Wednesday, December 16, 2020

మంచిమాటలు

బుధవారం --: 15-12-2020 :--
ఈ రోజు AVB మంచిమాటలు
జీవితంలో ఆనందంగా మనం ఉండాలంటే ఆస్తులు ఉండవలసిన అవసరం లేదు . మనమే ఒక ఆస్తిగా భావించే ఓ తోడు ఉంటే చాలు . జీవితంలో బాధలు లేకుండా ఉండాలంటే బంగ్లాలు , కారులు ఉండవలసిన అవసరం లేదు . మనకు బాధే తెలియకుండా చూసే ఓ బంధముంటే చాలు .

ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసినా మనిషి చనిపోగానే తిరిగి రమ్మని , బతికి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకుని బోరున ఏడుస్తాం అంత ప్రేమ మనిషి బతికుండగా చూపించరు ఎందుకని ? .

మనం నవ్వినా కన్నీళ్లు వస్తాయ ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి కానీ ! మనల్ని నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటాడు , కాని మనల్ని బాధపెట్టినా వారు బతుకంతా గుర్తుంటాడు .

తనవరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది . అనుభవమే మనిషికి గుణపాఠం .

సేకరణ ✒️ *మీ ... AVB సుబ్బారావు 🌷🕉️💐🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment