Tuesday, December 15, 2020

దేవట్టిపరంబు

దేవట్టిపరంబు

కర్ణాటకలోని మడికేరి జిల్లా లోని భాగమండల సమీపంలోని అయ్యంగేరి గ్రామంలోని విశాల మైదానమే దేవట్టిపరంబు. మైదానాన్ని ఆనుకుని కావేరి ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చుట్టూ కొండలు. టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న అప్పటి కొడగుకు చెందిన నాల్కునాడు, బేంగునాడు కొడవ ప్రజలు ఆ కొండల్లో దాక్కుని దాడులు చేసేవారు. 1786లో ఒకరోజున టిప్పు సుల్తాన్ ఆ ప్రదేశంలోని గ్రామాలలో దండోరా వేయించి , ' నేను యుద్ధం వల్ల అలసిపోయాను. నాకు కొడవ ప్రజల భూమి అవసరం లేదు. వాళ్ళ స్నేహం కోసం అర్రులు చాస్తున్నాను. అయ్యంగేరి లోని దేవట్టిపరంబు మైదానంలో ఒక విందు ఏర్పాటు చేస్తున్నాను. మీరుకూడా నాలాగే ఆయుధాలను త్యజించి రండి. స్నేహితులుగా జీవిద్దాం ' అని ప్రకటన చేయించాడు. నిరంతర యుద్ధాలతో అలసిపోయిన కొడవ ప్రజలు టిప్పు సుల్తాన్ మాటలు నమ్మారు. అయ్యంగేరి గ్రామం లోని దేవట్టిపరంబు మైదానానికి వచ్చేశారు. అలా వచ్చి చేరినవారు దాదాపు 70,000 మంది.

ఆ మైదానంలో ముక్కాలు భాగం పొదలతో నిండి ఉండేది. ఆ పొదల్లో ముస్లిం మరియు ఫ్రెంచ్ సైనికులు దాక్కుని ఉన్నారు. ఉత్తి చేతులతో వచ్చిన కొడవ ప్రజల మీద విరుచుకుపడ్డారు. అది కర్ణాటక అప్పటిదాకా చూడని నరమేధం. ఆనాటి నరమేధంలో చనిపోయిన కొడవ ప్రజల సంఖ్య 35,000 పైగానే.

ఈ హత్యాకాండ అనంతరం టిప్పుసుల్తాన్ కొడవ ప్రజల భూమిని ముస్లింలకు జాగీరుగా ఇచ్చి ఈ క్రింది విధంగా ప్రకటించాడు. ' ఈ ప్రదేశాన్ని మీకు జాగీరుగా ఇవ్వడం జరిగింది.ఈ ప్రదేశంలోని కొండలలో ప్రజలను ( మిగిలిపోయిన వారిని ) మీరు నిర్మూలించవచ్చని రాజాజ్ఞ అయినందున,మా దృష్టినుండి తప్పించుకుపోయినవారిని వెదికి హత్య చేయడం మీకు పెద్ద బహుమానపు కర్తవ్యమని భావించండి. వాళ్ళ కుటుంబాల్లోని పిల్లలందరూ మీకు బానిసలవుతారు ' .

హత్యాకాండ తర్వాత కొడగులోని సామాజిక వ్యవస్థ తలక్రిందులైంది. 1786 నాటికి 1500 కొడవ కుటుంబాలుండగా , అవి 840 కి తగ్గిపోయాయి. భవిష్యత్తులో ఆంగ్లేయులు టిప్పు ను హత్య చేసి కొడగు పాలనా వ్యవస్థ రూపొందించే సమయంలో ఈ హత్యాకాండ పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జనాభా కొరతను తగ్గించడానికి సుళ్య అనే చోటినుండి ప్రజలను తీసుకురావాల్సివచ్చింది.

దేవట్టిపరంబు హత్యాకాండ తర్వాత చెరపట్టిన వేలాది హిందూ స్త్రీలను టిప్పు , ముస్లింలకు కానుకగా ఇచ్చాడు.పెద్దసంఖ్యలో ఉన్న పిల్లలను నపుంసకులుగా లేదా సున్నత్ చేసి మతం మార్చాడు. మతం మారడానికి ఇష్టపడనివారిని ఏనుగులతో తొక్కించి చంపేశాడు. పులి , మొసళ్ళకు ఆహారంగా ఎంతోమందిని తోసేశాడు. మతం మారిన యోధులతో ఒక సైన్యాన్ని రూపొందించి ' అహమదీయ సైన్యం అని పేరు పెట్టి యద్ధాలలో వాడుకున్నాడు.

1786 డిశంబర్ 12 న జరిగిన ఈ సంఘటన టిప్పుసుల్తాన్ మోసాలకు పరమావధి.
పంజాబులో జలియన్ వాలాబాగ్ దురంతాన్ని మించిన నరమేధం.

దేవట్టిపరంబు హత్యాకాండలో అసువులు బాసిన హిందువుల బలిదానాన్ని గుర్తు చేసుకుని , భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం నేటి హిందువులకు ఎంతైనా ఉందనడంలో సంశయమేమీ లేదు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment