ఇట్లా ఉంది నేటి పరిస్థితి!
ఒక తోటలో ఇద్దరు ముసలివాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఒకరు- “నాకు ఒక మనవరాలు పెళ్ళికి సిద్ధంగా ఉంది. ఇంజనీరింగు చదివింది. ఉద్యోగం చేస్తున్నది. ఎత్తు 5.2. అందంగానే ఉంటుంది. ఎవరైనా తగిన పిల్లవాడు ఉంటే చెప్పండి.”
మరొకరు- “మీ మనవరాలికి ఎటువంటి సంబంధం కావాలి?”
ఒకరు- “పెద్దగా ఏమీ వద్దు. అబ్బాయి M.E.;లేదా M.Tech; చేసి ఉండాలి. సొంత కారు, ఇల్లుండాలి. ఇల్లంటే కాస్త తోట, చెట్లు చేమలుండాలి. మంచి ఉద్యోగం, మంచి జీతం- కాస్త ఓ లక్షో రెండు లక్షలో..!”
మరొకరు- “ఇంకేమైనా కావాలా?”
ఒకరు- “అన్నింటికన్నా ముఖ్యంగా, పిల్లవాడు ఒంటరివాడై ఉండాలి. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే వారుంటే పోట్లాటలు కావచ్చు కదా..”
రెండవ వృద్ధుని కన్నులు నిండివచ్చాయి. ఆయన కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు- “నా స్నేహితుని మనవడున్నాడు. అతగాడికి తోబుట్టువులెవరూ లేరు. అమ్మా నాన్నా ప్రమాదంలో కన్నుమూశారు. మంచి ఉద్యోగం ఉంది. లక్షన్నర జీతం. కారుంది, పెద్ద భవంతి ఉంది. నౌకర్లూ చాకర్లూ..”
ఒకరు- “అయితే మరింకేంటి? సంబంధం ఖాయం చేయించు..”
మరొకరు- “కానీ అబ్బాయికి కూడా షరతులున్నాయి- అమ్మాయికి అమ్మానాన్నలు, తోబుట్టువులు, బంధువులు నా అన్నవారుండరాదు.”
(ఆ మాట అంటూనే ఆయనకు గొంతు పూడుకుపోయింది. మళ్ళీ సర్దుకుని అన్నాడు-)
“మీ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటే సంబంధం కుదిరినట్టే. మీ మనవరాలి పెళ్ళి ఆ పిల్లాడితో అవుతుంది. ఇహ సుఖంగా ఉంటుంది.”
ఒకరు- “ఏంటీ తిక్క వాగుడు? మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాలా? రేపుదయం పిల్ల సంతోషంలో, వేదనలో ఎవరుంటారు దానికి తోడునీడగా?”
మరొకరు- “అబ్బో, భలే! తన కుటుంబమేమో కుటుంబమా, కానీ ఇతరులది కాదా..? చూడు నేస్తమా, నీ పిల్లలకు కుటుంబపు విలువలు తెలియచేయి. చిన్నా పెద్దా ఇంటిల్లిపాదీ మనకు ముఖ్యమైనవారే. కాదంటే మనిషి సుఖదుఖాల విలువలు పోగొట్టుకుని ఒంటరి జీవి అయిపోతాడు. జీవితం నీరసమైపోతుంది.”
మొదటి వృద్ధుడు సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయాడు.
మిత్రులారా, కుటుంబం ఉంటే జీవితంలో ప్రతీ ఒక్క సంతోషం సంతోషంలాగా కనిపిస్తుంది. కుటుంబమే లేకపోతే మీ ఆనందం, బాధ ఎవరితో పంచుకుంటారు?
👏👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment