక ముడుస్తాయి. ఘోరీ మాత్రం.. ఎక్క‌డా ఆగ‌కూడద‌ని, తాను ఎక్కిన గుర్రాన్ని ఆప‌కూడ‌ద‌ని, అది ప‌డిపోతే మ‌రొక గుర్రంపైకి త‌న‌ను చేర్చాల‌ని, క‌నీసం చికిత్స అందించేందుకు కూడా గుర్రాన్ని ఆప‌వ‌ద్దని, సైనికుల‌ను త‌న వెంట‌నే ఉండాల‌ని ఆదేశిస్తాడు. దీంతో ఘోరీ, అత‌ని సైన్యాలు ముల్తాన్‌కు తిరుగుముఖం ప‌డ‌తాయి. కొన్ని రోజుల‌కు వారు ముల్తాన్‌కు చేరుకుంటారు. బ‌తుకు జీవుడా అంటూ.. ఘోరీ గాయాల‌కు చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకుంటాడు. కానీ ముందు, వెనుక భాగాల్లో ఉన్న అవ‌య‌వాలు పూర్తిగా ప‌నిచేయ‌కుండా పోతాయి. దీంతో అత‌ను న‌పుంస‌కుడు అవుతాడు. ఈ క్ర‌మంలో అత‌ను త‌న బానిస స్త్రీల‌కు పుట్టిన ప‌లువురికి రాజ్యాన్ని అప్ప‌గించాల్సి వ‌స్తుంది. అలా ఘోరీ వార‌సులు లేని వాడ‌వుతాడు. అయితే నాయ‌కీదేవితో యుద్ధం చేసిన త‌రువాత మ‌ళ్లీ 14 ఏళ్ల వ‌ర‌కు అత‌ను భార‌త్ వైపు క‌న్నెత్తి చూడ‌లేదు.

1178లో నాయ‌కీదేవిపై దండ‌యాత్ర‌కు వెళ్లిన ఘోరీ.. మ‌ళ్లీ 1192 లో భార‌త్‌కు వస్తాడు. కానీ ఈసారి గుజ‌రాత్ వైపు చూడ‌లేదు. అత‌ను మ‌రో రాజు అయిన పృథ్వీరాజ్ చౌహాన్‌పై దండ‌యాత్ర చేసి విజ‌యం సాధించాడు. త‌రువాత ఘోరీ ఒక్కొక్క‌టిగా రాజ్యాల‌ను జ‌యించి భార‌త్‌లో త‌న అకృత్యాల‌ను కొన‌సాగించాడు. కానీ ఆ రోజు నాయ‌కీ దేవికి రాజులంద‌రూ స‌హ‌క‌రించి ఉంటే.. ఘోరీ అనే పేరు అస‌లు చ‌రిత్ర‌లో ఎక్క‌డో అట్ట‌డుగు పేజీల్లో మిగిలిపోయి ఉండేది. ఘోరీ ఎవ‌రో అస‌లు ఎవ‌రికీ తెలిసేది కాదు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment