Wednesday, December 23, 2020

త్వమేవ శరణం!

త్వమేవ శరణం!
---------------------------
ప్రేయసీ!
నా అందమైన శత్రూ!!
నా హృదయాన్ని అమాంతం దొంగిలించి దాచుకున్న ఓ వైరీ!
జీవితాన్ని చదరంగం చేసి,
ఇరువైపులా నువ్వే ఆడే నా ప్రత్యర్ధీ!!
నా ఏకాంతాన్ని భగ్నపరిచి
సర్వస్వం ఆక్రమించిన
ఓ దురాక్రమణ దారూ!
నా జగత్తు నాకు లేకుండా చేసి,
నువ్వే నా ప్రపంచంగా చాటావు కదూ!
నన్ను రేపవలూ నీ ఆలోచనల్లో బంధించిన ఓ ప్రియ కారాగారమా!
ఆకలిదప్పులు మరపించి,
నీ తలపుల్లో ముంచేసిన
ఓ నా సమస్తమా!
నువ్వే లోకమనే మైకంలో నను మంత్రించిన ఓ ఇంద్రజాలమా!
నాకంటూ ఏమీ లేకుండా,
నువ్వే నాకంటూ ఒప్పించిన
ఓ దౌత్యమా!
నా ప్రాణాలు నీ పాదాల చెంత దాచుకున్న ఓ మాయావీ!
నా ఇష్టాయిష్టాలూ,ఆశలూ, ఆలోచనలూ, నా కలలూ అంతా నువ్వే అనిపించిన ఓ నియంతా!
నిను నిందించలేనంత ఆశక్తుడను
చేసి వినోదించే ఓ ప్రియతమా!
నా మనసు నన్ను వినకుండా నియంత్రించే ఓ జవ్వనీ!
త్వమేవ శరణం!!
----- దండమూడి శ్రీచరణ్
9866188266

Source - Whatsapp Message

No comments:

Post a Comment