Tuesday, April 13, 2021

మనలను మనమే ఉద్ధరించుకోవాలి! మనకు మనమే శత్రువు! మనకు మనమే మిత్రుడు!

అలెగ్జాండర్‌ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడయిన డియోజినస్ దగ్గరకు వెళ్ళాడు!
ఆయన ఉపదేశం పొందాలన్న ఆశతో!
ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు.
అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదయినా ఉపదేశించమని ప్రార్ధించాడు!.
అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు,
"నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?" అని!
ముందు పర్షియా ను జయిస్తాను చెప్పాడు అలెగ్జాండర్
ఆ తరువాత ?
అని ప్రశ్నించాడు డియోజినస్, ఈజిప్టు అని జవాబిచ్చాడు అలెగ్జాండర్.
తరువాత?
మెసపొటేమియా!
ఇట్లా ఆయన అడగటం
ఈయన చెప్పటం !
ప్రపంచంలో ని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉన్నాడు అలెగ్జాండర్‌!
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తావు?
అని అడిగాడు డియోజనస్!
మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి,
రా! నా ప్రక్కన పడుకో!
విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా!అని అడిగాడు!..డియోజినస్.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి !
అని అనుకున్నాడు అలెగ్జాండర్‌!
అలానే! నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు
సంపాదన,సంపాదన,సంపాదన
ఒకటే సంపాదన ......
సంపాదించటమే విజయం !
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు!
ఒక మనిషికి ఎంతకావాలి?
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా! ఎవరైనా వేసుకున్నారా
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!.
ప్రపంచం అంతా జయించాడు!
అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు!
ఇంకేదో కావాలి!
సీతమ్మను చెరబట్టాడు!
చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !.....
అలానే నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది!
తన మేనమామ కొడుకు,
తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు!
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు , తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు!
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు, !
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు!
ఈ భావనలను "యోగసాధన" అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే !
ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు!
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః" అని కఠోపనిషత్తు చెపుతుంది!
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి!
లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటాయి!
మనలను మనమే ఉద్ధరించుకోవాలి!
మనకు మనమే శత్రువు!
మనకు మనమే మిత్రుడు!

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment